అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి సమీపంలో ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.
అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి సమీపంలో ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. రామగిరి మండలం కుంటుమద్దికి చెందిన ఓ వివాహిత తండ్రితో కలసి బుధవారం ఉదయం ఆటోలో ధర్మవరం వెళుతుండగా.... క్వాలిస్‌లో వచ్చిన కొందరు ఆటోను అడ్డగించి ఆమెను అపహరించుకుపోయారు. ఆమె కోసం సీకే పల్లి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.