డీఎస్సీ కీ’ని ఈ నెల 18న విడుదల చేయనున్నారు. దీనికిగాను అధికారులు చర్యలు చేపట్టారు.
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ కీ’ని ఈ నెల 18న విడుదల చేయనున్నారు. దీనికిగాను అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా జూన్ 1న ఫలితాలు ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రసుతం పాఠశాలల్లో కొన్ని చోట్ల టీచర్లు అవసరానికి మించి ఎక్కువగా ఉండగా కొన్ని చోట్ల కొరత ఉంది. దీనికి సంబంధించి పూర్తి గణాంకాలను విద్యాశాఖ ఇంతకుముందే సిద్ధం చేసింది. దాదాపు 16 వేల మంది టీచర్లు ఆయా స్కూళ్లలో అవసరానికి మించి ఉన్నట్లు తేల్చింది. రేషనలైజేషన్, బదిలీలు పూర్తిచేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
రేషనలైజేషన్, బదిలీలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి కావడంతో విద్యాశాఖ.. ఆర్థిక శాఖ అనుమతిని కోరింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసి దానికి డీకోడింగ్, కంప్యూటరీకరణ ప్రక్రియలను పూర్తిచేస్తున్నారు.