కానిస్టేబుల్పై ఎనుగుల దాడి | Constable attacked by elephants | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్పై ఎనుగుల దాడి

May 3 2015 9:41 AM | Updated on Mar 19 2019 5:52 PM

కానిస్టేబుల్పై ఎనుగుల దాడి - Sakshi

కానిస్టేబుల్పై ఎనుగుల దాడి

విజయనగరం జిల్లా సాలురు మండలం ఎరగడవలసలో ఎనుగులు బీభత్సం సృష్టించాయి.

విజయనగరం: విజయనగరం జిల్లా సాలురు మండలం ఎరగడవలసలో ఎనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి గ్రామంలో ఎనుగులు సంచరిస్తుండటంతో  గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏనుగులను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో కానిస్టేబుల్ పి.త్రినాథ్‌రావు కింద పడటంతో ఏనుగులు ఆయన మీద దాడి చేశాయి. కానిస్టేబుల్ కాలుపై ఏనుగు పాదం మోపడంతో ఆయన కాలు విరిగింది. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎనుగుల గుంపు గ్రామ పరిసరాల్లోనే సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement