వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న బంద్‌కు మద్దతు తెలపాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ నేతలను కోరారు.
రాజీవ్‌గాంధీ భవన్‌లో శుక్రవారం కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు ముత్యాలరావును కలిశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జెండాలు పక్కన బెట్టి ప్రత్యేక హోదానే ఎజెండాగా అన్ని పార్టీలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్‌పార్టీ నేతలు చెప్పారు. అనంతరం సీపీఐ, సీపీఎం జిల్లా నాయకత్వంతో వైఎస్సార్‌సీపీ నేతలు చర్చించారు.