breaking news
-
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం
నెల్లూరు (బారకాసు): ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే... ఈ రోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి ‘అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల..’ అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. మద్దతు ధర దక్కకపోవడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే... ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఆ నెపాన్ని గత ప్రభుత్వం, అధికారులపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. అప్పట్లో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించారు. చిత్తశుద్ధితో పని చేసిన సీఎం జగన్ అయితే... ప్రెస్మీట్లు పెట్టి ఏమీ చేయకుండానే ఆహా.. ఓహో.. అని తన భుజాలను తానే తట్టుకునే సీఎం చంద్రబాబు’ అని కాకాణి అన్నారు.ఇవిగో వాస్తవ గణాంకాలు...‘జగన్మోహన్రెడ్డి హయాంలో 2019–24 మధ్య ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గిందని చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. కానీ, వాస్తవాలు చూస్తే ధాన్యం సేకరణ నుంచి అమ్మకం వరకు అన్ని విభాగాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా పని చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారికి రూ.40,236 కోట్లు చెల్లించారు.అదే 2019–23 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.65,255 కోట్లు చెల్లించాం.’ అని కాకాణి వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితిని గుర్తించి, సజావుగా జరిగేలా చూడాలి. రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. -
చంద్రబాబుకు క్లీన్చిట్ ఎలా ఇస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్చిట్ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నంచారు. ‘హై ప్రొఫైల్ కేసుల్లో చంద్రబాబు, అజిత్ పవార్లకు కేంద్ర సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాను.పవార్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల ఐటీ బినామీ ఆస్తుల కేసు, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబులకు క్లీన్చిట్ అంశం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. మోదీ ప్రభుత్వం పవార్ పేరును క్లియర్ చేస్తే, ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచి్చంది. ఈ కేసుల్లో కేంద్ర సంస్థలు తగిన ప్రమాణాల మేరకు పనిచేశాయా? తగిన ప్రక్రియను అనుసరించాయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ రెండు కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు చెప్పడం వాటి విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. సభ మంగళవారానికి వాయిదా పడటంతో దీనిపై చర్చ జరుగలేదు. ఇదే అంశంపై ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్... ‘ఈడీ, సీబీఐల పారదర్శక విచారణ, పనితీరుపై విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం’ అని చెప్పారు. -
సానా, బీద పేర్లు ఖరారు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వ్యాపారవేత్తలు సానా సతీష్, బీద మస్తానరావు పేర్లను చంద్రబాబు ఎట్టకేలకు సోమవారం ఖరారు చేశారు. ఎన్డీయే కూటమి తరఫున మూడో స్థానాన్ని బీజేపీ కూడా తన అభ్యరి్థగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన ఈ ముగ్గురూ మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వాస్తవానికి.. ఈ మూడు స్థానాలు అంతకుముందు వైఎస్సార్సీపీకి చెందినవే.కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్యలను ప్రలోభాలతో రాజీనామా చేయించారు. ఆరి్థకంగా స్థితిమంతుడైన బీద మస్తానరావు రాజీనామా సమయంలోనే తిరిగి ఆ స్థానాన్ని తనకే కేటాయించేలా టీడీపీతో డీల్ కుదుర్చుకుని ఆ పార్టీలో చేరారు. కృష్ణయ్య సైతం మళ్లీ తనకే సీటు ఇచ్చే ఒప్పందంతో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తిరిగి సీట్లు ఇవ్వాలనే ఒప్పందం, భారీ ఆరి్థక లావాదేవీల నేపథ్యంలోనే వీరిద్దరికీ సోమవారం సీట్లను ఖరారుచేశారు.ఇక మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానాన్ని టీడీపీలో ప్రస్తుతం బలమైన లాబీయిస్టుగా ఉన్న సానా సతీష్‌కు కేటాయించారు. ఈయన గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. ఆయన చాలాకాలం నుంచి టీడీపీ, జనసేన పార్టీల కోసం పనిచేస్తూ భారీగా నిధులు సమకూరుస్తున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చారు.ఈ స్థానం కోసం మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. సానా సతీష్ లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడిగా మారడం, పార్టీలో ఇప్పుడాయన చెప్పిన మాటే నడుస్తుండడంతో ఆయనకే రాజ్యసభ అవకాశం దక్కింది. పార్టీలో ఎంతోమంది సీనియర్లు, ముఖ్యులు ఉండగా వారందరినీ పక్కనపెట్టి లాబీయిస్టులుగా ఉన్న వీరిద్దరికీ పదవులివ్వడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. నాగబాబుకు మంత్రి పదవి.. నిజానికి.. ఈ మూడు స్థానాల్లో ఒకదాన్ని ఆశించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించి ఆ మేరకు ప్రకటన చేశారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటిని టీడీపీ తీసుకోగా ఒకదాన్ని బీజేపీకి కేటాయించడంతో జనసేనకు అవకాశం లేకుండాపోయింది. అంతకుముందు.. సానా సతీష్‌కు ఇచి్చన స్థానాన్ని నాగబాబుకు ఇవ్వాలనే చర్చ జరిగింది. అయితే, సీఎం తనయుడు, మంత్రి లోకేశ్ సతీష్‌కే అవకాశమివ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో సతీష్‌కి రాజ్యసభ సీటు, నాగబాబుకి మంత్రి పదవిని ఖరారుచేశారు. మరోవైపు.. ఇప్పటిదాకా బీజేపీలో సభ్యత్వంలేని కృష్ణయ్య సోమవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆన్లైన్లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.టీడీపీలో తీవ్ర అసంతృప్తి.. ఇక ఈ ఎంపికలో చంద్రబాబు అనుసరించిన తీరుపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు, పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని కొత్తగా వచి్చన లాబీయిస్టులకు అవకాశం ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారు. ధనబలం ఉండి ఎక్కువ ఫండ్ ఇచ్చే వారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారనే చర్చ జరుగుతోంది. యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య, దేవినేని ఉమా వంటి నేతలు కూడా ఈ పదవులను ఆశించినా వారిని పట్టించుకోలేదు. యనమల గతంలోనే తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కోరినా ఆయన ఆసక్తి చూపలేదు.ఇప్పుడూ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంతోనే ఇటీవల ఆయన చంద్రబాబును ధిక్కరిస్తూ లేఖ రాశారు. కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు.. కేవీ రావుకు మద్దతిస్తూ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా యనమల కేవీ రావును దుయ్యబడుతూ చంద్రబాబుకే లేఖ రాశారు. వేల కోట్లు దోచేసిన కేవీ రావును వెనకేసుకుని రావడమేమిటనే రీతిలో లేఖాస్త్రం సంధించడం టీడీపీలో కలకలం రేపింది. కంభంపాటి కూడా రాజ్యసభ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేసినా పట్టించుకోకపోవడంపై అసహనంతో ఉన్నారు. గత ఎన్నికల్లో తనకు మైలవరం సీటు ఇవ్వలేదని, ఇప్పుడు పదవుల విషయంలోనూ న్యాయం చేయడం లేదని ఉమా రగిలిపోతున్నారు. -
వైఎస్ జగన్ పథకాలపై బాబు కుట్ర: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలపై చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం(డిసెంబర్ 9) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సజ్జల మాట్లాడారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,రీజనల్ ఇంఛార్జులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ పథకాలను ఉద్దేశపూర్వకంగా కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం. ఈనెల 13న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం.రైతులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తాం. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 27న,ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ జనవరి 3న ధర్నాలు చేస్తాం. సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలా చేస్తోంది. బాధితులకు పార్టీ అండగా ఉంది. వారికి న్యాయ సహాయం అందిస్తూనే ఉంటుంది’అని సజ్జల తెలిపారు. -
ఇండియా కూటమికి ‘దీదీ’ సరైన నాయకురాలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సరైన నాయకురాలు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీయేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం(డిసెంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు అవసరమైన రాజకీయ, ఎన్నికల అనుభవం ‘దీదీ’కి కావల్సినంత ఉంది. 42 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆమె నాయకత్వ పటిమ రుజువవుతూనే ఉంది’అని విజయసాయిరెడ్డి కొనియాడారు.Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఫలించేనా..? -
పోలీసుల వేధింపులపై ఫిర్యాదు చేశాం: మార్గాని భరత్
సాక్షి,ఢిల్లీః రాజమండ్రిలో దళిత నాయకుడు పులి సాగర్‌ను పోలీసులు బట్టలు ఊడదీసి సెల్లో పెట్టారని మాజీ ఎంపీ మార్గానిభరత్ మండిపడ్డారు. ఈ విషయమై సోమవారం(డిసెంబర్9) తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఢిల్లీలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ‘పులిసాగర్కు వేధింపుల విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిటీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. తగు చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్.సీ కమిషన్ హామీ ఇచ్చింది.అమానుషంగా పులి సాగర్‌ను పోలీస్ స్టేషన్ సెల్లో పెట్టి వేధించారు.ఒక మహిళా కానిస్టేబుల్ సమక్షంలో సెల్లో పులిసాగర్‌ను వేధించారు. వర్షాలు,వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందని అడిగినందుకు పోలీసులు ఇంతటి అమానుషానికి పాల్పడ్డారు’అని మార్గాని భరత్ ఫైరయ్యారు.బూతులు తిట్టి వేధించారు: బాధితుడు పులిసాగర్ * రాజమండ్రిలో ఇన్స్పెక్టర్ బాజీలాల్ రమ్మంటే పోలీసు స్టేషన్‌కు వెళ్ళాను.* సోషల్ మీడియాలో నేను చేసిన పోస్ట్ ను ప్రశ్నిస్తూ బూతులు తిట్టి, నన్ను వేధించారు.* వరదలు వచ్చిన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో వెంటనే వరద నీటిని తొలగించామని ఎమ్.ఎల్.ఏ ఆదిరెడ్డి శ్రీనివాస్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చేశారు.* ఎమ్.ఎల్. ఏ పోస్ట్‌ను వ్యతిరేకిస్తూ వాస్తవ పరిస్థితిని చిత్రీకరించి తిరిగి పోస్ట్ చేసినందుకు పోలీసులు నన్ను కొట్టి సెల్లో పెట్టారు.* బూతులు తిట్టి, బట్టలు ఊడదీసి నన్ను సెల్లో వేశారు.* రాత్రి 9 గంటలకు సెల్లో నుంచి బయటకు తీసుకువచ్చి, నాతో బలవంతంగా సంతకం పెట్టించుకుని, హెచ్చరించి విడిచిపెట్టారు.* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో సైకోగా మారి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని పోలీసులు రాసిన కాగితంపై నాతో బెదిరించి, బలవంతంగా సంతకం చేయుంచుకున్నారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
ఢిల్లీ, సాక్షి: తెలుగు మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ఈ రెండు మీడియా సంస్థలు అడ్డగోలుగా కథనాలు రాశాయి. అయితే అవి నిరాధారమైన కథనాలుగా పేర్కొంటూ.. పరువు నష్టం దావా వేశారు వైఎస్ జగన్. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ మేరకు భేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. అయితే జగన్ ఇచ్చిన గడువు ముగిసినా.. ఆ రెండు మీడియా సంస్థల నుంచి స్పందన లేదు. దీంతో చెప్పినట్లుగానే లీగల్ నోటీసులు పంపించారు. ఇక తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమన్లు జారీ చేసింది. అయితే సమన్ల తర్వాత పిటిషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామలు తుడి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేస్తూ.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.కాగా, రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. టీడీపీ తోక పత్రికల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అసత్య కథనాలు ప్రచురించాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులు ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా స్పందన లేకపోవడంతో పరువు నష్టం దావాకు వెళ్లారు. -
Human Rights: నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు!
ప్రపంచమంతా మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ(డిసెంబర్ 10న).. ఏపీలో మాత్రం ఆ హక్కులు ఊసేలేకుండా పోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పెంచుకున్న పగను.. అధికారంలోకి రాగానే వెల్లగక్కడం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్ర శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగానే.. గత ఆరు నెలలుగా దాడులు, హత్యలు, అత్యాచారాలకు నిలయంగా మారింది. భద్రత కరువైన వేళ బతుకుజీవుడా అనుకుంటూ కొందరు ఏపీని విడిచి వెళ్లిపోతుండగా.. ప్రభుత్వ వేధింపులు భరించలేక మరికొందరు బలవనర్మరణాలకు పాల్పడ్డారు.ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను సైతం వదలకుండా దాడులకు తమ శ్రేణులను ఉసిగొల్పింది కూటమి. ఇక.. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక.. ఆ దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రతిపక్ష నేతలూ, కార్యకర్తల మీద ఏపీ పోలీసులూ.. కూటమి వర్గాల దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. దళితులపైనా దారుణమైన దాడులు జరుగుతున్నాయి. విపక్ష నాయకుల నిరసనలపై ఖాకీల ఆంక్షలు సరేసరి.‘ఒక మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా బతకడానికి కొన్ని హక్కులు అవసరం. జాతి, కుల, మత, వర్ణ, లింగ, రాజకీయపరమైన వివక్షకు గురవ్వకుండా వ్యక్తుల రక్షణ కోసం రూపొందించినవే మానవ హక్కులు. ఆ హక్కులపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అలాంటి ప్రభుత్వమే ఏపీలో ఆ బాధ్యత మరిచి.. హక్కులను కాలరాస్తోంది’అధికారం చేపట్టాక.. పవన్ కల్యాణ్ ప్రతీకార రాజకీయాల్లాంటివి ఉండబోవని ప్రకటించారు. కానీ, స్వయానా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్‌బుక్ పేరిట ఇష్టారాజ్యానికి దిగారు. ఆ ఎర్రబుక్లో ఉన్నవాళ్లను అధికార దుర్వినియోగంతో హింసిస్తున్నారు. తమ అనుకూలురను ప్రొత్సహించే క్రమంలో ఇతరులను బదిలీలు చేయించారు. మాట విననివాళ్లను బలవంతంగా ఇళ్లకు పంపించారు. ఈ పరిణామాలకు భయపడే అధికారులు కళ్లు మూసుకుండిపోయారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహంఏవో కొంపలు మునిగిపోయినట్లే!నచ్చని అంశాలను విమర్శించడం.. ప్రజలకున్న హక్కు. ఆ హక్కు ఎంతంగా వినియోగంలో ఉంటే.. ప్రజాస్వామ్యం అంతగా బలోపేతమవుతుంది. అయితే ఏపీలో రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఏపీలో తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల హామీల గురించి, ప్రజా సమస్యలపై మాట్లాడిన వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సాధారణంగా.. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేయడం సహజం. కానీ, కూటమి ప్రభుత్వ కర్కోటక ఏలుబడిలో మాత్రం అది మహాపాపం. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే- ఏవో కొంపలు మునిగిపోయినట్టు కేసులు పెడుతున్నారు. రాజకీయ ఆసక్తితో పోస్టులు చేస్తున్నవాళ్లనూ వదలడం లేదు. అక్రమ కేసులు బనాయిస్తూ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆఖరికి.. ఆడపడుచుల విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గుతున్న వాళ్లు కొందరైతే.. ధైర్యంగా పోరాడుతున్నవాళ్లు మరికొందరు.ఇదీ చదవండి: టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యఅన్నింటిని మేనేజ్ చేస్తున్న బాబు!దేశంలో ఎక్కడా లేనంతగా.. చంద్రబాబు సారథ్యంలో ఏపీలో పౌరహక్కుల హననం నిరాటంకంగా సాగుతోంది. ఈ ఆర్నెల్ల కాలంలోనే ఏపీ నుంచి జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు రికార్డు స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్ర పెద్దలకు, గవర్నర్ స్థాయి వాళ్లకు స్వయంగా ఫిర్యాదులు అందజేసింది వైఎస్సార్సీపీ. ఇక.. పోలీస్ శాఖకు వెళ్లిన ఫిర్యాదుల సంగతి సరేసరి. అయినా తన పరపతిని ఉపయోగించి చంద్రబాబు ఎక్కడికక్కడే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు.రాజ్యాంగ నిర్దేశాలను నట్టేట్లో కలుపుతున్న కూటమి ప్రభుత్వం- మానవ హక్కుల హంతకిగా మారింది. ఏపీలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ తాను ఆడిందే ఆటగా చెలరేగిపోతోంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అధోపాతాళానికి దిగజార్చింది. ఇప్పుడు ఏపీలో మానవహక్కులతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు మిగిలింది హక్కుల కమిషన్ల, న్యాయస్థానాల జోక్యం మాత్రమే!. -
ఇది ప్రజా ప్రభుత్వం కాదు..‘ఈవీఎం’ల ప్రభుత్వం: చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని,ఈవీఎంల ప్రభుత్వమని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్ 9) ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీచేస్తానని,జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు.వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఇప్పటికే ఇంటికి యాభై వేలు వచ్చేవి: మాజీ మంత్రి కారుమూరిరాష్ట్రంలో ప్రజా కంటక పాలన జరుగుతుంది... ఎమ్మెల్యే లు ప్రజలలోకి రావడానికి భయపడుతున్నారుఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలనను మరచిపోయి కక్ష సాధింపుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారుఎన్ని కష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట నిలుపుకొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఎన్ని సార్లు అయినా మోసం చేసే ఏకైక సీఎం చంద్రబాబువైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ ఆరునెలల్లో ఇంటికి యాబైవేల రూపాయలు వచ్చేవినేను ఎప్పుడూ వైఎస్ జగన్ వెంబడే: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిఎంపిటిసి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాడిని కార్యకర్తల కష్టాలు తెలుసునాకు రాజకియ బిక్ష పెట్టింది దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డినేను నా కుటుంబం ఎప్పటికీ వైఎస్ జగన్ వెంబడేప్రజలను వంచించి అక్రమ కేసులు పెడుతున్న పార్టీ పై పోరాటం చేద్దాంఅతి తక్కువ మెజారిటితో గిద్దలూరు సీటును కోల్పోయాంవైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది -
ప్రజలకు అర్థమైంది.. బాబు, పవన్‌కు థ్యాంక్స్: బొత్స
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కంటైనర్ షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ వర్షాలు కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈనెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తాము. తగ్గిస్తామని చెప్పి కరెంట్ చార్జీలు కూటమి ప్రభుత్వం పెంచింది. ఆరు స్లబ్స్‌లో చార్జీల భారం ప్రజలపై మోపింది. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి వెంటనే చెల్లించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తాం.కంటైనర్ షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారు. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషం. సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖల రాస్తాను. లేనిపోని ఆరోపణల కారణంగా దేశం పరువుపోతుంది కదా?. టీడీపీ హయాంలో వేసిన సిట్ బహిర్గతం చేయాలి. ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలి.చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించారు. నాడు-నేడు ద్వారా స్కూల్స్‌లో మిగతా పనులను పూర్తి చేస్తామని చెబితే బాగుండేది. ధాన్యం కొనుగోలుపై పరుచూరి బ్రదర్స్‌లా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం సరికాదు, వాస్తవాలు మాట్లాడాలి’ అంటూ సూచనలు చేశారు. -
విశాఖ డ్రగ్స్ కేసుపై పచ్చ మంద కిక్కురు మనదేం?
నిజం నిలకడ మీద కానీ తెలియదంటారు. రాజకీయ నాయకులు కొంతమందికి ఈ విషయం బాగా తెలిసినట్టు ఉంది. ఈ ధైర్యంతోనే వాళ్లు వదంతులు, అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి సఫలం అవుతుంటారు. ఎక్కువసార్లు జరిగేది ఇదే. అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సరితూగ గలిగే వాళ్లు ఇంకొకరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతోనే పోటీపడుతున్నారు. ఏ ఘటనలోనైనా తమవారి తప్పుందని తెలిస్తే దాన్ని వెంటనే ప్రత్యర్దిపైకి నెట్టేయడం వీరి శైలి. అనుకూల మీడియా ఒకటి వీరికి అండగా నిలుస్తోది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే చందమీ పచ్చ మీడియా. వందల అబద్దాలు వ్యాప్తి చేయడంలో వీరిదో రికార్డు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అబద్దాల విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని కూడా ఆయన అసత్యాల ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా తీర్చిదిద్దినట్లున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీ బ్రెజిల్ నుంచి వీటిని దిగుమతి చేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది కూడా. ఈ వార్త వచ్చిందో లేదో.. టీడీపీ వెంటనే రంగంలో దిగిపోయింది ఆ డ్రగ్స్ వైసీపీ వారివేనని ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ చేసిన ట్వీట్లు చూస్తే... ఇంత నీచంగా కూడా ప్రచారం చేయవచ్చా? అనిపించకతప్పదు. వైసీపీ పేరును వక్రీకరిస్తూ ‘యువజన కొకైన్ పార్టీ’ రాసింది. అక్కడితో ఆగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది. ‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి’’ అని, ‘‘నాడు తాలిబన్ టు తాడేపల్లి. 2021 విజయవాడలో రూ.21 వేల కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ తాడేపల్లి.. 2024విశాఖలో రూ.1.60 లక్ష కోట్ల కొకెన్’’ అంటూ ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవమని టీడీపీకి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా తెలుసు. రాజకీయం కోసం ఏమైనా చేయాలన్నది వారి థియరీ. ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చన్నది వారి అభిమతం. అదే ప్రకారం వారితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని ఎల్లో మీడియాగా మార్చేసి, ఎలాంటి నీతి,విలువలు లేకుండా తెలుగుదేశం పక్షాన పని చేయించారు. పచ్చి అబద్దాలైనా, ఏమో నిజం ఉందేమో! అన్నట్లుగా వీరు కథలు ఇచ్చేస్తుంటారు. ఇవి చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుంటారు.ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా వీరి ట్రెండ్ ఇదే. విశాఖ డ్రగ్స్ పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా పోటీ పడి అబద్దపు ప్రసంగాలు చేశారు. పవన్ కళ్యాణ్ దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి విశాఖకు హెరాయిన్ వచ్చిందని ఉపన్యాసం చేస్తే, బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పేశారు. తీరా సీబీఐ విచారణలో తేలింది ఏమిటంటే సంబంధిత కంటైనర్‌లో డ్రగ్స్ లేవని!! దీనిపై టీడీపీ ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ కిక్కురుమంటే ఒట్టు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సీబీఐ కూడా ఎన్నికలకు ముందు మౌనం పాటించి, ఎన్నికలైన ఆరు నెలలకు తాపీగా విశాఖ పోర్టులోకి వచ్చింది డ్రగ్స్ కాదని తెలిపింది. ఈ విషయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి కుట్రలు చేసి ఉండవచ్చన్న డౌట్ చాలా మందిలో ఉంది. అదే క్రమంలో సీబీఐ కూడా పని చేసిందేమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చాక అయినా, ఇంత నీచమైన ఆరోపణలు చేశాం కదా..వాటిని ఉపసంహరించుకుంటున్నాం..అని కూటమి నేతలు ఎక్కడా చెప్పరు.అప్పట్లో ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంస్థ టీడీపీకి సంబంధించిన వారిదని వార్తలు వచ్చాయి. దాన్ని తోసిపుచ్చడానికి ఆ కంపెనీ యజమాని సోదరుడు వైసీపీ వాడంటూ మరో వాదనను టీడీపీ మీడియా వారు తెరపైకి తెచ్చారు. అంతేకాదు. సీబీఐ కోరిక మేరకు వారికి సహకరించడానికి అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు వెళ్లారు. వెంటనే ఎల్లో మీడియా డ్రగ్స్ కేసును మేనేజ్ చేయడానికే వెళ్లారని కల్పిత కథనాలు వండేశారు. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో అబద్దపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిపై పెడుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో టీడీపీ, జనసేనలు చేసిన దారుణమైన అసత్యాలపై ఎంత తీవ్రమైన కేసులు పెట్టి ఉండాలో! కాని అప్పట్లో అలా చేయలేదు. మరీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎవరిపైన అయినా ఒకటి, అరా కేసులు పెడితే, వెంటనే మీడియాపై దాడి అంటూ విపరీతమైన ప్రచారం చేసేవారు. అదే ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న దాడిని సమర్థిస్తూ, వారిని సైకోలుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఘోరమైన పోస్టులు పెట్టిందని వైసీపీ వారు ఆధార సహితంగా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు తాము కోర్టులలో ప్రైవేటు కేసులు వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలలో అసత్యాలే ప్రామాణికంగా పని చేసుకుంటూ రాజకీయ నేతలు వెళితే సమాజం కూడా అలాగే తయారవుతుంది. ప్రస్తుతం ఏపీలో సమాజం అటువైపు పయనిస్తోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి సర్కార్ నిరంకుశ పాలన.. నేతల కనుసన్నల్లో పోలీసులు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్సార్సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.గత నెల 19న తమపై , తమ కుటుంబ సభ్యుల గురించి టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆధారాలతో సహా వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వానికి ఒకలా, వైఎస్సార్సీపీ వారికి మరోలా వ్యవరిస్తున్నారని, తాము ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై పోలిస్ స్టేషన్ల ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలపాలని నిర్ణయించారు. -
టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు. -
ఇంతటి నటనా కౌశల్యం బాబుకే సొంతం.. విద్యా మీట్‌పై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ మోసాలు, డ్రామాలను ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందంటూ ట్వీట్ చేశారు.చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ, అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు. ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబుకే సొంతం’’ అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు...టీచర్లు-విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలో నుంచీ జరుగుతున్నవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విద్యారంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. 15,715 పాఠశాల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలివిడత నాడు-నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయి.భ్రమ కల్పించడానికి చంద్రబాబు ప్రయత్నం..అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లిషు మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటినెన్స్ ఫండ్, స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈవిధంగా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సమావేశాలకు కొత్త టైటిల్స్ పెట్టి, ఓవైపు విద్యారంగాన్ని నాశనంచేస్తూ, మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి చంద్రబాబు, ఆయన నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరొక విశేషం ఏంటంటే.. పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతలనుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం...మేం అమ్మ ఒడి కింద ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15వేల చొప్పున, క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకు రూ. 26,067 కోట్లు ఇచ్చాం. నీకు రూ.15వేలు, నీకు 15వేలు, నీకు రూ.15వేలు అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా, ప్రతి ఇంటికీ డప్పు కొట్టారు. ఇద్దరు పిల్లుంటే రూ.30వేలు అన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు అన్నారు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లన్నైనా కనాలని చంద్రబాబు పిలుపుకూడా ఇచ్చారు.ఇదీ చదవండి: చదువుల విప్లవానికి తూట్లు.. సర్కారు ప్రచార పాట్లుతల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా?..అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ఒక్కపైసా ఇవ్వలేదు కదా, గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్నీ ఆపేశారు. బడ్జెట్లో రూ.12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఆ హామీని అమలు చేయకపోవడంతో తల్లిదండ్రులమీద పిల్లల ఖర్చులు, వారి భారం పడుతోంది కదా? నిన్నటి పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్‌కళ్యాణ్, విద్యా శాఖమంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది దగాచేయడం కాదా? ఒక్కమాట కూడా మాట్లాడ్డంలేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా?ఎందుకు నిలిపేశారు? ..అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగుకోసం వైఎస్సార్సీపీ చేసిన మంచి పనులన్నింటినీ కూడా నిలిపేశారు. మలిదశలో మిగిలిపోయిన నాడు-నేడు పనులను ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలనూ పట్టించుకోలేదు. ఏ కారణంతో నిలిపేశారు? ఎందుకు నిలిపేశారు? ఎంతో కష్టపడి స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకు వచ్చాం. ఇప్పుడు సీబీఎస్ఈని ఎందుకు రద్దుచేశారు? ఇంగ్లిషు మీడియం బోధనను ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు? ప్రపంచస్థాయిలో గవర్నమెంటు స్కూలు పిల్లలను తయారుచేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశపెట్టిన టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్ టెక్నాలజీపై తరగతులు.. ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు?1. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. వైయస్సార్సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 8, 2024 ..డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల పంపిణీని ఎందుకు రద్దుచేశారు? 3వ తరగతినుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ను ఎందుకు రద్దుచేశారు? మేం స్కూళ్లలో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులోనూ, ప్రతి స్కూల్లోనూ పెట్టిన ఐఎఫ్‌పీ ప్యానెల్స్, డిజిటల్ స్క్రీన్ల సమర్థ వినియోగంకోసం ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్ను ప్రతి స్కూలుకూ పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనివల్ల వేలమంది ఇంజినీరింగ్ స్టూడెంట్లకు ఉపాధి దొరకదా? లేకపోతే ఐఎఫ్‌పీ ప్యానెల్స్ మెయింటినెన్స్ మూలన పడదా?మెయింటినెన్స్ ఫండ్ ఏమైంది? ..గతంలో రోజుకో మెనూతో, ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా తయారయ్యిందంటూ ఈ మీటింగ్స్‌లో పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకూ వినిపించిందా చంద్రబాబూ? డొక్కా సీతమ్మ అనే మహా తల్లి పేరుపెట్టి చివరకు స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థుల డొక్కమాడుస్తున్నారు. కనీసం ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడంలేదు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. పిల్లలు వెళ్లే గవర్నమెంటు స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణకోసం ఇచ్చే టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్, స్కూళ్ల నిర్వహణకోసం ఇచ్చే స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ ఈరోజు ఏమైంది? ఆరోజు టాయిలెంట్ల మెయింటినెన్స్ గురించి గానీ, స్కూళ్ల మెయింటినెన్స్ గురించి గానీ ఎవరైనా పట్టించుకున్నారా? మభ్యపెట్టడానికి సిగ్గేయడం లేదా?..అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేసి, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్ధికభారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రులకు ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడంలేదా? ఈ డ్రామా మరో డీవియేషన్ రాజకీయం కాదా?..విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యాదీవెన ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈరోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్ రాజకీయం కాదా?’’ అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
ఇప్పుడేం సమాధానం చెబుతావ్ బాబూ?: విజయసాయి ట్వీట్
సాక్షి, అమరావతి: తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సమధానం చెప్పాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘‘విశాఖ కంటెయినర్లో వెయ్యి టన్నుల డ్రగ్స్ దొరికిందంటూ చంద్రబాబు కుట్ర రాజకీయాలల్లో భాగంగా దుష్ప్రచారం చేశారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని రాద్ధాంతం చేశారు. ఓటర్లను మోసగించేందుకు పోలింగ్‌కు నెలన్నర ముందు పెద్దఎత్తున దుష్ప్రచారం చేశాడు’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: సీజ్ ద పోర్ట్‘‘ఇప్పుడు ఆ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ ప్రకటించింది.. బ్రెజిల్ అధ్యక్షుడికి, నాకు లింకు పెట్టి మరీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, అతని పచ్చకుల మీడియా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?’’ అంటూ ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.నాపై చేసిన ఆరోపణలకు సమాదానం చెప్పు చంద్రబాబు..! @ncbn చంద్రబాబు కుట్ర రాజకీయల్లో భాగంగావిశాఖ కంటైనర్ లో వెయ్యి టన్నుల డ్రగ్స్ దొరికిందని, రాష్ట్రం గంజాయి, డగ్స్ అడ్డాగా మారిపోయిందని, ఓటర్లను మోసగించేందుకు పోలింగ్ కు నెలన్నర ముందు పెద్దఎత్తున దుష్ప్రచారం చేసాడు. ఇప్పుడు ఆ…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 8, 2024 -
పార్వతీపురం ఎమ్మెల్యే నయా దందా.. లోకలోళ్లు వద్దు.. గెంటేయండి!
అమెరికా నుంచి దిగుమతి అయిన వాడిగా చెప్పుకుంటున్న పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే స్థానిక నేతలను దగ్గరకు రానివ్వడంలేదు. తన కోసం కొద్దిమంది లీడర్లను బయటినుంచి తెచ్చుకుని వారితోనే దందాలు చేస్తున్నారు.. సెటిల్మెంట్స్.. లిక్కర్ ఇవన్నీ వాళ్లతోనే చేయిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్వతీపురం (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విజయ చంద్ర ఎన్నారై అనే బ్రాండ్ వేసుకొని లోకేష్ తాలూకా అని చెప్పుకుంటూ జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. వస్తూనే హడావుడి చేసి అందర్నీ కలుపుకొని వెళ్తున్నట్టు నటించి గెలిచేశారు.తెలిసిన మరుక్షణం నుంచి తన గురువు చంద్రబాబు పంథాలోనే వెళుతున్నారు. అంటే గెలిచిన తర్వాత అదంతా తన గొప్పతనమేనని స్థానికంగా ఎవరు తనకు సపోర్ట్ చేయలేదని, తన సామర్థ్యం.. తన తెలివితేటలే తనని గెలిపించాలని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయనకు మొన్నటి ఎన్నికల వరకు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ భారీగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని అకస్మాత్తుగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయారు గెలిచేసారు. మాజీ ఎమ్మెల్యే చిరంజీవి.. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఇంకా గొట్టపు వెంకట్ నాయుడు.. తదితరులంతా ఆయన కోసం పనిచేసి.. ఆయన్ని గెలిపించారు. అయితే తాను మాత్రం కార్యకర్తల ను ఏ మాత్రం లెక్క చేయకపోగా స్థానిక నాయకత్వాన్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేశారు.సరికొత్త టీం దిగుమతిఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అని ఎవరైనా స్థానికంగా అప్పటికే ఉంటున్న టీడీపీ క్యాడర్‌తో కలిసి మెలిసి పనిచేసుకుంటూ పోతారు. వారు చెప్పినట్లు చేయాలని లేకుండా వారిని కూడా కలుపుకొని పోవడం అనేది రాజకీయంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. కానీ విజయ్ చంద్ర మాత్రం ఎక్కడెక్కడో వేరే జిల్లాల నుంచి కొంత మందిని తీసుకొచ్చి తన చుట్టూ ఉంచుకొని వాళ్ల ద్వారా నియోజకవర్గంలో దందా చేస్తున్నారు. రెండు మూడు సార్లు ఎంపీపీలు జడ్పిటిసిలుగా చేసిన వాళ్ల సైతం విజయ్ చందన కలవాలంటే ముందు ఆ కోటరీని కలవాల్సి ఉంటుంది. వాళ్లను సంతృప్తి పరిస్తే తప్ప ఎమ్మెల్యే దర్శనం దక్కదు.. ప్రతి చిన్న విషయంలోనూ ఎమ్మెల్యే ఆయన బ్యాచ్ ఇన్వాల్వ్ అయిపోతూ బెదిరింపులు బ్లాక్ మెయిల్ వసూళ్లకు దిగుతున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చాడని గెలిపిస్తే ఇలా పీక మీద కత్తి పెడితే ఎలా అని వారు భీతిల్లిపోతున్నారు.లిక్కర్ దందా మనదేమొన్నామధ్య లాటరీల లిక్కర్ షాపులు దక్కించుకున్న వాళ్లని సైతం ఎమ్మెల్యే పేరట అనుచరులు బెదిరించి 20 శాతం వాటా ఇస్తారా 10% కమిషన్ ఇస్తారా తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికీ మార్జిన్లు లేక నష్టాల బాటలో షాపులు నడుపుతుంటే రాబందుల్లా ఎమ్మెల్యే బ్యాచ్ దిగిపోయిందని పెట్టుబడి పెట్టకపోయినా వ్యాపారం వాటా ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని లిక్కర్ లైసెన్సీలు ఆవేదన చెందుతున్నారు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులుఇది కాకుండా రియల్ ఎస్టేట్.. ఇసుక.. కన్స్ట్రక్షన్ వంటి అన్ని వ్యాపారాల్లోనూ విజయ చందర్ జోరుగా జోకింగ్ చేసుకుంటూ కమిషన్లు నొక్కుతున్నారు. గట్టిగా మాట్లాడితే దాని దళిత ఎమ్మెల్యే అని అంటూ సరికొత్త బ్లాక్ మెయిల్‌కి దిగుతున్నారు. మాటకు మన ఉద్యోగులు బదిలీల విషయంలో కూడా సిఫార్సు లెటర్స్ కు రేటు పెట్టి మరి వసూలు చేసుకున్నారని.. గ్రామస్థాయి ఉద్యోగాల బదిలీల్లోనూ ఆయన డబ్బులు తీసుకుని లెటర్ ఇచ్చారని ఉద్యోగులు గొల్లుమంటున్నారు. రాజకీయాలకు కొత్తగా అయినా దందాలు చేయడంలో ఆరు నెలల్లోనే ఆరితేరిపోయారని మున్ముందు ఆయన ఇంకెంత రెచ్చిపోతారో తెలీదని స్థానిక వ్యాపారుల సైతం భయపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
వైఎస్సార్సీపీ ఫిర్యాదులపై పోలీసులు స్పందించరేం?.. అంత్యరమేంటి?: అంబటి
సాక్షి, గుంటూరు: లోకేష్ ఆధ్వర్యంలోనే వైఎస్ జగన్ ఫొటోలను మార్ఫింగ్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సోషల్ మీడియాపై పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. టీడీపీ సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపోస్టులు పెట్టారని.. టీడీపీపై తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసుల ఇప్పటివరకు స్పందించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయలేదని.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే అరెస్టుల చేయడంలో అంత్యరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిరసన చేస్తామని అంబటి తెలిపారు.ఇదీ చదవండి: సెజ్ భూములు తిరిగిచ్చిన ఏకైక సీఎం జగన్ -
కూటమి నేతల కమీషన్ దందా.. జేసీ ప్రభాకర్‌పై ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: కూటమి సర్కార్ పాలనలో లిక్కర్ మాఫియా హవా కొనసాగుతోంది. పలుచోట్ల కూటమి నేతలకు మద్యం షాపులు దక్కకపోవడంతో కమీషన్ల కోసం టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కారణంగా తాడిపత్రిలో నేటికీ నాలుగు మద్యం షాపులు ప్రారంభం కాలేదు.వివరాల ప్రకారం.. తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులను విజయవాడకు చెందిన వ్యాపారులు గోపీనాథ్, గురునాథం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించవద్దని జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశారు.దీంతో, నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నప్పటికీ తాడిపత్రిలో మాత్రం అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో విజయవాడ మద్యం వ్యాపారులు గోపీనాథ్, గురునాథం.. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో మద్యం షాపులు తమ వారికి దక్కకపోవడంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు 15 శాతం కమీషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు. -
చంద్రబాబు రైతు ద్రోహి.. సెజ్‌పై విచారణ చేయాల్సిందే: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అధికారానికి ముందు ఒక మాట.. అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం అలవాటేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులను సెంట్రల్ జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు సర్కార్‌కు అనుకూలంగా ఒక మీడియా దర్మార్గమైన ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు...2003లో పరిశ్రమల కోసం భూములను సేకరించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఈజడ్ కోసం 10 వేల ఎకరాలు సేకరించే ప్రయత్నం చేశారు. 8,150 ఎకరాల్లో జీఎంఆర్ ఈ భూములు సేకరించింది. సెజ్‌లో రైతులు దీనిని వ్యతిరేకించారు. ఉద్యమం ప్రారంభించిన సేకరణ ఆగలేదు. 2012లో చంద్రబాబు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కూడా చంద్రబాబు మాటలు నమ్మింది. 2014 తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అపరిచితుడులా మారిపోయారు.రైతుల భూములను, ఎస్సైన్ లాండ్లను తిరిగి తీసేసుకుని సెజ్‌కి ఇచ్చేశారు. పోరాట కమిటీ నాయకులను పోలీసులతో వేధించి అక్రమ కేసులు పెట్టారు. 2018లో సెజ్ ఉద్యమం తీవ్రమైంది. సెజ్ పోరాట కమిటీ నాయకులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. జైలులో బాత్ రూమ్‌లు రైతులతో కడిగించారు. భూములు ఇవ్వాలని రైతులపై తీవ్రమైమ ఒత్తిడి తెచ్చారు. కార్పోరేట్ కంపెనీలకు కొమ్ముకాసిన చరిత్ర చంద్రబాబుది. సెజ్‌కు భూములు ఇవ్వని రైతులకు తిరిగి ఇచ్చేస్తామని పాదయాత్రలో జగన్ పోరాట కమిటీ ఇచ్చారు. 2180 ఎకరాలు తిరిగి ఇచ్చేయాలని నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తీర్మానం చేసింది. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్పా.. ఆ భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా. చంద్రబాబు ఒక్కడే నీతి మంతుడిలా మీడియా చూపిస్తుందిరైతులను దారుణంగా వేధించారు: దాడిశెట్టి రాజామాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, తన బినామీ అయినా కేవీరావు ద్వారా 2003లోనే చంద్రబాబు సెజ్‌లో భూ సేకరణ చేశాడు. మొట్ట మొదటిగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది అప్పటి తుని ఎమ్మెల్యేగా ఉన్న యనమల రామకృష్ణుడు. దీంతో రైతులు కూడా భూములు ఇవ్వాల్సి వచ్చింది. సెజ్ భూసేకరణ ద్వారా లాభపడింది యనమల రామకృష్ణుడు. 2014 లో చంద్రబాబు సీఎం అయిన వెంటనే దీవిస్ వంటి రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. దీవీస్ కోసం పోరాడిన రైతులను పోలీసులతో దారుణంగా వేధించాడు. 2180 ఎకరాల భూములను సెజ్ నుండి రైతులకు వైఎస్ జగన్ తిరిగి ఇచ్చారు. రైతులకు భూములు తిరిగి ఇచ్చిన జగన్ మంచివారా.. భూములు ఇవ్వాలని రైతులను హింసించిన చంద్రబాబు గొప్పవాడా?. 2003 నుండి జరిగిన భూ సేకరణ పై విచారణ చేయాలి. సెజ్‌లో జరిగిన అవకతవకలు బయట పెట్టాలి’’ ఆయన డిమాండ్ చేశారు.రైతులను చంద్రబాబు అవమానించారు.. జగన్ గౌరవించారు: వంగా గీతవంగా గీతా మాట్లాడుతూ.. సెజ్ గురించి 2003 నుంచి 2024 ఏం జరిగిందని రికార్డెడ్‌గా ఉంది. సెజ్‌లో భూముల కోసం పోరాడిన రైతులు ఉన్నారు. ఏరువాక చేసి సెజ్ భూములు వెనక్కి వస్తాయని చంద్రబాబు మోసం చేశారు. సీఎం అయిన వెంటనే రైతులను బెదిరించి చంద్రబాబు అవమానించారు. ఇప్పుడు మళ్లీ సెజ్ నుంచి ఏం ఆశించి అసత్య ప్రచారం మొదలు పెట్టారు. రైతుల ఉద్యమాన్ని వైఎస్ జగన్ గౌరవించారు.సెజ్‌లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలు అక్కడే ఉండేలా చేశారు. 2180 ఎకరాల్లో చాలా భూములు రైతులకు తిరిగి వెళ్లిఫొయాయి. మిగిలిన భూములు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వద్ద నిలిచిపోయాయి. వాటిని చంద్రబాబు సర్కార్ క్లీర్ చేసి ఆ భూములను వెనక్కి ఇవ్వాలి. సెజ్ మీద మళ్లీ ఎందుకు అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు. సెజ్ మీద ఏదో కుట్ర కోణం ఉంది?. సెజ్‌పై విచారణ వేయాలి. 2003 నుంచి 2024 నుంచి ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. సెజ్ రైతుల సెంటిమెంట్‌ను వైఎస్ జగన్ గౌరవించారు. సెజ్‌ను రాజకీయం చేయడంలో అసలు కథ ఏంటో ప్రజలకు తెలియాలి -
‘చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో దిట్ట’
విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా డ్రగ్స్‌తో ఓ కంటైనర్ విశాఖకు వచ్చిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారని ఈ సందర్బంగా గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు ప్రచారం చేశారని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడానికే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.‘ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. అధికారం కోసం నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. కంటైనర్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ లేవని చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది.ఆపరేషన్ గరుడ అనే పేరుతో సీబీఐ విచారణ జరిపింది. చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేశారు. మాకు ఆ కంటైనర్‌కు సంబంధం లేదని మేము మొదటి నుంచి చెపుతూనే వచ్చాము, మేము చెప్పిందే సీబీఐ కూడా చెప్పింది. కంటైనర్ షిప్ పై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడమే లక్ష్యంగా తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు అర్గనైజడ్ క్రైమ్ చేయడంలో దిట్ట’ అని గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: కుప్పంలో సీజ్ ది థియేటర్ -
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. సీన్ రివర్స్!
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం ఒకటి అనుకుంటే.. మరొకటి జరుగుతోంది. ఏపీవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి పెద్దషాకే ఇస్తున్నారు. ఆర్భాటంగా జరుగుతుందని భావించిన పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్‌లో అడుగడుగునా నిలదీతలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు తమ ప్రశ్నలతో.. నిరసనలతో కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు , విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అంతా సవ్యంగానే నడుస్తోందంటూ మంత్రులు, కూటమి నేతలు ప్రకటించుకున్నారు. కానీ..కర్నూల్లో.. విద్యార్థుల సమస్యలపై అడుగడుగునా తల్లిదండ్రులను కూటమి నేతలను నిలదీస్తున్నారు. కర్నూల్లో మంత్రి టిజి భరత్‌ను ఓ విద్యార్థి తల్లి నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. ఆ భోజనం కారణంగానే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారామె. కర్నూలు నగరంలోని హైస్కూలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో మంత్రి భరత్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.అల్లూరి సీతారామరాజు జిల్లాలో..ఏజెన్సీ కూనవరం ఏపీ టీ డబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో రచ్చ రేగింది. అన్ని సబ్జెక్టులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సిలబస్ పూర్తికాకుండా తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. స్కూల్ ముందు రోడ్డుపై తమ పిల్లలతో బైఠాయించారు. -
అది ‘విద్యా మీట్’ కాదు..దగా మీట్: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు? రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్‌లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్ జగన్ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..? -
‘అలా పోస్టు పెడితే తప్పా?.. ఇది టీడీపీ సైకోల ఆలోచనే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక చాలా మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఇదే సమయంలో సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారని చెప్పుకొచ్చారు.తాజాగా మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో దుష్ట సంప్రదాయం కొనసాగుతోంది. బాధితుల్ని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలను ఆలోచింపచేసేలా పోస్టులు పెడుతున్నా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని మస్క్ ప్రకటించారు. ఆ తర్వాత టెస్లా కంపెనీ ఏపీలో పెట్టుబడి పెట్టాలని లోకేష్ ట్వీట్ పెట్టారు. ఈ రెండిటినీ కలుపుతూ ఇంటూరి రవి కిరణ్ వ్యంగ్యంగా పోస్టు పెడితే కేసు పెట్టారు. సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారు.బుడమేరు వరద పరిహారంలో జరిగిన దోపిడీపై వ్యంగ్యంగా పోస్టు పెడితే మరో కేసు పెట్టారు. గాంధీజీ ఏం చెప్పారు? చంద్రబాబు మద్యం షాపుల పెంపు ద్వారా ఏం చెప్తున్నారో తెలుపుతూ ఒక జోక్ పోస్టు పెడితే దాన్ని కూడా తప్పు పట్టారు. కనకదుర్గమ్మ గుడి కవర్‌తో బయటి నుండి తెచ్చిన లడ్డూలు పెట్టి విక్రయించిన వైనంపై పోస్టు పెడితే కేసు పెట్టారు. డీజీపీ కోయ ప్రవీణ్ ఫక్తు పొలిటికల్ లీడర్ లాగా ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆయనకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావాలేగానీ పోలీసు డ్రెస్సులో రాజకీయాలు మాట్లాడవద్దు.వైఎస్ జగన్‌పై అత్యంత దారుణమైన భాషతో టీడీపీ వారు పోస్టులు పెట్టారు. వైఎస్ జగన్ తనపై తానే దాడి చేయించుకున్నట్టు టీడీపీ నేతలు మాట్లాడారు. వీళ్ల మనసులో ఎంత విషం ఉంటే ఇలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదు?. టీడీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. దీన్ని బట్టే టీడీపీ సైకో మెంటాల్టీని అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ మేలు చేస్తే జనం నోటి దగ్గర తిండిని తీసేశారంటూ పోస్టులు పెట్టారు. ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు రూ.73వేల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బును ఏం చేశారో ప్రజలకు తెలపాలి. కాకినాడ పోర్టును గురిపెట్టి లాక్కున్నట్టు నిస్సిగ్గుగా పోస్టు పెట్టారు. టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లోనే వైఎస్ జగన్‌పై దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారు. కేవలం వ్యంగ్యంగా పోస్టులు పెట్టిన ఇంటూరి రవికిరణ్‌పై 20పైనే కేసులు పెట్టారు. మరి దుర్మార్గంగా పోస్టులు పెట్టిన టీడీపీ వారిని ఏం చేయాలి?. పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టుని రాజమండ్రి పోలీసులు నగ్నంగా లాకప్‌లో పడేశారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కస్టడీలోనే పోలీసులు కొట్టారు. ఇలా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలోని మేధావులు, ప్రజాసంఘాల నేతలు ఆలోచించాలి. ఈ దారుణాలను గట్టిగా ప్రశ్నించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెడుతున్నాం’ అని చెప్పారు. -
‘బాబూ.. ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు.