స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం జగన్‌ సమీక్ష 

CM YS Jagan Review Meeting On Skill Development - Sakshi

సాక్షి, తాడేపల్లి: నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలుండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు పరిగణనలోకి తీసుకోవాలని ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగుపరచాలని సీఎం తెలిపారు. ఏపీలో నిర్మించనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 30 చోట్ల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలల నిర్మాణ నమూనాలను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. కాలేజీల నిర్మాణం పూర్తైన తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్‌ ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయించాలని సీఎం తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఈలోగా పరిశ్రమలకు అవసరాలు ఏంటో తెలుసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. (పొగాకు కొనుగోళ్లపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు)

30 కాలేజీల్లో 20 రంగాలకు చెందిన అంశాలపై  నైపుణ్యాభివృద్ధి, 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్‌ మహీంద్ర, హెచ్‌సీఎల్‌, హ్యూందాయ్‌, వోల్వో, బాష్‌ కంపెనీలను భాగస్వామ్యం చేయనున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. 30 కాలేజీల నిర్మాణానికి రూ.1210 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. (‘వేదాద్రి’ మృతులకు 5 లక్షల పరిహారం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top