
విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: నారాయణ
విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు.
హైదరాబాద్: విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. ఆయన సోమవారం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రణబ్ను కోరినట్టు నారాయణ తెలిపారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసన సభకు వచ్చిన నాటినుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాల నేతలు బిల్లు అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.