'డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది'

Amjad Basha Says CM Jagan Has Got Credit To Give Deputy CM To Minority - Sakshi

అంజాద్‌ బాషా

సాక్షి, విశాఖపట్నం : ఏపీ చరిత్రలో మొదటిసారి ఓ మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వెల్లడించారు. విశాఖలో ఆదివారం జరిగిన మైనారిటీ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పించి వైఎస్సార్‌ మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. వైఎస్సార్‌ సాధికారత కింద పేద ముస్లింలకు హజ్‌ యాత్ర కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు నిధులు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top