
(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ ముగిసింది. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు. సుమారు అరగంట పాటు వీరి భేటి సాగింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ సమావేశాల అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారు. దానిలో భాగంగానే సీఎం జగన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ చేపడుతున్న చర్యలు, పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలపై కూడా గవర్నర్‌తో భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. (సీఎం వైఎస్ జగన్‌పై పెరిగిన ప్రజామద్దతు)