లక్నో పర్యటనకు జగన్కు కోర్టు అనుమతి | CBI court grants YS Jagan Mohan reddy permission to travel Lucknow | Sakshi
Sakshi News home page

లక్నో పర్యటనకు జగన్కు కోర్టు అనుమతి

Dec 3 2013 11:28 AM | Updated on Sep 27 2018 5:59 PM

లక్నో పర్యటనకు జగన్కు కోర్టు అనుమతి - Sakshi

లక్నో పర్యటనకు జగన్కు కోర్టు అనుమతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్నో పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్నో పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలిసేందుకు లక్నో వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన   సీబీఐ ప్రత్యేక కోర్టును కోరిన విషయం తెలిసిందే. అందుకు కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది.  జగన్ ఈరోజు సాయంత్రం అఖిలేష్ యాదవ్ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరనున్నారు.

కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు ఈ నెల 4న చెన్నై వెళ్లడానికి అనుమతించాలన్న జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇక జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడను 5న(గురువారం) బెంగళూరులో కలిసేందుకు అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement