breaking news
-
కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్ గిరగిర
సాక్షి నెట్వర్క్: అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్ ఎంపీపీ రెబల్) వైఎస్సార్సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. దౌర్జన్యకాండ.. వైఎస్సార్ జిల్లా గోపవరంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ జెడ్పీ పీఠంపై ఫ్యాన్ రెపరెపలు వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాడులకు తెగబడ్డ టీడీపీ శ్రేణులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. రెండు కార్లలో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా, గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారు వద్దకు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చేరుకున్నారు. కానీ మిగిలిన వార్డు సభ్యులు కారులోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు కారు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వాహన డ్రైవర్‌తో పాటు వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, తోట మహేశ్వరరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, చీమల రాజశేఖరరెడ్డి, గంటా వెంకటేశ్వర్లు, బొగ్గుల సుబ్బారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎన్నిక జరుగుతున్న కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి కోరం తప్పకుండా ఉండాలని చెప్పడంతో టీడీపీ నాయకులు 10వ వార్డు మెంబర్ కందుల బీబీ, 9వ వార్డు మెంబర్ షేక్ ఖాదర్ బాషా, 4వ వార్డు మెంబర్ కేశవ స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులతో కొత్త వ్యక్తులను వార్డు సభ్యులు అని చెప్పి కార్యాలయంలోకి పంపారు. విచారణలో వారు వార్డు సభ్యులు కాదని నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చేందుకు కారులో ఉన్న వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ప్రయతి్నంచగా టీడీపీ నాయకులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. ఖాజీపేట ఉప మండలాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ (రెబల్) అభ్యర్థి ముమ్మడి స్వప్న విజయం సాధించారు. రాయచోటి రూరల్ మండల ఉపాధ్యక్షురాలు–2గా వైఎస్సార్ సీపీకి చెందిన శిబ్యాల ఎంపీటీసీ సభ్యురాలు నాగ సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్ప్రకాశం జిల్లాలో గురువారం రెండు ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్, నాలుగు ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండు ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుడిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మిదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీగా లింగంగుంట్ల రాములు, యర్రగొండపాలెం కో–ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాధిక్లు వైఎస్సార్సీపీ తరుఫున ఎన్నికయ్యారు. సృజన, కృష్ణలతో ఎంపీపీ సుబ్బమ్మ త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. చేయిదించమని గట్టిగా అరుస్తూ గద్దించినా సృజన చలించలేదు. దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యుడు పి.కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతిచ్చారు. ఫలితంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. పుల్లలచెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ కుయుక్తులు పన్నింది. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.జగనన్న పార్టీకే జై ‘మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే ఉంటానని మాట ఇచ్చాను. నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగనన్న అభిమానిని. ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచా. కొంత మంది నన్ను మభ్య పెట్టాలని చూశారు. మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చారు. – ఎం.సృజన, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం–2 ఎంపీటీసీ సభ్యురాలుధీరనారి... నాగేంద్రమ్మప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైస్ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా, భార్య మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోని పుట్టింటికి వెళ్లింది. పుల్లల చెరువు మండలం ముటుకుల విద్యుత్ సబ్ స్టేషన్లో పోలయ్య నైట్ వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య వి.నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు. మండల వైస్ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. చేసేదిలేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ పోటీలో ఉన్న రాములుకు మద్దతుగా చేయి ఎత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటునుంచి అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు.రామగిరిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీల అడ్డగింతశ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చిల్లర రాజకీయం చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ప్రలోభాలకు గురిచేసే యత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని భావించారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. కంబదూరు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవితో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీ తలారి రంగయ్య రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ క్రమంలో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేకపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఒక్కరే ఉన్నారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీలోకి లాక్కున్నారు. ముగ్గురూ పురుషులే కావడంతో టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థి కూడా లేరు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ఆరుగురు రామగిరికి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరికి తామే తీసుకెళ్తామని, మిగతా వాళ్లు రాకూడదని చెప్పారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరిందని.. ఎన్నికను మరుసటి రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. దీంతో మార్గం మధ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌కు వీడియో కాల్ కలిపారు. డబ్బులు, పదవులు ఆశ చూపి.. పార్టీ మారాలని వారు కోరగా.. వైఎస్సార్సీపీ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉందని.. వాంతి వస్తోందని పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వాహనం నుంచి కిందకు దిగారు. వెనుకే వస్తున్న టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా వారి వాహనం ఎక్కించుకుని ఉడాయించారు. మిగిలిన ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను కర్ణాటక సరిహద్దు వరకు పోలీసులు వదిలివచ్చారు. కాగా, కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోన్న ఎస్ఐ మొన్నటి వరకు సెలవులో ఉన్న రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం దేనికి? బందోబస్తులో భాగంగా రామగిరిలో డ్యూటీ ముగించుకుని వెంటనే.. ప్రత్యేక వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యుల వెంట వెళ్లడం.. పరిటాల సునీత, శ్రీరామ్‌తో వీడియో కాల్స్ మాట్లాడించి.. బెదిరింపులకు దిగడం సబబు కాదు. రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రవర్తించాడు. గత ఎన్నికల్లోనూ ఆయన అనంతపురం జిల్లాలో టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనంఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్‌ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. నందిగామ పీఠం వైఎస్సార్సీపీదే ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిడ్నాప్ చేసి దక్కించుకున్న టీడీపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్సార్ సీపీ, ఒక్కరు టీడీపీ. వారిలో గ్రంధశిరి ఎంపీటీసీ సభ్యుడు చిలకా జ్ఞానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 16 మందితో ఎన్నిక నిర్వహించవలసి ఉంది. అయితే బుధవారం పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తొమ్మిది మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వారికి పచ్చ కుండువాలు కప్పి బలవంతంగా ఎన్నికకు తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా భూక్యా స్వర్ణమ్మ భాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో ఎన్నిక బాయ్‌కాట్ నరసరరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేదన్న కారణంతో ఆగిపోయింది. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను అన్ని స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇందులో గతంలో వైస్ ఎంపీపీగా గెలిచిన యాంపాటి లక్ష్మీ మరణించడంతో గురువారం ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి ఎంపీపీ భర్త మూరబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ తన్నీరు శ్రీనిసవారావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామిరెడ్డిలను పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు అపహరించారు. దీనికి నిరసనగా ఎన్నికలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పాల్గొనలేదు. విడవలూరులో ఏకపక్షంగా ఎన్నిక నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ 12, సీపీఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగదర్తిలో వాయిదా వేశారు. విశాఖలో వైఎస్సార్సీపీకి నాలుగుఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైఎస్ ఎంపీపీ, ఒక కోఆప్షన్ మెంబర్‌కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైఎస్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.సీఎం సొంత జిల్లాలో టీడీపీ అరాచకం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎనిమిది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్‌కృష్ణ మండల పరిషత్ కార్యాలయానికి బయలు దేరారు. వీరి వాహనాన్ని టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్రపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్‌లో అడ్డుకున్నారు. ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనుక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. మరి కొన్నిచోట్ల చెట్లను నరికి రోడ్డుకు అడ్డుగా వేశారు. అడ్డుగా ఉన్న వాహనాలు, చెట్లను తొలగించుకుంటూ రామకుప్పం మండల పరిషత్ కార్యాలయం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ లోపు టీడీపీ ఆరుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరచిన సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరచిన వెంకట్రామయ్య గౌడ్ గెలుపొందారు. ఆ మూడు మండల పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోకే.. తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడిగా మూలం చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్ అధ్యక్షురాలిగా మాధవి, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్సుందర్రాయల్ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులే. చిత్తూరు జిల్లా విజయపురం మండల ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ బలపరిచిన కన్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో–ఆప్షన్ సభ్యురాలిగా వైఎస్సార్సీపీ బలపరచిన నసీమా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్‌గా టీడీపీ బలపరచిన వెంకటరమణ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. భయపెట్టినా..నిలబడ్డారు నామమాత్రపు బలం లేకపోయినా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. పిట్టలవానిపాలెం ఎంపీపీ పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు సయ్యద్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, రేపల్లె మండలం పేటేరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు శ్రీదేవి ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. పశ్చిమగోదావరిలో ప్రజాస్వామ్యం ఖూనీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చమూకలు రెచి్చపోయాయి. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ గల్ఫ్‌లో ఉండగా, ప్రస్తుతం వైఎస్సార్సీపీకి 13, కూటమికి ఆరుగురు సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఐదుగురు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి ఉదయం 13 మంది సభ్యులు బయలుదేరుతుండగా అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు ఇంటిని చుట్టుముట్టారు. రోడ్డుకు మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి దమ్ముంటే తీసుకువెళ్లమంటూ గొడవకు దిగారు. ఒకానొక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి నివాసంలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వచి్చంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక వాయిదా వేసినట్టు సమాచారం అందాక కూటమి శ్రేణులు కారుమూరి నివాసం నుంచి వెళ్లారు.యలమంచిలిలో హైడ్రామాకూటమి హైడ్రామా నడుమ యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు కాగా, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే కావాల్సి ఉంది. తమకు ఓటేయాలని వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును కూటమి నేతలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తున్న స్థానిక జర్నలిస్ట్ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబదారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన తొమ్మిది మంది మాత్రమే ఎన్నికకు హాజరుకావడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. -
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ కేడర్ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్సార్సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. వాస్తవానికి ఆ 53 పదవులూ గతంలో వైఎస్సార్‌సీపీవే. అయితే, పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. రెడ్‌బుక్ అమలు చేసి గెలవటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్సీపీ కేడర్ నిలిచింది. దీంతో టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి.కోరం లేక 10 చోట్ల ఎన్నికలు వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కేడర్ పోరాట స్పూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పది నెలల్లోనే మోసకారి ప్రభుత్వంపై ఇది తిరుగుబాటుగా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. హైకమాండ్‌కు కొలికపూడి అల్టిమేటం
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌రావు వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం రచ్చకెక్కింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.గిరిజన మహిళ పట్ల కేశినేని చిన్ని అనుచరుడు రమేష్‌రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడు. రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఎంపీ అడ్డుకుంటున్నారు. 48 గంటల్లో రమేష్‌రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. -
‘మా ఎంపీటీసీల బస్సును అడుగడుగునా అడ్డగించారు’
కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఎంపీటీసీలను ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోకి ఆడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో భాగంగా కుప్పంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును భరత్ ఎండగట్టారు.‘పోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారు. మా ఎంపీటీసీలు వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలను బెదిరించారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఏం జరుగుతుందో అందరూ చూశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు మాపై దాడి కూడా చేయాలని కుట్ర చేశారు. ఈ ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. కోరం లేకుండా ఎంపీపీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని భరత్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు ఒకసారి కుప్పం వైపు చూడండిప్రజాస్వామ్య వాదులుగా చెప్పుకుంటున్న వారు ఒకసారి కుప్పం వైపు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు\ చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. ‘కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారు. కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యంను ఖూనీ చేశారు. టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది’ అని మండిపడ్డారు గోవిందప్ప.ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదుఈ తరహా ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. జరగలేదన్నారు రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి,. ‘ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీలు అందరినీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మాపై కేసులు పెడతాం అని బెదిరించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం’ అని రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి స్పష్టం చేశారు. -
‘అబద్ధాల్లో అందరి కంటే పెద్ద.. నిజాల్లో అందరి కంటే చిన్న’
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి గుంటూరు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరం వెళ్ళారని,. చంద్రబాబు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుందని ఆయన అనుకూల పత్రికలు రాసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్ పై బురుద జల్లుతున్నారు. 2019లో మళ్లీ మేము అధికారంలోకి వచ్చినట్లయితే 2020- 21లో పోలవరాన్ని పూర్తిచేసే వాళ్ళమని ఆయన చెప్పటం విడ్డూరంగా ఉంది. అసలు పోలవరాన్ని సర్వనాశనం చేసింది విధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా నడిచాయి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పటంలో అందరికన్నా పెద్దవాడు. నిజాలు చెప్పటంలో అందరికన్నా చిన్నవాడు. జగన్ పాలనలో పోలవరం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళించారని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్ళించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. పోలవరం నిర్మాణ సమయంలో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ఏంటో తెలుసా?, ముందు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది ఆ డబ్బులను కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. అలాంటప్పుడు నిధులు మళ్ళించడం ఎలా సాధ్యమవుతుంది?, పోలవరం రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోలవరానికి అన్ని అనుమతులు తీసుకువచ్చారు. అసలు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు మేమే కడతావని ఎందుకు ఒప్పందం చేసుకున్నారు’? అని అంబటి ప్రశించారు. -
పార్లమెంట్లో చంద్రబాబు ఐటీ నోటీసుల కేసు ప్రస్తావన
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గతంలో దాఖలైన ఐటీ నోటీసుల కేసు(IT Notices Case) ప్రస్తావన ఇవాళ పార్లమెంట్లో వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ఎంత దాకా వచ్చిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖను గురువారం ఆరా తీశారు. ఫైనాన్స్ బిల్లు పై చర్చ సందర్భంగా ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక పాయింట్లను ప్రస్తావించారు. చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్లు సృష్టించారు. బోగస్ ఇన్వాయిస్ల ద్వారా రూ.2,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం ప్రాజెక్టుల నుంచి కొల్లగొట్టిన డబ్బును చంద్రబాబుకు అందజేశారని ఐటీ సోదాలలో మనోజ్ వాస్తవ అనే వ్యక్తి అంగీకరించాడు. ఈ డబ్బును పీఎస్ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా అందించినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత అతను అమెరికాకు పారిపోయాడు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. మరి ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?. ఈ కేసుపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కేంద్రాన్ని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటోంది. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు. వైఎస్సార్ దీనికి శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల.. స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పునరుద్ధరణకు అవసరమైన నిధులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాట్ ను పరిరక్షించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి అని వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. -
‘ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది’
తాడేపల్లి : కూటమి నేతల అరాచకాలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడ్డదోవలో పదవులను దక్కించుకునేందుకు కూటమి పార్టీలు అత్యంత నీచమైన దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బలం లేకపోయినా బెదిరింపులు, కేసులతో, వేధింపులతో ఏదో ఒక విధంగా పదవులను చేజిక్కించుకునేందుకు కుటిల రాజకీయంతో బరితెగించారని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా దానిలో ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలనే తలంపుతో రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తూ కూటమి పార్టీలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజాస్వామికవాదులు సిగ్గు పడుతున్నారు. ఏపీలో ప్రజాస్వామిక విలువలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార కూటమి పార్టీలు పదవులను దక్కరించుకునేందుకు అడ్డదోవలు తొక్కుతున్నాయి. పదవుల్లో పోటీకి సిద్దమైన వారిని భయపెట్టి, కేసులతో వేధింపులకు పాల్పడుతూ వారిని పోటీకి దూరంగా ఉంచుతున్నాయి. నాలుగుసార్లు సీఎంగా ఉండి, రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నిస్సిగ్గుగా ఇలా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీలో చేరాలంటే ప్రస్తుతం వారు ఉన్న పార్టీకి, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే పదవులకు రాజీనామా చేసిన తరువాతే రావాలంటూ చాలాసార్లు చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. కానీ వాస్తవం చూస్తూ ఫిరాయింపు రాజకీయాలు, అడ్డదోవలో బెదిరించి, కేసులు పెట్టి మరీ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా పదవులను చేజిక్కించుకుంటున్న కుటిల రాజకీయం కనిపిస్తోంది. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేవి స్థానికసంస్ధలకు చెందినవి. వాటిల్లో గెలపు ఓటముల వల్ల రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం ఉండదు. అయినా కూడా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఇటువంటి చిన్నచిన్న పదవులను కూడా అప్రజాస్వామికంగా దక్కించుకునే ప్రయత్నం చేయడం దారుణం. కూటమి బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదుకూటమి పార్టీల బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా చంద్రబాబు నిలబెట్టారు? ఈ రోజు జరిగిన ఉప ఎన్నికల బలాబలాలను చూస్తే రాజంపేట, అత్తిలి, ఏలూరు రూరల్, నరసరావుపేట, దగదర్తి, రాప్తాడు, రామకుప్పం ఇలా ప్రతిచోటా వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ చంద్రబాబు అన్నిచోట్లా అభ్యర్ధులను నిలబెట్టి, వైఎస్సార్సీపీ వారిని బెదిరించి మరీ పదవులను చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. యాబై ఒక్క చోట్ల ఎన్నికలు జరిగితే 30 చోట్లకు పైగా వైఎస్సార్సీపీ అన్ని ఒత్తిళ్ళను అధిగమించి పదవులను గెలుచుకున్నాయి. టీడీపీ 11, జనసేన ఒక చోట మాత్రమే గెలిచాయి. మరో పదిచోట్ల ఎన్నికలను వాయిదా వేయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత బలవంతం చేసినా, బెదిరించినా, భయపెట్టినా కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు మొక్కవోని పట్టుదలతో తమ బలాన్ని ప్రదర్శించి పదవులను కాపాడుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా వ్యవహరించారు. భయపెట్టి, బెదిరింపులతో అధికారంను చేజిక్కించుకోవాలనుకునే కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం నేర్పడానికి సిద్దంగా ఉన్నారు.ఎన్నిక నిలుపుదలకు టీడీపీ కుట్రలువైఎస్స్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు.వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసంకూటమి కుట్రలు పటాపంచలు.. ఈ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం -
మోదీ అంటే భయమా.. దక్షిణాదిపై స్పందనేది బాబు?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలలో కాక పుట్టిస్తోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 14 రాజకీయ పార్టీల నేతల సమావేశం ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గట్టిగానే చెప్పగలిగింది. ఈ సమావేశానికి హాజరు కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కూడా తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ కాపీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు.తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ అంశం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, ఇంకా చర్చ జరగలేదని చెబుతుంటే మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం చెన్నై సమావేశాన్ని దొంగల భేటీగా పోల్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంజయ్ ఇప్పటికీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై మాట్లాడడానికి నోరు పెగులుతున్నట్లు లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అనుకోవడం లేదని చెబుతున్నారు. వీరిద్దరు బీజేపీతో కూటమి కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.గతంలో చంద్రబాబు నాయుడు తను కూటమిలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోబోనని కనీసం కబుర్లయినా చెప్పేవారు. ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయలేకపోవడం గమనార్హం. పాతికేళ్లపాటు పునర్విభజన వద్దని చెన్నై భేటీలో పాల్గొన్న నేతలు కోరారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వచ్చే సమస్యకు జగన్ తన లేఖ ద్వారా పరిష్కార మార్గాలు వివరించారు. పాతికేళ్ల నిషేధమన్న డిమాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పాతికేళ్లలో ఉత్తరాది జనాభా మరింత పెరగదని ఈ నేతలు గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇప్పుడే పునర్విభజన వ్యవహారానికి ఒక పద్దతైన పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పక తప్పదు.వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న వాటాను యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయి. ఇదే ఉద్దేశం చెన్నై భేటీలో పాల్గొన్న నేతలందరికీ ఉన్నప్పటికీ, వారి తక్షణ డిమాండ్ మాత్రం పునర్విభజన వద్దన్నది కావడం గమనార్హం. అయితే, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నియోజకవర్గాలు పెరగకపోతే ఎన్నికైన ఎంపీలకు అవి అలవికానివిగా మారతాయి. ఉదాహరణకు ఇప్పుడు 17 లక్షల నుంచి 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, అది పాతిక లక్షలకు ఒక నియోజకవర్గంగా మారవచ్చు. అదే సమయంలో ఏ రాష్ట్రానికి దీనివల్ల నష్టం జరగకూడదన్నది అంతా ఒప్పుకోవాలి.ఈ సమస్యకు ప్రధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ సరిగా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా పెరుగుదలను నియంత్రించడం. దీనివల్ల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిస్తే ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో కొత్త నియోజకవర్గాలు భారీ ఎత్తున వస్తాయి. దక్షిణాదిలో మాత్రం ఆ స్థాయిలో పెరగవు సరికదా కేరళ వంటి చోట్ల నియోజకవర్గాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రం ఎంపీలు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి కేంద్రానికి వస్తుంది. యూపీతోపాటు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొద్ది రాష్ట్రాలే దేశాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. ఈ పరిణామం ఒకరకంగా నియంతృత్వ ధోరణికి దారి తీయవచ్చన్నది దక్షిణాది రాష్ట్రాల నేతల భయం.జనాభా ప్రాతిపదికన పునర్విభజన రాజకీయ నేతలకే కాదు.. దక్షిణాది ప్రజలకు కూడా నష్టం కలిగించే అంశమే. నిధుల పంపిణీ వంటి వాటిలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంటే, ఉత్తరాదికి అధిక వాటా వెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, యూపీ నుంచి కేంద్రానికి అందే రూపాయి పన్ను అందితే, తిరిగి ఆ రాష్ట్రానికి 2.73 రూపాయలు వెళుతున్నాయని తెలిపారు. బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయలకు పైగా నిధులు వెళుతుంటే తమిళనాడుకు 29పైసలు, కర్ణాటకకు 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 66 పైసల వాటా మాత్రమే నిధులు వస్తున్నాయని వివరించారు. ఈ వివక్షతో పాటు ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గితే ఉత్తరాది, దక్షిణాది అంతరం బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దేశ సమగ్రత భావానికి ఇది విఘాతం కలిగిస్తుంది. అనవసరమైన అపోహలకు దారి తీస్తుంది.కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఉత్తరాదిన నియోజకవర్గాలు పెరిగితే బీజేపీ లబ్ది పొందుతుందని, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెన్నై సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ది పథంలో వెళుతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండరాదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.వైఎస్ అధినేత జగన్ మాత్రం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా దామాషా పద్దతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయించాలని, తదానుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయాలని ప్రతిపాదించారు. చెన్నై భేటీలో తమిళనాడు, కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కూడా హాజరు కావడం విశేషం. పంజాబ్‌లోని పరిస్థితులు, ఐఎన్డీఏతో ఉన్న సంబంధాల రీత్యా హాజరై ఉండవచ్చు. నవీన్ పట్నాయక్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలు తెలియచేశారు. తదుపరి భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భేటీకి ప్రధాన ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ ఎంతవరకు హాజరు అవుతుందన్నది సందేహమే. ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి పక్షాలు పాల్గొన్న సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లడంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శలు చేస్తుంది. ఒడిషా నుంచి బీజేడీ నేతలు హైదరాబాద్ వస్తారా? రారా? అన్నది చెప్పలేం. ఎటుతిరిగి డీఎంకే, వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసే ఉంటున్నాయి కనుక వారికి ఇబ్బంది ఉండదు. ఇక వైఎస్సార్సీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించి భేటీకి వెళ్లకుండా, అలాగని తన అభిప్రాయాలు దాచుకోకుండా ప్రధానమంత్రికే ఏకంగా లెటర్ రాశారు. దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరగరాదని ఆయన డిమాండ్ చేసినట్లయింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి పక్షాలు అధికంగా ఉన్న భేటీకి ఆయన హాజరు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతవరకు వైఎస్సార్సీపీ అటు ఎన్డీయే వైపుకానీ, ఇటు ఇండియాకూటమివైపు కానీ ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేనలు మాత్రం దీనిపై మాట్లాడలేకపోతున్నాయి. సాధారణంగా అయితే గతంలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తే పొత్తుల గురించి పట్టించుకోకుండా మాట్లాడతానని చంద్రబాబు అనేవారు. గుజరాత్ మత కలహాల అంశంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి ఓటింగ్ సమయానికి జారి పోయినప్పటికీ, కొన్నిసార్లు అయినా మాట్లాడేవారు. అలాగే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ యూపీ, బీహార్ రాష్ట్రాలకు అధిక వాటాలో కేంద్రం నుంచి నిధుల వెళ్లే తీరుతెన్నులపై గతంలో ధ్వజమెత్తేవారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మైనార్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని మాట వరుసకైనా అనేవారు. కానీ, ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అంటే ఏం భయమో తెలియదు కానీ.. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం స్పందించడం లేదు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా, మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఆయనకు దీనిపై పెద్దగా అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ, తానే మోదీని ఎదిరించగలనని గతంలో చెప్పుకున్న చంద్రబాబు వంటి సీనియర్ నేత, ఇప్పుడు ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో ఇంత నష్టం జరుగుతుంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయ లేకపోవడం ఆయన ఎంతగా బలహీనపడ్డారో తెలియ చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి కుట్రలు పటాపంచలు.. ఈ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, ప్రకాశం జిల్లా: త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు ఎదురైంది. త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. అక్రమ కేసులతో భయపెట్టినా వైఎస్సార్సీపీకే ఎంపీటీసీలు పట్టం కట్టారు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసినా త్రిపురాంతకం-2 ఎంపీటీసీ సృజన లొంగలేదు. ఎన్నికల హాలులోనే సృజనపై టిడిపి ఎంపీటీసీలు దాడికి కూడా యత్నించారు. సృజనా ఎత్తిన చేయిని బలవంతగా దించివేయడానికి కూటమి అభ్యర్థి చల్లా జ్యోతి ప్రయత్నించింది.మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలలో వైఎస్సార్ సీపీ గెలిచింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రలోభాలు పెట్టినా... వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు మాత్రం వారి ఒత్తిడి కి తలొగ్గలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హైడ్రామా మధ్య మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఐదు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి.కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు ఎంపీపీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్ష్మి దేవి విజయం సాధించారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగమ్మ గెలుపొందారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ ఎంపీపీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వండ్రయ్య విజయం సాధించారు.వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా మెజారిటీ ఎంపీటీసీలు చేతులెత్తడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలు.. బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ ఎమ్మీటీసీలు లొంగలేదు. కోరం ఉన్నా సంతకాలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేయడం, సమయం పూర్తి కావడంతో గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు.రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడంతో సమయానికి సభ్యులు రాక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సారసీపీ విజయం సీఎం చంద్రబాబబుకు చెంపపెట్టు అని శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ స్పష్టం చేశారు.తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మూలం చంద్రమౌళిరెడ్డి గెలుపొందారు. ఆయనకు 33 మంది వైఎస్సార్సీపీ సభ్యులు మద్దతునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రుత్తుల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలం లేకపోవడంతో టీడీపీ ఎంపీటీసీలు పోటీకి దూరంగా ఉన్నారు. మాడుగుల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్. రాయవరం మండల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలం ఎంపీపీగా చింతల భూలోక లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
‘వివేకా కేసు.. రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు?’
సాక్షి, వైఎస్సార్: సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్టు చేసి, వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వివేకా హత్య ఉదంతం టీవీ సీరియల్‌ను తలపిస్తోందన్నారు. ఆయన కేసులో.. అసలు రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వివేకా హత్య ఉదంతం జరిగి ఐదేళ్లు గడుస్తున్నా నిన్న కాక మొన్న జరిగినట్లే పచ్చ పత్రికలు రాస్తున్నాయి. వాళ్ళకి వివేకాపై ప్రేమ లేనే లేదు.. ప్రజాస్వామ్యం కోసం అంటే అదీ కాదు. సొంత తమ్ముడు రాంమూర్తినాయిడిపైనే చంద్రబాబుకు ప్రేమ లేదు. అయినా మీరు వండి వారుస్తూనే ఉన్నారు. ఒకే ఒక కారణం.. వివేకా రక్తాన్ని జగన్ చొక్కాకి రాయాలని చూస్తున్నారు. రక్తం మాదే.. చొక్కా మాదే.. వీళ్ళ రాతలకు అడ్డే లేదుమా ఎంపీ అవినాష్ రెడ్డిని బలిపశువును చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఐదు ఏళ్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, పచ్చ మీడియా.. వారి కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేసి మానసిక వేదనకు గురిచేశారు. అవినాష్ రెడ్డికి హత్యలో ఏమాత్రం సంబంధం లేదని మేము ఎన్నో సార్లు చెప్పాం. ప్రజలని నమ్మించి..వారిపై ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం పచ్చ పత్రికల నుంచి వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు.హత్య అనే సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ కూడా వస్తే దాంట్లో ఒక సన్నివేశాన్ని షేర్ చేసిన వారిపై కేసు. నేను ఎన్టీఆర్ సినిమా క్లిప్ పెట్టినా చంద్రబాబుకు తప్పుగా కనిపిస్తుంది. సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్టు చేసి కొట్టే వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది.పెన్ను,పేపర్ ఉందని.. ఒక బాధితుడు వైఎస్ జగన్‌ను కలిస్తే దానిపై కూడా గూడు పుటానీ అని రాస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి సునీల్ ఫిర్యాదు చేస్తే పవన్‌ను అరెస్టు చేశారు. సునీల్ కుమార్ యాదవ్ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు.. ఇదెక్కడి న్యాయం?. ఈ నిందితులు కోట్లకు పడగలెత్తారంటే.. ఆ డబ్బు సునీత ఇచ్చిందా..? చంద్రబాబు ఇచ్చాడా?.దస్తగిరి తరపు వాదించే లాయర్ సిద్ధార్థ లూథ్రా.. గంటకు 2 లక్షలు తీసుకునే లాయర్. చంద్రబాబు వ్యక్తిగత లాయరే.. దస్తగిరి, సునీల్‌కి లాయర్‌గా ఉన్నారు. దీని వెనుక సునీత, చంద్రబాబు ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు, లైంగిక దాడుల గురించి ఈ పత్రికలు మాట్లాడవు. నిత్యం జగన్ జగన్ అంటున్నారు. అయ్యన్నపాత్రుడు చెప్పింది నిజం చేయాలని చూస్తున్నారు. జగన్ ఓడిపోయాడు మరణించలేదు అని అయ్యన్నపాత్రుడు అన్నాడు.పీఏ కృష్ణారెడ్డి నిన్న అన్నీ విషయాలు వివరిస్తే దాన్ని రాయరు. అసలు రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు?. ఆయన కొడుకు అని చెప్తున్న వాళ్లకు డీఎన్ఏ టెస్ట్ చేశారా?. ఇవన్నీ ఎవ్వరూ మాట్లాడారు. జగన్‌ను చూస్తే మీకు వెన్నులో వణుకు.. అందుకే మీరు ఇలాంటివి చేస్తున్నారు. వివేకాను పాశవికంగా హత్య చేసిన వ్యక్తులతో సునీత, చంద్రబాబు అంటకాగుతున్నారు. ఇంతటి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్న మీది ఒక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. -
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్(YS Jagan) ట్వీట్లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్ జగన్ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025 -
జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు
అనంతపురం:టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిబలం లేకపోయినా రామగిరి ఎంపీపీ ఎన్నిక లో పోటీకి దిగారుపేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేశారుకొందరు సీఐలు, ఎస్సైలు పరిటాల సునీత కు తొత్తుగా వ్యవహరిస్తున్నారువందలాది మంది టీడీపీ గూండాలను రామగిరి లోకి ఎలా అనుమతించారు?పరిటాల హింసా రాజకీయాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం విజయనగరం జిల్లాభోగాపురం మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంవైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పచ్చిపాల నాగలక్ష్మిని వైస్ ఎంపీపీగా ప్రకటించిన ఎన్నికల అధికారి. చిత్తూరు జిల్లా:కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు: ఎమ్మెల్సీ భరత్ఎంపీటీసీ లను ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారుపోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారుమా ఎంపీటీసీ వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారుపోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారుటిడిపి సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలు ను బెదిరించారురాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోంది అని చెప్తున్న చంద్రబాబు కుప్పం లో ఏం జరుగుతుందో అందరు చూశారువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లను భయబ్రాంతులకు గురి చేశారుఈ రోజు మా పై దాడి కూడా చేయాలని కుట్ర చేశారుఈ ఎన్నికలు పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం,కోరం లేకుండా ఎంపిపి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..గోవింధప్ప శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ప్రజాస్వామ్య వాదులు కుప్పం వైపు ఒకసారి చూడండి..ఇక్కడ ఏం జరుగుతుందో..కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారుటిడిపి నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారుకుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ను ఖూనీ చేశారుఅధికారులు చేసిన తీరుపై హైకోర్టు లో ఈ కేసు సూటిగా తీసుకోవాలిటిడిపి కు కుట్ర రాజకీయాలు చేస్తోంది కుందనందన రెడ్డి, రామకుప్పం ఎంపీటీసీఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడు జరగ లేదుసిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలివైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపిటిసి అందరినీ తప్పుడు కేసులు పెడతామని బెదిరించడంమా పై కేసులు పెడతాం అని బెదిరించారురామకుప్పం వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ అందరినీ బెదిరించారుదీనిపై న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం ఏలూరు: కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూక👉ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత👉కూటమికి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో👉గెలుపు కోసం ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి👉మాజీ మంత్రి కారుమూరి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు👉ఎన్నికకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూకవైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉పల్నాడు జిల్లా: నరసరావుపేట రూరల్ మండలం వైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ దారుణాలకు ఒడిగట్టింది: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి👉పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తోంది👉రెండు రోజుల నుంచి మా ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు👉పోలీసులతో కేసులు పెడతావని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ భర్తను రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు👉పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని పోలీసులు తీసుకువెళ్లారు👉పోలీసులే వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉టీడీపీ నాయకులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం👉వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేయరు👉లోకేష్ పోలీసులను అడ్డంపెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడుకుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం👉కుప్పం మెయిన్ రోడ్డు అన్నవరం క్రాస్ వద్ద ఎంపీటీసీలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించిన టీడీపీ శ్రేణులు👉రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు. పరిస్థితి ఉద్రిక్తం👉ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవని రామకుప్పం మండలంలో ఎంపీపీ ఎన్నిక కోసం అడ్డదారుల్లో ప్రయత్నాలుటీడీపీ అరాచకం.. ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీతూర్పుగోదావరి: అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీపీ స్థానాన్ని అడ్డగోలుగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ👉బిక్కవోలు మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేని టీడీపీ👉బెదిరింపులు, ప్రలోభాలు చూపి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను తమ వైపుకు తిప్పుకున్న టీడీపీ నేతలు👉టీడీపీ వ్యవహార శైలితో ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలువైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులుచిత్తూరు జిల్లా: వి.కోట మండలం పట్రపల్లి గ్రామం జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నివాసం నుంచి పోలీస్ భద్రత నడుమ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను రామకుప్పం ఎంపీడీవో కార్యాలయానికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో వి.కోట వద్ద టీడీపీ శ్రేణులు అడ్డగించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైకోర్టు ఆదేశాలతో బందోబస్తుతో తరలిస్తుండగా.. పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.తాడేపల్లి: జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెరతీసింది. బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. వైఎస్సార్సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు భారీఎత్తున ప్రలోభాలకు పాల్పడుతోంది. తమ దారికి రాకుంటే కిడ్నాప్‌లు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం చేస్తూ.. నిన్నటి నుంచే అనేకచోట్ల టీడీపీ నేతలు భీతావాహ వాతావరణం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపికి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్ చేశారు.తూర్పు గోదావరి జిల్లా జిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర వేశారు. ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగించింది. ఒకే సభ్యుడు ఉన్న వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ వేసింది. టీడీపీ, జనసేన అరాచకాలను చూసి ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.👉శ్రీ సత్యసాయి జిల్లా: ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపారు. బలం లేకపోయినా ఎంపీపీ స్ధానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో విప్ జారీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసిన పరిటాల వర్గీయులు.. వైఎస్సార్ సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు.👉వైఎస్సార్సీపీ నేతల వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయంటూ పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. కదిరి వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు కిడ్నాప్ కేసులు నమోద చేయగా, తాము సురక్షితంగా ఉన్నామని చామలగొంది, కటారుపల్లి ఎంపీటీసీలు సెల్ఫీ విడియో విడుదల చేశారు. అయినప్పటికీ కదిరి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సహా ఆరుగురిపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.👉చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రామకుప్పం ఎంపీడీవో కార్యాలయం బి. ఫార్మ్ తీసుకునేందుకు వెళ్లిన మురుగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌ను పోలీలసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్‌కు తీసుకువెళ్లారో కూడా పోలీసులు చెప్పలేదు. మురుగేశ్తో పాటు సర్పంచ్‌లు మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మురుగేష్, సర్పంచ్ మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు విడిచి పెట్టారు.👉ఏలూరు జిల్లా: నేడు కైకలూరు మండలం వైస్ ఎంపీపీ-2 ఎన్నిక జరగనుంది. వైఎస్ ఎంపీపీ-2 ఎన్నికకు సైతం అధికారి ప్రలోభాలకు తెరతీసింది. బలం లేకపోయినా ప్రలోభాలతో వైస్ ఎంపీపీ- 2 స్థానాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. ఉదయం 11 గంటలకు కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరగనుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.👉కృష్ణా జిల్లా: రామవరప్పాడు ఉపసర్పంచ్‌కు ఎన్నిక ఇవాళ జరగనుంది. వార్డు సభ్యురాలు రాజీనామా చేయడంతో ఉపసర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ చీప్ పాలిటిక్స్ తెరతీసింది. 11వ వార్డు సభ్యుడు కత్తుల శ్రీనివాస్‌కు వైఎస్సార్సీపీ వార్డు సభ్యుల మద్దతు, ఆరో వార్డు సభ్యుడు అద్దెపల్లి సాంబశివనాగరాజుకు కూటమి మద్దతు ఉంది. కత్తుల శ్రీనివాస్‌కే మెజారిటీ మద్దతు ఉంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.👉వైఎస్సార్ జిల్లా: నేడు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మూడు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. రాయచోటి, ఖాజీపేట, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీలను పాలకవర్గాలు ఎన్నుకోనున్నాయి. పూర్తి స్థాయి బలం ఉండటంతో మూడు చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది.👉తిరుపతి జిల్లా: తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠత కొనసాగుతోంది. పటిష్ట బందోబస్తు నడుమ తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం ముందుగానే వైఎస్సార్‌షీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్యాంప్ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.విమానాశ్రయం నుంచి తుమ్మలగుంట వరకు ఎంపీటీసీల బస్సులను భారీ భద్రత నడుమ పోలీసులు తరలించారు. మరి కాసేపట్లో తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీలు పాల్గొననున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థిగా పేరూరు-1 ఎంపీటీసీ మూలం చంద్రమోహన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎంపీపీ ఎన్నికల్లో బలం లేనందున పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లు సుమాచారం. వైఎస్సార్సీపీకి వన్ సైడ్ మెజారిటీ ఉండటంతో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి.టీడీపీ ద్వంద్వనీతి👉 వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.👉జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.👉బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
నేడు వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథరెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే కావడం విశేషం. వైఎస్సార్సీపీ సభ్యులకు విప్ జారీ... జిల్లా పరిషత్‌లో 47మంది జెడ్పీటీసీలకు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సూచన మేరకు వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి ద్వారా సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ జారీ చేసిన రిసిప్ట్ కాపీలు ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. విప్ ధిక్కరిస్తే ఆయా సభ్యులు సభ్యుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని సమాచారం. దాంతో వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. చైర్మన్‌గిరిని పార్టీ ఖాతాలో జమ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంది.రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్ పీఠంబ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్ పీఠం దక్కనుంది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యరి్థగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతిని«థ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని ఎంపిక చేశారు. అధినేత సూచనలు మేరకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు చైర్మన్ ఎన్నిక కోసం కంకణబద్ధులై ఉన్నారు. కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీ ద్వంద్వనీతిజిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
లోకేశ్‌కో రూలు.. మిథున్‌కో రూలా!?
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని ఏప్రిల్ 3 వరకు అరెస్టుచెయ్యొద్దని హైకోర్టు బుధవారం సీఐడీని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రోజున తీర్పు వెలువరిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు సాగాయి. అప్పుడు లోకేశ్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు..ముందుగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడు కానప్పటికీ, ఆ కేసువల్ల ప్రభావితమయ్యే వ్యక్తి ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అరెస్టుచేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా వెయ్యొచ్చని తెలిపారు. గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేశ్‌ను నిందితుడిగా చేర్చలేదు కాబట్టి, ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడు మిథున్‌రెడ్డి విషయంలో అలాగే నడుచుకునేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అప్పుడో రకంగా, ఇప్పుడు మరో రకంగా సీఐడీ వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా.. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు.గతంలో లోకేశ్ తరఫున సిద్దార్థ లూథ్రా, ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఆ రోజున నిందితుడు కానప్పటికీ లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సమర్థించిన లూథ్రా.. ఇప్పుడు మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.లోకేశ్‌కు ఇచ్చినట్లే ఉత్తర్వులివ్వాలని మిథున్ కోరలేరు..లూథ్రా వాదనలు వినిపిస్తూ, లోకేశ్ కేసులో వాస్తవాలకు, ఈ కేసులో వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు. లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని, అలాంటి ఉత్తర్వులే తమకూ ఇవ్వాలని పిటిషనర్ కోరడానికి వీల్లేదన్నారు. మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హతే లేదని లూథ్రా తెలిపారు. పైగా.. విచారణకు హాజరుకావాలని ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దర్యాప్తు అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పీఎల్ఆర్ కంపెనీ వివరాలు అడిగామని, అందువల్ల తనను అరెస్టు చేస్తారని పిటిషనర్ చెబుతున్నారని, వాస్తవానికి ఆ కంపెనీలో మిథున్‌రెడ్డి డైరెక్టర్ కాదన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారం రూ.వేల కోట్లకు సంబంధించిందన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయ్యొద్దని లూథ్రా కోర్టును కోరారు.దర్యాప్తు అధికారి తీరును తీవ్రంగా పరిగణించండి..ఇక ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వాంగ్మూలంలో మిథున్‌రెడ్డి ప్రస్తావన ఉందన్నారు. ఇదే సమయంలో.. ఓ అధికారి సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారని అది తమ వద్ద లేదని సీఐడీ దర్యాప్తు అధికారి చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు అధికారిపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లు కనిపించడంలేదని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఒకవైపు నేరారోపణలకు ఆధారాలు లేవంటారని, మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ పరస్పర విరుద్ధంగా వాదనలు వినిపిస్తోందన్నారు. ఆధారాల్లేకుంటే ముందస్తు బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు. మిథున్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నందునే తాము ముందస్తు బెయిల్ కోసం కోర్టుకొచ్చామన్నారు. మిథున్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను దగ్గరకు వస్తే అరెస్టుచేయాలన్న ఉద్దేశంతో సీఐడీ ఉందన్నారు. -
YSRCP: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. -
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?
అమెజాన్ ప్రైమ్‌లో ఓ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 15 రోజుల క్రితం ఈ సినిమా ప్రైమ్‌లో రిలీజైనప్పటి నుంచిం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్‌కు కేంద్ర బిందువైంది. కొందరు ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంది.. చాలా ఫ్యాక్చువల్‌గా ఉందని చెబుతుంటేం మరికొంతమంది ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో టాప్-2గా ట్రెండ్ అవుతున్న హత్య సినిమా ఐదు భాషల్లో రిలీజైంది.👉అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న హత్య సినిమా ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా బిట్స్ షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్ హత్య విచారణకు సంబంధించిన కథాంశంతోం సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పొలిటీషియన్‌ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ పోలీస్ అధికారి చేసే విచారణ సినిమాలో ప్రధాన అంశం. సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్ డిస్క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది.👉మాజీ మంత్రి హత్య నేపథ్యంలో ఈ సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీమంత్రి హత్యకు దారితీసిన అంశాలను ఈ సినిమాలో చర్చించారనే డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసు విచారణ మొదలుం సాంకేతిక ఎవిడెన్సెస్ వరకు ప్రతీ అంశంపై చాలా నిశితంగా చర్చిస్తూ సినిమా స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరుం అందరిని ఆకట్టుకుంటోంది. మాజీమంత్రి హత్యకేసులో డిస్కషన్‌కు వచ్చిన చాలా టెక్నికల్ అంశాలను సైతం ఈ సినిమాలో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించారనే ప్రశంసలు వస్తున్నాయి.👉ఒక సినిమా పూర్తి ఫిక్షన్ అయినపప్పటికీ ఆ సినిమా కథ ఏదో ఒక వాస్తవ ఘటన ఆధారంగా తీసుకున్నదే అయి ఉంటుంది. ఇప్పుడు హత్య సినిమా కూడా ఎంతో కొంత వాస్తవ ఘటనల ఆధారంగా తీసుకన్నారనే డిస్కషన్ ఉంది. హత్య సినిమాలో ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురవుతాడు. ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలనే ఉద్దేశంతోం హత్యకు గురైన వ్యక్తి బంధువు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై నిస్పక్ష విచారణకు ఆదేశిస్తారు. తన బాబాయి హంతకులు ఎవరనేది బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సిన్సియర్‌గా యత్నిస్తారు.👉దీనిపై ఓ నిబద్ధత ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్‌కుం విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు ఆ మహిళా అధికారి అన్ని కోణాల్లో విచారణ చేపడుతుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అయితే విచారణ చేసిన అధికారిని కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తాయి. కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది అధికారులు ఆమెకు ద్రోహం చేస్తారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఆమెను విచారణ నుంచి తప్పిస్తారు. మొత్తానికి వాస్తవాలు బయటకు రాకుండా ఆమెను అడ్డుకుంటారు.👉సినిమా ముందుకు కదులుతున్నకొద్దీ హత్యకు గురైన మాజీ మంత్రికి సంబంధించి చాలా కొత్త కొత్త విషయాలు రివీల్ అవుతాయి. ఈ సినిమాలో హత్య గురైన వ్యక్తికి ఉన్నటువంటి వివాహేతర సంబంధంపైం చాలా డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో హత్యకు గురైన మాజీమంత్రి ఆ మహిళతో పరిచయం అయిన తీరు ఆ పరిచయం ఏవిధంగా కుటుంబంలో చిచ్చుపెట్టిందో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ కేసు విచారణలో చనిపోయిన మాజీమంత్రికి ఉన్న వివాహేతర సంబంధం కీలకంగా మారిందనేది సినిమా చూస్తున్న వారందరికీ అర్ధం అవుతుంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ఆయన కూతురు, అల్లుడితో పాటు బావమరిదికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.👉ఒకవేళ రెండో వివాహానికి అంగీకారం తెలిపితే ఆస్తిలోవాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం.. హత్యకు గురైన మాజీమంత్రి కూతురు, అల్లుడిని వెంటాడుతుంది. ఓ సందర్భంలో మాజీమంత్రి బావమరిది.. ఆమె రెండో భార్య దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసిన దృశ్యం సినిమాలో టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలిసిం హత్యకు గురికావడానికి ముందు ఆ మాజీమంత్రి తన మొదటి భార్య బంధువులతో సహా కూతురు అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హత్యకు గురికావడానికి ముందు తన ముస్లిం భార్యకు ఆస్తిలో వాటాతో పాటు ఆమెతో కలిగిన కుమారుడికి కాన్వెంట్ అడ్మిషన్ ఇప్పించాలని మాజీమంత్రి కోరుకుంటాడు అనే సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇదే హత్యకు కారణమైన ఉండొచ్చు అనే అనుమానాలు తరువాత విచారణలో ముందుకు వస్తాయి.👉ఈ సినిమాలో మాజీమంత్రి హత్యకు సంబంధించి రెండు కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. ఒకటి హత్య జరిగిన సందర్భంగా హత్య చేసే సమయంలో దుండగులు మాజీమంత్రితో ఓ లేఖ రాయిస్తారు. సినిమాలో ఇది చాలా డ్రమటిక్ సీన్. లేఖలో తనను డ్రైవర్ తీవ్రంగా కొట్టాడంటూ రాయిస్తారు. అయితే ఉదయాన్నే మృతదేహం వద్ద ఈ లేఖను చూసిన పీఏ.. విషయం మాజీమంత్రి అల్లుడికి చెప్తాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పినాం ఇది హత్య అని అప్పుడే తెలిసే అవకాశం ఉండింది. కాని మాజీ మంత్రి అల్లుడు ఈ విషయం బయటకు రాకుండా మధ్యాహ్నం వరకు దాచిపెడతాడు. మొత్తం సినిమాలో ఇది చాలా కీలకమైన అంశం.👉ఎందుకు హత్యకు గురయిన మాజీ మంత్రి అల్లుడు ఇది హత్య అనే విషయం బయటకు రాకుండా అడ్డుకున్నాడనే సినిమా కథలో కీలకమైన అంశం. దీంతో మాజీమంత్రి మృతిపై రకరకాల పుకార్లు వస్తాయి. హత్య అని ముందే తెలిస్తే సాక్ష్యాలు భద్రపరిచే అవకాశం ఉన్నాం లేఖను ఎందుకు దాచిపెట్టారనే విషయం హత్య సినిమాలో కీలకం. ఇక పీఏను అబద్ధమపు సాక్ష్యం చెప్పమని మాజీమంత్రి కూతురు బలవంతపెడుతుంది. దీంతో తాను అబద్ధం చెప్పనని పీఏ తిరగబడతాడు. పీఏ అబద్ధం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందనిం హత్యకు గురైన మాజీ మంత్రి కూతురు నోరుజారడం షాకింగ్ విషయం. అసలు హత్య వెనకాల మాజీమంత్రి కుటుంబం ఉందా? అనే విషయం ముందు నుంచీ ప్రతీ ఒక్కరికీ అనుమానం కలిగిస్తుంది. పరిస్థితులు సాక్ష్యాధారాలు సైతం మాజీ మంత్రి కూతురు,అల్లుడి వైపే అనుమానాలు కలిగిస్తాయి. హత్య వల్ల లాభం ఎవరికి అనేది సినిమా చూసిన వారికి స్పష్టంగా అర్థమైపోతుంది.👉హత్యకు సంబంధించిన అబద్ధాలు ప్రచారం చేసి ఏవిధంగా రాజకీయ రంగు పులుమే ప్రయత్నం జరుగుతుందో హత్య సినిమా చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రి హత్యను రాజకీయాల కోసం వాడుకున్న కూతురు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. రెండో వివాహం కుటుంబంలో చిచ్చురేపిం అది హత్య వరకు దారితీసిన ఘటనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నిజాలు బయటకు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ఏవిధంగా ద్రోహం చేశారో కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఓ బలమైన వర్గం సొంత కూతురు కలిసి మాజీ మంత్రి హత్య కేసును ఏ విధంగా దారితప్పించారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. -
గీత దాటిన పోలీసులకు కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చట్టాలను గౌరవించకుండా కూటమి ప్రభుత్వం మెప్పుకోసమే పనిచేస్తున్న పోలీసులకు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్ కోసమే పనిచేస్తే పోలీసులే నష్టపోతారని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ యంత్రాంగం మీద న్యాయవ్యవస్థ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్రమైన ఆలోచనలో పడేశాయి. ప్రజలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో కీలకమైన పోలీస్ యంత్రాంగం చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం బాధాకరం. ఒకే కంటెంట్ ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ కావొచ్చేమోకానీ, పలుచోట్ల ఎఫ్ఐఆర్లు కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన సూచనలు పోలీస్ యత్రాంగం పట్టించుకోవడం లేదు.అరెస్ట్ చేయొద్దని చెప్పినా, పీటీ వారెంట్ పేరుతో అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఒక ప్రణాళిక బద్ధంగా పైనుంచి వచ్చిన నాయకుల సూచనలను పోలీసులు పాటిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఒకానొక సందర్భంలో డీజీపీని కూడా కోర్టుకు పిలవాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చే దాకా తెచ్చుకోవడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. కోర్టు సీసీ టీవీ ఫుటేజీలు అడిగితే కోతులు కొరికేశాయని చెప్పుకునే పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.వ్యవస్థీకృత నేరాల పేరుతో వేధింపులుగుంటూరులో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక రీల్ చేస్తే, అతడిని కర్నూలులో అరెస్ట్ చూపించారు. ఆయన్ను వ్యవస్థీకృత నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని కోర్టు ఆక్షేపించింది. మేం కళ్లు మూసుకుని ఉండలేమని గౌరవ హైకోర్టు చెప్పడం పోలీసుల వ్యవహారశైలికి నిదర్శనం. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షలు పడే నేరాలకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలని పలుమార్లు సూచించింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పింది. 41ఏ నోటీసు ఇచ్చాక స్పందించకుండ పారిపోయే ప్రయత్నం చేసినప్పుడే అరెస్ట్ చేయాలని కోర్టులు చెబుతున్నాయి. నరసరావుపేటలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి పెళ్ళిలో ఉంటే పోలీసులు మంగళగిరిలో ఉన్నట్టు చూపించారు. ఆ కేసులో ఆధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎన్ఎస్ 111 యాక్ట్ ని సోషల్ మీడియా యాక్టీవీస్ట్ల కేసుల్లో ఎలా వర్తింపచేస్తారంటూ కోర్టు పలుమార్లు ఆక్షేపించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు.రాష్ట్రంలో అడుగడుగునా అధికార దుర్వినియోగంరాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అడుగుడుగునా అధికార దుర్వినియోగం కనిపిస్తోంది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఎంపీపీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. గార్లపెంటలో ఇన్చార్జిగా ఉన్న గంగోజమ్మ తానే స్వయంగా వీడియో పంపినా కూడా అక్కడున్న లీడర్లపై కేసులు పెట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలో బలం లేకపోయినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది.ఒక పక్క పోటీ చేయడం లేదని చెబుతూనే మరోపక్క ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అత్తిలి, యలమంచలిలో ఎంపీపీ ఎన్నికలున్నాయి. రెండుచోట్లా వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా అడ్డదారులు తొక్కి మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలా అనైతిక కార్యకలాపాల ద్వారా గెలవాలని చూస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.పథకాల అమలుపై దృష్టిసారించండిరాష్ట్రంలో రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఒక పక్క మద్ధతు ధర లభించిక అప్పులపాలవుతున్నారు. మిర్చి రైతులు నెలరోజులకుపైగా ఆందోళనలు కొనసాగిస్తుంటే వారి కష్టాలు పట్టించుకునే వారే లేరు. పీ4 పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేసే పనులు పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీలకు, వెనుకబడిన వర్గాలకు కేటాయించిన పథకాలకు నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి పేదరికంపై యుద్ధం చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో నాయకులు బెదిరింపులకు దిగుతుంటే వారి ఆదేశాలకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వత్తాసు పలకడం సబబేనా? -
మరో అపచారం.. పవనానంద స్వామి ఎక్కడ?
తిరుపతి, సాక్షి: తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని.. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి(డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్) ఎక్కడ? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు. నిన్న పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు.అలాంటి డ్యామ్‌లో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి?. టూరిజం వేరు.. అధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యామ్ ఉంది. బోటింగ్‌పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి అని భూమన డిమాండ్ చేశారు.అటవీ శాఖ పవన్ కల్యాణ్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుండగా.. ఈ ప్రాంతంలోనే పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉన్నాయి. ఈ క్రమంలో బోటింగ్ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
పిఠాపురంలో మళ్లీ దబ్బిడి దిబ్బిడి
సాక్షి,కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటేశామంటూ జనసేన ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్‌పై వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.బుధవారం పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం అందలేదు. ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే సమయంలో టీడీపీ,జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటు వేశామని వర్మ అనుచరులు,టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను భయటపెట్టారు. వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. నాగబాబు ఏమన్నారంటే?మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది. ఆ సభలో నాగబాబు ..పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. నాగబాబుకు వర్మ కౌంటర్‌గా ఆ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ తరుణంలో వర్మ అభిమానులు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది. -
పరిటాల వర్గీయుల హల్చల్.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, శ్రీ సత్యసాయి: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే అహంతో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల హల్చల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల దారుణాలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లాలోని రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల తాజాగా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వెళ్లిన లాయర్ కురుబ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు రామాంజనేయులు, హరిలపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పరిటాల వర్గీయులు.. వాహనం ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక, రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్సీపీ-8, టీడీపీ-1 ఒక్క స్థానంలో విజయం సాధించగా.. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో దాడులు, దౌర్జన్యంతో ఎంపీపీ పదవి కైవసం చేసుకోవాలని టీడీపీ కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. -
సోమిరెడ్డి ఫిర్యాదుతోనే నాపై అక్రమ కేసు: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో అధికార కూటమి పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. బెదిరిది లేదు.. వెనక్కి తగ్గిదిలేదని స్పష్టం చేశారు. మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి.. తనపై నమోదైన అక్రమ కేసులపై స్పందించారు. ఈ క్రమంలో నెల్లూరులో కాకాణి మీడియాతో మాట్లాడుతూ..‘మైనింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో తన ప్రమేయం ఉందని ఎక్కడా ప్రస్తావించలేదు. సోమిరెడ్డి ఫిర్యాదు చేశారని.. నాపై పొదలకూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. 16 విచారణలు జరుగుతున్నాయి. ఎనిమిది అక్రమ కేసులు నాపై నమోదు చేశారు. రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కావాలనే క్వార్జ్ అక్రమ రవాణాలో కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో మరిన్ని పోరాటాలు చేస్తాము తప్పా.. రాజీ పడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాను కాబట్టే ప్రభుత్వానికి నేను టార్గెట్ అయ్యాను. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే.. సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. 👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు. 👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్లను వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!. 'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘టీడీపీ అధికారంలో ఉంటే రైతన్నకు కష్టాలే’
సాక్షి,విశాఖ: టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే. వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతన్నను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో రైతన్నల దుస్థితిపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం అయినా రైతుల కష్టాలను తీర్చేలా ఉంటే బాగున్ను..అది రాష్ట్రంలో లేదు.. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదు. కడపలో అరటి తోటలు గాలికి నేలకొరిగాయి.పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు.మిర్చి పరిస్థితి కూడా అలానే ఉంది ఏం చెయ్యాలో తోచని దుస్థితి.చెరకు రైతులు స్వయంగా పంటను వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తుంది. మిర్చి కొంటాం అని హామీ ఇచ్చారు. ఒక్క క్వింటా అయినా కొన్నారా..?.ఒక్క కేజీ అయినా కొన్నారా? కొంటే రైతులు యార్డ్ దగ్గర ఎందుకు ఉంటారు. గోవాడ చెరకు రైతులకు రూ.24 కోట్లు బకాయి పడ్డారు. ఎందుకు రైతులకు చెల్లించడం లేదు. వ్యవసాయం అంటే దండగ అని టీడీపీ నానుడి. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వంలో రైతులకు మంచి చేశాం. మా హయాంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. రైతులకు మాటలే తప్ప చేసినది ఏమి లేదు.గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే పరిస్థితి తెలుస్తుంది. మేము చెప్పింది అబద్దం అయితే అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. హామీలు ఇవ్వడం కాదు చేతల్లో చూపించండి. కూటమి హామీలు చూసి ప్రజలు మోసపోయారు..హామీలు నమ్మి మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైంది.ఇక్కడ పండిన పంటకు ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయొచ్చు కదా.రైతులను ఆదుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదు.రైతుల ఇబ్బందులను ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు ఇచ్చిన హామీలను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి’ అని డిమాండ్ చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్
సాక్షి, కృష్ణాజిల్లా: పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దిగజారుడు రాజకీయాలకు తెర లేపారు. వేసవిలో ప్రజలకు దాహం తీర్చేందుకు చలివేంద్రం పెట్టిన వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. నాలుగు రోజుల క్రితం యనమలకుదురులో అభయ హస్త సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు.చలివేంద్రాన్ని పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ప్రారంభించారు. వైఎస్సార్‌షీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడంతో బోడే ప్రసాద్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే బోడే ఆదేశాలతో చలివేంద్రం తీసేవేయించాలని మున్సిపల్ కమిషనర్‌కు టీడీపీ నాయకుడు వీరంకి కుటుంబరావు ఫిర్యాదు చేశారు.కమిషనర్ సమక్షంలోనే అక్రమంగా క్రేన్‌తో చలివేంద్రం తొలగించారు. చలివేంద్రం నిర్వాహకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చలివేంద్రం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆరేపల్లి ఈశ్వర్ రావును కాలర్ పట్టుకుని మరీ బయటికి లాగి పడేసిన పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.