-
టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి, కూతురు బలి
కళ్యాణదుర్గం: టీడీపీ నాయకుల కక్ష సాధింపులకు తల్లి, కుమార్తె బలయ్యారు. తన భర్తపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంతో తీవ్ర మనస్తాపం, ఆందోళనకు గురైన గొల్ల మమత (24).. తన 8 నెలల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లికార్జునపల్లికి చెందిన గొల్ల శాంతకుమార్ వైఎస్సార్సీపీ కార్యకర్తగా పార్టీ తరఫున గ్రామంలో చురుగ్గా పనిచేశారు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ కిరాణా దుకాణం వద్ద జగన్‌కు అనుకూలంగా మాట్లాడాడు. అనంతరం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శాంతకుమార్‌ను మందలించేందుకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. శాంతకుమార్‌ను ఎలాగైనా కేసులో ఇరికించి జైలుకు పంపాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన హనుమంతు అనే టీడీపీ కార్యకర్తను ఉసిగొల్పి శాంతకుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ విషయంపై బుధవారం పోలీసులు శాంతకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించారు. భర్త జైలుకు వెళ్తాడన్న భయంతో.. తన భర్త శాంతకుమార్‌ను స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని, అతన్ని జైలులో పెట్టిస్తారన్న భయంతో అతడి భార్య మమత తీవ్రంగా కుంగిపోయింది. ముందుగా తన 8 నెలల కుమార్తెను ఇంటి ఆవరణలోని నీటి తొట్టెలో ముంచి ప్రాణం పోయాక.. బాత్రూంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించేసరికే చిన్నారితో పాటు మమత మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకుమార్తె మృతితో మల్లికార్జునపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు. తల్లీకుమార్తె మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. ఇవి రాజకీయ హత్యలే: వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే వారి అధికార దాహానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి అన్నారు. కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి, పార్టీ నేతలు రామచంద్ర, హనుమంతరెడ్డి, చిత్తప్ప, తలారి సత్యప్ప, కృష్ణమూర్తి, ఆంజనేయులు తదితరులతో కలిసి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ఇద్దరి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇవి అధికార పార్టీ చేసిన రాజకీయ హత్యలని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న కారణంతో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడం, అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇక్కడ విష సంస్కృతికి తెర లేపారని విమర్శించారు. తల్లీకూతురు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.40,000 జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని బాలికకు ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిహారం కింద రూ.3.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ కృష్ణ అందించిన వివరాలు.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి తోటగురువు దగ్గర బీఎన్ఆర్ నగర్లో నివాసముంటున్న గుండెల సాయికుమార్.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆరిలోవ సెక్టార్–2 శివాజీనగర్‌లో తన ఇద్దరు మైనర్ కుమార్తెలతో తండ్రి నివాసముంటున్నాడు. గతేడాది ఏప్రిల్ 9న తన కుమార్తెలను టిఫిన్ తీసుకురమ్మని హోటల్‌కు తండ్రి పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న సాయికుమార్.. ఓ బాలికను ఎత్తుకుని తన బండిపై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.సోమశేఖర్.. సాయికుమార్‌పై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. -
తహసీల్దారును నిర్బంధించిన వీఆర్వో
ఘంటసాల: కృష్ణాజిల్లా ఘంటసాల తహసీల్దారును మంగళవారం వీఆర్వో నాగమల్లేశ్వరి నిర్బంధించారు. తోటి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయారు. తనకు న్యాయం చేయకపోతే కొడుకుతో సహా చనిపోతానంటూ ధర్నాకు దిగారు. ఈ వ్యవహారం సంచలనం కలిగించింది. ఘంటసాల మండలం ఘంటసాలపాలెం సచివాలయ వీఆర్వోగా బి.నాగమల్లేశ్వరి పనిచేస్తున్నారు. సచివాలయం పరిధిలోని ఘంటసాలపాలెం, కొత్తపల్లి, తాడేపల్లి గ్రామాల వీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ మూడు గ్రామాలకు సంబంధించిన పాస్‌బుక్ ఫైల్స్, ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఇతర రెవెన్యూ పనులను అధికారులు తన ప్రమేయం లేకుండానే కొడాలి, ఘంటసాల, లంకపల్లి వీఆర్వోలు తదితరులతో చేయిస్తున్నారని, తన సంతకాలు లేకుండా ఫైల్స్ ఆన్లైన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించారు. కార్యాలయంలో తహసీల్దారు ఎన్.బి.విజయలక్షి్మని నిర్బంధించారు. తనకు న్యాయం చేసేంతవరకు తలుపులు తీయనని భీషి్మంచారు. బయట నుంచి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తలుపులు తీశారు. ఆమె కుమారుడు కార్యాలయం బయట గోడలపై పెట్రోల్ పోశాడు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో వచ్చి తనకు న్యాయం చేయాలని, లేదా తన కుమారుడితో కలసి చనిపోతానంటూ కుమారుడితో కలసి తహసీల్దార్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. తన పరిధిలో పనులు తన ప్రమేయం లేకుండా జరగడంపై ఆర్డీవో విచారించాలని, తనకు న్యాయం చేయాలని తొమ్మిది నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చల్లపల్లి సీఐ సీహెచ్.నాగప్రసాద్, ఎస్ఐ చినబాబు అక్కడికి వచ్చి వీఆర్వో నాగమల్లేశ్వరితో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూద్దామని సర్దిచెప్పారు. అయినా నాగమల్లేశ్వరి ఆందోళన విరమించకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడిస్తామని సంబంధిత అధికారులతో చెప్పించి ధర్నా విరమింపజేశారు. ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ తాను ఎన్నికల విధుల్లో భాగంగా ఐదునెలలు కిందట ఘంటసాల వచ్చినట్లు చెప్పారు. తాను పనుల్ని ప్రాపర్ చానల్ ద్వారానే చేస్తున్నానని, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తన గదిలోకి వచ్చిన వీఆర్వో నాగమల్లేశ్వరి అక్కడే ఉన్న కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయిందని, ఏమైందని అడుగుతుండగానే అసభ్య పదజాలంతో తిట్టడమేగాక తలుపులు మూసేసిందని, అనంతరం తన చాంబర్ ముందు బైఠాయించిందని చెప్పారు. గత తహసీల్దార్ హయాంలో వీఆర్వోకు సంబంధం లేకుండా ఫైల్స్ చేశారని వీఆర్వో ఆరోపిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో నుంచి వీఆర్వోపై వచ్చిన రిపోర్టు చూసి ఆగ్రహంతో ఆందోళన చేసి ఉంటుందని భావిస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. -
రియాక్టర్ పేలుడు.. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెనుక వైపు గేట్ నుంచి కంపెనీలోకి చొచ్చుకెళ్లేందుకు స్థానికులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.వెనుకవైపు గేట్‌కు వేసిన తాళాన్ని స్థానికులు రాళ్లతో పగలగొట్టారు. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావస్తున్నా కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అల్ట్రాటెక్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే కంపెనీ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు.కాగా ఎన్టీఆర్ జిల్లా బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ఉదయం లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రియాక్టర్లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.కర్మాగారంలోని మూడో ఫ్లోర్లో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రా మెటీరియల్ మిక్స్ చేయటానికి 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో హీట్‌చేసే రియాక్టర్ వద్దకు ఉదయం షిఫ్టులో 16 మంది కార్మికులు విధులకు వచ్చారు. వారు విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అందులోని సిమెంట్ కార్మికులందరిపై పడింది. దీంతో వారి శరీర భాగాలు కాలిపోయాయి.ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ యాదవ్, సుభం సోని, గుడ్డు కుమార్, దినేష్‌కుమార్, నాగేంద్ర, బిహార్‌కు చెందిన బి. సింగ్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన బొంతా శ్రీనివాసరావు, బూదవాడ గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు, వేముల సైదులు, గుగులోతు గోపినాయక్, గుగులోతు బాలాజీ, బాణావతు సైదా, బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్ గాయపడ్డారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. వీరిలో ఆవుల వెంకటేష్ (35)కు 80 శాతం కాలిన గాయాలవడంతో మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.ఫర్నిచర్ ధ్వంసం చేసిన గ్రామస్తులు..యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు. ప్రమాదం జరిగినా కనీస స్పందనలేదని ఆరోపించారు. సమాధానం చెప్పడానికి కర్మాగారం తర ఫున ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామ స్తులు, క్షతగాత్రుల బంధువులు కర్మాగారంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్ఐ సతీష్ పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఏసీపీ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. -
అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు
బూదవాడ (జగ్గయ్యపేట)/సాక్షి, అమరావతి/ తాడేపల్లి రూరల్/ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రియాక్టర్లో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్మాగారంలోని మూడో ఫ్లోర్లో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రా మెటీరియల్ మిక్స్ చేయటానికి 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో హీట్‌చేసే రియాక్టర్ వద్దకు ఉదయం షిఫ్టులో 16 మంది కార్మికులు విధులకు వచ్చారు. వారు విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అందులోని సిమెంట్ కార్మికులందరిపై పడింది. దీంతో వారి శరీర భాగాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ యాదవ్, సుభం సోని, గుడ్డు కుమార్, దినేష్‌కుమార్, నాగేంద్ర, బిహార్‌కు చెందిన బి. సింగ్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన బొంతా శ్రీనివాసరావు, బూదవాడ గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు, వేముల సైదులు, గుగులోతు గోపినాయక్, గుగులోతు బాలాజీ, బాణావతు సైదా, బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్ గాయపడ్డారు. వీరిలో బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆవుల వెంకటేష్ (35)కు 80 శాతం కాలిన గాయాలవడంతో మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఫర్నిచర్ ధ్వంసం చేసిన గ్రామస్తులు..యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు. ప్రమాదం జరిగినా కనీస స్పందనలేదని ఆరోపించారు. సమాధానం చెప్పడానికి కర్మాగారం తర ఫున ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామ స్తులు, క్షతగాత్రుల బంధువులు కర్మాగారంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్ఐ సతీష్ పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఏసీపీ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి..ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అలాగే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కూడా పరామర్శించారు. ఇదిలా ఉంటే.. పేలుడు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. మిగిలిన వారికి గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారాన్ని అందించాలన్నారు. అలాగే, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సీఐటీయు నేతలు కూడా బాధితులను పరామర్శించారు. యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. గాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం, యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది..ఇదిలా ఉంటే.. గాయాలైన ఎనిమిది మందిని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు వచ్చారు. 24 గంటలు గడిస్తే తప్ప ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉందో చెప్పలేమని తెలియడంతో తమవారికి ఏమవుతుందా అని వారంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే, దుర్ఘటనపై ఆదివారం మణిపాల్ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఉదయం 10.00– 10.30 మధ్య ప్రమాదం జరిగిందని.. తమకు తెలిసేసరికి రెండు గంటలు పట్టిందని, ఆ తర్వాత తాము ఫ్యాక్టరీకి వెళ్లిన రెండు గంటల తరువాతే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని మండిపడ్డారు. ఇంతగా జాప్యంచేసి కార్మికుల ప్రాణా లంటే లెక్కలేకుండా యాజమాన్యం ప్రవర్తించిందని ఆరోపించారు. తొలుత.. గాయపడిన వారిని బయటకు తెచ్చేందుకు తామంతా ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది అనుమతించలేదని.. పైగా తమను తోసేసి చేయిచేసుకున్నారని చెప్పారు. అయినా వారిని తోసుకుంటూ వెళ్లగా గాయపడ్డ వారంతా కేకలు పెడుతున్నారని.. మొత్తం 16మందిని తీసుకుని బయటకు వచ్చామన్నారు. అలాగే, మృతుడు ఆవుల వెంకటేష్ తమ్ముడు గోవింద్ మాట్లాడుతూ.. మా అన్నయ్య బూడిదలో కూరుకుపోయాడని, పైకి లేవలేకపోయాడని చెప్పాడు. -
ఆగని విధ్వంసాలు
సాక్షి నెట్వర్క్: కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సాగిస్తున్న విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను, అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంసాలు శనివారం రాత్రి, ఆదివారం కూడా కొనసాగాయి. » విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామం బజారు కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శనివారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమం సందర్భంగా విగ్రహానికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దడంతో తట్టుకోలేక విగ్రహం చేతిని విరగ్గొట్టడంతోపాటు తల వెనక భాగంలో రాడ్డుతో కొట్టారు. కోనాడ బజార్లో ఉన్న సీసీ కెమెరా వైర్లను కట్‌చేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పూసపాటిరేగ ఎస్.ఐ. సన్యాసినాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుంటామని ఎస్.ఐ. చెప్పారు. గ్రామ వైఎస్సార్సీపీ నేతలు దాడిశెట్టి త్రినాథరావు, అమర గురువులు, బొడ్డు ఎల్లాజీ, దారపు లక్ష్మణరెడ్డి, దాడిశెట్టి గోవింద, విజ్జపు కిరణ్, కంబపు రామిరెడ్డి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రశాంతతకు మారుపేరైన కోనాడలో అసాంఘిక శక్తులు బరితెగించి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం జిల్లేళ్ళవారిపేటలో వాటర్ ట్యాంకు శిలాఫలకాన్ని మాయం చేశారు. జిల్లేళ్ళవారిపేట ఎస్సీ గ్రామానికి మంచి నీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీ‹Ùకుమార్ జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.54 లక్షలతో 40 వేల లీటర్ల ట్యాంకు, పైపులైన్ పనులు, ఇంటింటా కుళాయిల పనులు పూర్తిచేసి ప్రారంభించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఇప్పుడు మాయం చేశారు. వారం రోజుల కిందట గ్రామంలో చర్చికి వెళ్లే పంచాయతీ పైపులైన్‌ను టీడీపీ కార్యకర్తలు కట్ చేశారు. » ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలులో ఇటీవల నిర్మించిన గ్రామ సచివాలయ భవనంపై ఉన్న ఫొటోలను పగులగొట్టారు. ఈ భవనానికి ఘంటా రంగారావు తన తండ్రి పేరిట 12 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారు. దీంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను నేలమట్టం చేశారు. ఈ ఘటనను జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. » పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామ పంచాయతీ బీసీ కాలనీలో కొవ్వూరి గంగిరెడ్డి స్మారక మందిరం వద్ద 2021లో సీసీ రోడ్డు ప్రారం¿ోత్సవం సందర్భంగా వేసిన శిలాఫలకాన్ని శనివారం రాత్రి కూల్చేశారు. రూ.కోటితో నాలుగు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, సచివాలయ భవన విస్తరణ పనులు చేసిన తరువాత 2021 సెప్టెంబరు 5న మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు ప్రారంభించి శిలాఫలకాలు ఆవిష్కరించారని సర్పంచ్ తమనంపూడి వీర్రెడ్డి చెప్పారు. బీసీ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ఇప్పుడు కూల్చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. -
భయానక వాతావరణం సృష్టించేందుకే..
సాక్షి టాస్‌్కఫోర్స్: వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో వాటా అడిగారని, ఇస్తానని చెప్పినా చివరికి పనులు మొత్తం ఇవ్వాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దీనికి అంగీకరించని తాను 15 రోజులుగా నిలిచిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించడానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసుకు దుండగులు నిప్పుపెట్టారని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పనులను మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నాలుగు కిలోమీటర్ల మేర పనుల్ని సబ్ కాంట్రాక్ట్ కింద సిద్ధార్థ కంపెనీ యజమాని రామిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టారు. పనులు జరుగుతుండగా కూటమి అధికారంలోకి వచ్చి0ది. అప్పటి నుంచి హైవే పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. టీడీపీ నేతలు నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో జరిగే హైవే పనులను అడ్డుకున్నారు. వాటా ఇవ్వందే పనులు చేయకూడదని హుకుం జారీచేశారు. అయినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడానికి సిద్ధమైన తరుణంలో వారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాయల్టీ లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారని అధికారులు టిప్పర్లను సీజ్‌చేశారు. రాయల్టీ అధికారులు విధించిన జరిమానా చెల్లించి టిప్పర్లను తెచ్చుకుని పనులు ప్రారంభించే సమయంలో క్యాంపు ఆఫీసును తగులబెట్టారు. హైవే రోడ్డు పనులు నాలుగు కిలోమీటర్లు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నానని, దాన్లో రెండు కిలోమీటర్లు చేసుకునేందుకు ఇచ్చేస్తానని టీడీపీ నేతలకు చెప్పినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. కానీ వారు మొత్తం నాలుగు కిలోమీటర్ల పనులు కావాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించని తాను పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యానని, ఈ పనులను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసును తగులబెట్టారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్‌్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
రాంబిల్లి: ఒక మృగాడి పైశాచికానికి బాలిక బలైంది. పోలీస్ యంత్రాంగం బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించి బాలిక కుటుంబీకుల్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగి ఉండేది కాదు. దీనికి సంబంధించిన వివరాలు.. కశింకోట మండలానికి చెందిన జె.సురేశ్ అదే ప్రాంతానికి చెందిన బద్ది దర్శిని(14)ని వేధించేవాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో పోక్సో కేసు నమోదు చేసి జైలుకి పంపారు. బాలికను వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దకు పంపించి చదివిస్తున్నారు. రాంబిల్లి మండలం కొప్పిగొండుపాలెంలో ఉంటూ రాంబిల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దర్శిని శనివారం యధావిధిగా పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. బెయిల్‌పై వచ్చి అప్పటికే మాటు వేసి ఉన్న సురేశ్ వేట కొడవలితో బాలిక మెడ నరికి హతమార్చాడు. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్ ఈ దురాగతానికి పాల్పడ్డాడని భావిస్తున్నా రు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు, ఎస్ఐ మన్మధరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారు కావడంతో అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో రాంబిల్లి మండలంతోపాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఉలిక్కిపడింది. -
నేలకేసి కొట్టి పసికందు హత్య
చిత్తూరు రూరల్: ఏడాదిన్నర పసికందును తండ్రే నేలకేసి కొట్టి చంపిన ఉదంతం చిత్తూరు మండలం దిగువ మాసాపల్లిలో శనివారం వెలుగుచూసింది. బీఎన్ఆర్ పేట ఎస్ఐ వెంకట సుబ్బమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లి మండలం మాధవరం సమీపంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఐరాల మండలం జంగాలపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. మూడేళ్ల క్రితం భర్త వదిలేయడంతో ఆమె చిత్తూరు జిల్లా దిగువ మాసాపల్లికి వచ్చి ప్రదీప్ (34) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఏడాదిన్నర క్రితం కుమారుడు పుట్టాడు. కాగా.. ఆ మహిళ ఇటీవల దిగువ మాసాపల్లిలోనే ఓ కోళ్లఫారంలో పనికి కుదిరింది. కాగా.. ప్రదీప్ శుక్రవారం మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పసికందు ఏడుస్తుండటంతో బిడ్డను నేలకేసి కొట్టి చంపేశాడు. ఆ తరువాత తేరుకుని ఇంటిపై నుంచి పడి బిడ్డ మృతి చెందాడని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బంధువులకు అనుమానం రావడంతో మహిళ సోదరుడు బీఎన్ఆర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. పసికందు మరణానికి కారణమైన తండ్రి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే ఇంట్లోనే నన్ను తీవ్రంగా కొట్టారు
గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు గృహంలోనే తనపై మారణాయుధాలతో దాడిచేశారని ఆ పార్టీ కార్యకర్త అల్లూరి హరికృష్ణ తెలిపారు. తీవ్రంగా గాయపడిన తనకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే బయటకు నెట్టేశారని చెప్పారు. 4న నరసరావుపేటలోని ఎమ్మెల్యే అరవింద్‌బాబు గృహంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నుంచి శుక్రవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి 43మందిపై కేసు నమోదు చేశారు.హరికృష్ణ శనివారం ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘నా సొంత ఊరు నరసరావుపేట మండలం ఇసప్పాలెం. నరసరావుపేట శ్రీనివాసనగర్‌లో ఉంటూ పల్నాడు రోడ్డులో బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తున్నాను. 4న సాయంత్రం ఎమ్మెల్యేతో డీఎంహెచ్‌వోకు ఒక ఫోన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాష్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా... ప్రసాద్, సురేష్, సాయి, రాజేష్, అంకమ్మరాజు, కాళీ, ప్రేమ్‌కుమార్, నవీన్, బొట్టు సాయితోపాటు మరో 40మంది కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు పట్టుకుని బైక్‌లపై ఎమ్మెల్యే గృహంలోకి వచ్చి పూలకుండీలు, కురీ్చలు పగలగొట్టారు.అక్కడే నిలబడి ఉన్న నాపై మారణాయుధాలతో దాడి చేయడంతో నా ఎడమ చేయి మోచేతి కిందభాగంలో ఎముక విరిగింది. తల, వీపుపై గాయాలయ్యాయి. అక్కడకు వచ్చిన వారిలో సురేష్ అనే వ్యక్తి నన్ను గుర్తుపట్టి తెలిసినవాడే అనడంతో వదిలేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను తీవ్రంగా గాయపడిన నేను తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగితే బయటకు నెట్టివేసి లోపలికి వెళ్లిపోయారు. మా గ్రామం టీడీపీకి కంచుకోట. నేను కూడా అరవిందబాబు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశా. అయినా నాకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేదు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా పరామర్శించేందుకు కూడా ఎమ్మెల్యే రాలేదు.’ అని చెప్పారు. -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
వేంపల్లె: శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అనుచరుడు వేంపల్లె అజయ్‌కుమార్‌రెడ్డిపై దాడి కేసులో 10 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ చాంద్‌బాషా శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వేంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథ్‌రెడ్డి, అజ్జుగట్టు రవితేజారెడ్డిలను అసభ్య పదజాలంతో తిట్టడం, సోషల్ మీడియాలో అవహేళన చేశారనే కోపంతో అజయ్‌కుమార్‌రెడ్డిని చంపాలని నిందితులు ప్రయత్నించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. అజయ్‌కుమార్‌రెడ్డి సోదరుడు మౌనీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.ఈ కేసులో వైఎస్సార్ జిల్లా పులివెందుల శివారు శిల్పారామం వద్ద గండూరు హిదయతుల్లా, కొండాపురం మండలం డోంకుపల్లి గ్రామానికి చెందిన పందిర్ల శివకుమార్‌రెడ్డి, సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన మల్లెల మహేశ్వర్, వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన రామిరెడ్డి ధరణీశ్వరరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. పులివెందుల రోడ్డులోని స్కూల్ సమీపంలో అజయ్‌కుమార్‌రెడ్డిని హాకీ స్టిక్స్, బండరాళ్లతో కొట్టి గాయపరిచామని నిందితులు చెప్పినట్టు సీఐ తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. -
ఆకతాయికి దేహశుద్ధి
ఒంగోలు టౌన్: కొత్తగా కొనుగోలు చేసిన కారుకు పోలీసు హారన్ బిగించిన ఓ ఆకతాయి ఒంగోలు నగరంలో రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భయాందోళనలు సృష్టించాడు. ఒక మహిళ సమీపంలోకి కారు పోనిచ్చి భయపెట్టేందుకు ప్రయత్నించి దెబ్బలు తిన్నాడు. పేర్నమిట్టకు చెందిన ఓ వ్యక్తి తన సోదరుడితో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తుంటాడు. ఇటీవలే కొత్తకారు కొని.. మూడు, నాలుగు రోజుల నుంచి పగలు రాత్రీ తేడాలేకుండా పోలీసు హారన్ మోగించుకుంటూ అతివేగంగా తిరుగుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తాలుకా పోలీసు స్టేషన్ ఎదురుగా రోడ్డుపై కారు నిలబెట్టి హారన్ మోగిస్తూ రచ్చ చేశాడు. శనివారం పేర్నమిట్టలోని ఒక హోటల్ యజమానిని భయపెటేందుకు యత్నించగా అతను.. సదరు కారు నడుపుతున్న వ్యక్తిపై పెట్రోలు చల్లినట్లు చెప్పుకుంటున్నారు. అనంతరం రోడ్డుపై వెళుతున్న ఒక మహిళకు అతి సమీపంలో కారు తీసుకెళ్లి ఆటపట్టించాడు. ఆగ్రహానికి గురైన సదరు మహిళ బంధువులు, స్థానికులు కలిసి ఆకతాయిని పట్టుకొని పేర్నమిట్ట బస్టాండులోని డివైడర్ వద్ద పోల్‌కు తాళ్లతో కట్టేసి చితకబాదారు. కాగా ఇతని వ్యవహారంపై పోలీసులు శుక్రవారం నుంచే గాలిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. -
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం కారును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. దీంతో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. అయితే, సదరు కారు కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య
గుంతకల్లు: భార్య వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.... పాత గుంతకల్లుకు చెందిన వడ్డె రోహిత్‌కుమార్ (24) బజాజ్ షోరూంలో మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి భర్తను సూటిపోటి మాటలతో లక్ష్మీదేవి మానసిక క్షోభకు గురి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో లక్ష్మీదేవి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది. కాపురానికి రావాలని భర్త పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయితే తాను పెట్టిన కండీషన్లు ఒప్పుకుంటే కాపురానికి వస్తానని ఆ సమయంలో ఆమె చెబుతూ వచ్చింది. విషయం తెలుసుకున్న రోహిత్‌కుమార్ తల్లిదండ్రులు కోడలి కండీషన్ల మేరకు ఆమె పేరుతో కొంత, బాబు పేరుతో మరికొంత స్థలం రాసిచ్చిన తర్వాత కాపురానికి వచ్చింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం బాబు చనిపోయాడు. ఆ తర్వాత భర్తను వదిలి లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య వేధిస్తున్న విషయంపై ఆరు రోజుల క్రితం గుంతకల్లు రెండో పట్టణ పోలీసులకు రోహిత్ ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ గణేష్ ఇరువురి వాదనలు విన్నారు. తర్వాత పెద్దల సమక్షంలో తామే పంచాయితీ చేసుకుంటామని బాధితులు తెలపడంతో వారిని అక్కడి నుంచి పంపించేశారు. సమస్య మరింత జఠిలం కావడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రోహిత్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనలక్ష్మీదేవిపై చర్య తీసుకోవడంతో పాటు సీఐ గణేష్ అక్కడకు వచ్చి సమాధానం చెప్పాలంటూ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ప్రధాన రహదారిపై రోహిత్ బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లక్ష్మీదేవి పెట్టిన కండీషన్ల మేరకు 20 సెంట్ల స్థలాన్ని బాబుతో పాటు ఆమె పేరుతో రాసిచ్చినట్లు తెలిపారు. బాబు చనిపోయినప్పుడు లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిందన్నారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందని, బాబు చనిపోయిన రాత్రే ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని వివరించారు. అప్పటి నుంచి భర్తకు తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తూ వచ్చిందన్నారు. న్యాయం చేయాలని సీఐ గణేష్‌ను ఆశ్రయిస్తే ఆయన సైతం తమకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు రోహిత్‌ను దుర్భాషలాడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. టూటౌన్ సీఐ గణేష్ అందుబాటులో లేకపోవడంతో వన్‌టౌన్ సీసీ రామసుబ్బయ్య అక్కడకు చేరుకుని బాధితులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడి తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పుంగనూరులో ‘అధికార’ అరాచకం
సాక్షి, టాస్‌్కఫోర్స్: అన్నమయ్య జిల్లా పుంగనూరులో అధికార మదంతో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న అరాచక కాండ ఇది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. నివాసాల్లోకి చొరబడి తరిమి తరిమి కొడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కూల్చివేస్తున్నారు. టీడీపీ శ్రేణుల దాడులతో తీవ్రగాయాలైన అనేక మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఊళ్లొదిలి రహస్య ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి. సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో సుబ్రమణ్యంరెడ్డి, ఇంతియాజ్ బాషా, ప్రసాద్, భానుప్రకా‹Ù, రమే‹Ù, మునీశ్వర్, మోహన్‌బాబు, గంగులప్ప నివాసాల్లోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం కమ్మపల్లిలో వంద మందికి పైగా టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నాయకుడు సుబ్రమణ్యం రెడ్డి ఇంటి తలుపులు విరగ్గొట్టి లోపలికి జొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుబ్రమణ్యంరెడ్డిని ఈడ్చుకొచ్చి కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఆయన ఇటుకల బట్టీలోని లక్ష ఇటుకలను దౌర్జన్యంగా ట్రాక్టర్లతో తరలించుకెళ్లారు. బట్టీని ధ్వంసం చేశారు. ఫోటోలు, వీడియోలు తీయకుండా మొబైల్ ఫోన్లు లాక్కుని నేలకేసి కొట్టి నాశనం చేశారు. ఈ విషయం బయటకు పొక్కితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతామని హెచ్చరించారు. దీంతో ప్రాణ భయంతో సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం ఊరొదిలి వెళ్లిపోయింది. ఇలాంటి ఘటనలో గత నెల రోజుల్లో అనేకం జరిగాయి. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. టీడీపీ నేతల దాడుల విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు. తాగు నీటి ట్యాంకులూ కూల్చివేత వైఎస్సార్సీపీ హయాంలో నిరి్మంచిన ప్రభుత్వ ఆస్తులను సైతం టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారు. కరువు ప్రాంతాల్లో ఒకటైన పుంగనూరు నియోజకవర్గంలో ప్రజల తాగు నీటి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు. 20 వేల లీటర్ల సామర్థ్యంతో నియోజకవర్గం మొత్తం రూ.60 కోట్లతో 550 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రజలకు మంచి నీరందించే ఈ ట్యాంకులను కూడా టీడీపీ నేతలు కూల్చివేస్తున్నారు. రొంపిచెర్ల మండలం బోడిపాటివారి పల్లిలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకును రెండు రోజుల క్రితం టీడీపీ నేతలు జేసీబీలతో కూల్చివేసి, పనులకు తెచ్చిన ఇనుప కమ్మీలను ఎత్తుకెళ్లిపోయారు. రొంపిచెర్ల క్రాస్ కురప్పల్లి వద్ద రూ. 15 లక్షలతో రెండో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు. దీనిని కూడా జేసీబీలతో కూల్చివేశారు. ప్రజాధనంతో గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులను సైతం కూల్చివేయడం టీడీపీ నీచ మనస్తత్వానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికార మదం పుంగనూరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జీరి్ణంచుకోలేకపోతోంది. వారిద్దరూ పుంగనూరులో పర్యటిస్తే అక్కడ టీడీపీకి పుట్టగతులుండవన్న విషయం ఆ పార్టీ నేతలకు అర్ధమైంది. అందుకే ఎమ్మెల్యే, ఎంపీలనే పుంగనూరులో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులతో ఇద్దరినీ హౌస్ అరెస్టు చేయించారు. దాడుల పరంపర సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో పలువురి ఇళ్లలోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికార గూండాయిజం కమ్మపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి నివాసంలోకి జొరబడ్డ టీడీపీ గూండాలు ఆయన్ని చితక్కొట్టారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలను తరలించి, ఆ బట్టీని ధ్వంసం చేశారు. ఫోన్లను నాశనం చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్లిపోయారు. ఖాకీల కాఠిన్యం ఓ పక్క టీడీపీ గూండాల దాడులకు బెంబేలెత్తుతున్న ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తే వారికి ఊహించని సమాధానం ఎదురవుతోంది. మీరే ఊరొదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లిపోండంటూ పోలీసు అధికారులు కొందరు సమాధానమివ్వడం బాధితులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.పింఛన్లు నిలిపివేత ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కమ్మపల్లిలో పొన్నెమ్మ, యశోదమ్మ, శివారెడ్డితో పాటు సోమల మండలం పరిధిలో 75 మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు నిలిపివేశారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు సరఫరా నిలిపివేయండి కమ్మపల్లిలో వైఎస్సార్సీపీకి మద్దతిచ్చిన పది కుటుంబాలకు పాలు కూడా అందకుండా టీడీపీ నేతలు దాషీ్టకం ప్రదర్శిస్తున్నారు. ఈ కుటుంబాలకు పాల సరఫరా నిలిపివేయాలని టీడీపీ నేతలు డెయిరీ యజమానులకు ఫోన్‌చేసి హుకుం జారీ చేసినట్లు బాధితులు వాపోయారు. వారికి పాలు సరఫరా చేస్తే వ్యాను తగులబెట్టేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించినట్లు సమాచారం. అప్పు తీసుకోకపోయినా చెల్లించాలట పుంగనూరులో దుస్తుల దుకాణం నడుపుతున్న కె. జయంతి వైఎస్సార్సీపీకి ఓటేశారని టీడీపీ శ్రేణులు ఆమెకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా.. పోలీసుల ద్వారా ఆమెకు ఫోన్ చేయించి ‘మీరు రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారంట. వెంటనే చెల్లించకపోతే కేసు నమోదు చేస్తాం’ అని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఆమెను సంప్రదిస్తే తాను ఎవ్వరికీ బకాయిలేనని, ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఊరొదిలి వెళ్లి దాక్కోండి టీడీపీ దాడులతో కమ్మపల్లి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలీసులు కూడా ఊరొదిలి వెళ్లిపోవాలని చెబుతుండటంతో మరింత భయకంపితులవుతున్నారు. టీడీపీ నేతలు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కలి్పంచాల్సిన పోలీసులే బాధ్యత లేకుండా వ్యవహరించటంపై న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
కిడ్నీ మార్పిడి కేసు: విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగ్గుస్తున్న ఉచ్చు
సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ మార్పిడి కేసులో విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడి చేస్తామని పది లక్షలు దోచేసి.. మొహం చాటేసింది.కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడుగా వ్యవహరించారు. డీసీపీ-1ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు సీపీ శంఖబ్రత బాగ్చీ స్పెషల్ టీం వేశారు. నేటి నుంచి కిడ్నీ రాకెట్ కేసులో విచారణ జోరు అందుకుంది. నిందితులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. -
వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే!
జమ్మలమడుగు/మైలవరం: ‘మాకు మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. తమకు మామూళ్లు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో టీడీపీ నాయకులు ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్నిరోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామాళ్లు డిమాండ్ చేస్తున్నారు.వ్యాపారాలు సాఫీగా జరగాలన్నా.. లారీలు రోడ్డెక్కాలన్నా మామూళ్లు ఇవ్వాలని బెదిరించారు. అయినా యజమానులు పట్టించుకోకపోవడంతో.. కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు గురువారం తెల్లవారుజామున లారెన్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన 11 లారీలను ధ్వంసం చేశారు. మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాన్స్పోర్ట్ కంపెనీల యజమానులు, పారిశ్రామికవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. బాడుగల రూపంలో వస్తున్న ఆదాయం తమ ఖర్చులకే సరిపోవడంలేదని, డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు, లారీలకయ్యే ఖర్చులు పెరిగిపోయాయని, ఇప్పుడు ఇలా రౌడీయిజం చేస్తే తామంతా బతికేదెలా అని ట్రాన్స్పోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తలమంచిపట్నం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ హనుమంతప్పకు లారెన్స్ ట్రాన్స్‌పోర్టు మేనేజర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. చేపల పెంపకానికీ మామూళ్లు.. లేదంటే దాడే జమ్మలమడుగులో చేపల పెంచుకోవాలన్నా టీడీపీ నాయకులకు మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే దాడి చేసి చంపడానికీ వెనుకాడట్లేదు. చేపల పెంపక కేంద్రం నిర్వహిస్తున్న మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బారాయుడిని కూడా ఇటీవల టీడీపీ నాయకులు బెదిరించారు. రూ.20 లక్షలు ఇవ్వకపోతే చేపల కేంద్రాన్ని మూసేస్తామంటూ హెచ్చరించారు. వారి హెచ్చరికలను లెక్కచేయకపోవడంతో సుబ్బారాయుడు, అతని కుమారులపై దాడి చేశారు. చికిత్స కోసం వెళ్తుండగా.. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కూడా దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నాయకుల తీరుతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. -
మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం టీడీపీ నేతల దౌర్జన్యం
వజ్రకరూరు: అధికారం అండగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంతా తాము చెప్పినట్టే జరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నేతలు దౌర్జ్యనం చేశారు. దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గత 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని బోయ సుంకమ్మ నిర్వహిస్తున్నారు. ఆమెకు సహాయకురాళ్లుగా ఆమె కుమార్తెలు రాధ, లక్ష్మి ఉన్నారు. ఇన్నేళ్లలో వారిపై చిన్న ఫిర్యాదు కూడా అందలేదు. కానీ గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఏజెన్సీ కోసం బోయ సుంకమ్మను బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కూడా తమ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అందువల్ల స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ అధికారికంగా తనకు ఎవరూ ఏజెన్సీ నిర్వహించవద్దని చెప్పకపోవడంతో బోయ సుంకమ్మ ఎప్పటిలాగే చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండుతోంది. ఈ క్రమంలో గురువారం పాఠశాల వద్దకు వెళ్లిన కొందరు టీడీపీ నాయకులు సుంకమ్మపై మరోసారి దౌర్జన్యానికి దిగారు. చెబితే వినవా... ‘ఒక్కసారి చెబితే నువ్వు వినవా.. ఏజెన్సీ నుంచి తప్పుకోకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించారు. దీంతో సుంకమ్మ అది చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు వంట గదిలోని సామగ్రి, కూరగాయలు తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు. అడ్డుకోబోయిన సుంకమ్మ కూతురు రాధ, మనుమడు దొరబాబు, మనుమరాలిని పక్కకు నెట్టివేశారు. దీంతో మనస్తాపం చెందిన సుంకమ్మ వంటగదిలోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను 108లో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వజ్రకరూరు ఎస్ఐ నరేష్ ఆస్పత్రికి వెళ్లి సుంకమ్మ నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే మండల విద్యాధికారి తిమ్మప్ప కూడా ఆమెను పరామర్శించి వివరాలు సేకరించారు. కాగా అదే పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ మహేశ్వరిని కూడా టీడీపీ నేతలు బెదిరించారు. ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు స్వీపర్ మాముడూరు మహేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం వదిలేస్తే తన కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఐదుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 759 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక ఏఎస్పీ ప్రతాప్‌శివకిశోర్ తెలిపారు. ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో గంజాయి లభ్యం కాకపోవడంతో ధారకొండ పంచాయతీ గంగవరం గ్రామానికి చెందిన వండలం బాలు బద్దర్ తనకు పరిచయం ఉన్న ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ బరడబందకు చెందిన చేపల వ్యాపారి లింగుఖిలా (బాబూరావు)ను ఆశ్రయించాడు. అతని ద్వారా 759 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి రెండు బొలోరా వాహనాల్లో గూడెం, చింతపల్లి మీదుగా తాళ్లపాలెం చేర్చేందుకు లింగుఖిలాతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు వ్యాన్లలో గంజాయి తీసుకొస్తుండగా గూడెం కొత్తవీధిలోని సంస్థ కాలనీ వద్ద సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ అప్పలసూరి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వ్యాన్లలో ఉన్న బాలుబద్దర్‌తోపాటు రింతాడ పంచాయతీ కుమ్మరివీధికి చెందిన పాంగి గోవర్దన్, మాలిగుడకు చెందిన కొర్రలైకోన్ (లక్ష్మణ్), ఊబలపాలెంకు చెందిన కిల్లో శంకర్రావు, చింతపల్లి మండలం కడశిల్పకి చెందిన మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38 లక్షల విలువైన 759 కిలోల గంజాయి, రెండు వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.16,900 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లింగుఖిలా (బాబూరావు) కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళపై టీడీపీ నేత అఘాయిత్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: వీరబల్లి మండలం ఒదివీడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డయ్య బాత్రూంలో దూరి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో అక్కడ నుండి నిందితుడు పరారయ్యాడు.బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ వీరబల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయకపోగా, ఆమె పట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తనకు న్యాయం జరగకపోతే చావేశరణ్యమని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
వైఎస్సార్ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహితను కర్కశంగా నరికి చంపిన ఆటో డ్రైవర్
పొందూరు: మండలంలోని తాడివలస సమీపంలో చిన్న బొడ్డేపల్లి గ్రామానికి చెందిన వివాహిత హత్య మంగళవారం సంచలనం రేపింది. వివాహితను హత్య చేసిన ఆటోడ్రైవర్ ఆమె మృతదేహాన్ని నేరు గా పొందూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..చిన్నబొడ్డేపల్లి గ్రామానికి చెందిన అచ్చయ్య, రాజులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అమలాపురపు రాజేశ్వరి భర్త గుప్తేశ్వరరావు మూడేళ్ల కింద ట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుమార్తెతో పాటు తల్లిదండ్రులను పోషిస్తున్నారు. రెండు నెలల కిందట బొడ్డేపల్లి రైల్వేట్రాక్ పనులకు వచ్చిన నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన ఆముజూరు గోపాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్రామంలోనే వారిద్దరూ తరచూ కలిసేవారు. మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి వెళ్లడానికి సిద్ధమైన రాజేశ్వరి గోపాల్‌కు ఫోన్ చేసింది. గోపాల్ ఆటోపై చిన్నబొడ్డేపల్లికి వచ్చాడు. ఆటోలో ఇద్దరూ వాల్తేరుకు బయ లుదేరారు. అయితే తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. గోపాల్ తనతో తెచ్చుకున్న చాకుతో రాజేశ్వరి మెడపై పలుమార్లు దాడిచేశాడు. దీంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన రాజేశ్వరిని గోపాల్ తన ఆటోలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. ఆమదాలవలస సీఐ దివాకర్‌యాదవ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు అచ్చయ్య, రాజు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశారు. హత్య చేసిన గోపాల్‌తో కలి సి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తాబస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికిగల కారణాలు పూర్తి… pic.twitter.com/x5CKlHCjen— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024