ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సోమవారం ప్రారంభమై శుక్రవారం(సెప్టెంబర్ నాలుగో తేదీ)తో ముగుస్తాయి. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభ ఉదయం 9.30 గంటలకు సమావేశమందిరంలో సమావేశం అవుతుంది. శాసనమండలి 10.30 గంటలకు శాసనమండలి సమావేశ మందిరంలో సమావేశమౌతుంది.