అరుణ్‌ జైట్లీ మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం | AP CM YS Jagan Mohan Reddy Tribute Over Arun Jaitley Death | Sakshi
Sakshi News home page

అరుణ్‌ జైట్లీ మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం

Aug 24 2019 1:09 PM | Updated on Aug 24 2019 4:12 PM

AP CM YS Jagan Mohan Reddy Tribute Over Arun Jaitley Death - Sakshi

సాక్షి,  అమరావతి : బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారని, విలువలకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు.

జైట్లీ మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. అరుణ్ జైట్లీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

జైట్లీ ఆత్మకి శాంతి కలగాలి : గవర్నర్‌ బిశ్వభూషణ్ హరి చందన్
సాక్షి,  అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు అరుణ్‌ జైట్లీ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సంతాపం తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ జైట్లీ కన్నుమూయడంపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన  కుటుంబం ధైర్యంగా ఉండాలన్నారు.

సంబంధిత వార్తలు : అరుణ్‌ జైట్లీ అస్తమయం

వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement