breaking news
-
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ భార్య సౌజన్య, పిల్లలు అభిసాత్విక, అభినయ్ కలిశారు. ప్రేమ్‌కుమార్ బెయిల్ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైఎస్సార్సీపీ లీగల్ టీమ్‌కు వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్‌కుమార్‌ను తీసుకువెళ్లిన తీరును వైఎస్ జగన్‌కు కుటుంబ సభ్యులు వివరించారు. వారికి ధైర్యాన్నిచ్చి, అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కుందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రేమ్‌కుమార్ కుటుంబసభ్యుల వెంట మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఉన్నారు.ఇదీ చదవండి: పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్చల్.. వైఎస్సార్సీపీ ప్రేమ్ కుమార్ ఎక్కడ? -
‘మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు దగా’
తాడేపల్లి : మెగా డీఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగా చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను చంద్రబాబు మరోసారి మోసానికి గురి చేశారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన మేరుగు నాగార్జున.. చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. ‘ ప్రజలకు సంక్షేమం అందించాల్సిందిపోయి వార్నుంచే డబ్బులు గేసుకుంటున్నారు. దీపం పథకానికి రూ.4500 కోట్లు అవసరమైతే రూ.800 కోట్లతో సరిపెట్టారు. ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయటం?, అన్నా క్యాంటీన్‌కు ఒకసారి వెళ్తే రెండో సారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు. వృద్దులు, వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో అడుకుంటున్నారు.రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని దగా చేశారు. రైతులకు అండగా ఉంటూ రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.వ్యవసాయం దండగా అని తన పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. జగన్ హామీ ఇచ్చాడంటే దాన్ని అమలు చేసి చూపించాడు. చంద్రబాబు ఏనాడూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి పేరుతో ఒక్క పైసా కూడా యువకులకు ఇవ్వలేదు. వాలంటీర్లను ఉద్యోగాల్లో నుండి తొలగించారు.ప్రభుత్వం అసూయ, కక్షలతో పరిపాలన చేస్తోంది. చివరికి ఐపీఎస్, ఐఏఎస్‌లను కూడా వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది’అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: టార్గెట్ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్! -
వారెవ్వా..! కుదిరితే ఎర.. లేకుంటే వధ్యశిల!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఎలాంటి వంచనాత్మకమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందో.. ఆచరణాత్మకం కాని ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో.. ప్రజలకు తెలుసు. ఎన్డీయే సర్కారు ఆ హామీలను నిలబెట్టుకుంటుందో లేదో వేచిచూస్తూ వైఎస్సార్సీపీ ఆరునెలల గడువు ఇచ్చింది. ప్రజలకు అదే ధోరణిలో మాయమాటలు చెప్పడం తప్ప.. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల విషయంలో నోరు మెదపకుండా ప్రభుత్వం వంచిస్తూనే పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ దాటిపోయిందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ పోరుబాటలో కార్యచరణకు దిగుతుండడం.. కూటమి సర్కారులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీ ఉద్యమ ప్రణాళికకు జడుసుకుంటున్న ప్రభుత్వం రాజకీయం కుటిల వ్యూహాలను అమల్లో పెడుతోంది. ఆ పార్టీ నాయకులను లోబరచుకోవడం.. తమకు అనుకూలంగా మార్చుకుని.. తమ చేతి కీలుబొమ్మల్లాగా ఆడించడం.. వైఎస్సార్సీపీ మీదకే అస్త్రాల్లాగా ప్రయోగించడం అనేది అధికార పార్టీ అనుసరిస్తున్న తాజా వ్యూహంగా ఉంది. వైఎస్సార్సీపీ బలహీన పడుతున్నట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు భావనను క్రియేట్ చేయడానికి వైఎస్సార్సీపీ నాయకులతో రాజీనామాలు చేయించడం ఒక తక్షణ ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి ఇన్నాళ్లుగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన, తనను మంత్రిని చేసిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఊహాగానాలు రాయొద్దని మీడియాకు విన్నవించుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొంటూ.. మరోవైపు కనీసం ఏడాది రోజులైనా ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడానికి టైం ఇవ్వకుండా.. అప్పుడే ఉద్యమాలు చేయడం కరెక్టు కాదని అవంతి సూత్రీకరించడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. తాడేపల్లిలో కూర్చుని నిర్ణయాలు చేస్తోంటే అమలు చేయడానికి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ అవంతి అనడాన్ని లోతుగా గమనిస్తే.. ఆ మాటల వెనుక ‘ఉండవల్లి’ స్క్రిప్టు ఉన్నదనే సంగతి ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, తమ హామీలు తీర్చడానికి ప్రజలు అయిదేళ్ల గడువు ఇచ్చారని, అప్పుడే పోరాటాలు సరికాదని.. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా అవంతి శ్రీనివాస్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుల మీద తెలుగుదేశం అండ్ కో పార్టీలు రెండు రకాల గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలకు గేలం వేసి, ఎర వేసి, ప్రలోభపెట్టి ఆకర్షించడం ఒక పద్ధతి. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి వస్తే మంచి భవిష్యత్తు చూపిస్తామని ఆశ పెడతారు. గేలం వేస్తే లొంగని వారిని బెదిరిస్తున్నారు. వధ్యశిల బెదిరింపు అన్నమాట. వారి కెరీర్ అంతం అయ్యేలాగా కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఈ రెండురకాల వక్ర మార్గాల్లో ఏదో ఒకదానికి వైఎస్సార్సీపీ నాయకులు లొంగిపోతున్నారు. అయితే రాజీనామా చేసిన నేతలకు మంచి భవిష్యత్తు అనేది బూటకం మాత్రమే. మంత్రి పదవి ఆశ పెట్టి బాలినేని శ్రీనివాస రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనతో జగన్ మీద నానా నిందలు వేయించారు. తీరా ఇప్పుడు కరివేపాకు లాగా తీసి పక్కన పడేశారు. తెలుగుదేశం కూటమి పార్టీల ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడుతున్న వారి భవిష్యత్తు కూడా అంతేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.:::ఎం.రాజేశ్వరిఇదీ చదవండి: యనమల గతి ఇక ఇంతేనా? -
టార్గెట్ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడైన కొణిదెల నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ ప్రకటన చేశారు. ఈ పరిణామంపై జనసేన ఫుల్ ఖుషీగా ఉంది. కష్టకాలంలో అండగా ఉన్న అన్నకు పవన్ తగిన బహుమతి ఇవ్వబోతున్నాడని అనుకుంటున్నారు. కానీ, టీడీపీ మాత్రం లోలోపల రగిలిపోతోంది. అందుకు కారణం.. గతంలో టీడీపీని, చినబాబును నాగబాబు ఫుల్‌గా ఆడేసుకోవడం!.2014లో జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఆయన అన్న నాగబాబు నడుస్తున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆయన రాజకీయ మనుగడ కష్టమేనని అంతా అనుకున్నారు. అనూహ్యంగా.. జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. 2024 ఎన్నికలకు పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే.. జనసేన శ్రేణుల్లో నైరాశ్యం ఆవహించింది. అయితే.. ఆ అసంతృప్తిని కప్పిపెట్టడంలో నాగబాబే ముఖ్యభూమిక పోషించారు. చివరకు ఏదైతేనేం.. ఎమ్మెల్సీ కోటాతో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కొణిదెల నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణలాంటి అర్హత ఉన్నవాళ్లు ఉండగా.. ఏనాడూ ఎన్నికల్లో గెలవని నాగబాబును మంత్రిని చేయడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అదే టైంలో.. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కొందరు ప్రస్తావిస్తున్నారు.2019-24 మధ్య వైఎస్సార్సీపీతో పాటు టీడీపీని టార్గెట్‌గా పెట్టుకుని నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్లో అడ్డగోలు కామెంట్స్ చేశారు. అందులో చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్‌తో పాటు కొడుకు లోకేష్ నోరు జారి చేసిన ప్రసంగాలను నాగబాబు బాగా హైలైట్ చేశారు. యూట్యూబ్ ఆదాయం కోసమే నాగబాబు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయనపై ఆ టైంలో సెటైర్లు కూడా బాగానే పేలాయి. చివరకు.. ఎందుకనో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.సంబంధిత వార్త: ‘లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ ఏపాటిది’కట్ చేస్తే.. 2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు.సంబంధిత వార్త: లోకేష్‌కు ఓ.. వేస్కోండి!ఇప్పుడు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టుల వెనుక.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ మొదలైంది. ప్రతీకార చర్యలో భాగంగానే.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్‌ను పక్కనపెట్టారు చంద్రబాబు. తీరా ఎన్నికలయ్యాక లోకేష్‌ను మంత్రిని చేసినప్పటికీ.. జనసేనానితో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది. మరోవైపు ఈ పోస్టుల ఆధారంగా.. నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఏ పదవీ దక్కకపోవడానికి చినబాబే కారణమై ఉంటాడని జనసేనలోనూ ఓ చర్చ నడుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ కోటా మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్‌కు అన్వయింపజేస్తూ కౌంటర్‌కు దిగారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా.. టీడీపీ-జనసేనల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
యనమల గతి ఇక అంతేనా?
అవమానభారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు తెలిసివస్తూంటుంది. స్వపక్షం నుంచే వస్తున్న విమర్శల జడిని నేరుగా తిప్పికొట్టలేక, అలాగని జవాబు కూడా ఇవ్వలేని స్థితిలో యనమల ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలుగుదేశం వాళ్లే ఆయనను బ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణిస్తూండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు యనమల. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉండగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు జరిగిన పరాభవాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎక్కింది మొదలు యనమలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోతోందన్న అంచనాలకు బలం పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆశించిన రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడం ఒక అవమానమైతే.. కాకినాడ పోర్టు యజమాని కేవీరావుపై చంద్రబాబుకు రాసిన లేఖ సొంత పార్టీలో ఆయన్ను పరాయివాణ్ణి చేసింది. పదవి ఇవ్వలేదన్న అక్కసుతో యనమల నేరుగా బాబునే బ్లాక్మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులే దూషణలకు దిగుతారని బహశా ఆయన కూడా ఊహించి ఉండరు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన యనమల 1994లో టీడీపీ హయాంలో స్పీకర్‌గానూ పనిచేశారు. రాజకీయ జీవితంలో ఇదే ఆయనకు మేలిమలుపు అంటారు. నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ కూడా యనమలకు మంత్రి పదవి కానీ, ఇతర పదవి ఏదైనా కూడా ఇచ్చేందుకు సుముఖత చూపలేదని అంటారు. తనకు విశ్వాసపాత్రుడైన గాలి ముద్దు కృష్ణమనాయుడికి స్పీకర్ పదవి ఇవ్వాలన్నది ఎన్టీఆర్ ఆలోచన. అయితే ముద్దుకృష్ణమ ఇష్టం మేరకు మంత్రిని చేశారు. ఈ అవకాశాన్ని వాడుకున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా స్పీకర్ పదవికి యనమల పేరును తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ ను ఒప్పించారు. బాబు కుట్రల గురించి పెద్దగా ఆలోచించని ఎన్టీఆర్అంగీకరించడం.. ఆ తరువాత తొమ్మిది నెలలకే యనమల సహకారంతో ఎన్టీఆర్ పదవీచ్చుతి చకచకా జరిగిపోయాయి... బాబు డైరెక్షన్లో! ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్టీఆర్ ది.యనమల కూడా వారిలో ఒకరు. అయినాసరే.. రాజకీయాల్లో విశ్వాసానికి తావులేదనట్టుగా చంద్రబాబు, యనమల వంటి వారు రుజువు చేశారు. వాస్తవానికి 1994 ప్రాంతంలో చంద్రబాబు వర్గం ప్రధాని పీవీ నరసింహరావును కూడా బుట్టలో వేసుకోగలిగిందని, అందుకే పార్టీ రాష్ట శాఖ ఆలోచనలకు భిన్నంగా పీవీ బాబుకు సాయం చేశాడని అంటారు. శాసనసభ రద్దుకు ఎన్టీఆర్ చేసిన సిఫారసును గవర్నర్ కృష్ణకాంత్ పట్టించుకోకపోవడం, మంత్రిపదవి నుంచి బర్తరఫ్ అయిన చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం, శాసనసభలో జరగాల్సిన బలపరీక్షను స్పీకర్ యనమల చేతిలో పెట్టడం వంటివన్నీ ఇందుకు నిదర్శనాలు. యనమల స్థానంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పీకర్‌గా ఉండి ఉన్నట్లైతే ఎన్టీఆర్ పదవి అంత తేలికగా పోయేది కాదు. చంద్రబాబు తన వర్గం ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి అక్కడకు వెళితే, టీడీపీ వారే చెప్పులు విసిరారు. సినీ రంగంలోను, రాజకీయ రంగంలోను ఎదురులేని మొనగాడిగా అందరి ప్రశంసలు పొందిన ఎన్టీఆర్ కు ఎదురైన దుర్గతి అది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు గవర్నర్ స్వయంగా వెళ్లి ఆయన నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. పిమ్మట అసెంబ్లీ సమావేశంలో తన వాదన వినిపించడానికి ఎన్టీఆర్ పలుమార్లు ప్రయత్నించారు. చంద్రబాబుపై కుట్రలను వివరించే ప్రయత్నం చేసిన ప్రతిసారి స్పీకర్ యనమల మైక్ కట్ చేసేవారు. ఆ అవమానం భరించలేక ఎన్టీఆర్ తన వర్గం ఎమ్మెల్యేలతో వాకౌట్ చేశారు. పదవి కోల్పోయాక ఎన్టీఆర్ మీడియా సమావేశం పెట్టి సొంతపార్టీ వారి చేతిలో, సొంత కుటుంబం చేతిలో పరాభవానికి గురైన తీరు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాజకీయాలలో ఎంత పెద్ద నాయకుడైనా ఒక్కోసారి ఇలా అవమానాలకు గురి అవుతారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు యనమల వంతు. 2019 వరకు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న యనమల, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. 1983 నుంచి 2004 వరకు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2019లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి పొందగలిగారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. అశోక్ గజపతి రాజు వంటి నేతలను తోసిరాజని పార్టీలో చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన తాను కోరితే రాజ్యసభ సభ్యత్వం కష్టం కాదని అనుకున్నారు. భంగపడ్డారు. పార్టీలో బాబుకంటే లోకేష్ ప్రాభవమే ఎక్కువ అవుతూండటం దీనికి కారణంగా చెబుతున్నారు. సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలను బాబు కూడా ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఈ నేపథ్యంలోనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయంగా యనమలను పక్కన పెట్టేశారన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేనట్లుగా యనమల ఏపీ రాజకీయాల నుంచి వైదొలగి పార్లమెంటుకు వెళ్లాలని అనుకున్నా... చంద్రబాబు, లోకేష్‌లు ఆయనకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, పలు అక్రమాల ఆరోపణలు ఉన్న సానా సతీష్ వైపు మొగ్గు చూపారు.నిజానికి ముగ్గురు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన టీడీపీ తన సొంత పార్టీ నేతలకు ఈ పదవులు ఇవ్వలేకపోయింది. పోనీ ఖాళీగా ఉన్న మంత్రి పదవి అయినా ఇస్తారా అని ఎదురుచూస్తే, దానిని నాగబాబుకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంత్రి పదవి, రాజ్యసభ సీటు రెండూ రావడం లేదని స్పష్టమైందన్నమాట. ఎమ్మెల్సీగానే కొనసాగాలన్న మాట. సానా సతీష్ తో పోల్చితే యనమల కచ్చితంగా మెరుగైన రాజ్యసభ అభ్యర్ధి. పార్టీ వాదనను బలంగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవారు. అయితే ఈయన వల్ల ఢిల్లీలో పెద్దగా ఉపయోగం ఉండదని, సానా సతీష్ లాబీయింగ్‌లో దిట్ట అని చంద్రబాబు, లోకేష్‌లు భావించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సెజ్ భూములను కేవీరావు చౌదరి ఎలా దోచేసింది వివరిస్తూ యనమల లేఖ రాయడం సంచలనమైంది. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా కేవీరావు నుంచి లాక్కున్నారంటూ కొందరు వైఎస్సార్సీపీ నేతలపై, ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అధినేతపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు వేసిన ప్లాన్‌కు ఈ లేఖ గండి కొట్టింది. టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయే పరిస్తితి ఏర్పడింది. దాంతో యనమల లేఖలోని అంశాల జోలికి వెళ్లకుండా, ఆయనను తిట్టడానికే టీడీపీలోని కొన్ని వర్గాలు పనికట్టుకున్నాయి. రాజ్యసభ సీటు ఇవ్వలేదనే ఈ లేఖ రాశారని టీడీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. యనమలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేవీరావు చివర చౌదరి అని కులం పేరు తగిలిస్తారా అని మండిపడ్డారు. కమ్మ కులం మద్దతు లేకుండానే యనమల ఈ స్థాయికి వచ్చారా అని వారు ప్రశ్నించారు. అయితే యనమల వెనక్కి తగ్గకుండా ఒక ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ తన చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. తన పేరు చివర యాదవ అని లేనంత మాత్రాన కులం పోదు కదా? అని ప్రశ్నించారు ఆయన. యనమల కుటుంబానికి నాలుగు పదవులు ఉన్నా సంతృప్తి లేదని, అసలు పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవ ఏముందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. యనమల తమ్ముడు అసెంబ్లీ టిక్కెట్ అడిగినా, ఆయనను కాదని ఈయన ఒక కుమార్తెకు తుని టీడీపీ టిక్కెట్ ఇచ్చిన మాట నిజమే. అలాగే వియ్యంకుడు పుట్టా సుధాకర్ కు రాయలసీమలోని మైదుకూరు అసెంబ్లీ సీటును, ఈయన కుమారుడు, యనమల మరో అల్లుడు పుట్టా మహేష్ కుమార్‌కు ఏలూరు లోక్ సభ సీటు ఇచ్చారు.అయితే సుధాకర్, ఆయన కుమారుడికి టిక్కెట్లు రావడంలో యనమల పాత్ర పెద్దగా లేదని, పార్టీకి చేసిన సేవల రీత్యా లభించాయని కొందరి అభిప్రాయం. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్ది పార్టీలు విమర్శిస్తుంటాయని, కాని ఆ వెన్నుపోటు పొడిచింది యనమల అవుతారు కదా అని టీడీపీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈయనకు ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఎవరిరీ లభించలేదని, ఈయన పార్టీలో ఇతరనేతలు ఎవరిని ఎదగనివ్వలేదని కూడా ఆయన అబిప్రాయపడ్డారు. టీడీపీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నేరుగా యనమలపై వ్యాఖ్యానిస్తూ ఆయన వల్ల పార్టీకి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. యనమల బీసీ నేతలను పెరగనివ్వకుండా అణగదొక్కి, తాను మాత్రమే లాభపడ్డారని విమర్శించారు. టీడీపీ అధినాయకత్వం సూచన లేకుండానే సుబ్రహ్మణ్యం ఈ విమర్శలు చేశారా అన్న సందేహం ఏర్పడుతోంది. గతంలో యనమలను ఇంత నేరుగా విమర్శించే సాహసం పార్టీలో ఎవరూ చేసేవారు కాదు. కాని కాలచక్రం మారుతుంది కదా! ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సర్దుకుపోయి అవమానం భరించడం తప్ప యనమల చేయగలిగింది కూడా ఏమీ లేదేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లేఖ కాదు యనమల.. విచారణకు ఆదేశించాలి?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: కాకినాడ సెజ్ భూములపై యనమల రామకృష్ణుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే భూ దోపిడీపై చంద్రబాబుతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. అలాగే, 2014లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగిందని చెప్పుకొచ్చారు. నాడు మంత్రిగా ఉన్న యనమల.. రైతుల పక్షాన ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తన రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబుకు యనమల లేఖ రాశారు. 2002-03లో కాకినాడ సెజ్ కోసం భూసేకరణ ప్రారంభమైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. 2014లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగింది. అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల ఎందుకు సెజ్ రైతుల పక్షాన నిలవలేదు.సెజ్‌కు ముందుగానే తన భూములను ఇచ్చి.. రైతులంతా భూములు ఇచ్చేలా మోటివేట్ చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. సెజ్ రైతులపై యనమలకు చిత్తశుద్ది ఉంటే భూ దోపిడిపై చంద్రబాబుతో విచారణ జరిపించాలి. వేల కోట్లు దోచుకున్న కేవీరావు చౌదరి నుండి సొమ్ములు వెనక్కి తీసుకుని.. సెజ్ రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు తిరిగి చెల్లించాలి. సెజ్ రైతులకు వైఎస్ జగన్ భూములు తిరిగి ఇచ్చేశారు. అలాగే, చంద్రబాబుకు కూడా రైతులకు తిరిగి భూములు ఇచ్చే విధంగా భగవంతుడు ఆయనకు మంచి మనసు ప్రసాదించాలి.సెజ్‌లో నేను ఆరు ఎకరాల భూమి కొన్నది వాస్తవమే. రైతులకు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా రైతుల నుండి భూములు కొనుగోలు చేశారు. సరైన పద్దతిలో భూముల కొనుగోలు చేయడంలో తప్పు లేదు కదా? అని ప్రశ్నించారు. -
ప్రజాగ్రహం వల్లే 'డైవర్షన్ పాలిటిక్స్': వైఎస్ జగన్
కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ హంగామా చేయడం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాతలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభుత్వంలో మనమున్నామా? వాళ్లున్నారా? అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచాయి. అధికారులు, మంత్రులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మార్వోలు, పోలీసులు అంతా వాళ్ల అధికారులే. చెక్ పోస్టులు వాళ్లవే. పోర్టులో కస్టమ్స్ అధికారులు, సీఐఎస్ఎఫ్ పోలీసులు వాళ్ల పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వ మనుషులే. ఇవన్నీ దాటుకుని ఏదైనా మెటీరియల్ పోర్టులోకి పోగలుగుతుందా? పవన్ కళ్యాణ్ వెళ్లి పరిశీలించిన షిప్ పక్కనే ఉన్న మరో షిప్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీనివాసరావుది. పట్టాభి రైస్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో అదే పోర్టు నుంచి శ్రీనివాసరావు ఎగుమతి చేస్తున్నారు. అక్కడికి మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్లడు. ఆ షిప్‌ను పరిశీలించడు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఎవరు చేస్తున్నారని నాకు ఆశ్చర్యం అనిపించింది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘ప్రజలకు అబద్ధాలు చెబితే అది మోసం అవుతుంది. అది ప్రజల్లో కోపం కింద మారుతుంది. ఆ కోపమే చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఇప్పుడు విపరీతంగా కనిపిస్తోంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు ఏమైందని ప్రజలు నిలదీస్తుండటంతో సమాధానం చెప్పలేని టీడీపీ పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని దెప్పి పొడిచారు. ‘జూన్‌లో రుషికొండ భవనాలు అని, జూలైలో శ్వేతపత్రాలు అని, మదనపల్లె ఫైల్స్ అని, ఆగస్టులో ముంబై నటి కాదంబరి జెత్వానీ అని, సెప్టెంబర్‌లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి కూలగొట్టాలన్న కుట్ర చేశామని, అక్టోబర్‌లో నా కుటుంబాన్ని తెచ్చి, నవంబర్‌లో బడ్జెట్‌పై దృష్టి మరలించడానికి రూ.14 లక్షల కోట్లు అప్పు అని డైవర్షన్ చేశారు. ఇప్పుడు డిసెంబర్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ నానా హంగామా చేస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారు’ అని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ‘యుద్ధం గతంలోలా లేదు. మనం చంద్రబాబుతోనే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. వీటికి తోడు చెడిపోయిన ఐ–టీడీపీతో యుద్ధం చేస్తున్నాం. వీరంతా నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది’ అని నేతలకు ఉద్బోధించారు. ‘ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఎక్కౌంట్ ఉండాలి. అన్యాయం జరిగితే దాన్ని కచ్చితంగా ప్రశ్నించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోటో తీసి ప్రశ్నించాలి. ఎందుకు అమ్మఒడి రావడం లేదు? మా విలేజ్ క్లినిక్ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఇలా అన్ని సమస్యలపై ఫోటోలు తీసి అప్ లోడ్ చేయాలి. తద్వారా ప్రజలకు దగ్గర కావాలి’ అంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ‘ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు దాటింది. ఈ పరిస్థితుల్లో పార్టీని మనం మళ్లీ సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ కలుస్తున్నాం. ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత ఈ స్ధాయిలో ఏ ప్రభుత్వం మీద లేదు. కేవలం చంద్రబాబునాయుడు పాలనలో మాత్రమే ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం’ అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అధికార పార్టీ వ్యవస్థీకృత నేరాలు ⇒ ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల వ్యవస్థీకృత నేరాలు’ అంటూ ఈనాడులో రాశారు. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నది వాళ్లు అయితే, మన మీద వేలెత్తి చూపిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చూస్తే.. బియ్యం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దశాబ్దాలుగా నెంబర్ వన్‌గా ఉంది. తెలంగాణా నుంచి కూడా బియ్యం మన దగ్గరకే వస్తాయి. అందులో పట్టాభి ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఎగుమతి చేస్తున్న పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీనివాసరావు ఆంధ్రాలో నెంబర్ వన్. ⇒ మన ప్రభుత్వంలో తొలిసారిగా బియ్యం పంపిణీలో డీలర్ల వ్యవస్థను పక్కన పెట్టి.. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేశాం. ఇందులో భాగంగా ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్) ఏర్పాటు చేసి ఇంటి వద్దకే సార్టెక్స్ చేసి వాళ్లు తినగలిగే బియ్యాన్ని ఇచ్చాం. వాళ్లు అమ్ముకునే పరిస్థితి లేకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం వైఎస్సార్సీపీ హయాంలో జరిగింది. ఈ రోజు ప్రభుత్వం పథకం ప్రకారం ఇంటి వద్దకే బియ్యం ఆపేసింది. మనం సార్టెక్స్ చేసి స్వర్ణ వంటి మధ్యస్థ సన్న బియ్యం ఇస్తే.. ఇవాళ దాన్ని నిర్వీర్యం చేశారు. వీళ్లు ఇవన్నీ చేస్తుంటే.. వీళ్ల తప్పిదాలతో నాసిరకం బియ్యం సరఫరా కావడం వల్ల మళ్లీ ప్రజల దగ్గర నుంచి వివిధ రూపాల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎగుమతి జరుగుతోంది. ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తం ⇒ మన హయాంలో ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ప్రతి రైతుకు కనీస మద్ధతు ధర వచ్చేటట్టు చేశాం. రైతు ఏ మిల్లుకు తాను పోవాలన్నది పూర్తిగా పక్కన బెట్టి.. రైతుకు మిల్లర్లకు సంబంధం లేకుండా చేశాం. ఆర్బీకే దగ్గరే ఎంత ధాన్యం అమ్మావు, ఎంత రేటు వస్తుందనే స్లిప్పులు ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. ⇒ ఇవాళ రైతుల పంట చేతికొచ్చే సరికి ఈ–క్రాప్ లేదు. ఆర్బీకే వ్యవస్థ లేదు. కొనుగోలు చేసే వారు లేక.. రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరకు వెళితే వాళ్లు కనీస మద్దతు ధర చెల్లించకుండా, రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాలుగా ధాన్యం సేకరణ వ్యవస్థను సర్వనాశనం చేశారు.బుధవారం తాడేపల్లిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పప్పు బెల్లాల్లా బాబు అమ్మకం ⇒ రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల. దాన్ని కట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఒకవైపు మనం కడుతున్న మెడికల్ కాలేజీలు, పోర్టులను చంద్రబాబు అమ్ముతానంటున్నాడు. మనం రాక ముందు నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉంటే మనం వచ్చిన తర్వాత నాలుగు పోర్టులు కట్టాం. ఇప్పుడు ఆ పోర్టులన్నీ శనక్కాయలకు, బెల్లాలకు అమ్ముతాడట!⇒ సంపద సృష్టించడమంటే పోర్టులు, మెడికల్ కాలేజీలు వంటివి నిర్మించడం. ఈ పోర్టుల నిర్మాణం పూర్తైతే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈ పోర్టు కట్టడానికి ఇవాళ రూ.4 వేల కోట్లు అవసరం అయితే పదేళ్ల తర్వాత రూ.10 వేల కోట్లు అవసరం అవుతుంది. ఈ పోర్టులన్నింటినీ చంద్రబాబు తన వాళ్లకు అమ్మే కార్యక్రమం పెట్టాడు. వెలిగొండ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు..వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లు పూర్తయ్యాయి. నల్లమల సాగర్ రిజర్వాయర్ కూడా పూర్తయింది. లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగే ప్రధాన కాల్వల నిర్మాణం కూడా పూర్తయింది. కేవలం ఆర్ అండ్ ఆర్ పరిహారం మాత్రమే చెల్లించాలి. అది కూడా రూ.1,200 కోట్లు ఇస్తే నీళ్లు నింపవచ్చు. దాన్ని ఈ ఏడాది చేయాలనుకున్నాం. అలా పూర్తి చేసిన ప్రాజెక్టు ఈ రోజుకూ అలా ఉండిపోయింది. పూర్తైన ప్రాజెక్టుకు కూడా ఆర్ అండ్ ఆర్ డబ్బులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్ కాలేజీ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. దాన్ని అమ్మడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి వాళ్లని చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. జనవరి నుంచి జిల్లాల పర్యటనపార్టీని మనం మరింత బలోపేతం చేయాలి. దీన్ని వ్యవస్థీకృత విధానం (ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్)లోకి తీసుకురావాలి. ఇందులో భాగంగా పార్టీలో క్రియాశీల మార్పులు తీసుకు వచ్చాం. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బుధ, గురువారాల్లో ఉంటాను. అవసరాన్ని బట్టి శుక్రవారం కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. నా కార్యక్రమం ప్రారంభమయ్యేలోపు జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల స్థాయి కమిటీలు పూర్తి చేయాలి. సంక్రాంతి లోపే అవన్నీ పూర్తి కావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చేద్దాం.పోరు బాట దిశగా అడుగులుమీలో కూడా ఎవరైనా నాయకత్వ దిశగా ఎదగాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎదగడానికి అవకాశం వస్తుంది. ప్రజలకు మనం దగ్గర కావాలి. ప్రజలకు దగ్గరవుతూ పోరాటంలో వాళ్లకు తోడుగా నిలబడగలిగితేనే మనకు సానుకూలంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు మనల్ని త్వరగా రోడ్డు మీదకు వచ్చేలా చేశాడు. ప్రజల తరఫున పోరాటంలో బాగంగా మనం మూడు కార్యక్రమాలు చేపట్టాం. ఈ నెల 13న అన్నదాతలకు అండగా సమస్యలపై కార్యక్రమం పెట్టాం. గతంలో మనం రైతు భరోసాగా రూ.13,500 ఇచ్చాం. ఇందులో ఆరు వేలు కేంద్రమే ఇస్తుందని టీడీపీ వాళ్లు అన్నారు. అంటే కేంద్రం ఇస్తున్నది కాకుండా ఏడాదికి మరో రూ.20 వేలు ప్రతి రైతుకూ ఇస్తామన్నట్టుగా భావన కల్పించారు. కానీ ఇప్పుడు ఏమీ ఇవ్వడం లేదు. దీనిపై నిలదీసే కార్యక్రమం జరగాలి. ధాన్యం కనీస మద్దతు ధర కోసం కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశాడు. వీటన్నింటి మీద ప్రశ్నిస్తూ రైతుల తరఫున కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తాం. ఈనెల 27న కరెంటు చార్జీల మీద మరో కార్యక్రమం చేస్తున్నాం. కరెంటు ఛార్జీల విషయంలో కూడా చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో నేనున్నా.. నేను తగ్గిస్తా.. అన్నాడు. తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.15,000 కోట్లు పెంచాడు. దీనిపై ఈనెల 27న కార్యక్రమం పెట్టాం.జనవరి 3నఫీజు రీయింబర్స్మెంట్ కోసం మరో కార్యక్రమం చేస్తున్నాం. క్వార్టర్ అయిపోయిన వెంటనే నాలుగో నెలలో వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల తల్లులకు విద్యాదీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇచ్చే వాళ్లం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి నాలుగు త్రైమాసికాల నుంచి విద్యా దీవెన అందలేదు. వసతి దీవెన డబ్బులు కూడా ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువులు మానేసి పొలం పనులు చేసుకుంటున్నారు. ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితులు. ఆ పిల్లల తరఫున చంద్రబాబును ప్రశ్నిస్తూ జనవరి 3న పోరు సాగిస్తున్నాం. ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి.చంద్రబాబు బాదుడే బాదుడు ⇒ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతం చేయడంతో పాటు, ప్రజల తరఫున పోరాటం చేయడానికి సన్నద్ధం అయ్యాం. చంద్రబాబు చేస్తున్న పాలన చూసి ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్లకు మేమున్నామనే భరోసా ఇవ్వగలిగినప్పుడే ప్రజలకు మన మీద నమ్మకం కలుగుతుంది. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి.⇒ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నీ నాశనమయ్యాయి. మరోవైపు బాదుడే బాదుడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. రూ.6 వేల కోట్ల బాదుడుతో మొదటి డోసు ఇది. నవంబరు, డిసెంబరు బిల్లులో ఏ ఇంటికి వెళ్లినా రూ.300 కనీసం తేడా కనిపిస్తోంది. రా>నున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల భారం వేస్తున్నారు.⇒ ఊళ్లలో రోడ్డెక్కితే చాలు డబ్బు కట్టాల్సిందేనట. అది జాతీయ రహదారులపై చూశాం కానీ, గ్రామీణ రోడ్లు బాగు చేయడం కోసం వాటిపై టాక్స్ వేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నాడు. ఆయన హయాంలో, మన హయాంలో తేడా చూస్తే.. మన హయాంలో రూ.43 వేల కోట్లు రోడ్లపై ఖర్చు చేస్తే, అంతకు ముందు చంద్రబాబు హయాంలో అది రూ.27 వేల కోట్లు మాత్రమే. అది కూడా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ మనమే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఇవాళ చంద్రబాబు హయాంలో సంపద సృష్టి అంటే బాదుడే బాదుడు అని అర్థం.మేనిఫెస్టో అమలు చేసిన తొలి ప్రభుత్వం2019–24 మధ్య మన పాలనలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మన ప్రభుత్వం రానంత వరకు మేనిఫెస్టో ప్రాధాన్యత ఏమిటన్నది తెలియదు. ఎన్నికలైపోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పాలనను మన కంటే ముందు చూశాం. తొలిసారిగా ఆ చరిత్రను మార్చిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ.. ఎన్నికలప్పుడు చెప్పిన ప్రతి మాటను తూచ తప్పకుండా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్ కూడా ప్రకటించి.. ఏ నెలలో, ఏ పథకం అమలు చేయబోతున్నామో చెప్పాం. ఆ నెల వచ్చేసరికి బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసిన పాలన మన ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మనం రానంత వరకు ప్రజలకు ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా పథకాలు ఇవ్వడం సాధ్యమేనా? అన్న పరిస్థితి నుంచి ఔను, ఇవన్నీ సాధ్యమే.. కచ్చితంగా చేయగలం.. అని రాష్ట్రానికి, దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా చూపింది వైఎస్సార్సీపీ పాలన మాత్రమే. విద్య, వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి ⇒ ఎప్పుడూ చూడని విధంగా స్కూళ్లు మారాయి. పేదవాడు పేదరికం నుంచి బయటకు వచ్చి సమాజంతో పోటీ పడేలా చదువులు కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే అందాయి. బడులలో ఎప్పుడూ చూడని మార్పులు తెచ్చాం. ప్రభుత్వ బడుల కన్నా ప్రైవేటు బడులు ముందుంటాయి అన్న పరిస్థితి నుంచి ప్రైవేటు బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితిలోకి తెచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ పరకు ప్రయాణం, నాడు–నేడుతో సమూల మార్పులు, ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి డిజిటలైజ్ చేశాం. ఏటా పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. ⇒ వైద్య రంగంలో కూడా ఎప్పుడూ చూడని మార్పులు చేశాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ప్రతి 15 రోజులకొకసారి ప్రభుత్వ వైద్యుడు గ్రామానికే వచ్చి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేశాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు విస్తరించాం. గతంలో ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు ఉంటే వాటిని 3300కు పెంచాం. దేశమంతా ప్రభుత్వ రంగంలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే, మన వద్ద జీరో వేకెన్సీ పాలసీతో దాన్ని 4 శాతానికి లోపే తీసుకువచ్చాం. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు అందించాం.సాగులో కనీవినీ ఎరగని మార్పులు ⇒ వ్యవసాయంలో కనీవినీ ఎరగని మార్పులు తెచ్చాం. గ్రామంలో రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ గ్రామంలో కనిపిస్తుంది. అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ రైతులకు సలహాలు, సూచనలు అందించే పరిస్థితి. తొలిసారిగా పారదర్శకతకు పెట్టపీట వేస్తూ ఈ–క్రాపింగ్, దాని ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. రైతులకు ఏ ఇబ్బంది రాకుండా పంట వేసే సమయానికే పెట్టుబడి సాయం చేశాం. ⇒ రైతుల వద్ద నుంచి దళారీ వ్యవస్థను తీసివేయడం సాధ్యమేనా అన్న వాళ్లకు.. ఇది సాధ్యమేనని చేసి చూపించాం. ధాన్యం కొనుగోళ్లను ఆర్బీకే స్థాయి నుంచే మొదలుపెట్టి ప్రతి ఒక్క రైతుకూ కనీస మద్దతు ధర అందేటట్టు చేయడంతో పాటు, రైతులకు బోనస్‌గా జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, ట్రాన్స్‌పోర్టు)గా ఎకరాకు రూ.10 వేలు అందించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేం ⇒ పరిపాలనను ఇంటి గడప వద్దకే తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా అన్నీ చేయగలిగాం. అంత మంచి చేసినా ఎక్కడో పొరపాటు జరిగింది. ‘జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. చంద్రబాబు ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతానన్నాడు. తీరా ఎన్నికలయ్యాక పలావు పోయింది. బిర్యానీ కూడా పోయిందన్న’.. మాట ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోంది. ⇒ ఆరోజు చంద్రబాబు అలా ప్రచారం చేసినప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి.. అన్నా నువ్వు ఏం చెప్పనంటున్నావు. చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరు కనిపించినా వదలడం లేదు. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అంటున్నాడు. వాళ్ల అత్తలు, అమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, అదే ఇంట్లో నుంచి 20 ఏళ్ల యువకుడు బయటకు వస్తే నీకు రూ.36 వేలు అంటున్నాడు. అదే ఇంట్లో నుంచి కండువా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని అంటున్నాడు. ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. మనమూ చెప్పాలని అన్నారు. ⇒ ‘ఇది మన రాష్ట్ర బడ్జెట్. మన రాష్ట్ర పరిస్ధితులు ఇవి. కాబట్టి మనం చేయగలిగింది ఇది మాత్రమే. కానీ మనం చెప్పిన దానికన్నా చంద్రబాబు మూడింతలు చెబుతున్నాడు. అవి సాధ్యం కాదు’ అని చెప్పాను. కానీ, మనం ఎంత చెప్పినా.. ప్రజలు అటువైపు ఆలోచన చేశారు. ప్రజలు బాధ పడకుండా ఉండాలని, వారిలో చిరునవ్వు చూడాలన్న తపనతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా భరించాం. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినా కారణాలు వెతుక్కోకుండా యుద్ధం చేసి మరీ ప్రజలకు మంచి చేశాం. బాబు చెప్పిన అబద్ధాలు ఓ పది శాతం మంది అధికంగా నమ్మి ఇటువైపు నుంచి అటువైపు వెళ్లారు.విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామరక్ష⇒ నేను ఒక్కటే చెబుతున్నాను. ఈ క్యారెక్టర్, క్రెడిబులిటీ వల్లనే మనం మళ్లీ అధికారంలోకి వస్తాం. నా దగ్గరకు వచ్చిన మన పార్టీ నేతలు మీలో అతి మంచితనం, అతి నిజాయితీ అనే సమస్యలు ఉన్నాయని చెబుతారు. కానీ ఆ రెండు గుణాలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. ప్రజలకు అబద్ధాలు చెప్పినప్పుడు అది మోసం అవుతుంది. అది ప్రజల్లో కోపం కింద మారుతుంది. ఆ కోపమే చంద్రబాబు పాలనలో ప్రజల్లో ఇప్పుడు విపరీతంగా కనిపిస్తుంది. ప్రజలు నిలదీసే పరిస్థితుల్లోకి వస్తున్నారు.⇒ నా రూ.15 వేలు ఏమయ్యాయని చిన్నపిల్లలు, నా రూ.18 వేలు ఏమయ్యాయని వాళ్ల తల్లులు, నా రూ.48 వేలు ఏమయ్యాయని అమ్మమ్మలు, నా రూ.36 వేలు ఏమయ్యాయని యువకులు, నా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పలేని తెలుగుదేశం పార్టీ పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. -
6 నెలల్లో తారుమారు.. హామీలకు చంద్రబాబు తూట్లు
ఓ నాయకుడు మాట ఇస్తే... ఆరు నూరైనా నూరు ఆరైనా కట్టుబడి ఉండాలంటారు! కానీ సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఏరు దాటాక తెప్ప తగలేశారు! ఆర్నెళ్ల పాలనలో కనిపించేదంతా ఉత్త ‘గ్యాసే’!ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకపోగా ఇసుకలో దోపిడీ.. మద్యంలో దోపిడీ.. రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల బాదుడుతో ప్రజలను గుల్ల చేస్తున్నారు. మరోవైపు కొత్త పథకాలు లేకపోగా ఉన్నవాటినే రద్దు చేస్తూ రెడ్‌బుక్ పాలనతో ప్రశ్నించే గళాలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. రెడ్‌బుక్, మాఫియా రాజ్యంతో స్కామ్‌ల పాలన సాగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడు నెలలు తరువాత.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్నెళ్లు గడిచాక ఇదీ పరిస్థితి!!సాక్షి, అమరావతి: అలవి మాలిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత ఐదేళ్లూ అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన ‘తల్లికి వందనం’ ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఎటు పోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి లేదంటే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన పేదలను ధనికులుగా మార్చే ‘పూర్ టు రిచ్’ కాన్సెప్ట్ కాగితాలకే పరిమితం! ‘యువగళం’, ‘ఆడబిడ్డ నిధి’ పథకాలు కనుచూపు మేరలో లేవు. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు ఆశగా పడిగాపులు కాస్తున్నారు. అయితే కనీసం వాటిని అమలు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వ పెద్దల్లో కానరాక పోవడంతో మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరవేశారు. రాజకీయ వేదికలుగా ప్రభుత్వ విద్యా సంస్థలు..అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలో 16 వేలకుపైగా పోస్టులతో మెగా డీఎస్సీని పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన తొలి సంతకం మురిగిపోయింది! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆర్నెళ్లుగా ప్రభుత్వ పాఠశా>లలపై అనేక ప్రయోగాలు చేసి ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఐబీ, సీబీఎస్ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకం అమలుపై మాత్రం చేతులెత్తేసింది. ఇంగ్లీషు మీడియం చదువులు, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు ట్యాబ్‌లపై చేతులెత్తేసింది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌కు లబ్ధి చేకూరుస్తోంది. రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ ఇస్తామన్న హామీ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లల్లో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చిందే గానీ ఒక్క విద్యా సంస్కరణను అమలు చేసింది లేదు. మెగా పీటీఎం పేరుతో ఉపాధ్యాయులను ఉరుకులు పెట్టించి ప్రభుత్వ విద్యా సంస్థలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లకు మోకాలడ్డిన కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు మన విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. అన్ని విధాలా దగా పడిన రైతన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.1000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. గత ఆర్నెళ్లలో 70 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1.80 కోట్ల మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్కపైసా విదల్చక పోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది.వైఎస్ జగన్ హయాంలో ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే లో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టారు.సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర ముఖ్యమైన హామీలు⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం.⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెళ్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు.⇒ ఉచితంగా ఇసుక అంటూ దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు.ఆసరా, చేయూత అసలే లేవువైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికే అందాల్సిన మత్స్యకార భరోసాగానీ, వాహనమిత్ర లాంటి పథకాలుగానీ అందలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది. కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఉచిత గ్యాస్‌లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారంఅధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. ఇంకా తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని వినియోగదారులపై మోపిన కూటమి ప్రభుత్వం మరో రూ.9,412 కోట్ల భారం కూడా మోపేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్నెళ్లలో వేసిన మొత్తం విద్యుత్ చార్జీల భారం రూ.15,485.36 కోట్లకు చేరింది.మద్యం సిండికేట్లతో లూటీప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసిన సీఎం చంద్రబాబు టీడీపీ సిండికేట్ దోపిడీకి రాచబాట పరిచారు. ప్రైవేటు మద్యం దుకాణాలను నెలకొల్పారు. టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించి టీడీపీ సిండికేట్‌కే అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసు యంత్రాంగంతో బెదిరించి అడ్డుకున్నారు. మాట వినకుంటే దాడులకు పురిగొల్పారు. తద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది. ప్రతి మద్యం దుకాణం పరిధిలో 4 నుంచి పది వరకు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఊరూవాడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.15, బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డగోలుగా దోపిడీకి తెర తీశారు. మద్యం విక్రయాల ద్వారా టీడీపీ సిండికేట్ ఏటా రూ.41,850 కోట్ల చొప్పున ఐదేళ్లలో 2.09 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నింది.పాలనా వైఫల్యాలు.. డైవర్షన్ రాజకీయాలుఆర్నెళ్ల పాలన అంతా వైఫల్యాల మయంగా మారడంతో డైవర్షన్ రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్‌లో రుషికొండ భవనాల పేరుతో బురద చల్లి మభ్యపుచ్చేందుకు యత్నించారు. ఆగస్టులో కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. సెప్టెంబర్‌లో ప్రకాశం బ్యారేజీని వైఎస్సార్సీపీ నేతలు బోట్లతో ఢీకొట్టి ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారంటూ ఏమార్చే కుతంత్రాన్ని రచించారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమలను రాజకీయాలకు వాడుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. అక్టోబర్‌లో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాలను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేశారు. నవంబర్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులపై కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియా కేసులు పెట్టారు. అమెరికాలో అదానీపై కేసుల వ్యవహారాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టి దుష్ప్రచారానికి కుట్ర పన్నారు. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేసి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు.ఇది అప్పుల కుప్ప ప్రభుత్వంసంపద సృష్టిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిరంతరం అప్పుల ఊబిలోకి దించుతున్నారు. ఇప్పటివరకు రూ.67,237 వేల కోట్ల మేర కొత్త అప్పులు చేసి రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చలేదు.ఉచితం అంటూ.. ఇసుక దోపిడీఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం యార్డుల్లో 80 లక్షల టన్నులను నిల్వ చేయగా కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రజాప్రతినిధులు మాయం చేశారు. 108 రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద అయిన వారికి అప్పగించేశారు. ఇసుక లేక నిర్మాణ రంగం స్తంభించి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు అల్లాడుతున్నారు. భూ సమస్యలు మళ్లీ మొదటికిల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ వివాదరహితంగా మార్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములపై ఆంక్షలు తొలగిస్తే ఇప్పుడు టీడీపీ మళ్లీ ఆంక్షలు పెట్టి రైతులను కష్టాల్లోకి నెడుతోంది. -
ఇది రైతుల పక్షాన నిలబడాల్సిన సమయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు లేక, గిట్టుబాటుధర అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు...అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, రైతులు సంయుక్తంగా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లీ, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి...ఇది రైతులకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వం ధాన్యం సేకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శాంతియుతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి కావాలని అనుమతులు నిరాకరించి, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తే, దానిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపడుతున్న ఈ కార్యక్రమంపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి వ్యక్తమవుతుంది. వైఎస్సార్సీపీ ఎంత బలంగా ఉందో, ప్రజా సమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడవుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ దీనిని విజయవంతం చేయాలి.ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులకు అండగా, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతుల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
అంతా వాళ్లే చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తోన్న దుష్ఫ్రచారంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తోందన్నారు.‘‘రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు?.. ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. కానీ, ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ వన్. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు?. అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: కూటమి చక్రం.. బాబు చేయిజారుతోందా?‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే దాన్ని పక్కనపెట్టాం. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించాం. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం. సార్టెక్స్ చేసిన మరీ ఇచ్చాం. రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని అడ్డుకుంది మనమే.కానీ, మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారు. సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వడం లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడం లేదు. దీని వల్ల మళ్లీ రేషన్ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ నీరుగారిపోయింది. రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. -
‘రైతులను ముంచేసిన కూటమి సర్కార్’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం.. ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయి. రైతుల కోసం బడ్జెట్లో ప్రస్తావించకుండా కూటమి సర్కార్ మోసం చేసింది. సూపర్ సిక్స్‌లో చెప్పిన పెట్టుబడి సాయం గురించి కూటమి నేతలు మాట్లాడటం లేదు. కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కకుండా చేస్తున్నారు’’అని అవినాష్ నిలదీశారు.దయనీయ స్థితిలో రైతులుతన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు కనీసం గోనె సంచులు కూడా అందించడం లేదని మండిపడ్డారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ ఉన్న వాహనాలు ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్ పట్టాలిచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. రైతులు దయనీయమైన స్థితిలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది’’ అని మండిపడ్డారు.రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపువిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కళ్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం రంగుమారిపోతున్నా కొనడం లేదు. రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతులను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని ఆమె ధ్వజమెత్తారు. -
చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే, చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైందని వ్యాఖ్యలు చేశారు.నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోంది. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అంతా వాళ్లే చేస్తున్నారు: వైఎస్ జగన్ బాబు బాదుడు షురూ..చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైంది. కరెంటు బిల్లులు చూస్తే షాక్‌లు తగులుతున్నాయి. రూ.15వేట కోట్లకుపైగా ఛార్జీలు పెంచాడు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్స్‌లు వేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సంపద సృష్టి అంటే.. బాదుడే బాదుడు. రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల. దాన్ని కట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ హాయాంలో దాదాపుగా పూర్తైంది.. షిప్‌లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఐదేళ్లలో నాలుగు పోర్టులు కట్టడం మొదలైంది. ఇప్పుడు వాటిని శనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు. మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టించాం. వీటిని పద్దతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడని మండిపడ్డారు. అలాగే, వెలిగొండ రెండు టన్నెల్స్ పూర్తి చేశాం. ఆర్ అండ్ అర్ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మనం అధికారంలో ఉండి ఉంటే అక్టోబరులో నీళ్లు నింపేవాళ్లం. అయిపోయిన ఈ ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. మార్కాపురంలో మనం మెడికల్ కాలేజీని దాదాపుగా పూర్తి చేశాం. ఇప్పుడు దీన్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే మనమంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే. ఈనెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం. కరెంటు ఛార్జీలపైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం జనవరి 3న కార్యక్రమం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.ఎల్లో మీడియాతో యుద్ధమే..చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడం లేదు. ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. ప్రతీ రోజూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద చల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలి. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలి’ అని సూచనలు చేశారు. -
అక్కడికి వచ్చే దమ్ముందా?.. సోమిరెడ్డికి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇదే సమయంలో సోమిరెడ్డి లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సోమిరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా?. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా?.సోమిరెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. తేదీ, సమయం చెబితే.. విజయ సాయిరెడ్డి, నేను వస్తాం.. ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా?. విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయింది’ అంటూ ఆరోపణలు చేశారు. -
కూటమి చక్రం.. బాబు చేయిజారుతోందా?
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీనపడుతున్నారా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోనూ బాబు స్థానాన్ని క్రమేపీ కుమారుడు లోకేష్ ఆక్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బాబును ఇరకాటంలో పెడుతున్నాయి.రాజ్యసభకు పార్టీ ఎంపికలు, పవన్ అన్న నాగబాబుకు మంత్రి పదవి వంటి నిర్ణయాలు ఆ ఇబ్బందికి నిదర్శనమంటున్నారు. టీడీపీకి రాజ్యసభలో అసలు బలం లేని నేపథ్యంలో ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన బాబు ఆ స్థానాలకు ఇతర పార్టీల వారికి కట్టబెట్టడం ఆయన పరిస్థితిని సూచిస్తోంది. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ తాను వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే.. అన్న నాగబాబుకు ముందు టీటీడీ ఛైర్మన్ పదవి ఆ తరువాత రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారని పలు వదంతులు వచ్చాయి. అయితే, లోకేష్ ఒత్తిడితో టీటీడీ ఛైర్మన్ పదవి కాస్తా టీవీ-5 ఛైర్మన్ బీఆర్.నాయుడికి దక్కిందని, రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ లోకేష్ తన మాట నెగ్గించుకున్నారని సమాచారం.ఇక, నాగబాబుకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి రహస్యమేమీ కాదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి ఆయన తన ఆసక్తిని పలు రూపాల్లో వ్యక్తం చేశారు కూడా. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత కూడా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రచారంలోనే ఉన్నారు ఆయన. సినిమాల్లో బాగా నష్టపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నను ఆదుకున్నట్లు చెబుతారు. కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు నాగబాబు ‘‘తాము పిలిచినా రాకపోతే ఏం చేయాలి’’ అని పవన్‌ను ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించినా.. తరువాతి కాలంలో ఆయనతోనే రాజకీయ పయనం సాగించడం గమనార్హం. ఇందులో భాగంగా 2019లో నరసాపురం నుంచి లోక్‌సభకు జనసేన తరఫున పోటీ చేసినా వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు ఆయన. తరువాతి కాలంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో నాగబాబు కూడా ఆయన వెంట నడిచారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని టాక్ వచ్చినా.. పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని బీజేపికి వదులుకోవాల్సి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంతోనే టీటీడీ ఛైర్మన్ ఆయనకు ఇప్పించేందుకు పవన్ ప్రయత్నించినా లోకేష్ ప్రాభవం ముందు నిలవలేకపోయారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ తన కుటుంబ సభ్యులకు పదవి అడగలేదని పవన్ చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ తరువాత రాజ్యసభ సీటైనా నాగబాబుకు ఇప్పించాలని పవన్ నానా ప్రయత్నాలూ చేశారు. బీజేపీ ఈ స్థానాన్ని ఆశించకపోతే అన్నకు దక్కుతుందన్న అంచనాతో ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మంతనాల వెనుక బాబు ఉండి ఉండవచ్చు. అయితే, బీజేపీ అనూహ్యంగా ఏపీ నుంచి ఒక సీటు ఆశించడంతో నాగబాబుకు మళ్లీ ఆశాభంగమైంది. మూడు రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీ ఒకటే తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంచనాతో నాగబాబును సీటు వదులుకోమని చంద్రబాబే నచ్చజెప్పి ఉండాలి. అదే సమయంలో పవన్ అసంతృప్తికి గురి కాకుండా మంత్రి పదవి ఆఫర్ చేసి ఉండవచ్చు.అయితే, దీనిపై టీడీపీ, జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఏర్పడింది. జనసేన కోసం పనిచేస్తున్న పలువురు నేతలను కాదని, సోదరుడి పదవి కోసం పవన్ పట్టు పట్టారన్న విషయం విమర్శలకు దారి తీసింది. జనసేన కూడా కుటుంబ పార్టీయేనని తేలిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ జనసేన నుంచి నలుగురు మంత్రులు ఉంటే ముగ్గురు కాపు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పదవులు వద్దంటూనే పవన్, నాగబాబులు వాటి కోసం పాకులాడారని భావిస్తున్నారు. పవన్‌కు ఆర్థికంగా అండదండలు అందించిన లింగమనేని రమేష్‌కు రాజ్యసభ స్థానం దక్కుతుందని కథనాలు వచ్చినా, పవన్, చంద్రబాబులిద్దరూ ఇప్పటికైతే మొగ్గు చూపలేదు.మరోవైపు.. టీడీపీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ తదితరులు రాజ్యసభ స్థానం ఆశించి భంగపడ్డారు. మంత్రిపదవి కూడా దక్కని నేపథ్యంలో యనమల చిరకాల వాంఛ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెను ఎక్కడంలో యనమలది కీలక భూమిక అన్నది తెలిసిందే. గతంలో స్పీకర్‌గా ఉండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం సులువైన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కంభంపాటి రామ్మోహన్ రావు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేస్తూ చంద్రబాబుకు ఉపయోగపడుతుంటారు. గతంలో ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండేవారు. మళ్లీ అదే పదవి అయినా ఇస్తారో, లేదో చూడాలి.2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఇచ్చినట్లే ఇచ్చి, చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకు కేటాయించారు. ఈసారి రామయ్య పేరును పరిశీలనకు తీసుకోలేదు. గల్లా జయదేవ్ కూడా ఆశించినా అవకాశం ఇవ్వలేదు. మరో నేత అశోక్ గజపతిరాజు ప్రస్తావన వచ్చినా, ఈ పోటీలో ఆయన వెనుకబడిపోయారు. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, లోకేష్‌కు సన్నిహితుడైన సానా సతీష్‌కు చెరో సీటు లభించింది. సానా సతీష్ కాకినాడ నుంచి జనసేన తరఫున లేదంటే టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ పదవి పొందారు. ఈయన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరపడంలో పేరు గాంచడంతోపాటు ఆర్థికంగా బలవంతుడు అవడం, అన్నిటికి మించి లోకేష్ అండదండలతో పదవి పొందారని అనుకోవాలి. బీదా మస్తాన్ రావు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే. నెల్లూరు జిల్లాలో రొయ్యల సీడ్ ప్లాంట్లు తదితర వ్యాపారాలు ఉన్నాయి.2019 ఎన్నికలలో టీడీపీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత వైఎస్సార్సీపీలో రాజ్యసభ సీటు సంపాదించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ అదే స్థానాన్ని టీడీపీ నుంచి పొందడం విశేషం. ఈయన సోదరుడు రవిచంద్ర కూడా లోకేష్ కు సన్నిహితుడుగా చెబుతారు. టీడీపీలో కాకలు తీరిన నేతలను కాదని, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఈయనకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తికి తావిచ్చారని చెప్పాలి. మరో సీటును బీజేపీకి కేటాయించారు. ఈ సీటు కూడా మొన్నటి వరకు వైఎస్సార్సీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారు. బీజేపీకి వేరే నేతలు ఎవరూ లేనట్లు తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు మళ్లీ ఇదే సీటు ఇవ్వడంపై ఆ పార్టీలోనే అసమ్మతి ఉంది.గతంలో ప్రధాని మోడీని అసలు బీసీ నాయకుడే కాదని, పలు విమర్శలు చేసిన కృష్ణయ్యకు ఈ పదవి ఇవ్వడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణయ్య తనకు సీటు ఇచ్చిన రోజునే బీజేపీలో చేరడం కొసమెరుపుగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలని ఇలా చేసి ఉండవచ్చని అంటున్నా, టీబీజేపీ నేతలు ఈయనపట్ల పెద్దగా ఆసక్తిగా లేరు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈయనకు విశేష ప్రాధాన్యం ఇచ్చి పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇస్తే ఇప్పుడు ఇలా చేశారు. రాజ్యసభ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులను టీడీపీ ఆకర్షించింది. వారిలో ఇద్దరు మళ్లీ టికెట్లు పొందితే, మరో నేత మోపిదేవి వెంకట రమణకు దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో చూడాలి. ఈ ఎంపికలకు సంబంధించి మరో విశేషం చెప్పుకోవాలి.చంద్రబాబుకు తానే ప్రధాన సలహాదారుడనని, టీడీపీ ప్రభుత్వం తనవల్లే నడుస్తోందని భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీవీ-5 యజమాని బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడాన్ని రాధాకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారట. అయినా లోకేష్ పట్టుబట్టి ఈ పదవి ఇప్పించడం ద్వారా రాధాకృష్ణకు ఝలక్ ఇచ్చారన్న విశ్లేషణలు వచ్చాయి. ఆ వార్తకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక తీరు కూడా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో అక్టోబర్‌లోనే సానా సతీష్‌కు వ్యతిరేకంగా రాధాకృష్ణ పెద్ద కథనం రాయించారు. అందులో సతీష్‌పై పలు ఆరోపణలు చేశారు. కాకపోతే సానా అన్న పదం బదులు చానా అని రాసి పరోక్షంగా రాసి హెడ్డింగ్ కూడా చానా ముదురు అని ఇస్తూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. లోకేష్ పేరుతో దందాలు చేస్తున్నారని, ఉత్తరాంధ్రలో మైనింగ్ తదితర రంగాలలో అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని, సీబీఐలో సైతం చిచ్చు పెట్టిన వ్యక్తి, అనేక స్కామ్‌లతో సంబంధం ఉన్నవాడని ఆంధ్రజ్యోతి రాసింది. అయినా లోకేష్ దానిని లెక్క చేయలేదు. తండ్రిపై ఒత్తిడి తెచ్చి సతీష్‌కే రాజ్యసభ పదవి ఇప్పించారు. రాధాకృష్ణను లోకేష్ నమ్ముతుండకపోవచ్చు. లేదా తన తండ్రి మాదిరి రాధాకృష్ణ బ్లాక్ మెయిలింగ్‌కు తాను లొంగనన్న సంకేతం ఇచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.అంతేకాక, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీని మోయడం తప్ప గత్యంతరం లేదని, అందువల్ల ఆయన మాటకు అంత విలువ ఇవ్వనవసరం లేదని భావించి ఉండవచ్చని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రతిసారీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో డబ్బు, సిఫారసులు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినా, నాటకీయత కోసమైనా టీడీపీ కోసం పని చేసేవారు ఒకరిద్దరికైనా ఈ పదవులు దక్కుతుండేవి. కానీ, ఈసారి అసలు పార్టీతో సంబంధం లేని ముగ్గురు ఈ పదవులు దక్కించుకున్నారు. తద్వారా టీడీపీపై కార్యకర్తలలో అపనమ్మకం ఏర్పడడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు చేతిలో నిర్ణయాధికారం పెద్దగా లేదన్న భావన కూడా ఏర్పడుతోంది.ఈ ఎంపికలపై వ్యతిరేకత ఉన్నా ఎల్లో మీడియా కూడా నోరు మూసుకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్లు కూటమి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంగా మారింది. తండ్రి, కొడుకులు చంద్రబాబు, లోకేష్, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులు మంత్రివర్గంలో ప్రముఖంగా ఉన్నారు. రెండు కుటుంబాల వారు ఇలా మంత్రివర్గంలో ఉండటం ఇదే ప్రథమం కావచ్చు. అటు కొడుకును కాదనలేక, ఇటు పవన్ కళ్యాణ్‌ను వదలుకోలేక, వారిద్దరి మధ్య అంతర్గత పెనుగులాటలో చంద్రబాబు బలహీనపడుతున్నారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నాదెండ్ల.. కొల్లిపర ఎక్కడో తెలుసా?: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పని తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పంట కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి ఏమైపోయారని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోళ్ళ పనితీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలో అంబటి ట్విట్టర్ వేదికగా..‘నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!. కొల్లిపర మండలంలో వరి సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు. ధాన్యం దిగుబడి 31వేల మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం కొన్న ధాన్యం 1500 మెట్రిక్ టన్నులు. ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర!’ అంటూ కామెంట్స్ చేశారు.నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!కొల్లిపర మండలం: వరి సాగు విస్తీర్ణం: 13,500 Acresధాన్యం దిగుబడి :31000 MTప్రభుత్వం కొన్న ధాన్యం : 1500 MTప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర !@ncbn @mnadendla— Ambati Rambabu (@AmbatiRambabu) December 10, 2024 -
ఏపీ కేబినెట్ విస్తరణ.. ఆ ఐదుగురికి ఉద్వాసన?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిత్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందనే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంతో ఈ పరిణామం తప్పదనేది ఆ వార్త సారాంశం. ఈ క్రమంలో ఇప్పుడున్న కేబినెట్లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే మరో ప్రచారం తీవ్రంగా నడుస్తోంది. కూటమికి చెందిన.. అదీ టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేతే ఈ ప్రచారం దగ్గరుండి చేయిస్తుండడం గమనార్హం.ఏపీలో కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందా? లేదంటే సంక్రాంతి తర్వాత అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. నాగబాబు కేబినెట్ ఎంట్రీ ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో ఐదుగురిని మారుస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి కేబినెట్లో ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఆ ఒక్కస్థానం అప్పగిస్తే సరిపోతుంది కదా?. కానీ, ఈ విషయంపై ఆ టీడీపీ పెద్ద ఏం చెబుతున్నారంటే.. ఇప్పుడు ఏపీ మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత పట్ల చంద్రబాబు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పనితీరు కూడా పెద్దగా బాగోలేదనే చంద్రబాబు అనుకుంటున్నారు. బోనస్‌గా.. హోం మంత్రి అనిత విషయంలోనూ పాజిటివ్నెస్ లేదు’’ అని ప్రచారం చేయిస్తున్నారు. ఆ టీడీపీ నేత చెప్పిన విషయాల గురించే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జోరుగా చర్చించుకుంటున్నాయి.ఇదిలా ఉంటే.. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన కూటమి సర్కారులో చిన్నపాటి చిచ్చు రాజేసింది. టీడీపీ నేతలు ఆ ప్రకటనతో రగిలిపోతున్నారు. అయితే చంద్రబాబు వాళ్ల ఆవేశాన్ని చల్లార్చినట్లు సమాచారం. తొలుత.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని, పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ఊహాగానాలు వినవచ్చాయి. అయితే.. ఢిల్లీ లెవల్లో జనసేన పప్రాతినిధ్యం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుంది. అందుకే ఆ మూడు సీట్లలో ఒకటి బీజేపీ.. రెండు టీడీపీకి ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ కేబినెట్లో నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి.. జనసేనలో పేరుకుపోయిన అసంతృప్తిని చంద్రబాబు చల్లాచర్చారు. -
‘సానా’కు శానా చేస్తున్నారు
సాక్షి, అమరావతి: మనీ లాండరింగ్, హవాలా కేసులు సహా సీబీఐనే వివాదంలోకి లాగిన చరిత్ర ఉన్న సానా సతీష్‌కు సీఎం చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాబీయింగ్, అవినీతి వ్యవహారాలతో అంటకాగే వ్యక్తికి కీలక పదవి ఇవ్వడం సరికాదంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో, వ్యక్తిగత సంభాషణల్లో విరుచుకుపడుతున్నారు. పార్టీ కోసం సుదీర్ఘ కాలం నుంచి పని చేసిన వారిని పట్టించుకోకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న సానా సతీష్‌కు ఉన్నత పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు పదవి ఇస్తున్నారని కొన్ని రోజుల క్రితమే తెలియడంతో చాలా మంది ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి తమ అసంతృప్తి వెలిబుచ్చారు. ఎంతో మంది సీనియర్లు ఉండగా, తీవ్ర స్థాయి ఆరోపణలున్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ లాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటని.. క్యాడర్‌కు, నాయకులకు ఏం సమాధానం చెప్పాలని అడిగినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో, అంతకు ముందు.. పార్టీకి భారీగా నిధులు ఇచ్చిన వారికి ఇప్పుడు న్యాయం చేయక తప్పదని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. లోకేశ్ పాదయాత్రలో సతీష్ లాంటి నేతలు చాలా ఉపయోగపడ్డారని, వారు డబ్బు ఖర్చు చేశారు కాబట్టే అధికారంలోకి వచ్చాక ప్రతిఫలం ఇస్తున్నామని స్పష్టం చేసినట్లు.. అంతటితో ఆగకుండా పార్టీలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు స్పందించిన తీరుతో సీనియర్ నాయకుల్లో ఇంకా ఆగ్రహం పెరిగిపోయింది. పార్టీ చంద్రబాబు చేతుల్లో లేదని, లోకేశ్ కోటరీ చేతుల్లో ఉందని చర్చించుకుంటున్నారు. లోకేశ్ కోటరీలో అత్యంత కీలకంగా ఉంటూ బదిలీలు, కాంట్రాక్టులు సహా అన్ని వ్యవహారాలను సానా సతీష్ చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పేరును రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ప్రకటించక తప్పలేదంటున్నారు.విస్తుగొలిపే తీవ్ర ఆరోపణలు ⇒ సానా సతీష్‌పై మనీ లాండరింగ్ అభియోగాలుండడంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ కేసులకు సంబంధించి 2019 జూలైలో ఆయన్ను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ⇒ మనీ లాండరింగ్, హవాలా కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మీట్ వ్యాపారి మొయిన్ ఖురేషీతో సతీష్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది. ఖురేషీతో కలిసి అక్రమ వ్యాపారాలు కూడా చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే తనపై ఉన్న మనీ లాండరింగ్ కేసుల నుంచి తప్పించుకునేందు ఖురేషీ ద్వారా సీబీఐ అధికారులకు సతీష్ లంచం ఇచ్చినట్లు స్పష్టమైంది. ⇒ అదే సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా పని చేసిన రాకేష్ ఆస్థానా, మరో సీబీఐ అధికారి అలోక్ వర్మ మధ్య చిచ్చుపెట్టి.. ఏకంగా సీబీఐనే వివాదంలోకి లాగిన చరిత్ర సతీష్‌ది. తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు స్పష్టమవడంతో ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.⇒ తనపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలంటూ ఈ ఏడాది జులైలో సానా సతీష్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని కోర్టు కొట్టివేసింది. ఇలా తీవ్ర స్థాయి ఆరోపణలున్న వ్యక్తిని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది.సబ్ ఇంజినీర్ నుంచి కోట్లకు పడగలెత్తి..⇒ కాకినాడకు చెందిన సానా సతీష్ మొదట్లో విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్‌గా పని చేశారు. ఉద్యోగం వదిలేశాక అక్రమ వ్యాపారాలతో కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్, హవాలా కేసులు నమోదయ్యాయి. అలాంటి వ్యక్తి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ⇒ అక్రమంగా సంపాదించిన డబ్బును ఖర్చు చేసి వారికి బాగా దగ్గరయ్యారు. లోకేశ్ పాదయాత్ర ఖర్చును చాలా వరకు సతీష్ భరించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో భారీగా డబ్బు సమకూర్చినట్లు తెలిసింది. చాలా వ్యవహారాల్లో లోకేశ్ వెన్నంటే ఉండి అన్నీ సమకూర్చినట్లు చెబుతున్నారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా అవతరించారు. ⇒ మంత్రి పదవులు, ఉన్నతాధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు, కాంట్రాక్టులు ఇతర అనేక వ్యవహారాల్లో ఆయన ప్రమేయం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవి ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా కాకలు తీరిన సీనియర్ నేతలను కాదని రాజ్యసభ సీటునే తన్నుకుపోయారు. -
రైతుల తరపున పోరాడతాం: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తామని చెప్పి మోసం చేసిందని, చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.‘అన్నదాతకు అండగా’ పేరుతో ఈ నెల 13 నుంచి వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను భూమన మంగళవారం(డిసెంబర్10) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తామని,వరికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలయినా రైతులను పట్టించుకోక పోవడం దారుణం.20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి, ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైఎస్సార్ చెబితే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు.రూ.86 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని 2014లో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఈనెల 13న తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు నేతలు ఆర్కే రోజా, అభినయ్,మోహిత్,రాజేష్,మధుసుధన్‌రెడ్డితో కలిసి నేను నిరసనలో పాల్గొంటా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పూతలపట్టు పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్,విజయానందారెడ్డి కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేపడతాం. డిస్కంల ఎదుట ఆందోళన చేస్తాం’అని భూమన తెలిపారు. -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం(డిసెంబర్10) ఏపీ హైకోర్టు విచారించింది. సజ్జల కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్పీ నేతలకు వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనపై 41ఏ నోటీసుకు వీలులేని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదీ చదవండి: బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం -
‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’..పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు. -
‘బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం’
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌తో పోరాడాల్సిన సమయం వచ్చిందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాపక్షాన నిలబడాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో రాజీ ప్రస్తావన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారాయన. మంగళవారం వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రజా పోరాట కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన వాళ్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదాం’ అని పార్టీ నేతలతో అన్నారు. 👉అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది.పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలను ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను.. వాళ్లకు అందకుండా చేశారు. ఇంటింటికే డెలివరీలాంటి వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలించారు. ఇదేకాదు..👉రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.ఈ పోరాట కార్యాచరణను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం ప్రకటించారు. ‘రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలి. రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల కరెంట్ భారం ప్రజలపై మోపింది. రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టనున్నాం.అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి వాళ్లకు అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం.👉మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ గట్టిగా తీర్మానం చేసింది. ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్నివర్గాల తరపున పోరాడుతూ.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందనే విషయం ఆ వర్గాలకు తెలియజేయాలి.👉రైతులకు అండగా వైఎస్సార్సీపీ అనే మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలి అని సజ్జల తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్‌పై ఒత్తిడి తేవాలి: బొత్స
సాక్షి, కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తాం’’ అని బొత్స తెలిపారు. -
లోకేష్ సన్నిహితుడు ‘సానా’ మామూలు ముదురు కాదు!
సాక్షి, గుంటూరు: నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్‌పై తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. హవాలా మనీలాండరింగ్ కేసులో సానా సతీష్ సీబీఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. సీబీఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు, హవాలా వ్యాపారి ఖురేషీతో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.ఖురేషీ చెందిన వ్యాపార సంస్థలో సానా సతీష్ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది. సీబీఐ డైరెక్టర్లుగా పనిచేసినా రాకేష్ ఆస్తానా, ఆలోక్‌వర్మ మధ్య వైరంలో సానా సతీష్ కీలక పాత్ర పోషించారు. తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు సానా సతీష్ చెప్పారు.2019 జులై 26న సానా సతీష్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. తనపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలంటూ జులైలో సానా సతీష్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సీబీఐ, ఈడీ ఆరోపణలపై సానా సతీష్‌ను విచారించాల్సిందేని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ శాఖలో చిన్న ఉద్యోగిగా ప్రారంభమై వేల కోట్ల వ్యాపారాలకు అధిపతిగా సానా సతీష్ ఎదిగారు. సానా సతీష్ రాజకీయ నేతలకు బీనామీగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: కూటమి @ ఫ్యామిలీ ప్యాక్కాగా, కూటమిలో రాజ్యసభ కుంపటి రగులుతోంది. అన్న నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుబట్టగా, తన అనుచరుడు సానా సతీష్ కోసం నారా లోకేష్ భీష్మించారు. లోకేష్ చెప్పిన సానా సతీష్ కే రాజ్యసభ సీటును చంద్రబాబు ప్రకటించారు. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు పత్రికా ప్రకటన చేశారు. మాట తప్పుతారన్న అనుమానంతో చంద్రబాబు చేత పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన ఇప్పించినట్లు తెలిసింది.రాజ్యసభకు నాగబాబు వెళితే ఢిల్లీలో బలం పెరుగుతుందని టీడీపీ అడ్డుకుంటోంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్‌లను ప్రకటించిన చంద్రబాబు.. మత్స్యకార మోపిదేవికి షాక్ ఇచ్చారు. చంద్రబాబు దెబ్బకి మత్స్యకారులు రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయారు. చంద్రబాబు రాజకీయంతో రాజ్యసభలో బీసీల సంఖ్య తగ్గింది. -
కూటమి @ ఫ్యామిలీ ప్యాక్
కూటమి సర్కారు ఫ్యామిలీ సర్కస్ మాదిరి మారింది. సర్కారులో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును సైతం కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి పార్టీలో అత్యంత కీలకమైనవ్యక్తులకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివాళ్లకు మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా చేస్తారు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పొంగూరు నారాయణ, లోకేష్ వంటివాళ్లకు మంత్రిగా స్థానం కల్పించారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ కేబినెట్లోనూ ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన చిక్కంతా కూటమిలో ఫ్యామిలీ ఫ్యాక్స్ ఎక్కవైనాయి అనేది చర్చకు వచ్చింది.కూటమి ధర్మం అంటూ చంద్రబాబు చేస్తున్న చేష్టలు దిగజారినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి తాజాగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మూడు సీట్లలో ఒకటి బిజెపి.. రెండు తెలుగుదేశం వాళ్ళు ఎగరేసుకుపోవడంతో నాగబాబుకు రాజ్యసభ ప్రాప్తం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సంతుష్టుణ్ణి చేసేందుకు కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మొదటినుంచీ కష్టపడినవాళ్లకు కాకుండా పైరవీకారులకు, డబ్బులు ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యం దక్కిందన్న మూతి విరుపులు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో నాగబాబు పాత్ర, పార్టీ నిర్వహణ .. ఆర్థికవ్యవహారాలు వంటి అంశాల్లో అయన వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం డబ్బులు కలెక్షన్ చేశారని. కార్యకర్తలను సాంతం వాడేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కావడం.. పైగా ఎలాగైనా చట్టసభకు వెళ్లాలన్న కోరిక నాగబాబుతో ఉండడంతో ఆయన్ను ఈవిధంగా సంతృప్తి పరుస్తున్నట్లు టీడీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామకృషుడు,, కిమిడి కళావెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు వంటివాళ్లకు మంత్రిపదవుల్లేక వట్టి ఎమ్మెల్యేలుగా జనాల్లోకి వెళ్లలేక అవమానభారం మోస్తుంటే ఇప్పుడు ఏమీలేని నాగబాబును ఎలా మంత్రిని చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే చంద్రబాబు.. అయన కుమారుడు లోకేష్ అధికారంలో ఉన్నారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు. అయన అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు (కేంద్ర మంత్రి)గా ఉన్నారు. అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులూ ఇప్పుడు ఆహామీల సంగతిపక్కనబెట్టి అధికారాన్ని పంచుకోవడంలో బిజీ అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.బాబు మాటలు.. నీటి మూటలునీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అనడమే కాకుండా ప్రతి వ్యక్తికీ ఒక పథకాన్ని ప్రకటించారు. అవేం అమలుకాకపోగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసారు . పైగా ఇప్పటికే 75 వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండుసార్లు పెంచి జనం నడ్డివిరగ్గొట్టారు. ఆ వైఫల్యాలను జనం ప్రస్తావించకుండా ఉండేందుకు ఒక నెల తిరుమల లడ్డులో కొవ్వు అంటూ.. ఇంకో నెల సోషల్ మీడియా అరెష్టులు.. ఇంకోసారి ఇంకేదో అంశాన్ని తెరమీదకు తెచ్చి జనం దృష్టిని మళ్లిస్తూ వస్తున్నారు.ఇదీ చదవండి: డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?ఫ్రీ ఇసుక లేకపోగా దాని ధర ఆకాశాన్ని అంటింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ రూపాయి ఉంటె అక్కడికి వాలిపోతున్నారు. ఇక పవన్ సైతం పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది.. ఏమి చేయలేకపోతున్నాం అని వగచారు. సంపద సృష్టిస్తాం అని చెప్పుకుని గెలిచాక ఈ చేతగాని ఏడుపులు ఎందుకు అంటూ ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే నాగబాబుకు మంత్రిపదవి అంటూ చంద్రబాబు సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు. మొత్తానికి కూటమి సర్కారు జల్సా చేస్తోంది తప్ప ప్రజలకు చేస్తున్నదేం లేదని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే జబర్దస్త్ కామెడీ మొత్తం కేబినెట్లోనే ఉంటుందని అంటున్నారు-సిమ్మాదిరప్పన్న -
ఏపీలో 427 ‘ఉద్యం సఖి’ లబ్ధిదారులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ‘ఉద్యం సఖి’ పథకం కింద 427 మంది లబ్ధిదారులున్నారని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సహాయ మంత్రి శోభ కరన్ ద్లాజే తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎంఎస్ఈలను స్థాపించిన మహిళలు ఈ ‘ఉద్యం సఖి’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆ పథకం లబ్ధిని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి శోభ కరన్ ద్లాజే పేర్కొన్నారు. ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు.. విశాఖపట్నంలో మార్కెటింగ్ టెర్మినల్ పునర్నిర్మించడానికి సవరించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సమీక్షించారని పెట్రోలియం, సహజవాయువులు సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. 2014 జూలైలో రూ.250కోట్ల అంచనాతో ప్రారంభించిన మార్కెటింగ్ టెర్మినల్ తొలగించిన విషయంపై రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని ప్రశి్నంచారు. 2014లో పునరుద్ధరణ ప్రతిపాదనకు రూ.247కోట్లు మంజూరు చేయగా..ఆ పనులు డ్రాప్ అయ్యాయని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా తెలిపారు. సౌభాగ్య పథకం కింద.. సౌభాగ్య పథకం కింద రాష్ట్రంలో 1,81,930 కుటుంబాలకు విద్యుత్తు అందించారని కేంద్ర విద్యుత్తు సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ తెలిపారు. రాజ్యసభలో సౌభాగ్య పథకం కింద ఎన్ని గ్రామాలకు విద్యుత్తు అందిస్తున్నారని ఎంపీ పరిమళ్నత్వాని అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. అర్సెనిక్ కాలుష్యం బారిన ఏపీలోని 7 జిల్లాలు.. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ కాలుష్యాన్ని 25 రాష్ట్రాల్లోని 230జిల్లాలు ఎదుర్కొంటున్నాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన మౌఖికంగా సమాధానమిచ్చారు. ఏపీలో ఏడు జిల్లాలున్నట్లు తెలిపారు. ఆర్సెనిక్ కాలుష్యం వలనే భూగర్భ జలాలు కలుíÙతం అవుతున్నట్లు సమాచారం ఉందని కేంద్ర మంత్రి వివరించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021–22 నుంచి 2023–24 మధ్య 1.27 కోట్ల మంది విద్యార్థులు సమగ్ర శిక్ష పథకం ద్వారా లబ్ధి పొందారని వైఎస్సార్సీపీ ఎంపీలు డాక్టర్ గుమ్మ తనూజరాణి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. అంతేగాక గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.867.60 కోట్ల వ్యయంతో 2,032 ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ల్యాబ్స్, 4,678 స్మార్ట్ తరగతులు ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. నెల్లూరు–చెన్నై హైవేని విస్తరించండి కలకత్తా–చెన్నై జాతీయ రహదారి–16 నెల్లూరు నుంచి చెన్నై వరకు రహదారిని 4–లైన్ నుంచి 6–లై¯Œన్గా మార్పు చేయాలని.. ప్రత్యేక అధికరణం 377 ద్వారా తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రస్తావించారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం ఓడరేవు, శ్రీ సిటీ, మేనకూరు వంటి పారిశ్రామిక ప్రాంతాలుండడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని ఎంపీ గుర్తు చేశారు. హైవే విస్తరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఏపీలో గత మూడేళ్లలో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద నిరర్ధక ఆస్తుల సంఖ్య ఏడాదికేడాదికి తగ్గిందని వైఎస్సార్సీపీ ఎంపీలు పీవీమిధున్ రెడ్డి, డాక్టర్ గుమ్మ తనూజరాణి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ( ఎస్ఎల్బీసీ)ప్రకారం, ఈ కేటగిరీ కింద ఎనీ్పఏలు 2021–22లో 16.09%, 2022–23 లో 11.52%, 2023–24లో 4.68% కి తగ్గాయని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.