235వ రోజు పాదయాత్ర డైరీ

235th day padayatra diary - Sakshi

12–08–2018, ఆదివారం
డి.పోలవరం, తూర్పుగోదావరి జిల్లా

నాన్నగారి హయాంకు, చంద్రబాబు జమానాకు ఉన్న తేడా ఇదే..
తునికి చెందిన చిన్నారి వర్షిత పుట్టుకతోనే మూగ, చెవుడు. వైద్యం కోసం చెన్నై వెళితే రూ.10 లక్షలు అవుతుందన్నారట. దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆ పాప తల్లిదండ్రులకు నాన్నగారు ఆపద్బాంధవుడయ్యారు. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ను ఉచితంగా చేయించారు. జీవితంలో మాటలే రావనుకున్న ఆ బిడ్డ చక్కగా మాట్లాడుతోంది. బడికెళ్లి బాగా చదువుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం శిబిరం వద్దకొచ్చి కృతజ్ఞతలు చెప్పింది. రేఖవా నిపాలెంలో నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటలక్ష్మి కలిసింది. భర్త తాపీ మేస్త్రీ. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి గుండె జబ్బుచేస్తే.. ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. నాన్నగారి చలవతో ఆపరేషన్‌ ఉచితంగా జరిగింది. ఇప్పుడు ఆ బిడ్డ కాలేజీకి వెళుతున్నాడు. ‘ఎప్పుడో నాన్నను కోల్పోయిన నాకు.. తండ్రిలా సాయపడ్డారు మీ నాన్నగారు’ అంటూ ఆ సోదరి చెబుతుంటే మనసుకెంతో గర్వంగా అనిపించింది.

పాయకరావుపేటకు చెందిన గంగాధర్‌ అనే పిల్లాడికి గుండె జబ్బు. వాళ్ల నాన్న స్థానిక ఎమ్మెల్యేను పట్టుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే.. రూ.లక్షన్నర మంజూరు చేసినట్టు లెటర్‌ ఇచ్చారట చంద్రబాబుగారు. అది పట్టుకుని ఆస్పత్రికెళితే.. ఆ లెటర్‌ చెల్లదు.. డబ్బు కట్టి ఆపరేషన్‌ చేయించుకోవాలన్నారట. పాపం.. ఓమామూలు లారీ డ్రైవర్‌గా పనిచేసే ఆ తండ్రి చేసేదిలేక, చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక.. అప్పులు చేసి మరీ వైద్యం చేయించాడట. నాన్నగారి హయాంకు, చంద్రబాబు జమానాకు ఉన్న తేడా ఇదే. 

మరువాడలో ఉన్న తాండవ నది తెలుగుదేశం ఇసుకాసురుల విచ్చలవిడి అక్రమార్జనకు సాక్ష్యంగా అనిపించింది. నదిలోని ఇసుకనే కాదు.. నది గట్టున ఉన్న పేదల భూముల్ని సైతం దౌర్జన్యంగా తవ్వేస్తున్నారట పచ్చనేతలు. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై సైతం అక్రమ కేసులు బనాయిస్తున్నారట. 

మరువాడ గ్రామంలో స్కూలుకెళ్లే బాలలు నా వద్దకొచ్చి ‘అన్నా.. మందు వల్ల ఊరంతా పాడైపోతోంది.. దుకాణాలు మూయించండి’ అని కోరారు. అక్కడే నలుగురు బాలికలు.. మద్యం వల్ల గ్రామంలో కుటుంబాలు పడుతున్న బాధల్ని చెబుతూ కన్నీరు పెట్టుకున్నప్పుడు చాలా బాధేసింది. ‘అన్నా.. మా నాన్న రోజూ తాగొచ్చి నన్ను, మా అమ్మను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తాగి రోడ్డు మీద పడిపోయిన నాన్నను ఇంటికి తీసుకురావాలంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగకుంటే మంచోడే.. కానీ అది లేకుండా ఒక్క పూటా ఉండలేడు’ అని ఓ పాప ఏడుస్తూ చెప్పింది. ‘కూలి డబ్బు మొత్తం మద్యానికే ఖర్చయిపోతోంది.

ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండటంతో మా అన్న చదువు ఆపేసి అమ్మతో పాటు కూలికెళుతున్నాడు. నేను కూడా చదువు మానేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉందన్నా’ అంటూ ఆ చిట్టి తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం మనసును కలచివేసింది. ఆ ఊళ్లో తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి దాకా మద్యం అందుబాటులో ఉంటుందట. ఇడ్లీ హోటళ్లు, కిళ్లీ కొట్లు, కిరాణా షాపుల్లో సైతం మద్యాన్ని అమ్ముతారట. బెల్టు షాపులకు సైతం వేలం పాటలు నిర్వహించి లక్షల్లో పాడుకుంటున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రమంతటా దాదాపు ఇదే పరిస్థితి. ఎన్ని జీవితాలు నాశనమైపోయినా, ఎన్ని కుటుంబాలు ఛిద్రమైపోయినా, ఎందరు పిల్లల బంగారు భవిష్యత్తు అంధకారమైపోయినా.. మద్యం మీద ఆదాయమే ప్రధానం.. అని భావించే బాబుగారి పాలనలో ప్రజలకు ఈ కన్నీళ్లు తప్పవేమో. 

గుంటూరు నుంచి కాపునాడు ప్రతినిధులు, కోనసీమ నుంచి కాపు సోదరులు వచ్చి కలిశారు. కాపు సోదరులపై అక్రమ కేసులు ఎత్తివేస్తానన్నందుకు, రూ.పదివేల కోట్లు ఇస్తానన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రెండేళ్లున్న మద్యం షాపుల లైసెన్స్‌ల కాలపరిమితిని ఏకంగా ఐదేళ్లకు పెంచడం.. లైసెన్స్‌ ఫీజును నాలుగో వంతుకు తగ్గించడం.. ఎవరి బాగు కోసం? బెల్టు షాపులకు సైతం వేలం పాటలు నిర్వహించడం.. బెల్టు షాపులపై ఫిర్యాదులను మీరు పెట్టిన కాల్‌ సెంటర్లు స్వీకరించకపోవడం.. దేనికి సంకేతం? 
-వైఎస్‌ జగన్‌   

మరిన్ని వార్తలు

23-09-2018
Sep 23, 2018, 07:29 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  268వ రోజు కూడా భీమిలి,...
23-09-2018
Sep 23, 2018, 06:57 IST
సాక్షి, విశాఖపట్నం: అందరివాడై..ఆప్తబంధువై వడివడిగా అడుగులేస్తూ వస్తోన్న జనబాంధవుడుతో పల్లెలు పరవశించిపోతున్నాయి.వేగుచుక్కలా..వెలుగు దివిటీలా దూసుకొస్తున్న రాజన్న బిడ్డను చూసి పులకించిపోతున్నాయి....
23-09-2018
Sep 23, 2018, 06:34 IST
విశాఖపట్నం : సుమారు 11 నెలలుగా ఎండనక, వాననకా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు సీఎం అయ్యే అవకాశం...
23-09-2018
Sep 23, 2018, 06:26 IST
విశాఖపట్నం : ‘మా గ్రామంలోని 10 మంది దళితులకు 1999లో ప్రభుత్వం అర ఎకరా వంతున భూమి కేటాయించి డీ...
23-09-2018
Sep 23, 2018, 06:23 IST
విశాఖపట్నం : ‘నాకు ఏడాదిన్నర సమయంలో టీకాలు వేశారు. కొన్ని రోజుల తర్వాత నాకు పోలియో సోకింది. కాళ్ళు, చేతులు...
23-09-2018
Sep 23, 2018, 04:55 IST
22–09–2018, శనివారం  గండిగుండం క్రాస్, విశాఖపట్నం జిల్లా అక్కచెల్లెమ్మలు మీకెందుకు కృతజ్ఞతలు చెప్పాలి బాబూ?  విశాఖ జిల్లాలో యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ జిల్లాలో...
23-09-2018
Sep 23, 2018, 04:47 IST
సాక్షి ప్రతినిధి/సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పధీరుడికి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ బ్రహ్మరథం పట్టింది. నడిచొచ్చిన నిలువెత్తు నమ్మకాన్ని చూసి ఉప్పొంగిపోయింది....
23-09-2018
Sep 23, 2018, 04:37 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రభుత్వ భూములను వదలడం లేదు.....
22-09-2018
Sep 22, 2018, 20:40 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 268వ...
22-09-2018
Sep 22, 2018, 14:12 IST
జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు,,
22-09-2018
Sep 22, 2018, 08:07 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
22-09-2018
Sep 22, 2018, 07:29 IST
ఒక మహోన్నతాశయం.. ఒక మహా సంకల్పం కలిసి.. ఒక మహోజ్వల ఘట్టం వైపు అడుగులు వేస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో...
21-09-2018
Sep 21, 2018, 20:12 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 267వ...
21-09-2018
Sep 21, 2018, 13:00 IST
జన హితుడై... జన శ్రామికుడై... జనమే తన కుటుంబంగా...వారే జీవితంగా భావించే జగనన్న జిల్లాకు రానున్న తరుణంఆసన్నమైంది. ఎప్పుడు ఆయన...
21-09-2018
Sep 21, 2018, 12:52 IST
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రంలో నాలుగేళ్ల ప్రజా కంటక పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌...
21-09-2018
Sep 21, 2018, 06:53 IST
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న...
20-09-2018
Sep 20, 2018, 12:18 IST
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమై.. నేనున్నానంటూ బరోసా ఇస్తున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని..
20-09-2018
Sep 20, 2018, 09:04 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
20-09-2018
Sep 20, 2018, 07:08 IST
అన్నా చిట్టివలస జ్యూట్‌మిల్లు 2009లో లాకౌట్‌ అయింది. సుమారు 6,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తమ ప్రభుత్వం...
20-09-2018
Sep 20, 2018, 06:57 IST
జాబు కావాలంటే జగన్‌ రావాలి. జగనే నెక్ట్స్‌ సీఎం కావాలి అంటూ సాయిగణపతి పాలిటెక్నిక్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top