breaking news
-
పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్‌గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్‌గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింది’’ అని చంద్రశేఖర్ గుర్తు చేశారు.‘‘అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదుఇదీ చదవండి: ‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్‌గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్‌ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగదు’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ఇలాగే వేధిస్తే సీఎం ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటా: ఇంటూరి రవి భార్య సుజన
సాక్షి, తాడేపల్లి: తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారని అన్నారు. కనీసం తన భర్తను కలిసే అవకాశం కూడా ఇవ్వటం లేదని వాపోయారు. తన భర్త హార్ట్ పేషెంట్ అని కనీసం మెడిసన్ కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. తన భర్తను ఇలాగే వేధిస్తే సీఎం చంద్రబాబు ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. రెండున్నర నెలలుగా తన భర్తను పోలీసులు ఎలా వేధిస్తున్నారో చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన భర్తపై ఇప్పటికే 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని,. అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతోందని వాపోయారు. భ ర్త వెంట వెళ్తున్నానని తన కారులో గంజాయి పెట్టి మరో కేసు పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖలోని మా ఇంటి నుంచి తీసుకువెళ్ళి తొలుత గుడివాడ, తర్వాత గుంటూరు అరండల్‌పేట, దువ్వాడలో కేసులు పెట్టారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు ఎక్కడెక్కడో కేసులు పెట్టారు.నా భర్తను తీసుకెళ్తున్న పోలీసులతో నేను ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి, మా కారులో గంజాయి పెట్టి సీజ్ చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత విశాఖలోని మహారాణిపేట పీఎస్‌కు పంపి, అక్కడి నుంచి రాజమండ్రిలో రిమాండ్‌కు పంపారు. అక్కడి నుంచి మాచర్ల, తర్వాత కురుపాం, తర్వాత వైజాగ్ సెంట్రల్ జైల్‌కు పంపారు. పీటీ వారెంట్లు వేసి అక్కడి నుంచి బాపట్ల, ఇంకొల్లు పీఎస్‌కు ఆ తర్వాత సబ్బవరం జైల్‌కు పంపారు. అక్కడి నుంచి శ్రీకాకుళం లావేరు, గాజువాక కోర్టు ఇలా తిప్పి తిప్పి ఇప్పుడు మాచర్ల తీసుకువెళ్ళారు.రిమాండ్‌లో ఉన్నారని తెలిసి కూడా పులివెందుల పీఎస్ నుంచి పోలీసులు వచ్చి మా ఇంటి గోడకు నోటీసులు అంటించారు.నా భర్త హార్ట్ పేషెంట్. ఆయనకు ఏం మందులు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళితే అక్కడ కలవనీయకుండా పీటీ వారెంట్ల పేరుతో ఇంకో చోటకు తరలిస్తున్నారు. మా లాయర్లకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఆయనను ఒకేచోట అస్సలు ఉంచకుండా దాదాపు అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లు. జైళ్లు తిప్పుతున్నారు. నా భర్త ఆరోగ్యం బాగోలేదు. అయినా ఆయన్ను కనీసం చూడనివ్వడం లేదు. అర్ధరాత్రిళ్ళు తరలిస్తున్నారు. 12 ఏళ్ళ నుంచి మేం వైఎస్సార్సీపీలో పనిచేస్తున్నాం, నా భర్త ఏ తప్పూ చేయలేదు. అయినా ఆయన పట్ల ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు.నా భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటాను’ అని సుజన పేర్కొన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అధికారిక గూండాగిరి వెర్రితలలు వేస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో రోజురోజుకీ మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదులపట్ల కూడా వ్యవహరించనంత కాఠిన్యంతో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను నిర్భీతిగా కాలరాస్తున్నారు. ఒక్కొక్కరిపై నాలుగైదు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుచేస్తున్న పోలీసులు వారు రిమాండ్‌లో ఉండగానే వారికి తెలియకుండానే మరిన్ని కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను అక్రమ కేసులో ఇటీవల దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసినా ప్రభుత్వ కక్ష చల్లారలేదు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత కూడా వేధిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. -
మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి సవిత.. తక్షణమే రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘సభలో మంత్రి సవిత తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సవిత తక్షణమే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి పదే పదే సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులు ఓటేశారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఆరు నెలల్లో కాపులకు ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి. పది వేల కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశంలో ఎవరూ చేయనంత సంక్షేమం కాపులకు వైఎస్ జగన్ చేశారు. బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారనడం దుర్మార్గం అని మండిపడ్డారుఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ..‘సభలో బాధ్యత గల మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచితమైన వ్యాఖ్యలతో కించపరిచేలా మాట్లాడుతున్నారు. మంత్రి సవిత మహిళలను అవమానించేలా మాట్లాడారు. సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. మహిళలు గంజాయి, మద్యానికి బానిసలైపోయారనడం దారుణం. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి సవిత వ్యాఖ్యానించారుఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ, మైనార్టీలను అవమానించేలా కూటమి నేతల వైఖరి ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్..హోంమంత్రిని చులకన చేసి మాట్లాడారు. దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లే చులకనగా మాట్లాడారని మేం భావిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ ముస్లిం, మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. ఈరోజు మంత్రి సవిత.. మహిళలు గంజాయి, మద్యానికి అలవాటైపోయారంటున్నారు. మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దలు ఉన్నారని మేం భావిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది. వైఎస్ జగన్ అమ్మఒడి ద్వారా పేదలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మంత్రి సవిత వ్యాఖ్యలు చాలా హేయమైనవి. ఒక మహిళా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కనీస విలువ లేదు. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి చంద్రబాబుది. 2014-19లో సాక్షాత్తూ చంద్రబాబు సీఎంగా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. నోటితో చెప్పలేని విధంగా బాలకృష్ణ మహిళలను అవమానపరిచారు. తక్షణమే మహిళలందరికీ మంత్రి సవిత క్షమాపణ చెప్పాలి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పెట్టిన తప్పుడు పోస్టులపై ఎందుకు మాట్లాడరు. మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా?. వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడలేదా?. పవన్ కళ్యాణ్ చేసింది నేరం కాదా?. మేం మాట్లాడితేనే నేరమా?. ప్రజా గొంతుకై మాట్లాడితే మాగొంతు నొక్కేస్తారా. కేసులకు మేం భయపడం.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అని అన్నారు. -
‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పొగడ్తలు అతిగా మారుతున్నాయి. వీటి వెనుక ఉన్న నిజాయితీ ఎంత? వ్యూహమెంత? అన్నదిప్పుడు రాజకీయ వర్గాల చర్చ. చంద్రబాబు ఈ ఐదేళ్లు మాత్రమే కాకుండా.. మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగాలన్నది పవన్ పొగడ్తల్లో ఒకటి. అంటే.. సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పకనే చెప్పడమన్నమాట. ఇంకోలా చూస్తూ,, లోకేష్ సీఎం కాకూడదన్న ఆలోచనతో పవన్ ఈ మాట అన్నారేమో అనే చర్చ కూడా నడుస్తోంది. .. ఈ ప్రకటనతో పవన్ సీఎం పదవిపై ఆశ వదలుకున్నారని సందేశమూ తన సామాజిక వర్గమైన కాపులకు పంపినట్లు కనిపిస్తోంది. అయితే కాపుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి కావాలన్నది వారి చిరకాల ఆకాంక్ష. సినీనటుడు చిరంజీవి ద్వారా ఆ కోరిక తీరుతుందని వారు ఆశించినా ఫలితం లేకపోయింది. ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. కేంద్రంలో కొంతకాలం పాటు మంత్రి పదవి అనుభవించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టి తొలుత టీడీపీకి ఆ తరువాత వామపక్షాలు, బీఎస్పీలతో జట్టు కట్టి పోటీచేశారు అప్పట్లో పవన్ ఎక్కడకెళ్లినా అభిమానులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ యువత సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేసేది. దానికి ఆయన కూడా సంబరపడేవారు. కానీ.. 2019 ఎన్నికలలో ఆయన రెండుచోట్ల పోటీచేసి ఓడిపోవడం, పార్టీ ఒక్క సీటుకే పరిమితమైపోయాయి. ఆ వెంటనే పవన్ ప్లేటు మార్చి బతిమలాడకుని మరీ మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. ఆ ఎన్నికలలో టీడీపీ కూడా ఓటమి పాలవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరంగా ఉంటే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ ను ముందుగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలోకి ప్రవేశింప చేసి, తన తరపున రాయబారం చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారని అంటారు. .. ఆ తర్వాత కాలంలో పవన్‌ను చంద్రబాబు తన వెంట తిప్పుకున్నారు. చివరికి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో పవన్ ఆయనను పరామర్శించడానికి వెళ్లి పొత్తులపై మాట్లాడారు.అప్పటికే పవన్ కల్యాణ్ కు ఒక భయం పట్టుకుంది. తాను టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే మళ్లీ ఓడిపోతానని సందేహించారు. పవన్ కల్యాణ్, జనసేన మద్దతు లేనిదే టీడీపీ అధికారంలోకి రాలేదని చంద్రబాబూ భావించారు. ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా పని చేయాలంటే కేంద్రంలోని బీజేపీతో స్నేహం అవసరమని కిందా, మీద పడి ఆ పార్టీని ఒప్పించారు. నిజానికి జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేయడం ద్వారా ఏపీలో తమ బలాన్ని పెంచుకోవచ్చని బీజేపీ అనుకుంది. పవన్‌ను సీఎం అభ్యర్ధిగా కూడా బీజేపీ కేంద్ర నేతలు కొందరు ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తు చర్చల సమయంలో పవన్‌కు ముఖ్యమంత్రి పదవిని ప్రతిపాదించి రెండేళ్లపాటు అవకాశం ఇవ్వాలని బీజేపీ సూచించింది. .. అలాగే సీట్ల పంపిణీ టీడీపీకి సగం, జనసేన, బీజేపీలకు సగంగా జరగాలని బీజేపీ పెద్దలు అభిప్రాయపడినా, పవన్ దానికి కూడా పట్టుబట్టకుండా జారిపోయారు. పవన్ కల్యాణ్ అసలు తాను గెలుస్తానో, లేదో అన్న భయంతో షరతులు లేకుండా టీడీపీతో పొత్తుకు ముందుకు వెళ్లారన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. బీజేపీని కూడా ఒప్పించారు!. ఈవీఎంల మేనేజ్ మెంటా? లేక ప్రజలు ఓట్లు వేశారా? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ, ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తి చెందారు. ఆ తర్వాత ఎన్ని అరాచకాలు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పవన్ తొలుత నోరు మెదపలేదు. కారణం తెలియదు కానీ, సడన్ గా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారన్న వాస్తవాన్ని పవన్ ప్రకటించారు. ఆ సందర్భగా హోం మంత్రి అనిత సమర్థతను ప్రశ్నిస్తూ, తానే హోం మంత్రి అవుతానని హెచ్చరించారు. అది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసింది. .. ఆ మీదట చంద్రబాబు ఏమి చెప్పారో కానీ, వెంటనే స్వరం మార్చి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల గురించి కాకుండా సోషల్ మీడియా లో అసభ్య పోస్టింగ్లపైకి దారి మళ్లించారు. పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులు చేయిస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలోని సూపర్ సిక్స్ తదితర అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం బాగా పని చేస్తోందని ప్రచారం ఆరంభించారు. అదే సందర్భంలో చంద్రబాబు అనుభవం.. అంటూ పవన్ తెగ పొగుడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజంగానే అమలు చేస్తుంటే ప్రశంసించవచ్చు. నిత్యం అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించిందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని పవన్ అనడంలో ఆంతర్యం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ఆయన సనాతన ధర్మం అంటూ బీజేపీ ఎజెండా ప్రకారం రాజకీయం చేస్తూ ,మరో వైపు చంద్రబాబును పొగడడం ద్వారా టీడీపీతో సత్సంబంధాలు ఉంచుకునేలా జాగ్రత్త పడుతున్నారు. సినీ నటుడు కూడా అయిన పవన్ కల్యాణ్ గ్లామర్ ను ఉపయోగించుకుని ఏపీలో ఎదగాలని బీజేపీ భావనగా ఉందని అంటున్నారు. భవిష్యత్తులో టీడీపీతో తేడా వస్తే ఈ వ్యూహంలోకి బీజేపీ వెళ్లవచ్చన్నది కొందరి అనుమానం. ఈలోగా చంద్రబాబుతో గొడవ లేకుండా పవన్ పొగుడుతుండవచ్చు. మరో విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం స్థానంలో ఎప్పుడు కూర్చుంటారా అని లోకేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అమెరికా వెళ్లి వచ్చిన సందర్భంగా టీడీపీకి చెందిన 18 మంది మంత్రులు స్వాగతం చెప్పడమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. కుటుంబ పరంగా లోకేష్‌కు సీఎం పదవి సాధ్యమైనంత త్వరగా కట్టబెట్టాలన్న ఒత్తిడి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ లోకేష్ కు సీఎం పదవి అప్పగిస్తే పవన్ ఆయన క్యాబినెట్ లో ఉంటారా? లేదా? అన్నది చెప్పలేం. పవన్ కల్యాణ్ కు అది పెద్ద సమస్య కాదని, ఆయన పదవికి అలవాటు పడ్డాక దానిని వదులు కోలేరన్నది కొంతమంది వాదన. అయితే బీజేపీతో స్నేహం నడుపుతున్న పవన్ వ్యూహాత్మకంగా లోకేష్ కు సీఎం పదవి ఈ టరమ్‌లో రాకుండా చూడడానికే ఈ ప్రకటన చేశారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. అంతే కాకుండా, పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని అన్నారంటే, ఆ పదవి తనకే కాకుండా లోకేష్ కు కూడా రాదని చెప్పడమే అవుతుంది. ఇది ఒకరకంగా చంద్రబాబుకు కూడా కొంత ప్రయోజనకరం కావచ్చ. లోకేష్‌ను ఈ టరమ్‌లో సీఎంగా చేస్తే పవన్ ఒప్పుకోరని, ఆయన పొత్తు వీడిపోతే టీడీపీకి ఇబ్బంది అవుతుందని కుటుంబానికి నచ్చ చెప్పడానికి ఇది ఉపయోగపడవచ్చన్నది మరో అభిప్రాయం. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ఈ టరమ్ పూర్తి అయ్యేసరికి 79 ఏళ్లకు చేరతారు. ఆ తర్వాత పదేళ్లు అంటే 89 ఏళ్లు వస్తాయి. వచ్చే టరమ్‌లో తిరిగి కూటమి గెలుస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. ఆ పరిస్థితి ఎలా ఉన్నా 90 ఏళ్లు వచ్చే వరకు చంద్రబాబు సీఎం గా ఉండాలని పవన్ అంటున్నారంటే, అది ముఖస్తుతి కోసం, లోకేష్ సీఎం కాకుండా అడ్డుకోవడానికే కావచ్చన్నది జనసేనలో జరుగుతున్న చర్చ. నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ మాటే నడుస్తోందని, మంత్రులు ఎవరూ ఏమీ చేయడానికి లేదని అంటున్నారు. చివరికి పవన్ కల్యాణ్ శాఖలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు లోకేష్ ద్వారానే జరుగుతున్నాయని అంటారు. లోకేష్‌ను నేరుగా ఎదిరించే ధైర్యం పవన్ ప్రస్తుతం చేయడం లేదని చెబుతున్నారు. కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులను ఒక టీమ్‌గా పెట్టుకుని లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒకరినొకరు పొగుడుకుంటూ కాలం గడుపుతుంటే, అసలు పెత్తనం అంతా లోకేష్ చేస్తున్నారన్నది సచివాలయ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ నిస్సహాయ స్థితిలోనో, లేక వ్యూహాత్మకం గానో లోకేష్ సీఎం కాకుండా అడ్డుపడే లక్ష్యంతో ఈ ప్రకటన చేశారేమో అనే విశ్లేషణలు సోషల్ మీడియాలో కూడా విస్తారంగా వస్తున్నాయి. రాజకీయాలలో అతిగా పొగిడితే కూడా పలు సందేహాలు వస్తుంటాయి. ఏది ఏమైనా పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే యోగం ఎప్పటికైనా ఉంటుందా? అన్నది ఆయన అభిమానులకు లక్ష డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నందిగం సురేష్ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.మాజీ ఎంపీ సురేష్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్‌పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.మరోవైపు.. సురేష్ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. -
మహిళలపై మంత్రి సవిత అభ్యంతరకర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఇవాళ ఏపీ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో.. రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారామె.జగన్మోహన్రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు..మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాంతిచకపోవడంతో మండలిని వాయిదా వేశారాయన. ఇదిలా ఉంటే.. నిన్న ఇదే మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సమయంలో హజ్ యాత్రను ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి. -
పీఏసీ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ
అమరావతి, సాక్షి: రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు.‘‘ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది... పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గరి నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.. అన్నీ పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు... మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ, ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు. -
‘ఏయ్.. పవన్ చెప్పినా పనిచేయవా?’
కర్నూలు (సెంట్రల్): ‘ఏయ్.. మా పవన్ కల్యాణ్ చెప్పినా పనిచేయవా?’ అంటూ.. ఊగిపోతూ.. డీఎంహెచ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులుపై దాడికి దిగాడో జనసేన నేత. కర్నూలు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ హర్షద్ గురువారం డీఎంహెచ్‌వోలో వీరంగం సృష్టించాడు . వివరాల్లోకి వెళితే.. 2012 నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రీతిబాయి తల్లి పార్వతి ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులో పనిచేస్తోంది. ఆమెకు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం అధికారులను ఆశ్రయించింది. అందుకు సర్వీసు రూల్స్ లేవని చెప్పడంతో ఇటీవల ఆమె డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఆశ్రయించింది. ఆయన స్పందించి జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు ఫోన్‌చేసి పార్వతికి పదోన్నతి కల్పించే అంశంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని కలెక్టర్ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు అప్పగించారు. ఈ క్రమంలో గురువారం పార్వతితోపాటు డీఎంహెచ్‌వో కార్యాలయ ఏఓ అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ సంపత్‌లను డీఆర్వో తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల సర్వీసు మ్యాటర్. అయితే పార్వతితోపాటు జనసేన నాయకుడు హర్షద్ కూడా వారి వెంట వెళారు. డీఎంహెచ్ఓ కార్యాలయానికి సంబంధించి కేవలం సూపరింటెండెంట్ శ్రీనివాసులు మాత్రమే రావడం, ఎలాంటి రికార్డులు లేకుండా ఉండటంపై జనసేన నాయకుడు ఆయనపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎం చెప్పినా ఎందుకు పదోన్నతి ఇవ్వరని శ్రీనివాసులుపై దాడికి యత్నించాడు. అయితే అతను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన స్వయంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సి.వెంకటనారాయణమ్మ ఎదుటే చోటుచేసుకుంది. అయితే పదోన్నతి ఇవ్వాలంటే డీఎంహెచ్‌వో ఏవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు లంచం అడిగారని పార్వతి ఆరోపిస్తుండగా.. మరోవైపు సర్వీసు రూల్స్ అందుకు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. -
ఫ్లాష్‌బ్యాక్ గుర్తుందా చంద్రబాబూ?
అమరావతి, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ప్రజా పద్దుల సంఘం(PAC) ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగబోతోంది. వైఎస్సార్సీపీకి తగిన సంఖ్యా బలం లేదనే సాకు చూపిస్తూ.. అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.పీఏసీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా.. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా(1966 నుండి) వస్తోంది. అధికార కూటమి తర్వాత ఉంది.. విపక్ష స్థానంలో వైఎస్సార్సీపీనే కాబట్టి న్యాయంగా ఆ పదవి ఆ పార్టీకే దక్కాలి. అయితే.. ఆ సంప్రదాయానికి గండికొట్టి.. తామే దక్కించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోంది. పైగా ఏకగ్రీవం చేయకుండా.. కావాలనే కూటమి పార్టీ వాళ్లతో కావాలనే నామినేషన్లు వేయించారు చంద్రబాబు. అయితే..సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. నామినేషన్ సమయంలోనూ చివరిక్షణం దాకా అసెంబ్లీ సెక్రటరీ ఛాంబర్ వద్ద పెద్దడ్రామానే నడిచింది. ఇక.. మొత్తం 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు(టీడీపీ 7, జనసేన 1, బీజేపీ 1, వైఎస్సార్సీపీ 1) వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ సభ జరిగే టైంలోనే.. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.వైఎస్సార్సీపీ హయాంలో గుర్తుందా?2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించారు వైఎస్ జగన్. ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి అప్పగించారు... అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా మాత్రం చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. కానీ,అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించడం గమనార్హం. పీఏసీతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుంది. -
‘అదానీ గ్రూప్ సంస్థలతో ఏపీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. సెకీ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో మాత్రమే ఒప్పందం చేసుకుందని, అదానీ గ్రూప్‌తో ఏపీ డిస్కమ్‌లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా కల్పించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలుకు సెకీతో 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కమ్‌లు ఒప్పందం చేసుకున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రూపంలో ఏటా సుమారు 12,500 మిలియన్ యూనిట్లను డిస్కమ్‌లు సరఫరా చేస్తాయని తెలిపింది. ఈ ఛార్జీలను డిస్కమ్‌లకు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పింది. 👉 గత చంద్రబాబు ప్రభుత్వం అనాలోచిత విధానాలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సరఫరా ధర యూనిట్‌కు రూ.5.10కి చేరింది. ఇది డిస్కమ్‌లపై తీవ్ర భారం పడటానికి దారితీసింది. దీని వల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది.👉ఈ సమస్యను పరిష్కరించేందుకు పది వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పార్క్‌లను అభివృద్ధి చేయాలని 2020లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 👉ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. యూనిట్ రూ.2.49–రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది.👉అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు (ఐఎస్టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సెకీ ప్రతిపాదించింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ.. సెకీ. 2019 జూన్ 25న నిర్వహించిన టెండర్ల ద్వారా ఏర్పాటైన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి సెకీ విద్యుత్ కొనుగోలు చేస్తుంది. 👉ఈ నేపథ్యంలోనే యూనిట్ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో 2024–25లో మూడు వేలు, 2025–26లో మూడు వేలు, 2026–27లో వెయ్యి మెగావాట్లను అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలను మినహాయించుని సరఫరా చేయడానికి సెకీ అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్ 1న విద్యుత్ కొనుగోలుకు సెకీతో డిస్కమ్‌లు ఒప్పందం చేసుకున్నాయి. 👉సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి అత్యంత చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుంది.Andhra Pradesh distribution utilities supply close to 12,500 MU of free power per annum to agriculture sector. On this front, the Government compensates the distribution utilities to the extent of the cost of supply pertaining to that power. Owing to the policies of the previous…— YSR Congress Party (@YSRCParty) November 21, 2024 -
అదే ఒప్పందం మళ్లీ..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)తో ఒప్పందం చేసుకుంటే.. సీఎం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే సంస్థతో మరోసారి ఒప్పందం చేసుకున్నారు. నిజానికి.. గత ఏడాది ఫిబ్రవరి 9న నాటి సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ).. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న సీఎస్ సమక్షంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్–రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ప్రారంభించలేదు. అలాగే, అప్పట్లోనే ఎన్టీపీసీకి థర్మల్ పవర్ కోసం కేటాయించిన భూములను కూడా గ్రీన్ ఎనర్జీ కోసం కేటాయిస్తూ నాటి జగన్ ప్రభుత్వమే మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. గురువారం అదే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీతో మళ్లీ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) మధ్య ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ.1,87,000 కోట్లు ఎన్జీఈఎల్ పెట్టుబడి పెట్టనుందని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిద్వారా రాష్ట్రంలో దాదాపు 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని.. అలాగే, రానున్న 25 ఏళ్లలో దాదాపు రూ.20,620 కోట్ల లబ్ధి రాష్ట్రానికి చేకూరనుందని తెలిపింది.పునరుత్పాదక విద్యుత్‌దే భవిష్యత్తు..ఈ ఒప్పందం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేసే క్రమంలో ఇది కీలక అడుగన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. భవిష్యత్తు అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్‌ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తిచేయాలని సీఎం తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్టీపీసి గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గురుదీప్ సింగ్, ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. సారంగపాణి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. -
Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాలే 'పరమావధి'
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా రాజీ పడకుండా లోక్‌సభ,రాజ్యసభల్లో పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. ఆ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అన్ని కీలక అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న నిర్ణయం వల్ల కలిగే నష్టాన్ని సభలో ప్రస్తావించాలని చెప్పారు. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, ఇదే అంశంపై ప్రధానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు, ఆర్ అండ్ ఆర్ నిధులు తక్షణమే విడుదల చేసి ముంపు ప్రాంత వాసులకు న్యాయం చేయాలని కోరాలని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఈ విషయమై ఉభయ సభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయబోమని, రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యేలా మన వంతుగా గట్టి ప్రయత్నం చేయాలని, ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ బిల్లును ఆమోదించకూడదని, దీనిపైనా ఆందోళన చేయాలని ఆదేశించారు. వక్ఫ్ బిల్లుతో సెక్యులర్ దేశం అన్న దానికి అర్థం లేకుండా చేస్తే.. ముస్లిం మైనారిటీల తరఫున అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింప చేయాలని సూచించారు. అక్రమ కేసుల గురించి గట్టిగా మాట్లాడాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసం, హత్యలు, హత్యా యత్నాలు జరుగుతూనే ఉన్నాయని, వీటన్నింటి గురించి పార్లమెంట్లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ సూచించారు. ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లు సాకుగా చూపుతూ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధిస్తుండటం.. పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుండటం యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ఉభయ సభల్లో మాట్లాడాలని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారని, ఒకరిద్దరిపై ఏకంగా 10–15 కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శంగా నిలుస్తోందని.. ఇంత తీవ్రమైన దారుణాలు గతంలో ఎన్నడూ చూడలేదనే విషయాన్ని అన్ని పారీ్టల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మరోవైపు టీడీపీకి చెందిన సోషల్ మీడియా పెడుతున్న దారుణమైన పోస్ట్‌లపై వైఎస్సార్సీపీ నాయకులు సాక్ష్యాధారాలతో సహా ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎక్కడా పోలీసులు స్పందించడం లేదని, కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదనే విషయాలను ఎత్తి చూపాలని సూచించారు. ఈ విషయాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం సమావేశ వివరాలను రాజ్యసభ సభ్యుడు పిల్లి సుబాష్ చంద్రబోస్.. ఎంపీలు తనూజా రాణి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావుతో కలిసి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, చట్ట విరుద్ధమైన అరెస్టుల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్ జగన్ దిశా నిర్దేశం మేరకు రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలన్నింటి గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. -
YSRCP: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలు
తాడేపల్లి : ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆర్డినేట్‌గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.అదే సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి సైతం అదనపు బాధ్యతలు అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను అప్పగించారు. -
రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్‌ని చేస్తాననటం సరికాదన్నారు.‘‘రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినా రాయలసీమ వాసులు కాదనలేదు. కనీసం హైకోర్టు వస్తుందని రాయలసీమ వాసులు భావించారు. ఇప్పుడు అదికూడా లేకుండా చేస్తున్నారు. శంకుస్థాపన జరిగిన లా యూనివర్సిటీని ఎందుకు తరలిస్తున్నారు?. మా కళ్లెదుటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక పోతున్నాం. హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌ది. ఆయన వలన అనంతపురం జిల్లా కరువులోకి పోకుండా ఆపగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఆ ప్రాజెక్ట్‌ని నాశనం చేశారు. జిఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్టు నీటిని చంద్రబాబు కుదించారు’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.‘‘గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని వైఎస్ జగన్ పెంచారు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ను చంద్రబాబు పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడుని వైఎస్సార్ పూర్తి చేయటం వలన సాగునీరు అందుతోంది. శ్రీసిటీ, కొప్పర్తి ప్రాజెక్టులు వైఎస్సార్, జగన్‌ల వలనే సాధ్యమయ్యాయి. చంద్రబాబు ఏ ఒక్కపనీ చేయకపోగా వైఎస్ కుటుంబం చేసిన పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు దారుణం. వరద బాధితులకు పులిహోర పెట్టి రూ.550 కోట్లు కొట్టేశారు. అగ్గిపెట్టెల కోసం రూ.23 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు. వీటిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు.మరి చంద్రబాబు, లోకేష్‌లు జగన్‌ని కించపరిచేలా పోస్టులు పెడితే వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల పేరుతో టీడీపీ వారే దొంగ ఖాతాలను ఓపెన్ చేసి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. చట్టం ఎవరికైనా ఒకటే అన్నట్టుగా ఉండాలి. అధికారంలో ఉన్న వారికి ఒకలాగ, ప్రతిపక్షంలోని వారికి ఇంకోలా ఉండటం సరికాదు. ల్యాండ్ టైట్లింగ్ వలన భూసమస్యలు పరిష్కారమయ్యేవి. కానీ దానిపై విష ప్రచారం చేసి జనాన్ని భయపెట్టి ఎన్నికలలో పబ్బం గడుపుకున్నారు..ప్రజాజీవితంలో ఉన్నవారికి మంచితనం కూడా ఉండాలి. అబద్దాలే ప్రచారం చేసుకుని బతుకుతామంటే కుదరదు. పోలవరం ప్రాజెక్టులో 90 శాతం అనుమతులు వైఎస్సారే తెచ్చారు. కానీ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కన్నా జగన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. చంద్రబాబు పాలనలో విధ్వంసం మాత్రమే జరిగింది. కానీ అభివృద్ధి మొత్తం తన హయాంలోనే అన్నట్టుగా బిల్డప్‌లు ఇస్తున్నారు. పోర్టులు, మెడికల్ కాలేజీలను జగన్ తెస్తే వాటిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టించటం అంటే?. అదాని పరిశ్రమపై దాడి చేయటం దారుణం. జగన్ హయాంలో పారిశ్రమలు పెట్టటానికి పారిశ్రామిక వేత్తలు వచ్చారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వేత్తలు భయంతో పారిపోతున్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తెస్తానని ఎప్పట్నుంచో చెప్తూనే ఉన్నారు. మాటలు కాదు పనుల్లో చేసి చూపించాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. -
బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ: కన్నబాబు
సాక్షి ,గుంటూరు: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర అప్పులపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. 30 వేల మంది మహిళలను అక్రమ రవాణా చేశారని పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని.. మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలే ఒప్పుకున్నారన్నారు.‘‘పచ్చిఅబద్ధాలు ప్రచారం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రుషికొండ భవనాలపై రాష్ట్ర ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు మాటలు నమ్మి వాలంటీర్లు మోసపోయారు. వాలంటీర్లను మోసం చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే ఒప్పుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.’’ అని కన్నబాబు నిలదీశారు.‘‘టీడీపీ అబద్దాల పునాదుల మీద బతుకుతోంది. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులు అని, రాష్ట్రం శ్రీలంకగా మారుతోందని ప్రచారం చేశారు. చివరికి రూ.6 లక్షల కోట్లేనని తేలింది. 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా జరిగిందని పవన్ కళ్యాణ్ విషప్రచారం చేశారు. 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలింది. రూ.3 వేల కోట్లు రంగుల కోసం ఖర్చు చేశారని పవన్, చంద్రబాబు ఆరోపణలు చేశారు. కానీ అదే పవన్ కల్యాణ్ అసెంబ్లీలో రంగులు వేయటానికి, తొలగించటానికి రూ.101 కోట్లేనని చెప్పారు..రిషికొండ మీద ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భవనాలు కట్టారని నిసిగ్గుగా ఆరోపణలు చేశారు. కానీ ఇవాళ అన్ని అనుమతులు ఉన్నాయని అసెంబ్లీలో చెప్పారు. వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి, ఇప్పుడు అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదని అబద్దాలు చెప్తున్నారు. ఇంత మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గు అనిపించటం లేదా?. గత అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశాల్లో వాలంటీర్ల వ్యవస్థేలేదన్నారు. 2023 ఆగస్టు నుంచి ఆ వ్యవస్థే లేదని చెప్తూ మరి మే నెల వరకు ఎలా జీతాలు ఇచ్చారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘వాలంటీర్లు న్యూస్ పేపర్ కొనేందుకు ఇస్తున్న రూ.200 లను కట్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు. మరి వాలంటీర్లు లేకపోతే ఆ జీవో ఎలా ఇచ్చారు?. ఉచిత ఇసుక పేరుతో ట్రక్కు రూ.26 వేల చొప్పున అమ్ముతున్నారు. రాష్ట్రమంతటా నిర్మాణాలు ఆగిపోయాయి. గ్రామాల్లో బహిరంగంగా మద్యం బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలే బెల్టుషాపులు తెరిచారు. మద్యం ధరలను తగ్గించకుండా మోసం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు 30 నుండి 50 శాతం వరకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు పన్నులు వేయటమే సంపదను సృష్టించటం అంటారా?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది. చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసంతకం పెట్టిన మెగా డీఎస్సీకి ఇప్పటికీ దిక్కూమొక్కులేదు. ఉచిత గ్యాస్ సిలెండర్లకు నిధుల కేటాయింపే చేయకుండా ప్రజల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక హత్యలు, దోపిడీలు, అరాచకాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారులు టీడీపీ నేతలు చెప్పిందే చేస్తూ కాలం గడుపుతున్నారు. సామాన్యుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప ఎక్కే పరిస్థితే లేదు. మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీద 8 అక్రమ కేసులు నమోదు చేశారు..స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని లోకేష్ చెప్పాడు. మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లను ఎలా పెడుతున్నారు?. అప్పుడు ఉరితాడులు అన్న స్మార్ట్ మీటర్లు ఇప్పుడు పసుపు తాడులుగా మారాయా?. గీత కార్మికులకు ఒక్క మద్యం షాపు కూడా ఇవ్వకుండా ఇచ్చినట్టు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు. గతంలో కుల కార్పొరేషన్లను తప్పుపట్టున చంద్రబాబు ఇప్పుడు అవే కార్పొరేషన్లను ఎలా కొనసాగిస్తున్నారు?. అప్పుల గురించి చంద్రబాబు, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు వేర్వేరుగా లెక్కలు చెప్పారు. కాగ్ చెప్పిన లెక్కలు నిజమా? లేక ఈనాడు పత్రిక, టీడీపీ నేతలు చెప్పిన లెక్కలు నిజమా?..రాష్ట్ర పరపతిని దెబ్బతీసే కథనాలు పత్రికలో వస్తే ఆర్థిక శాఖ ఎందుకు ఖండించటం లేదు?. అసలు కాగ్ లెక్కలు కరెక్టా? మీ కాకి లెక్కలు కరెక్టా?. ఈ ఐదు నెలల్లోనే రూ.50 వేల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుది. గతంలో మాపై చేసినవి పచ్చి అబద్దాలని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. పబ్లిసిటీ స్టంటు, మీడియా మేనేజ్మెంట్తో ఎక్కువ కాలం ఏ ప్రభుత్వమూ నిలపడలేదు’’ అని కురసాల కన్నబాబు చెప్పారు. -
కర్నూలులోనే హైకోర్టు.. వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, కర్నూలు: కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుకు మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏర్పాటుపై శాసన మండలిలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో ఏముందో మంత్రి భరత్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని.. గతంలో బీజేపీ కూడా డిక్లరేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు.హైకోర్టును కర్నూలులో పెట్టాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో పెట్టిందని.. ఇప్పుడు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా గతంలో కూటమి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టాలని బీజేపీ గతంలో డిక్లరేషన్ చేసిందన్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆయన తెలిపారు. -
‘సోషల్ మీడియా నిర్బంధాలపై పార్లమెంట్లో చర్చిస్తాం’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..గురువారం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు. -
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధిక ధరలన్నాడు.. నాణ్యత లేదన్నాడు. ఆడ పిల్లల మంగళ సూత్రాలు తెంపుతాడు.. మీ ఆరోగ్యం గోవింద అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. 99 రూపాయలకే మద్యం అన్నాడు.. కానీ ఆ చీఫ్ లిక్కర్ మాత్రం దొరకడం లేదు. మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు?. జగన్ ప్రభుత్వంలో అది విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా?. ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే. వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని కూడా బాబు మోసం చేశాడు.చంద్రబాబు ఇచ్చే చీఫ్ లిక్కర్ 99కి అమ్మితే.. అదే మందు కేరళలో 85కి ఇస్తున్నారు. దానికి తోడు ఈ చీఫ్ లిక్కర్ నాణ్యమైనది కాదనేది నా అభిప్రాయం. కొన్ని ఏళ్లు ఈ మద్యం తాగితే వారి ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు. వారికి 20 శాతం మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5శాతం మార్జిన్ ఇస్తున్నాడు. విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయి.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. మా ప్రభుత్వంలో 47వేల బెల్టు షాపులు రద్దు చేస్తే మళ్ళీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం షాపులు సంఖ్య తగ్గించి పర్మిట్ రూమ్స్ లేకుండా చేశాం. కానీ, మళ్ళీ చంద్రబాబు పాత రోజులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు -
CBNlies: ‘మాట మార్చడంలో డాక్టరేట్ ఇవ్వాలేమో!’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు చేస్తున్న ప్రకటనలపై శాస్త్రీయంగా ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు.. ఆ తరువాత ఇస్తున్న సందేశాలు అంత ఆసక్తికరంగా ఉన్నాయి మరి! మాటలు మార్చడం ఇంత తేలికా అన్నట్టుగా ఉన్నాయి ఇటీవలి కాలంలో వీరు చేస్తున్న ప్రకటనలు. ఏమాత్రం జంకు గొంకూ లేకుండా అసత్యాలెలా చెప్పగలుగుతున్నారు? అసలు వీరి మాటలను ప్రజలు పట్టించుకుంటున్నారా? అన్న అనుమానాలూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమన్నారు..? తన రాజకీయ అనుభవంతో ప్రజలపై భారం పడకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాననే కదా? ఈ మాటలన్నింటికీ పవన్ కళ్యాణ్ ఊకొట్టడమే కాకుండా నిజం నిజం అంటూ బాబును ఆకాశానికి ఎత్తేశారా లేదా? వందిమాగధుల చందంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు పొడగ్తలతో బాబుకు ఎలివేషన్ కూడా ఇచ్చాయే..!! జగన్ సంక్షేమ కార్యక్రమాలను వృథా ఖర్చులంటూ, బటన్ నొక్కడం తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ విమర్శించిన ఈ మీడియా సంస్థలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు, మూడు రెట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించాయి కూడా. జగన్ చేస్తే తప్పట. అదే చంద్రబాబు ఇంకా అధికంగా చేస్తానని చెబితే సూపర్ అట. ఇలా సాగిపోయింది వారి ప్రచారం. కానీ... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం ఒక్కసారిగా అందరి గొంతు మారిపోయింది. వారి అసలు స్వరూపాన్ని బయటబెట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిలోనూ యూటర్న్ తీసేసుకున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గుపడటమూ లేదు సరికదా.. దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు పిసరంత పెంచినా బాదుడే, బాదుడు.. విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెరిగాయి అంటూ టీడీపీ, ఎల్లో మీడియా గొంతు చించుకునేవి. ఈ ప్రభావం ప్రజలపై కూడా కొంత పడింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అదే ట్రూ అప్ ఛార్జీలను మరింత అధికంగా బాదుతున్నారు. ఏకంగా రూ.17 వేల కోట్ల భారం మోపడానికి ఆమోదం పొంది, రూ.ఆరు వేల కోట్లకు పైగా మొత్తాన్ని తక్షణం వసూలు చేయడం ఆరంభించారు. అదేమిటంటే జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల పెంచాల్సి వస్తోందని కొత్త రాగం అందుకున్నారు. దీంతో సంపద సృష్టి అంటే జగన్ టైమ్‌లో కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమా? అని ప్రజలు నివ్వెర పోతున్నారు. ఇంకో ఉదాహరణ... రోడ్లపై గోతులు పూడ్చి, రోడ్ల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటన చూడండి. జగన్ టైమ్‌లో రహదారులను బాగు చేసినప్పటికీ రాష్ట్రంలో రోడ్లన్ని పాడైపోయినట్లు ఈనాడు మీడియా ప్రచారం చేసింది. వర్షాల వల్ల గోతులు పడినా, అదంతా జగన్ ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారం ఎంత స్థాయికి చేరుకుందంటే.. చంద్రబాబు, పవన్‌లు అధికారంలోకి రాగానే రహదారులపై గోతులు ఆమాంతం మాయమైపోతాయని, అద్దాల్లా మెరిసిపోతాయని ప్రజలు అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా మారింతి వీసమెత్తు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అట్టహాసంగా హెలీకాప్టర్ వేసుకుని ఓ గ్రామం వద్ద రహదారి గోతిపై మట్టిపోసి రావడం తప్ప! తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మళ్లీ గొంతు మార్చేశారు. రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామన్నారు. వాహనదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ సంస్థలే రహదారులను మరమ్మతు చేస్తాయని, ఉభయ గోదావరి జిల్లాల్లోనే తొలి పైలట్ ప్రాజెక్టు మొదలు పెడాతమని ప్రకటించారు. పైగా ప్రజలను ఈ పద్ధతికి ఒప్పించే బాధ్యతను ఆయన ఎమ్మెల్యేలపై నెట్టడం.. వారు ఒప్పుకోకుండా గుంతల్లోనే తిరుగుతామని అంటే తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పడం కొసమెరుపు!! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ పన్ను వేసినా, ఏ ఆదాయ వనరు పెంచినా, ప్రభుత్వ దోపిడీ అని అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు కాకుండా, అన్నిటిపై ముక్కు పిండి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంటున్నారన్నమాట. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మండల స్థాయి రోడ్లకు కూడా యూజర్ ఛార్జీలు అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఈ పద్దతి అమలు చేస్తామని చెబితే తప్పు కాదు. అప్పుడేమో అంతా ఫ్రీ అని, ఆ తర్వాత ఏదీ ఉచితం కాదని, డబ్బులు మీరే ఇవ్వాలని జనాన్ని అంటుంటే వారు నిశ్చేష్టులవడం తప్ప చేసేది ఏమి ఉంటుంది? ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రోడ్లు,భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డి మాత్రం రహదారులపై టోల్ గేట్లు ఉత్తదే అని ప్రకటన చేశారు. కాని మంత్రి గాలి తీస్తూ చంద్రబాబు యూజర్ చార్జీల ప్రకటన చేసేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం స్థానిక సంస్థలు పారిశుద్ద్యం నిర్వహణకు నెలకు ఏభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం చెత్తపన్ను వేశారని, ఇది చెత్త ప్రభుత్వం అని దుర్మార్గపు ప్రచారం చేశారు. ఇప్పుడేమో వేల రూపాయల చొప్పున యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. లేకుంటే గోతులే మీకు గతి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు దీనిని రోడ్లపై గుంతలకు కూడా జనం నుంచి డబ్బు వసూలు చేసే రోత ప్రభుత్వం అని ఎవరైనా విమర్శిస్తే తప్పులేదేమో! ఒకవైపు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు రాష్ట్రం అంతా కట్టాల్సిందే. అమరావతిలో మాత్రం కొత్త రోడ్లపై టోల్ గేట్లు పెట్టి డబ్బలు వసూలు చేస్తామని చెప్పడం లేదు. అమరావతిలో విలాసవంతమైన కార్లలో తిరిగే ఖరీదైన షరాబులే అధికంగా ఉంటారు. వారు తిరిగే రోడ్లపై అంతా ఫ్రీ. పేదలు, మధ్య తరగతి వారు ఎక్కువగా తిరిగే గ్రామీణ రోడ్లపై మాత్ర టోల్ వసూళ్లు. ఇసుక ,మద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇసుక మొత్తం ఉచితం అనుకున్న ప్రజలకు గతంలో కన్నా అధిక రేట్లు పెట్టి కొనాల్సి రావడం అనుభవం అయింది. మద్యం ధరలు తగ్గిస్తారనుకుంటే ఎమ్.ఆర్.పి కన్నా ఎక్కువ రేట్లే వసూలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలలో భాగంగా గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పెడితే చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్‌లు నానా యాగీ చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా దుర్మార్గపు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటినే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. అప్పట్లో స్మార్ట్ మీటర్లపై వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఈనాడు మీడియా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయి.. అని హెడింగ్ పెట్టి ప్రజలను పండగ చేసుకోమన్నట్లుగా స్టోరీలు ఇస్తోంది. వివిధ కారణాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. వాటిని అదుపు చేసే యంత్రాంగం లేకుండా పోయింది. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా సరుకుల రేట్లు పెరిగిపోయాయని యాగీ చేసిన టీడీపీ, ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఇప్పుడు అంతకు రెట్టింపు ధరలు పెరిగినా నోరు మెదిపితే ఒట్టు. ప్రజలకు జగన్ టైమ్ లో వచ్చిన స్కీముల డబ్బుతో పేదల జీవితం చాలావరకు సాఫీగా సాగేది. ఆయన ఇచ్చిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని కూటమి నేతలు అబద్దాలు చెప్పి, ఇప్పుడు దాదాపు అన్నిటిని ఎగవేసే పనిలో ఉన్నారు.దాంతో మండుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం పిండుతున్న అదనపు వసూళ్లు చాలవన్నట్లు జీఎస్టీపై ఒక శాతం సర్ఛార్జ్ వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. అది కూడా వస్తే ఏపీలో పన్నులు మరింతగా పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండుతాయి. ప్రజల జీవితం మరింత భారంగా మారుతుంది. చేసిన బాసలకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిశోధనార్హమే అవుతుందేమో! బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని టీడీపీ సూపర్ సిక్స్ నినాదం. కాని అది ఇప్పుడు బాబు ష్యూరిటీబాదుడే, బాదుడుకు గ్యారంటీగా మారిందా! ఇప్పుడు జనం రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని అనుకోరా! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
చంద్రబాబు పచ్చి మోసంపై ప్రజాగ్రహం
అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వలంటీర్ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే.. ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క.. నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే.. అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్న YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది.