లోకేష్‌ సన్నిహితుడు ‘సానా’ మామూలు ముదురు కాదు! | Serious Allegations Against Tdp Rajya Sabha Candidate Sana Satish | Sakshi
Sakshi News home page

లోకేష్‌ సన్నిహితుడు ‘సానా’ మామూలు ముదురు కాదు.. చాలా పెద్ద కథే!

Dec 10 2024 11:55 AM | Updated on Dec 10 2024 12:36 PM

Serious Allegations Against Tdp Rajya Sabha Candidate Sana Satish

సాక్షి, గుంటూరు: నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్‌పై తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. హవాలా మనీలాండరింగ్‌ కేసులో సానా సతీష్‌ సీబీఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. సీబీఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు, హవాలా వ్యాపారి ఖురేషీతో కలిసి సానా సతీష్‌ అక్రమ వ్యాపారాలు చేసినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

ఖురేషీ చెందిన వ్యాపార సంస్థలో సానా సతీష్‌ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది. సీబీఐ డైరెక్టర్లుగా పనిచేసినా రాకేష్‌ ఆస్తానా, ఆలోక్‌వర్మ మధ్య వైరంలో సానా సతీష్‌ కీలక పాత్ర పోషించారు. తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు సానా సతీష్‌ చెప్పారు.

2019  జులై 26న సానా సతీష్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. తనపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలంటూ జులైలో సానా సతీష్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సీబీఐ, ఈడీ ఆరోపణలపై సానా సతీష్‌ను విచారించాల్సిందేని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. విద్యుత్‌ శాఖలో చిన్న ఉద్యోగిగా ప్రారంభమై వేల కోట్ల వ్యాపారాలకు అధిపతిగా సానా సతీష్‌ ఎదిగారు. సానా సతీష్‌ రాజకీయ నేతలకు బీనామీగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: కూటమి @ ఫ్యామిలీ ప్యాక్‌

కాగా, కూటమిలో రాజ్యసభ కుంపటి రగులుతోంది.  అన్న నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుబట్టగా, తన అనుచరుడు సానా సతీష్ కోసం నారా లోకేష్ భీష్మించారు. లోకేష్ చెప్పిన సానా సతీష్ కే రాజ్యసభ సీటును చంద్రబాబు ప్రకటించారు. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు పత్రికా ప్రకటన చేశారు. మాట తప్పుతారన్న అనుమానంతో చంద్రబాబు చేత పవన్‌ కల్యాణ్‌ పత్రికా ప్రకటన ఇప్పించినట్లు తెలిసింది.

రాజ్యసభకు నాగబాబు వెళితే ఢిల్లీలో బలం పెరుగుతుందని టీడీపీ అడ్డుకుంటోంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్‌లను ప్రకటించిన చంద్రబాబు.. మత్స్యకార మోపిదేవికి షాక్ ఇచ్చారు. చంద్రబాబు దెబ్బకి మత్స్యకారులు రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయారు. చంద్రబాబు రాజకీయంతో రాజ్యసభలో బీసీల సంఖ్య తగ్గింది.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement