'2019 నాటికి తెలంగాణలో బలమైన ప్రత్యర్థిగా బీజేపీ' | 2019 BJP strong opponent in Telangana, says Bandaru Dattatreya | Sakshi
Sakshi News home page

'2019 నాటికి తెలంగాణలో బలమైన ప్రత్యర్థిగా బీజేపీ'

Aug 24 2014 11:21 AM | Updated on Mar 29 2019 8:30 PM

'2019 నాటికి తెలంగాణలో బలమైన ప్రత్యర్థిగా బీజేపీ' - Sakshi

'2019 నాటికి తెలంగాణలో బలమైన ప్రత్యర్థిగా బీజేపీ'

2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుందని బీజేపీ ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు.

తిరుపతి: 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుందని బీజేపీ ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం తిరుమలలో విఐపి ప్రారంభ సమయంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దత్తాత్రేయ దర్శనం చేసుకున్నారు. అనంతరం దేవాలయం ఎదుటు మాట్లాడుతూ... అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

దాంతో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.  కేంద్రం ప్రభుత్వం సాయంతో రైతులను అదుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్బంగా దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక భావనలు ఉన్న వ్యక్తులనే పాలక మండలిలో నియమించాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవాలయాల నిధులను ధర్మ ప్రచారానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement