-
సైబర్ నేరగాళ్లే ఎంపీడీవో ఉసురు తీశారు!
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్‌ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది. సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
మద్యం మత్తులో.. కూతురికే ఉరి
రొంపిచెర్ల: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న బిడ్డనే ఉరేసి చంపిన సంఘటన మండలంలోని పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలు మేనమామ జయరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లెకు చెందిన కె.మునిరత్నం(35), రెడ్డెమ్మ దంపతులకు ఒక కుమార్తె గౌతమి(14) ఉంది. పదేళ్ల క్రితం రెడ్డెమ్మ మృతి చెందారు. అప్పటి నుంచి గౌతమి తన తండ్రి, అవ్వతో కలసి ఉంటోంది.గౌతమి పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మునిరత్నం తల్లి ఐదు నెలల క్రితం మృతి చెందింది. అప్పుటి నుంచి ఆ ఇంట్లో తండ్రి, కుమారై జీవిస్తున్నారు. మునిరత్నం ఆదివారం రాత్రి తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉన్న కుమారైను ఏమీ పని చేయడం లేదని మందలించాడు. దీంతో గౌతమి కూడా గట్టిగా బదులిచ్చింది. వెంటనే కోపంతో సెల్ చార్జింగ్ వైర్‌ను మెడకు వేసి చంపివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకుని మృతి చెందిందంటూ ఉదయాన్నే చుట్టుపక్కల వారికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు తండ్రి మీద అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో తన బిడ్డను చార్జింగ్ వైరుతో చంపివేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే నిందితుడు మునిరత్నం పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మునిరత్నం కోసం రొంపిచెర్ల పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఎన్నో అనుమానాలు కుమారై గౌతమి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి తాను చనిపోతున్నానని తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన ఒక లేఖ సోమవారం బయటపడింది. అయితే మరోపక్క మునిరత్నమే తన కుమార్తెను చంపేశాడని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కుమార్తెపై లైంగిక దాడికి యతి్నంచి, చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోస్టుమాస్టరం నివేదికలో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు. -
విషాదం మిగిల్చిన విహారం
మైదుకూరు/దువ్వూరు: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. తెలుగుగంగ రిజర్వాయర్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన పఠాన్ రహంతుల్లా(23), ఎస్కే ముదాతీర్(22), వేంపల్లి షాహిద్(23) ఆదివారం సాయంత్రం మైదుకూరు మండల పరిధిలోని తెలుగు గంగ సబ్సిడరీ రిజర్వాయర్–1 వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పార్కులో కొద్దిసేపు గడిపిన తర్వాత రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈత వేసేందుకని రిజర్వాయర్‌లోకి దిగి గల్లంతయ్యారు. రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు.. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయాన్నే వారి స్నేహితులను వాకబు చేశారు. ముగ్గురు యువకులూ విహార యాత్రకని తెలుగు గంగ రిజర్వాయర్‌కు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. ఆ వెంటనే అక్కడికి వెళ్లగా.. రిజర్వాయర్ కట్టపై యువకుల దుస్తులు, చెప్పులు, సెల్ ఫోన్లు ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైదుకూరు, దువ్వూరు పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని.. యువకుల కోసం గాలించారు. మైదుకూరు అర్బన్, రూరల్ సీఐలు మస్తాన్, శ్రీనాథ్‌రెడ్డి అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు రిజర్వాయర్‌లో గాలించి సోమవారం మధ్యాహ్నానికి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. రిజర్వాయర్ గేట్లకు సమీపంలో.. 30 అడుగుల లోతు ఉండటంతో యువకులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. -
దాడిచేసింది వారే.. కేసు పెట్టింది వారే!
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ నాయకుడు గున్నయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సురేష్, అతడి బావ రాజయ్య, మామ వెంకటయ్య, మరికొందరు ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడిచేశారు. విజయకుమార్, గురునాథ్, చిట్టెమ్మ, బాబు, సుధాకర్‌లను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. బాధితులు ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు తీసుకువచ్చారు. టీడీపీ నేతల ఒత్తిడితో టీడీపీ వారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఆస్పత్రిలో చేరకుండా అడ్డుకుని వారిని తీసుకెళ్లి రాత్రంతా స్టేషన్లో ఉంచారు. సోమవారం వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసి న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టి సబ్‌జైలుకు పంపారు. తీవ్రంగా గాయపడిన చిట్టెమ్మ ఇచి్చన ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదుచేయలేదు. దీనిపై డీఎస్పీని అడగగా.. విచారించి కేసు నమోదుచేస్తామని తెలిపారు. ఈ నెల 19న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైననాటో డ్రైవర్ ఎర్రయ్యను హత్యచేసేందుకు టీడీపీకి చెందిన సురే‹Ù, మరికొంతమంది ప్రయతి్నంచారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో పారిపోయారు. 20వ తేదీన ఎర్రయ్య తొట్టంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిన పోలీసులు టీడీపీ నాయకుల బెదిరింపులకు తలొగ్గి సాధారణ కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని టీడీపీ నాయకులను వదిలేశారు.ఊళ్లోంచి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారు..» కూటమి నేతలు ఇళ్లల్లోకి వచ్చి దాడి చేస్తున్నారు » ఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా గారపాడు మహిళల ఫిర్యాదునగరంపాలెం: కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ ల నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలోని పల్లెలో ఉంటున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము గ్రామంలో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలకు చెందిన మహిళలు కూడా తమ ఇళ్లల్లోకి చొరబడి గొడవలకు దిగుతున్నారని, పల్లె విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బాధితులు కూరపాటి పూర్ణ, పల్లపాటి శృతి, ఏసుపొగుల సింధు, మహాలక్షి్మ, కోటేశ్వరి, బేతపూడి రాణి తదితరులు సోమవారం గుంటూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల ఫిర్యాదుల స్వీకరణలో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు.. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి వైఎస్సార్సీపీ వారిని కవి్వస్తున్నారు. అధికారం మాదే, ఈ ఐదేళ్లు గ్రామంలో ఉండటానికి వీల్లేదు.. వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. గత నెల 26న తాను ఇంటివద్ద నిలబడి ఉండగా లైట్లు ఆర్పేసి కర్రలు, సీసాలతో దాడిచేసి కొట్టి గాయపరిచారని కారసాల రంగమ్మ కన్నీరుమున్నీరైంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. ఈ దాడి గురించి స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల 24న తన మామ ఏసుపొగుల రవి, మరో పదిమందిపై సీసాలతో దాడిచేశారని మాధవి తెలిపింది. బయట నుంచి తాగునీరు తెచ్చుకోవాలన్నా భయమేస్తోందని చెప్పింది. ఆఖరికి పిల్లలపై పాఠశాలల వద్ద దాడిచేస్తున్నారని పలువురు తెలిపారు. 50కి పైగా కుటుంబాలు గ్రామం బయటే ఉంటున్నట్లు చెప్పారు. కారసాల ఆదాం, పల్లెపు రాంబాబు, శ్యాంబాబు తదితరులు గ్రామం విడిచి వెళ్లారని వారు తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని వారిని కట్టడి చేయాలని బాధిత మహిళలు విజ్ఞప్తి చేశారు. -
అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని.. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు. -
కాకినాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మురారీ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. కాకినాడలోకి గండేపల్లి మండలం మురారీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, మృతులను భీమవరానికి చెందిన వారిగా గుర్తించారు. -
పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ
సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్ క్లిక్ చేస్తే చాలు అంటూ నెట్‌ఫ్లిక్స్ ఫాలో అనే యాప్ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్మెంట్ సైబర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరుకు చెందిన రవి ఫోన్ నంబర్‌ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసినట్టు నోటిఫికేషన్ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్ అడ్మిన్ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్ పెట్టింది. గ్రూప్ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్‌షాట్స్ షేర్ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్ సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు. ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్ పనిచేయకుండా పోయింది. మెసేజ్‌లకు అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నమ్మించిమోసం చేస్తారు.. అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గ్రూప్‌లు క్రియేట్ చేసి ఫలానా స్కీమ్ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్‌లు, వెబ్సైట్లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్‌సైట్‌ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు చేయండిలా దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది. https://www. cybercrime.gov.in./ వెబ్సైట్ ద్వారా, 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్/సాధారణ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్లైన్ బ్యాంకింగ్‌ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు ఇలా..» ఢిల్లీ 58,748» బిహార్ 42,029» ఛత్తీస్‌గఢ్ 18,147» తెలంగాణ 71,426» ఆంధ్రప్రదేశ్ 33,507» కర్ణాటక 64,301 » కేరళ 23,757 -
ఒంటరితనం ఊపిరి తీసింది!
కర్నూలు సిటీ: కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం)లో చదువుతున్న నల్ల సాయి కార్తీక్ నాయుడు(20) ఒంటరితనం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామానికి చెందిన నల్ల వెంకట నాయుడు కుమారుడైన సాయికార్తీక్ ట్రిపుల్‌ఐటీడీఎంలో ఈసీఈ బ్రాంచ్‌తో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.శనివారం క్యాంపస్‌లోని కలాం హాస్టల్ భవనం 9వ అంతస్తు నుంచి దూకడంతో కుడి కాలు విరిగి, తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్యాంపస్‌కు వేసవి సెలవులు ముగిసి ఈ నెల 22 నుంచి క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సాయి కార్తీక్ క్యాంపస్‌కి వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ మానసికంగా ఇబ్బంది పడే వాడని, సమస్య ఏంటో ఎవరికీ చెప్పలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు.చదువులో ఒత్తిడి ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనం, తాను చెప్పినా ఎవరు వినిపించుకోలేదని సూసైడ్ నోటులో రాసినట్లు సమాచారం. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
రషీద్ హత్యకేసులో అసలు దోషులేరీ..?
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వినుకొండ వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ హత్యను ప్రభుత్వం నీరుగారుస్తోంది. రాజకీయ ప్రతీకార హత్య అయినప్పటికీ వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మృతుడి రక్త సంబంఽధీకులు ఇచ్చిన ఫిర్యాదులోని నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకుండా నామమాత్రంగా కొందరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు బాధిత కుటుంబం నుంచి వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజే రషీద్ సోదరుడు ఖాదర్‌బాషా ఇచ్చిన ఫిర్యాదులో రషీద్ మరణానికి కారణంగా పేర్కొంటూ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ మున్సిపాలిటీకి చెందిన కీలక టీడీపీ నేతలు షమీమ్‌ఖాన్, అయూబ్‌ఖాన్, హంతకుడు జిలానీ స్నేహితులైన కొందరు టీడీపీ రౌడీల పేర్లు ప్రస్తావించారు. అయితే పోలీసులు కేవలం హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాల పేర్లు మాత్రమే పొందుపరచి, హత్యకు కుట్ర పన్నిన ప్రజాప్రతినిధులు, పట్టణ టీడీపీ ముఖ్యనేతల పేర్లు తొలగించారు. దీనిపై తొలిరోజు నుంచి రషీద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు కుట్ర పన్నిన వారిని పక్కకు తప్పించి ఇది కేవలం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు.హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాలు అరెస్ట్రషీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు జిలానీని ఇప్పటికే అరెస్ట్ చేయగా, హత్యతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్ట్ చూపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు జిలానీ కూడా టీడీపీకి చెందిన వారే. ఈ ఏడాది జనవరి 17న ప్రచురితమై ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరంతా టీడీపీ కార్యకర్తలని, వారిపై వినుకొండలో జరిగిన ఓ దాడి కేసులో కేసు నమోదు చేశారని వార్త రాశారు. గురువారం అరెస్ట్ అయిన ఒక్కొక్కరిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీరంతా పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి హత్య ఉదంతాన్ని ముగించారు. మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేసే రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడో, ఎలా వెళ్తాడు అనేది వారం ముందు నుంచే జిలానీ, అతని అనుచరులు అక్కడ సంచరిస్తూ ఆరా తీశారు. హత్య జరిగిన ప్రాంతంలో పలు దుకాణాల వద్ద లభ్యమైన సీసీ ఫుటేజ్‌ల్లో ఈ విషయం వెల్లడైనట్టు పోలీసులు చెబుతున్నారు. రషీద్‌ను పాశవికంగా హత్య చేస్తున్న సమయంలో హంతకుడు జిలానీ అనుచరులు ఒక వలయంగా ఏర్పడి పహారా కాశారు. కొందరు హత్యకు ముందు మారణాయుధాలను అందించారు.పోలీసులపై తీవ్ర ఒత్తిడి?రషీద్ హత్య కేసులో తెరవెనుక కీలకంగా వ్యవహరించిన షమీమ్‌ఖాన్, అయూబ్‌ఖాన్‌లను ఎలాగైనా కేసు నుంచి తప్పించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ ఒత్తిడితో తాను న్యాయం చేయలేకపోతున్నానంటూ ఓ పోలీసు అధికారి బాధిత కుటుంబానికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసులో వీరిద్దరిని అరెస్ట్ చేస్తే టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటుందని అందుకు వారిద్దరిని అరెస్ట్ చేయకుండా చూడాలని పోలీసు శాఖలో ఓ ఉన్నతాఽధికారిని ఎమ్మెల్యే కోరినట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా...తన పార్టీ క్యారకర్త రషీద్ హత్యను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినుకొండకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు మనో ధైర్యం చెప్పారు. నిందితుడు జిలానీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు సతీమణి లీలావతికి కేక్ తినిపిస్తున్న ఫొటోలు వైఎస్ జగన్‌కు చూపి తమ పార్టీ వాడు కాదని టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మృతుడి తల్లిదండ్రులు ఎండగట్టారు. అయినప్పటికీ పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేపట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. రషీద్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని దేశ రాజధాని వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ప్రభుత్వం, పోలీసులు మాత్రం ఈ కేసును వ్యక్తిగత కక్షలతో అని అర్థం చెప్పేలా ప్రయత్నిస్తున్నాయి.అజ్ఞాతంలో అసలు నిందితులురషీద్ హత్యకు కుట్ర పన్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న షమీమ్ ఖాన్, ఆయూబ్ ఖాన్లు హత్య జరిగిన రోజు నుంచి వినుకొండ నుంచి పారిపోయినట్టు సమాచారం. రషీద్ హత్యకు కఽథా, స్క్రీన్‌ప్లే మొత్తం షమీమ్, అయూబ్ఖాన్లే రచించారనదే వినుకొండలో అందరినోటా వినిపిస్తోంది. ప్రధాన నిందితుడు జిలానీ, షమీమ్, అయూబ్ ఖాన్‌లపై ఈ ఏడాది జనవరిలో షాదీఖానా వద్ద జరిగిన గొడవలో నిందితులుగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వీరు ముగ్గురి మధ్య సంత్ససంబంధాలు ఉన్నాయి. హత్యానంతరం వీరిద్దరు అజ్ఞాతంలో ఉండి తమ ఫోన్లను స్విచ్ఆఫ్ చేసి మారు నెంబర్లతో మాట్లాడి రషీద్ హత్యకేసులో నిందితులను పోలీసులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. దీనికి ప్రతిఫలంగా కేసు నుంచి వీరి ఇరువురు పేర్లు తప్పించేందుకు ఒప్పందం కుదిరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యతో సంబంధం లేకపోతే వీరు పారిపోవాల్సిన అవసరమేముంది? పరారైన నిందితులు ఆశ్రయం కోసం వీరి వద్దకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు బాధిత కుటుంబం నుంచి వినిపిస్తున్నాయి. చిన్నచిన్న కేసుల్లో నానా హడావుడి చేసే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీమ్, ఆయూబ్‌లను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహించడం పోలీసుశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. -
ఏలూరులో బస్సు ప్రమాదం, వేగంగా లారీని ఢీ కొట్టి..
ఏలూరు, సాక్షి: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ వేకువజామున బస్సు ఢీ కొట్టింది. వేగానికి బస్సు ముందు భాగంగా.. లారీలోకి చొచ్చుకుపోయింది. బస్సులోనే ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే.. తన క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందించాల్సి ఉంది. -
నమ్మించి.. మత్తులో ముంచి..
తిరుపతి రూరల్ : ఫ్రెండ్ అని నమ్మించింది.. ప్రాణం కన్నా ఎక్కువ అని నమ్మబలికింది.. ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది.. నమ్మి వచ్చిన ఫ్రెండ్‌కు భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్‌పై భర్తతో లైంగిక దాడి చేయించింది.. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం మొదలెట్టింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో అమ్మకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థి (22) తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్‌రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాస్‌లోనే సహ విద్యార్థి నిగా ఉంది. తన తోటి విద్యార్థి ని నమ్మించి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణకిషోర్‌రెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. అనంతరం ఇద్దరు కలిసి విద్యార్థి కి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థి నిపై కృష్ణకిషోర్‌రెడ్డి లైంగికదాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇదంతా గతేడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగింది. ఇటీవల కర్నూలు విద్యార్థి కి తమ కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో నిశి్చతార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి విద్యార్థి ని బ్లాక్మెయిల్ చేయసాగారు. నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా, మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చి 0ది. బిడ్డ దుస్థితి చూసి లోతుగా ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన, బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారంపై తల్లి వద్ద వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. -
ఆగని టీడీపీ శ్రేణుల దాష్టీకాలు
సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల దాష్టీకాలు గురువారం రాత్రి, శుక్రవారం కూడా యథేచ్ఛగా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అడ్డూఅదుపు లేకుండా ప్రవర్తించారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపైకి వెళ్లి అనుచితంగా ప్రవర్తించడమేగాక ప్రశ్నించినందుకు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడిచేశారు. గ్రామ సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రానికి పెయింట్ వేశారు. రైతుభరోసా కేంద్రం, సచివాలయం బోర్డులు తొలగించారు. వైఎస్సార్సీపీ జెండాపోల్‌ను ధ్వంసం చేశారు. » పల్నాడు జిల్లా మర్సపెంట తండాలో టీడీపీకి చెందిన ఓ యువకుడు గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీకి చెందిన ఒక మహిళ ఇంటి తలుపు కొట్టాడు. ఒంటరిగా ఉన్న మహిళను దుర్భాషలాడాడు. ఈ విషయమై స్థానికులు టీడీపీ వారిని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో ఇళ్లముందున్న ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా వారు గృహాలపై దాడులకు తెగబడినట్లు గ్రామ సర్పంచ్ రవీంద్రనాయక్ చెప్పారు. ఆ మహిళ శుక్రవారం వెల్దుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.» ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన లింగసముద్రంలో వైఎస్సార్సీపీ మండల జేసీఎస్ కన్వీనర్ వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేశారు. లింగసముద్రం గ్రామకంఠం సర్వే నంబర్ 79లో ఆర్యవైశ్యులకు 89 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 50 ఏళ్లుగా వారు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. తమ అవసరాల నిమిత్తం ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వస్థలం అంటూ శుక్రవారం టీడీపీ నాయకులు ఆ షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఆర్యవైశ్యులను పక్కకి నెట్టిపడేశారు. అదే సమయంలో వెళ్లిన వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేసి కొట్టారు. సమాచారం అంది వచ్చిన పోలీసులు వారిని చెదరగొట్టారు. కృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, నేతలు ఖండించారు. » అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో పలువురు గడ్డపారలు, ఇతర పనిముట్లతో గ్రామ సచివాలయంలోకి చొరబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన సచివాలయ ఉద్యోగులు భయంతో బయటకు పరుగుతీశారు. దుండగులు సచివాలయంపై ఉన్న జగన్ ఫొటోతో పాటు శిలాఫలకానికి పెయింట్ వేశారు. అక్కడ పికెట్‌లో ఉన్న పోలీసులు కనీసం అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి స్పందించి ఎస్ఐ సాగర్‌తో పాటు సిబ్బందిని గ్రామానికి పంపించారు. టీడీపీ మద్దతుదారుల చర్యలను పోలీసులు అడ్డుకుని హెచ్చరించి పంపేశారు. » ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయం బోర్డులను తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అధికారుల పేర్లు ఉన్న శిలాఫలకాలను తొలగించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు, 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం గమనించిన శివప్రసాద్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి దుండగులు పరారయ్యారు. దీనిపై పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.» గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని అంజిరెడ్డినగర్లో వైఎస్సార్సీపీ జెండా పోల్‌ను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులి ఆశ్రయించనున్నట్లు వైఎస్సాÆŠ‡సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి చెప్పారు. -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
షిర్డీ టూ కాకినాడ రైలులో భారీ చోరీ.. ప్రయాణీకుల ఆందోళన
సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్‌కు ముందున్న పర్లీ స్టేష్లన్‌లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్‌లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. -
సోమిరెడ్డి అనుచరుల దురాగతం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల దురాగతాలు పెచ్చుమీరాయి. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తుల్ని ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పారిశ్రామిక రంగంపై కన్నేశారు. పరిశ్రమల యాజమాన్యాల నుంచి సొమ్ములు దండుకునేందుకు భయబ్రాంతుల్ని చేస్తున్నారు. తాజాగా.. టీపీ గూడూరు మండలం అనంతపురంలోని వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడి 16 మందిని తీవ్రంగా గాయపరిచారు. పథకం ప్రకారమే దాడి జిల్లాలోని సముద్ర తీరం వెంబడి రొయ్యల ప్రాసెసింగ్, మేత తయారీ యూనిట్లు ఉన్నాయి. టీపీ గూడూరు మండలం అనంతపురం వద్ద ది వాటర్‌బేస్ లిమిటెడ్ కంపెనీని దశాబ్దం కిందట నెలకొల్పారు. రొయ్యల ఫీడ్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఏటా రూ.200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తుంది. అందులో 200 మంది ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 150 మంది వరకు రోజువారీ లేబర్‌గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీపై టీడీపీ నేతల కన్ను పడింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే డైలీ లేబర్ పోస్టులు తమ కార్యకర్తలు సూచించిన వారికే ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు తెచ్చారు. 10 రోజుల్లో ఆ కూలీలను తొలగించి తాము చెప్పిన వారినే పెట్టుకోవాలని బెదిరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న లేబర్‌ను తొలగించేందుకు న్యాయపరమైన చిక్కులున్నాయని యాజమాన్యం కొంత సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులకు స్కెచ్ వేశారు. నిత్యం నెల్లూరు నుంచి అనంతపురం వద్ద ఉన్న కంపెనీకి ఉద్యోగులను తీసుకొచ్చే వాహనాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు వరకయపూడి వద్ద అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగులను కిందికి దించి కర్రలతో దాడి చేశారు. దాడిలో 16 మంది గాయపడ్డారు. కంపెనీ హెచ్ఆర్ హెడ్ ఉత్తమ్‌కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆయనను చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఉద్యోగుల ఆందోళన ఉద్యోగులపై పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు తెగబడటంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుల నుంచి రక్షణ కలి్పంచి న్యాయం చేయాలని కోరుతూ వరకయపూడి రచ్చబండ వద్ద ధర్నా నిర్వహించారు. కంపెనీ యాజమాన్యంపై ఉన్న అక్కసుతో ఉద్యోగులపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది ఉద్యోగులకు గాయాలైనప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కంపెనీ యాజమాన్యం జంకుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. -
కాపుకాసి కట్టెలతో దాడి
యాడికి/పెద్దవడుగూరు: రాజకీయ కక్షతో టీడీపీ నాయకులు కాపుకాసి వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి అనంతపురం జిల్లా యాడికి మండలం పుప్పాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు సుదర్శన్, రంగస్వామిలను ఓ కేసు విషయంపై పోలీసులు గురువారం యాడికికి పిలిపించారు. సాయంత్రం బైండోవర్ చేశారు. అనంతరం సుధాకర్ గ్రామానికే చెందిన మురళితో కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. వీరి వాహనం రాత్రి 8 గంటల సమయంలో గ్రామ సమీపానికి చేరుకోగా.. అప్పటికే అక్కడ కాపుకాసిన టీడీపీ నాయకులు దేవన్న, గంగిరెడ్డి, ప్రభాకర్, చరణ్, సుంకిరెడ్డి సురేష్, మహేష్ రాజు, శివ, చంద్రన్న తదితరులు కట్టెలతో దాడి చేశారు. ఈ ఘటనలో మురళి, సుధాకర్ తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఘటనా స్థలానికి రాగా, టీడీపీ నాయకులు పరారయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలునుకున్న సీఐ నాగార్జునరెడ్డి పుప్పాల చేరుకుని అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడిఅనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని లకు‡్ష్మంపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గురువారం సాయంత్రం టీడీపీ నాయకులు దాడి చేశారు. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... లకు‡్ష్మంపల్లి గ్రామంలోని మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్త సత్యంరెడ్డి బైక్‌పై ఇంటికి వెళుతుండగా, టీడీపీ నేతలు హితే‹Ùరెడ్డి, హేమంత్‌రెడ్డి వాహనానికి అడ్డు వచ్చారు. అయినప్పటికీ సత్యంరెడ్డి వారిని తప్పించుకుని ఇంటికి వెళ్లడానికి ప్రయతి్నంచారు. టీడీపీ నేతలు ఆయన వాహనాన్ని వెంబడించి అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ బ్రహ్మానందరెడ్డి, మరికొందరు వారిని ప్రశి్నంచారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు హితేష్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, రాజశేఖర్, సోమశేఖర్‌రెడ్డి తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బ్రహా్మనందరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా, సత్యంరెడ్డితోపాటు మరో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడికి కూడా గాయాలయ్యాయి. -
విషమంగానే ‘నాగరాజు’ పరిస్థితి
సత్యసాయి జిల్లా: కదిరిలో నాగుపాముతో ఆటలాడి.. కాటుకు గురైన యువకుడు నాగరాజు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అతను బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని గురువారం ఉదయం బులిటెన్ ద్వారా ప్రకటించారు. పూటుగా మద్యం సేవించిన నాగరాజు.. రోడ్డు మీద ఓ నాగుపాముతో ఆటలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న నాగరాజు ఆ యువకుడు అక్కడున్న వారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు. నాగుపాము తల వద్ద చేయి పెట్టి ఆడుతుండగా అది కాటేసింది. పాము కాటేసినా నాగరాజు దాన్ని వదలలేదు. దాన్ని కాలుతో తొక్కాడు. చివరకు అది పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వాత నాగరాజును బలవంతంగానే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. … pic.twitter.com/cV7yv0iQ2v— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024 -
ఎన్సీసీ సీనియర్ల దాష్టీకం
సాక్షి, నరసరావుపేట: క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఎన్సీసీ సీనియర్ క్యాడెట్లు పైశాచిక ఆనందంతో జూనియర్లను చితకబాదారు. సర్టిఫికెట్ కోసం ఉబికి వస్తున్న కన్నీటినీ దిగమింగుకుని జూనియర్ క్యాడెట్లు బాధను ఓర్చుకున్నారు. ఈ వీడియో ఆలస్యంగా బయటకు రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారి్థలోకం ఉలిక్కిపడింది. విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగి ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏటా ఇదే తంతువజ్రోత్సవాలు జరుపుకోబోతున్న పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ(ఎస్ఎస్ అండ్ ఎన్) కళాశాల స్థాయిలో ఎన్సీసీ విభాగం ఉంది. ఇక్కడ ఏటా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై వికృతచేష్టలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఏటా బీ సరి్టఫికెట్ పరీక్షకు వెళ్లే క్యాడెట్లను సీనియర్లు విచక్షణారహితంగా వెదురు బెత్తాలతో కొట్టడం ఇక్కడ ఆనవాయితీగా ఉందని సమాచారం. సీనియర్లు కొట్టే దెబ్బలకు చర్మం లేచిపోయి భరించలేని నొప్పితో ఎంతో మంది జూనియర్లు నరకయాతన అనుభవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైరలైన వీడియోలోనూ సీని యర్లు జూనియర్లను చితకబాదిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో ఘటన గత ఫిబ్రవరి 3,4 తేదీలలో చీరాలలో జరగనున్న ఎన్సీసీ బీ–సరి్టఫికెట్ పరీక్షకు వెళ్లే 20 మంది క్యాడెట్లను సీనియర్లు 2 తేదీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చితక్కొట్టారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తమను తమ సీనియర్లు ఇంత కంటే ఎక్కువగా కొట్టారని వీడియోలో కామెంట్ చేయటం ఈ తంతు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నదనేందుకు నిదర్శనంగా ఉంది. క్యాడెట్ల పరేడ్‌ను పర్యవేక్షించాల్సిన ఎన్సీసీ ఆఫీసర్ డ్రిల్ సమయంలో ఉండరని విద్యార్థులు బుధవారం చెప్పారు. డ్రిల్ ఉన్న రోజు సాయంత్రం ఆలస్యంగా హాజరయ్యే క్యాడెట్లను క్రమశిక్షణ పేరుతో చిత్రహింసలకు గురిచేస్తుంటారని పేర్కొంటున్నారు. శృతి మించుతున్న ర్యాగింగ్!పల్నాడు జిల్లా నరసరావుపేటలోని SSN కాలేజీలో NCC ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి వేళలో పిలిచి కట్టెలతో కొడుతున్న సీనియర్ విద్యార్థులు. pic.twitter.com/YxldJoRNew— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024నోరువిప్పని యాజమాన్యం ఘటనపై ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల యాజమాన్యం నోరు విప్పడం లేదు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్ డాక్టర్ సోము మల్లయ్య, ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె.రాజు, బాధిత విద్యార్థులను తన చాంబర్‌కు పిలిపించుకొని విచారణ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో ప్రిన్సిపల్ డాక్టర్ మల్లయ్య ఘటనపై విచారణ జరుపుతున్నామని మొక్కుబడిగా ప్రకటించారు. కేసు నమోదు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి బుధవారం ఉదయం కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ దాడిలో గాయపడిన విద్యార్థులను ఘటనపై ఆరా తీశారు. తమపై సీనియర్లు అజయ్‌కుమార్, గోపీకృష్ణ మరో నలుగురు కలిసి దాడి చేశారని సీహెచ్ పాల్ థామస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా వివరణ కోరేందుకు కళాశాల హాస్టల్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె.రాజు, సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు దురుసుగా ప్రవర్తించారు.ఏఐఎస్ఎఫ్ ధర్నా.. ఎన్సీసీ జూనియర్ క్యాడెట్లపై సీనియర్ల దాషీ్టకాన్ని నిరసిస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ అండ్ ఎన్ కళాశాల ఎదుట, హాస్టల్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం.నాగేశ్వరరావు, గోపిచంద్, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కాసా రాంబాబు, పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాష్టీకం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి. దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైఎస్సార్సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తార’ంటూ మునిసిపల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్చార్జ్ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్‌కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. పట్టించుకోని పోలీసులు ఈ అమానుష దాడి సోమవారం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న బాధిత మహిళలు పద్మ, కల్పనను బంధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల బంధువులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాస్పత్రిలో సైతం ఎంఎల్సీ (మెడికో లీగల్ కేస్) నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడా పట్టించుకోలేదు.‘చంపేస్తారు.. కాపాడండి’ ‘సార్.. మేం దళిత మహిళలం. ఇంటిముందు కంపచెట్లు తొలగించమని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవథ చేసి కొట్టారు. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేం సాధారణ మహిళలం. భవిష్యత్‌లో మమ్మల్ని బతకనిస్తారన్న నమ్మకం లేదు. కచి్చతంగా చంపేస్తారు. దయవుంచి కాపాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్‌ను, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నాగూర్‌హుస్సేన్, ముతుకూరు బీబీ, స్టాలిన్, జగ్గు, కుళ్లాయప్ప, జగదీ‹Ù, అల్లాబకాష్ తమపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
తిరుపతి: ఇష్టంలేని పెళ్లి చేశారని టెక్కీ ఘాతుకం
తిరుపతి క్రైం: తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం రాత్రి తిరుపతి పద్మావతినగర్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన దాస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. దాస్ సోదరుడు గుడిమెట్ల మోహన్ (36) చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడికి 2019లో అన్నావదినలు వివాహం జరిపించారు. వివాదాల నేపథ్యంలో 2021లో భర్త మోహన్‌ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత తమ్ముడి భార్య, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన దాస్ ఇద్దరూ కాపురం చేసుకునేలా ఒప్పించాడు. ఆ సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేశావంటూ దాస్‌పై తమ్ముడు మోహన్ దాడి చేశాడు. కొంతకాలం అనంతరం మోహన్ అతడి భార్య మధ్య గొడవలు ప్రారంభం కావటంతో మోహన్ భార్య తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్న మోహన్ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. రెండు రోజుల క్రితం తిరుపతి వచి్చన మోహన్ బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద విడిచిపెట్టి బజార్‌కు వెళ్లాడు. అన్న ఇంట్లో లేని సమయంలో తిరిగి వచ్చిన మోహన్ కత్తితో వదిన, అన్న కుమార్తెల గొంతుకోశాడు. ఆ తరువాత తాను గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్ ఇంటికి చేరుకోగా.. తలుపులు లోపలికి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెనుక డోర్ తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. తమ్ముడు గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన తమ్ముడు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నాడని దాస్ చెప్పాడు. భార్యాభర్త విడిపోవడంతో ఇద్దర్నీ కలిపేందుకు ప్రయత్నించానని తెలిపాడు. తనపై కోపం పెంచుకుని చివరకు ఇలా చేశాడని వాపోయాడు. -
కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. -
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
ఎంపీడీవో అదృశ్యం విషాదాంతం
పెనమలూరు/నరసాపురం/కోనేరుసెంటర్(మచిలీపట్నం)/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యం ఘటన చివరికి విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని విజయవాడలోని మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో మంగళవారం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఈ నెల 15వ తేదీన ఎంపీడీవో అదృశ్యం కాగా... ఆయన సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సిగ్నల్ ఆధారంగా మధురానగర్ వంతెన వద్ద నుంచి ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేశారు.ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ వంతెనకు 200 మీటర్ల దూరంలో పిచ్చిమొక్కల అడుగుభాగాన కుళ్లిపోయిన దశలో వెంకటరమణారావు మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరులో వెంకటరమణారావు అంత్యక్రియలు నిర్వహించారు.పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. కాగా, ఒత్తిళ్ల వల్లే వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు శవపంచనామా సందర్భంగా తెలిపారు. మాధవాయిపాలెం ఫెర్రీ సొమ్ము రూ.55లక్షల బకాయి కారణంగా మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరసాపురం ఎంపీడీవో కుటుంబానికి న్యాయం చేస్తాం: పవన్ నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు మరణం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచి్చన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.అన్నోన్ నంబర్ల నుంచి ఫోన్లు.. సంబంధం లేని ఖాతాలకు డబ్బులు బదిలీ!కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ తెలియకపోవడంతో ఆయన ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అన్ నోన్ నంబర్ల నుంచి వెంకటరమణారావుకు ఫోన్లు వచి్చనట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరికి, హైదరాబాద్‌కు చెందిన ఒకరికి, మరికొన్ని గుర్తుతెలియని ఖాతాలకు ఆన్లైన్లో ఎంపీడీవో డబ్బులు బదిలీ చేసినట్లు వెలుగుచూసింది.అయితే, మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో రూ.55 లక్షలు బకాయి ఉండగా, తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిన వెంకటరమణ కొంత నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో జమ చేశారని చెప్పారు. -
పల్నాడులో మళ్లీ పచ్చ మూకల అరాచకం
పెదకూరపాడు/నగరంపాలెం: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం.సాంబిరెడ్డికి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్ యార్డు చైర్మన్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పెదకూరపాడు ఇన్చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాలయానికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచరులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు.తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూరపాడు మండలం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారుల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోదర్‌రెడ్డి, గంగాధరరెడ్డికి గాయాలయ్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా పది మంది దాడి చేశారు.ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భార్య లావణ్య) కారునే అడ్డుకుంటారా అంటూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.దారుణంతెల్లారక ముందే.. దుకాణాలు కూల్చేశారు!విజయవాడ బుడమేరు వంతెన సెంటర్లో ఘటన.. లబోదిబోమంటున్న బాధితులుమధురానగర్ (విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటినుంచి పేదోడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నడి»ొడ్డునున్న బుడమేరు సెంటర్లోని చిరువ్యాపారుల దుకాణాలను మంగళవారం తెల్లవారుజామున కూలి్చవేయడంతో వారంతా నడిరోడ్డున పడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా తమ బతుకుపై దెబ్బకొట్టారని వారు లబోదిబోమంటూ రోడ్డెక్కి నిరసనకు దిగారు.వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బుడమేరు వంతెన సెంటర్లో పలువురు చిరువ్యాపారాలు సాగిస్తూ 40 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కావడంతో పది రోజుల క్రితం దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమను కలిసి గోడు విన్నవించుకోగా.. తాను అధికారులతో మాట్లాడతానని చెప్పి పంపించి వేశారు. దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే మంగళవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ టౌన్‌ఫ్లానింగ్ అధికారులు, పోలీసుల సహకారంతో దుకాణాలను కూలి్చవేశారు. సమాచారం తెలుసుకున్న దుకాణదారులు లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 40 ఏళ్లుగా దుకాణాలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు అర్ధాంతరంగా దుకాణాలు తొలగిస్తే.. ఎక్కడకు వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తాళాలు వేసి ఉన్న దుకాణాలు కూలి్చవేశారని, తమకు పునరావాసం కలి్పంచాలని డిమాండ్ చేస్తున్నారు.దుర్మార్గంశిలాఫలకంలోని చిత్రాలను పగులకొట్టారు⇒ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివాలయ భవనం శిలాఫలకాన్ని పచ్చ మూకలు సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్ల ఫొటోలను ఏర్పాటు చేశారు.పచ్చమూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకా ప్రతాప్ ఫొటోలను పలుగులతో పగులగొట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివాలయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. – నూజివీడుదాష్టీకం అభాగ్యురాలి జీవితం చిదిమేశారు⇒ విశాఖలో యువతిపై అత్యాచారం⇒ కేజీహెచ్‌కు బాధితురాలు తరలింపు⇒ గోప్యంగా ఉంచుతున్న పోలీసులు⇒ కొద్ది రోజుల క్రితమే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి⇒ ఆ ఘటన మరువకముందే మరో దారుణంమధురవాడ (విశాఖపట్నం): విశాఖపట్నంలోని మధురవాడలో కొద్ది రోజుల కిందట ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మూకలు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ ఘటన విశాఖ నార్త్ సబ్ డివిజన్ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి కొమ్మాది జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువతి చోడవరం ప్రాంతం నుంచి వచ్చి కొమ్మాది జంక్షన్ వద్ద ఉన్న ఒక బేకరీలో పనిచేస్తోంది.ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెపై బేకరీ–హాస్టల్‌కి మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న కొందరు యువకులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. రాత్రి ఒంటి గంట సమయంలో బాధితురాలు హాస్టల్‌కి వెళ్లింది. కాసేపటికే వాంతి చేసుకుంది. హాస్టల్ వార్డెన్ పరిశీలించగా యువతి చెంపపై గాయం కూడా కనిపించింది.దీంతో అనుమానం వచ్చిన వార్డెన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే పీఎం పాలెం పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పక్కనే ఉన్న గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనలతో విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అయితే బాధితురాలితో మాట్లాడేందుకు ఎవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ దారుణ ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయమై నార్త్ జోన్ ఏసీపీ సునీల్‌ను వివరణ కోరగా అత్యాచారం లాంటిది ఏమీ లేదన్నారు. యువతికి చిన్న దెబ్బలు తగిలాయని.. విచారణ చేస్తున్నామని తెలిపారు.