ఏజెన్సీలో పునుగు పిల్లి ఆనవాలు | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో పునుగు పిల్లి ఆనవాలు

Published Sat, Nov 11 2017 10:32 AM

civet cat dead in road accident agency area - Sakshi

కురుపాం: అరుదుగా కనిపించే పునుగు పిల్లి ఆనవాలు కురుపాం ఏజెన్సీలో ప్రత్యక్షమయ్యాయి. అదీ కూడా ఏదో వాహనం ఆ పునుగు పిల్లిని గురువారం రాత్రి ఢీకొట్టడంతో ఆర్‌ఆండ్‌బీ రహదారిపై మృత్యువాత పడి కనిపించింది.  ఈ పునుగు పిల్లులు శేషాచలం అడవుల్లో గతంలో ఎక్కువగా ఉండేవి. రానురాను అవి అంతరించి పోతున్నట్లు చెబుతున్నారు.పునుగు పిల్లి చమురుతోనే తిరుపతిలో ఉన్న వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయటం ఆనవాయితీ. ఈ పిల్లులు సంతతి కనుమరుగవుతున్న తరుణంలో టీటీడీ ఇప్పటికే  పునుగు పిల్లుల సంరక్షణకు చర్యలు కూడా చేపట్టిన విషయం విదితమే.

ఈ క్రమంలో కురుపాం నియోజకవర్గం పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండలం సంతోషపురం సమీపంలో ఉన్న రహదారిపై ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ పునుగు పిల్లి మృతి చెందింది. ఈ ప్రాంతంలో కూడా చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి దేవస్థానం సమీపంలో ఉండటం మరో విశేషం. ఏది ఏమైనా అంతరించిపోతుందనుకుంటున్న పునుగు పిల్లి సంతతి ఇలా ప్రత్యక్షం కావడంతో ఇక వెంకన్న నైవేద్యానికి పునుగు పిల్లుల కొరత లేనట్లేనని భావిస్తున్నారు.

Advertisement
Advertisement