తమ పిల్లలపై అక్రమ కేసులు పెట్టారనే మనస్థాపంతో ఓ తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు.
గుంటూరు: తమ పిల్లలపై అక్రమ కేసులు పెట్టారనే మనస్థాపంతో ఓ తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. తండ్రి యూనిస్ అనే వ్యక్తి మనస్థాపంతో మృతిచెందాడు.
అతడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద బందువులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.