
వైఎస్‌ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు
జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం జరగనుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం జరగనుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో సమావేశం జరుగుతుందని చెప్పారు. కౌంటింగ్‌లో అనుసరించాల్సిన విధానం, పోలింగ్ సరళిపై చర్చించనున్నట్టు తెలిపారు. సమావేశానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులతో పాటు శాసనసభ, లోక్‌సభ అభ్యర్ధులు విధిగా హాజరు కావాలన్నారు. పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులు కూడా హాజరు కావాలని కోరారు.
జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ మాదే విజయం
జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలతోపాటు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధిస్తారని ధర్మాన కృష్ణదాస్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 125 స్థానాల్లో విజయం సాధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు తామే విజయం సాధిస్తామని అంటున్నారని, అయితే 16వ తేదీ తర్వాత వారి నోళ్లు మూతబడటం ఖాయమని అన్నారు.