పక్కా బూటకపు ఎన్కౌంటర్: చెవిరెడ్డి | chevireddy bhaskar reddy demand for enquiry on chittoor encounter | Sakshi
Sakshi News home page

పక్కా బూటకపు ఎన్కౌంటర్: చెవిరెడ్డి

Apr 7 2015 8:04 PM | Updated on Aug 13 2018 4:11 PM

పక్కా బూటకపు ఎన్కౌంటర్: చెవిరెడ్డి - Sakshi

పక్కా బూటకపు ఎన్కౌంటర్: చెవిరెడ్డి

శేషాచల అడవుల్లో జరిగింది పక్కా బూటకపు ఎన్కౌంటర్ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోపించారు.

తిరుపతి: శేషాచల అడవుల్లో జరిగింది పక్కా బూటకపు ఎన్కౌంటర్ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోపించారు. ఎక్కడో పట్టుకొచ్చి 20 మందిని కాల్చిచంపారని అన్నారు. నిజమైన ఎన్కౌంటర్ అయితే ఒకరు చనిపోయిన తర్వాత మిగతావాళ్లు పారిపోయే అవకాశముందన్నారు. కానీ సంఘటన స్థలంలో శవాలు గుట్టలగా పడివుండడంతో ఇది బూటకపు ఎన్కౌంటర్ అన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement