
అంగన్‌వాడీ కేంద్రంలో మాస్క్‌లను పంపిణీ చేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
విజయనగరం, జియ్యమ్మవలస: కరోనా వైరస్ కట్టడికి రాబోయే రెండు వారాలు కీలకమని, ప్రతీ ఒక్కరూ లాక్‌డౌన్ ను పాటించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. చినమేరంగిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సోమవారం మాస్క్‌లు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా పరీక్షల నిర్వహణ, లాక్‌డౌన్ అమలులో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. దేశంలో సగటున ప్రతి పదిలక్షల మందిలో 268 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుండగా ఏపీలో 539 మందికి పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మూడు మాస్క్‌లు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్క్‌లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. అత్యవసర వేళ బయటకు వచ్చేవారు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.