-
టీడీపీ నేత హత్యకేసు: వెలుగులోకి దారుణ నిజాలు
కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణం హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. టీడీపీలో శ్రీనువాసులకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ హత్యను వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్, హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన చోటు చేసుకోగా, నేడో-రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. -
ఏలూరులో మహిళపై సామూహిక అత్యాచారం
ఏలూరు టౌన్: కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఏలూరులో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భర్తను చితక్కొట్టి.. భార్యను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆ మృగాళ్ల ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు వెంటనే స్పందించకపోవడం, ఘటన వివరాలు ఓ వ్యక్తి వెంటనే తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే.. కూటమి సర్కారులో మహిళలకు భద్రత కరువైందన్న దానికి తార్కాణంలా ఈ ఘటన నిలుస్తోంది.భర్త ఫిర్యాదుతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ఏలూరు జీజీహెచ్‌లో వైద్యచికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన భార్యాభర్తలు జీవనోపాధి కోసం 20 రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ హోటల్లో పనికి కుదిరారు. రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న ఆధ్యాతి్మక వేదిక రామకోటిలో నిద్రపోయి.. ఉదయం లేచి పనులకు వెళుతున్నారు. జీతం వచ్చాక అద్దె ఇల్లు కూడా తీసుకోవాలని భావించారు. వీరు ఇలా జీవించడం చూసిన ముగ్గురు జులాయి యువకులు కొద్ది రోజులుగా భర్తతో స్నేహంగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు భర్తకు మద్యం తాగించారు. అతను మత్తులో మునిగి నిద్రపోగా.. అతని భార్య (35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయగా.. మెలకువ వచి్చన భర్త వారిని అడ్డగించాడు. యువకులు బలమైన కర్రతో భర్త కాళ్లను చితక్కొట్టారు. అనంతరం మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె ముఖంపైనా బలంగా కొట్టారు. పోలీసుల అలసత్వం కాళ్లపై బలంగా దెబ్బతిన్నా.. భర్త రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరిచాడు. సినిమా చూసి అటుగా వెళుతున్న బాలాజీ అనే యువకుడు ఇది గుర్తించి డయల్ 100కు ఫోన్ చేయగా సిబ్బంది పట్టించుకోలేదు. చేసేది లేక ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పగా.. వారు వెంటనే స్పందించకుండా ఆలస్యం చేశారు. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో బాలాజీ.. తన స్నేహితులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లాడు. వీరు వెళ్లాక నిందితులు ముగ్గురూ బాధిత మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏలూరు వన్‌టౌన్ గజ్జవారి చెరువు వద్ద బిట్టు బార్ ఎదురుగా రోడ్డుపై నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జులాయిగా తిరిగే ఈ నిందితులు ఏలూరు టీచర్స్ కాలనీలో చెంచుకాలనీ రోడ్డు ప్రాంతానికి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేట, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన నారపాటి నాగేంద్ర, ఎంఆర్ఆర్ కాలనీ 13వ రోడ్డు ప్రాంతానికి చెందిన గడ్డి విజయకుమార్ అని పోలీసులు వెల్లడించారు. -
ఐదేళ్లలో అందరినీ చంపేస్తాం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరినీ చంపేస్తాం.. రోజు ఇళ్ల మీదకు వచ్చి కొడతాం. వైఎస్సార్సీపీ నా కొడుకులు ఎవడడ్డమొస్తాడో రమ్మను. ఒక్కొక్కరి అంతు చూస్తాం’ చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో శనివారం తెలుగుదేశం కార్యకర్తల హెచ్చరిక ఇది. మంత్రి అనగాని ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గీయులు రెచ్చిపోయి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గుళ్లపల్లిలో శుక్ర, శనివారాల్లో చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు అనుచరుడైన రిటైర్డ్ ఆర్మీ జవాను సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. ఇంటిని ధ్వంసం చేసి, సంపత్‌కుమార్‌తో సహా ఐదుగురిని గాయపరిచిన వారు.. రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వారందరినీ చంపేస్తామంటూ బెదిరించారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ కార్యకర్త కుమార్ మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్త సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో రాళ్లతో ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. బూతులు తిట్టి వెళ్లిపోయారు. శనివారం 15 మందితో కలిసి కుమార్ మళ్లీ సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశాడు.ఒక్కసారిగా ఇంట్లోకిదూరి బూతులు తిడుతూ దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో సంపత్‌కుమార్, ఆయన బాబాయి గాలి శ్రీనివాసరావు, తమ్ముడు గాలి శివకృష్ణ, మరో ఇద్దరు గాయపడ్డారు. గాలి శ్రీనివాసరావు దవడకు పెద్ద గాయమైంది. సంపత్‌కుమార్‌కు ఎదపైన, పొట్టమీద గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత తెలుగుదేశం వర్గీయులు మరోసారి సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. దాడులు, ఆస్తుల ధ్వంసం బాధ్యతాయుతమైన మంత్రి అనగాని నియోజకవర్గంలో రెండు నెలలుగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ వారు దాడులు చేస్తున్నారు. ఆస్తులను «ధ్వంసం చేస్తున్నారు. బలహీనవర్గాలపై ఈ తరహా దాడులు పెరిగాయి. ఊళ్లు విడిచి వెళ్లకపోతే చంపేస్తామని మైకు అనౌన్స్మెంట్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఊరువదలి వెళ్లక పోతే చంపేస్తామని టీడీపీ మూకలు హెచ్చరించడంతో రెండునెలలు అజ్ఞాతంగా గడిపిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు నాలుగు రోజుల కిందట సొంత గ్రామం గుళ్లపల్లికి వచ్చారు.ఆయన రాగానే తెలుగుదేశం వర్గీయులు ఆయన అనుచరులపై దాడులకు దిగారు. ఇటీవల తమ ఇంటివద్ద అరుగుపై కూర్చుని ఉన్న వైఎస్సార్సీపీ నేతలు వాకా వెంకటేశ్వరరావు, వీరంకి శివయ్యలపై కర్రలతో దాడిచేసి కొట్టి గాయపరిచారు. కస్తూరివారిపేటలో ఆంధ్రప్రభ విలేకరి యనుముల వెంకటేశ్వరరావు ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు. రాం»ొట్లవారిపాలేనికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజేష్‌కుమార్ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్, సర్పంచ్ల సంఘం నాయకుడు ప్రసాదరెడ్డిని గ్రామం వదలి పెట్టకపోతే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రసాదరెడ్డి గ్రామం వదలిపెట్టి వెళ్లిపోయారు. నగరం, నిజాంపట్నం తదితర మండలాల్లోను ఈ తరహా దాడులు పెరిగాయి. టీడీపీ మూకల దాడులు తట్టుకోలేక నియోజకవర్గంలోని వందలాదిమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు. స్పందించని పోలీసులు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నా పోలీసులు ఏ మాత్రం స్పందించడం లేదు. దాడుల గురించి తెలిసినా తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం వర్గీయుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన వారి వద్దకు వెళ్లి మొక్కుబడిగా కేసు నమోదు చేస్తున్నారు. -
భర్త అనుమానం.. పెను‘మంటలై’..
రాయచోటి: భర్త అనుమానానికి తోడు.. వేధింపుల ధాటికి తట్టుకోలేక ఇద్దరు బిడ్డలతో సహా ఓ తల్లి సజీవదహనమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా పది సంవత్సరాల కిందట గాలివీడుకు చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మనోహర్ (8), మన్విత (5) సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్ దేశంలో ఉంటూ భార్య, పిల్లలను రాయచోటి పట్టణం బోస్‌నగర్ తొగటవీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపుతూ జీవనం సాగించేది. రెండు సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా తను నివాసం ఉంటున్న ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్ ద్వారా వేధించేవాడు. వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం ఆరుగంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలు ఇద్దరినీ పట్టుకుని రమాదేవి (34) గ్యాస్‌బండకు నిప్పు అంటించి ఆ మంటల్లో ఆహుతి అయింది. ఇంటిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. అప్పటికే మంటల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు కాలిపోయారు. రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
దేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్డు, డిజిటల్ చెల్లింపులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశంలో 2016లో పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం వచ్చిన మార్పుల్లో భాగంగా కార్డు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏకంగా రోజుకు సగటున 800 ఆన్లైన్ ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. సుమారు రూ.2,110 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపింది. – సాక్షి, అమరావతిఅధిక మోసాలు ఈ రూపాల్లోనే» బ్యాంకు ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ, ఇతర వివరాలను వారికి తెలియజేయడం వల్లే అధికంగా ఆరి్థక మోసాలు జరుగుతున్నాయి.» ఖాతాదారులు బోగస్ ఈ–కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు రెండో స్థానంలో ఉన్నాయి. » బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్/బ్రీచ్ ద్వారా పాల్పడుతున్న నేరాలు మూడో స్థానంలో ఉన్నాయి.» బ్యాంకు ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధార్, పాన్ కార్డ్, ఓటీపీ వివరాలను ఇతరులకు తెలియజేయకూడదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. తమ వివరాలను ఇతరులకు వెల్లడించడం ద్వారాగానీ, అనధికారిక లావాదేవీలతో సంభవించే ఆరి్థక మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవని, దీనిపై 2017లోనే నిబంధనలు రూపొందించామని గుర్తుచేసింది.ఆర్బీఐ నివేదికలోని ప్రధాన అంశాలు»2023–24లో దేశంలో 2.90 లక్షల ఆన్లైన్ ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 800 కేసులు నమోదు కావడం గమనార్హం. » రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082 నమోదయ్యాయి. మిగిలిన కేసులతో కలిపి 2023–24లో మొత్తంమీద 2.90లక్షల ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. » 2016 తర్వాత ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. » ఆన్లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీస్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2,110 కోట్లు కొల్లగొట్టాయి. వాటిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో మొత్తం రూ.1,457 కోట్లు స్వాహా చేశారు. రూ.లక్ష కంటే తక్కువ కొల్లగొట్టిన కేసుల్లో మొత్తం రూ.653 కోట్లు దోచుకున్నారు.2023–24 లో దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు ఇలా..» మొత్తం కేసులు 2.90 లక్షలు» రోజుకు నమోదైన సగటు కేసులు 800» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082» మొత్తం స్వాహా చేసిన మొత్తం రూ. 2,110 కోట్లు -
చంద్రగిరిలో యధేచ్చగా గంజాయి రవాణా!
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో జోరుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా వెలుగుచూసింది. గాదంకి టోల్ ప్లాజా దగ్గర ఓ కారు అతివేగంగా దూసుకెళ్లింది. అయితే స్పీడ్ బ్రేకర్ వద్ద కారు డిక్కీలో నుంచి రెండు పార్సిల్స్ కింద పడ్డాయి. పోలీసులు వాటిని తనిఖీ చేయగా.. అందులో గంజాయి కనిపించింది. అది రెండు కేజీల దాకా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల్లో కారు వెళ్లిన దృశ్యాలు నమోదు కాగా.. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్‌కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
నరకం చూపాడని కొట్టి చంపారు!
మలికిపురం: ఎన్నో ఊసులు చెప్పాడు.. మరెన్నో ఆశలు కల్పించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని ఇంటి నుంచి తీసుకువెళ్లాడు.. తర్వాత నరకం చూపించాడు. గంజాయికి బానిసైన ఆ యువకుడు తన ప్రియురాలిని కూడా గంజాయి తాగమని బలవంతం చేసేవాడు. ఆ మత్తులో యువతిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. చివరికి ఆ బాధ భరించలేని ఆ యువతి ఆ యువకుడి చెర నుంచి తప్పించుకుని తన అన్న వద్దకు చేరుకుంది. జరిగిన విషయం చెప్పి విలపించింది. అక్కున చేర్చుకున్న యువతి సోదరుడు పథకం వేశాడు. నమ్మించి మోసం చేసిన ఆ యువకుడిని యువతి, సోదరుడు, అతని స్నేహితుడు కలసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించి రాజోలులో సీఐ గోవిందరాజు వివరాలు వెల్లడించారు. ఆ ఆసక్తికర విషయాలు ఇలా.. మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి, మలికిపురానికి చెందిన పడమటి నోయల్ జార్జి (19) ప్రేమించుకున్నారు. ఆరు నెలలు కాకినాడలో సహజీవనం చేశారు. నోయల్ మద్యం, సిగరెట్లు తాగుతూ, గంజాయికి బానిస అయ్యాడు. తనతోపాటు ప్రశాంతిని కూడా తాగమని ఇబ్బంది పెట్టి శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీనిని తట్టుకోలేక ప్రశాంతి ఈ నెల 9న కాకినాడ నుంచి గుడిమెళ్లంకలో తన అన్నయ్య రాపాక ప్రకాష్ వద్దకు వచ్చేసింది. అక్కడ నోయల్ జార్జి బాధపెట్టిన విషయాలు చెప్పి విలపించింది.పథకం రచించి..తన చెల్లెలిని బాధ పెట్టిన నోయల్ జార్జిపై కక్ష తీర్చుకోవాలని రాపాక ప్రసాద్ పథకం రచించాడు. అతని స్నేహితుడైన రాజోలు గ్రామస్తుడు యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్, చెల్లి రాపాక ప్రశాంతితో కలిసి నోయల్ జార్జిని చంపేయాలని ప్లాన్ చేశాడు. 9న రాత్రి రాపాక ప్రశాంతి సెల్ నుంచి నోయల్ జార్జికి ఫోన్ చేయించి దిండి– చించినాడ బ్రిడ్జి వద్దకు రావాలని చెప్పించాడు. అక్కడి రాగానే ఇనుప రాడ్లతో నోయల్ జార్జిని కొట్టి చంపి బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి పడేశారు. నోయల్ జార్జి తీసుకువచ్చిన మోటార్ సైకిల్‌ను బ్రిడ్జి వద్ద పెట్టి అక్కడ నుంచి నోయల్ జార్జి అదృశ్యమైనట్లు సృష్టించి పారిపోయారు. రెండు రోజుల తర్వాత నోయల్ జార్జి తండ్రి పడమటి రత్నంరాజు తన కుమారుడి ఆచూకీ కోసం ఫిర్యాదు చేయగా మలికిపురం ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 12న నోయల్ జార్జి మృతదేహం అంతర్వేది పల్లిపాలెం అన్నాచెల్లెలు గట్టు సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాపాక ప్రసాద్, రాపాక ప్రశాంతి, యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ గోవిందరాజు వివరించారు. -
కూలీలను కబళించిన మృత్యు శకటం
కర్నూలు (హాస్పిటల్): వారంతా కూలీలు. వానలు కురవక.. చేద్దామంటే పనులు దొరక్క పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టిన కూలీల్లో ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆటోడ్రైవర్ సహా 17 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు జిల్లాలో వర్షాభావంతో వ్యవసాయం పడకేసింది. పనులు కూడా దొరకని పరిస్థితుల్లో కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్నారు. రోజులాగే గురువారం స్టీరింగ్ ఆటోలో 20 మంది కూలీలు తెలంగాణలోని ఉండవెల్లి మండలం కంచుపాడు బయలుదేరారు. ఆ ఆటోను కర్నూలు –హైదరాబాద్ హైవేపై జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ సమీపంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు వద్ద వెనుక నుంచి 20 టైర్లు గల భారీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పైకెగిరి కింద పడింది. ఆటోలో ఉన్న లక్ష్మీదేవి (58) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన 19 మందిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు మూడు అంబులెన్సుల్లో తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమాదేవి అలియాస్ తెలుగు సుజాత (40) మృతి చెందింది. ప్రియాంక (18), అనిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్ నరసింహులు (40)తోపాటు లక్ష్మీదేవి (60), రాధ (40), మద్దిలేటి (50), వరుణ్‌కుమార్ (13), కె.వరలక్ష్మి (44), పద్మ (45), రమాదేవి (40), నందు (17), భాస్కర్ (47), పావని (25), లక్ష్మీదేవి (50), లక్ష్మీదేవి (50), చిట్టెమ్మ (60), వరలక్ష్మి(47)తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. క్షతగాత్రులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ కిక్కిరిసిపోయింది. క్షతగాత్రులకు ప్రజాప్రతినిధుల పరామర్శ ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కోడుమూరు వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ ఆదిమూలపు సతీష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరిహారం కోసం డిమాండ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం, పనిచేసిన వారికి 11 నెలలైనా బిల్లులు రాకపోవడం వల్ల పొట్టకూటి కోసం వెళ్లి వారు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
భవిష్యత్తును చిదిమేసింది..
ఓబులవారిపల్లె : వేకువ జామున నిద్రలేచి హడావిడిగా పుస్తకాలు సర్ది.. తన గారాల పట్టిని ముస్తాబు చేసి స్కూల్ వ్యాన్‌లో కూర్చోబెట్టి టాటా చెప్పి మురిసిపోయిన ఆ తల్లి ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. వ్యాన్ బయలు దేరిన ఐదు నిమిషాలకే తన బిడ్డ తనువు చాలించిందనే పిడుగుపాటు లాంటి వార్త ఆ తల్లి గుండెను పిండేసింది. దేవుడా ఎంత పనిచేశావు అంటూ ఆ మాతృమూర్తి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. ఓబులవారిపల్లె మండల కేంద్రానికి చెందిన వీరంరెడ్డి మధుసూధన్‌రెడ్డి, అరుణ దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. కుమార్తె భవిష్య(07), ఏడాది వయసున్న కుమారుడు వీరం రెడ్డి మోక్షజ్ఞ సాయికుమార్‌రెడ్డి ఉన్నారు. ఎంతో చలాకీగా ఉండే భవిష్య చిన్నఓరంపాడు అయ్యలరాజుపల్లె శ్రీవాణి హైస్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ప్రతి రోజు మాదిరిగా సోమవారం ఉదయం పాఠశాలకు వ్యాన్‌లో బయలు దేరింది. పాఠశాల సమీపంలో వ్యాన్ బోల్తా పడిన ఘటనలో భవిష్య అక్కడికక్కడే మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. వ్యాన్ డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, కాలం చెల్లిన బస్సులను వాడటం, అతి వేగంగా నడపడం తదితర కారణాలు తమ బిడ్డను బలిగొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. మరో చిన్నారి ప్రాణాలు బలి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. -
సహచరుల లైంగిక వేధింపులకు డెంటల్ విద్యార్థి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: నెల్లూరులోని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన డెంటల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విద్యార్థి ప్రదీప్ కుమార్(19) సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య విద్యార్థుల లైంగిక వేధింపులు భరించలేక కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారాయణ ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చారు. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటూ రింగ్‌లు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నారాయణకు అఖిల్‌కుమార్, ప్రదీప్‌కుమార్ కుమారులు. పెద్ద కుమారుడు «అఖిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రదీప్‌కుమార్ నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్‌కుమార్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద కుమారుడు అఖిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ నిర్ఘాంతపోయారు. వెంటనే స్నేహితులతో కలిసి వాహనంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడే మంగళవారం ప్రదీప్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు.లైంగిక వేధింపులు భరించలేకే నా తమ్ముడు ఆత్మహత్యవైద్య విద్య చదువుతున్న రాహుల్ అనే విద్యారి్థతోపాటు మరో ఇద్దరు కలిసి గత ఏడాది సెపె్టంబర్ నుంచి లైంగికంగా వేధిస్తున్నారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నా తమ్ముడు ప్రదీప్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాడు. వెంటనే తాడిపత్రిలోని తల్లిదండ్రులకు, నెల్లూరులోని కళాశాలకు ఫోన్ చేశా. అప్పటికే కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోయాడు. – మృతుడి అన్న అఖిల్‌కుమార్ -
ఆర్మేనియాలో ఆంధ్రా యువకుడి మృతి
పెద్దదోర్నాల: జీవనాధారం కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాల మండల పరిధిలోని హసానాబాదకు చెందిన చిన్న ఆవులయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఒంటేరు శివనారాయణ (31) బీటెక్ పూర్తి చేసి యూరప్‌లోని ఆర్మేనియాలో ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం తల్లిదండ్రులకు తాను మరో కంపెనీలో ఉద్యోగంలో చేరానని, అక్కడే నలుగురు కలిసి రూం తీసుకుని ఉంటున్నామని తెలిపాడు. గురువారం మద్యం పార్టీ చేసుకున్న మిత్రులు తనకు ఓ బాటిల్లో నీరు ఇచ్చారని, అది తాగటం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపాడు. అనంతరం తాను వైద్యశాలలో చేరినట్లు శుక్రవారం సమాచారం అందించాడు. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలను పంపించిన సహచరులు.. అదే రోజున శివనారాయణ చనిపోయాడంటూ సమాచారం అందించడంతో తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. సహచరుల తీరుపై అనుమానాలు.. ‘రూ.2 లక్షల పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే మృతదేహాన్ని ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేసిన శివనారాయణ సహచరులపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, సమాచారం ఇచ్చినప్పటి నుంచి వారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఏం చేయాలో అర్ధంకాక మృతుని తల్లిదండ్రులు, దిక్కతోచని స్థితిలో విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్ మృతి
తొండంగి: బైక్ రైడర్‌గా, యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో పేరొందిన పొగాకు సోంబాబు (క్రేజీ సొంబాబు) బైక్‌పై వెళ్తుండగా కాకినాడ జిల్లా బెండపూడి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. నెల్లూరుకు చెందిన పొగాకు సోంబాబు (35) వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రకృతి అందాలను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో స్నేహితుల వివాహానికి తోటి బైక్రైడర్స్తో కలిసి హాజరయ్యారు. అనంతరం బైక్‌లపై దునపాటి రాజేష్ , వెంకట్‌లతో కలసి ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగి, అరకు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం విశాఖ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. సోంబాబు బైక్‌ను జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్ వద్ద భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన సోంబాబును 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్! విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,నెల్లూరుజిల్లా: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు విద్యార్థి బలయ్యాడు. తోటి విద్యార్థుల లైంగిక వేధింపులతో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు అంతస్తు నుంచి దూకి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విద్యార్థి మృతిని నారాయణ కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, స్టూడెంట్స్ ర్యాగింగ్ వల్లే ప్రదీప్ చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నితీష్ కుటుంబంలో విషాదం
ప్రొద్దుటూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నితీష్ మరణించడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని దారా అపార్ట్మెంట్లో నివాసముంటున్న గిద్దలూరు శ్రీనివాసులు వస్త్ర భారతి క్లాత్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు జ్ఞానేష్ వేలూరు విట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు నితీశ్ (21) చైన్నె ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. నితీష్ సోమవారం తన మిత్రులతో కలిసి అరుణాచలానికి వెళ్లి తిరిగి వస్తుండగా తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలో వీరు ప్రయాణిస్నుత్న కారు–ఎదురుగవా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నితీశ్‌తోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషాదకర సంఘటన గురించి తెలుసుకున్న నితీశ్ తల్లిదండ్రులు సుజాత, శ్రీనివాసులు ఆదివారం రాత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. సోమవారం తిరువళ్లూరులో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం నితీష్ మృతదేహాన్ని తీసుకుని ఇంటికి చేర్చారు. ధారా అపార్ట్మెంట్లో నివసిస్తున్న వేంపల్లి అరుణ్కుమార్రెడ్డితోపాటు మరికొందరు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. -
యల్లనూరులో కీచక టీచర్
యల్లనూరు: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపుతుంటారు. అలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ కట్టుతప్పాడు. అభం శుభం తెలియని విద్యార్థినులను వేధిస్తూ పైశాచికానందం పొందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించిన వివరాలిలా.. మండలంలోని చిలమకూరు మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా భాస్కర్‌నాయక్ పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇతను 8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాకకూడని చోట తాకుతూ వికృతానందం పొందుతున్నాడు. ఈ క్రమంలో విషయాన్ని పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహం చెందిన వారు.. వారం క్రితం పాఠశాలకు చేరుకుని ఎంఈఓ చంద్రశేఖర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేష్‌ను నిలదీశారు. అయితే, విషయం బయటకు తెలియకుండా తల్లిదండ్రులకు వారు నచ్చజెప్పారు. స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకు భాస్కర్నాయక్పై డీఈఓ వరలక్ష్మి, మోడల్ స్కూల్ ఏడీ నాగరాజు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి విధులకు రావొద్దని ఆదేశించారు. వేరే చోటుకు బదిలీ చేసుకోవాలని తెలియజేసినట్లు సమాచారం. అయితే, భాస్కర్‌నాయక్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యారి్థనుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ మహేష్‌ను సంప్రదించగా, వారం రోజుల క్రితం ఘటన జరిగినట్లు తెలిపారు. అప్పటి నుంచి భాస్కర్ నాయక్‌ను విధులకు రానివ్వలేదని చెప్పారు. -
టీడీపీ నేత క్వారీలో జేసీబీ డ్రైవర్ మృతి!
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేత నడుపుతున్న క్వారీలో ఆదివారం జేసీబీ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బైక్‌పైనే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో అది ప్రమాదమా! లేక హత్యా! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మాదిగబండలోని అక్రమ క్వారీ కథ ఇది..స్థానికుల కథనం ప్రకారం.. మాదిగబండ సమీపంలోని సర్వే నంబర్లు 1367,1345, 1376లో 4.43 హెక్టార్లలో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ కోసం శరత్‌కుమార్ గనులశాఖ అనుమతులతో క్వారీ నడుపుతున్నారు. ఈక్రమంలో నిబంధనలు పాటించడంలేదని అధికారులు క్వారీకి అనుమతులు రద్దుచేస్తూ ఈ నెల 1న నోటీసులిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ క్వారీని టీడీపీ నేత జనార్థన్‌నాయుడు స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. దీని కరెంటు బిల్లులు రూ.20.09 లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ అధికారులు.. బకాయిలు చెల్లించకపోయినా స్పందించలేదు. అనర్హత వేటుపడిన ఈ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేయకుండా వదిలేశారు. ఇన్ని ఉల్లంఘనల మధ్య యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్వారీలో ఇప్పుడు జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదమా? చంపేశారా?ఈ క్వారీలో ఎర్రగొండేపల్లికి చెందిన చిన్నస్వామి (38) జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జేసీబీ ముందు భాగంలో తొట్టి వద్ద చిన్నస్వామి గ్రీజు వేస్తుండగా సెల్వ అనే వ్యక్తి జేసీబీ క్యాబిన్లో కూర్చొన్నాడు. సెల్వి సెల్‌ఫోన్ చూస్తూ గేర్ వేయడంతో జేసీబీ తొట్టె కిందికెళ్లిపోయి, గ్రీజు వేస్తున్న చిన్నస్వామిపై పడిందని, దాని కింద నలిగి అతను మృతి చెందినట్టు చెబుతున్నారు. పోలీసులను పిలవకుండానే మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తెచ్చారు. క్వారీలో ఉన్న జేసీబీని మాయం చేశారు. దీంతో ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చిన్నస్వామిని జేసీబీతో కొట్టి చంపేశారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్వారీ యజమాని ఆదేశాలతో ఆ ప్రాంతానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు మృతుడి కుటుంబానికి ఎంతోకొంత పరిహారం చెల్లించి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మృతుల బంధువులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఏం జరి గిందనేది తెలుస్తుందని పలమనేరు టౌన్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు. -
మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి
పెదకూరపాడు: అధికారమే అండగా టీడీపీ ముష్కర మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగిస్తూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారి ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఒక్కసారిగా 15 మంది టీడీపీ రౌడీలు పెదకూరపాడు మండలం గారపాడులోని జెడ్పీటీసీ ఇంటిలోకి ప్రవేశించి ఆమె సెల్‌ఫోన్ లాక్కొని పగలకొట్టారు. వృద్ధురాలన్న కనికరం కూడా లేకుండా స్వర్ణకుమారి తల్లి గణేశ్ శివమ్మని కింద పడేశారు. దీంతో ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. టీడీపీ గూండాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన జెడ్పీటీసీ స్వర్ణకుమారిని, ఆమె పెద్ద కుమార్తెను పక్కకు తోసేశారు. ‘నీ భర్తను పిలువు.. మాకు అప్పగించు’ అంటూ దౌర్జన్యం చేశారు. తన భర్త ఇక్కడ లేరని చెప్పినా వినిపించుకోకుండా భయోత్పాతం సృష్టించారు. రెక్కీ నిర్వహించి మరీ.. వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా నాయకుడైన కంకణాల శివాజీ తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తుంటారు. గత ఎన్నికల్లో పెదకూరపాడు జెడ్పీటీసీ అభ్యరి్థగా తన భార్య స్వర్ణకుమారిని పోటీ చేయించి గెలిపించుకున్నారు. స్వర్ణకుమారి, శివాజీ దంపతుల ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఆ దంపతులు కొద్ది రోజులు హైదరాబాద్‌లో, మరికొద్దిరోజులు స్వగ్రామం గారపాడులో ఉంటున్నారు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తన భర్త తల్లిని స్వగ్రామంలో వదిలిపెట్టడానికి జెడ్పీటీసీ స్వర్ణకుమారి, తన కుమార్తెలతో కలిసి కారులో శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గారపాడుకు వచి్చన వెంటనే శివారులో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఉట్లపల్లి శ్రీనివాసరావు కారులో మాటు వేశాడు. జెడ్పీటీసీ తన అత్తను వారి ఇంటి వద్ద దించి, ఆమె బాగోగులు చూసుకోవడానికి చిన్న కుమార్తెను ఉంచారు. పెద్ద కుమార్తెను తీసుకుని తన తల్లి గణేశ్ శివమ్మ ఇంటికి జెడ్పీటీసీ వెళ్లారు. సెల్‌ఫోన్ పగులకొట్టి జెడ్పీటీసీ తల్లిపై దాడి ఈ క్రమంలో ఉట్లపల్లి శ్రీనివాసరావు తనతోపాటు నెల్లూరి వెంకటేశ్వర్లు, ఉట్లపల్లి కోటేశ్వరరావు, మక్కెన ప్రభాకరరావు, కొంకా శౌరీలు, మక్కెన పవన్, ఉట్లపల్లి శ్రీనివాసరావు, బండారు మాధవరావు, పొదిలె కోటేశ్వరరావు, మక్కెన అప్పారావు, పెనుముచ్చు రమేశ్లతోపాటు మరో ఐదుగురిని తీసుకుని ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు స్వర్ణకుమారి ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఆమె తలుపులు తీయగానే ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన టీడీపీ గూండాలు ‘నీ భర్త శివాజీ గాడు ఎక్కడ.. వాడి అంతుచూస్తాం.. బయటకు రమ్మను’ అంటూ బిగ్గరగా కేకలు వేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఎస్ఐకి ముందుగానే సమాచారమిచ్చినా.. తమపై టీడీపీ గూండాలు దాడికి దిగనున్నారని ముందుగానే తెలుసుకున్న జెడ్పీటీసీ స్వర్ణకుమారి భర్త శివాజీ పెదకూరపాడు ఎస్ఐ విపర్ల వెంకట్రావుకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు.. రెండు వేల ఓట్లు ఉన్న గారపాడులో గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు. ఇళ్లపైకి వచ్చి దాడి చేయడం ఏమిటి? మీ నేత చంద్రబాబు ఇదేనా మీకు నేరి్పంది? మా గ్రామంలోకి మేము రాకూడదా? మా ఇంటిపైకి బీభత్సం సృష్టించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.–స్వర్ణకుమారి, జెడ్పీటీసీ -
పెళ్లి పేరిట పిలిచి స్నేహితుడితో కలిసి లైంగికదాడి
గుణదల(విజయవాడ తూర్పు): భర్తకు దూరంగా ఉంటున్న వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడో ప్రబుద్దుడు. ఓ మ్యాట్రిమోనీలో సంబంధం కోసం వెతుకుతుండగా ఏర్పడిన పరిచయంతో హోటల్ గదికి పిలిచి, స్నేహితుడితో కలసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ మోసంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం రెడ్డిపేట ప్రాంతానికి చెందిన సంగోజి చిన్నారి(25)కి అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌తో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ప్రవీణ్ చిన్నారిని విడిచిపెట్టాడు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న చిన్నారి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు మ్యాట్రిమోనీలో సాయి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, విజయవాడ రావాల్సిందిగా కోరాడు. దీంతో గత నెల 26న చిన్నారి విజయవాడకు రాగా సాయి బెంజిసర్కిల్ వద్ద గల ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆ రాత్రి ఇద్దరు కలసి అక్కడే ఉన్నారు. వివాహం గురించి మాట్లాడుకుని మరుసటి రోజు చిన్నారి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. మరలా ఈ నెల 5న రావాల్సిందిగా సాయి కోరగా చిన్నారి విజయవాడ వచ్చింది. ఆరోజు రాత్రి 10 గంటల సమయంలో బెంజిసర్కిల్ వద్ద హోటల్‌కు తీసుకువెళ్లిన సాయి ఆ గదిలోనే మద్యం తాగుతూ చిన్నారితో మాట్లాడాడు. ఒత్తిడి చేసి, ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. ఇది జరిగిన కొద్ది సేపటికి సాయి బయటకు వెళ్లిపోయాడు. ఇంతలో సాయి స్నేహితుడు వచ్చి చిన్నారిని బలవంతం చేయబోయాడు. భయంతో ఆమె అరవటం మొదలు పెట్టింది. అరిస్తే ఇక్కడ జరిగిందంతా ఆమె తలిదండ్రులకు చెబుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. కొద్ది సేపటికి మద్యం మత్తులో వచ్చిన సాయి తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. తాను అక్బర్‌బాషా అలియాస్ సాయిగా చెప్పాడు. వచ్చిన స్నేహితుడు పేరు జయసాయి అని కేవలం తమ శారీరక అవసరాల కోసమే నమ్మించానని అసలు నిజం చెప్పాడు. ఇది విని గుండె బద్దలైన చిన్నారి కన్నీరుమున్నీరుగా విలిపించింది. మద్యం మత్తులో స్నేహితులిద్దరూ మరోసారి పశువుల్లా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన చిన్నారి రెండు రోజులు మదనపడింది. జరిగిన విషయం బంధువులకు తెలియజేసింది. తనకు జరిగిన అన్యాయంపై బంధువులతో కలిసి వచ్చిన చిన్నారి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు మోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ఆదివారం తెలిపారు. -
టీడీపీ మైనింగ్ మాఫియా అరాచకం.. క్వారీలో దారుణ హత్య
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో పలమనేరులో అనధికారికంగా క్వారీల నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని టీడీపీ నేత ఆక్రమించుకున్నారు. ఇక, అక్కడ క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు సదరు టీడీప నేత. అంతేకాకుండా క్వారీలో పనిచేస్తున్న చిన్నస్వామి అనే యువకుడిని క్వారీలో చంపిపడేయటం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఈ హత్య విషయం పలమనేరు పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసు స్టేషన్లో టీడీపీ నేతలు పంచాయతీ పెట్టారు. ఇక, మృతుడు చిన్న స్వామి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
పెళ్లిలో ప్రియురాలి హల్చల్.. పెళ్లికొడుకుపై దాడికి యత్నం
అన్నమయ్య: తనకు తెలియకుండా మరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని ఓ ప్రియురాలు పెళ్లిలో హల్చల్ చేసింది. ఆగ్రహంతో పెళ్లి కొడుకుపై దాడికి దిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో ఈ రోజు వివాహం జరగుతున్న సమయంలో ప్రియురాలు రంగంలోకి దిగింది. సయ్యద్ భాషా.. తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సయ్యద్ భాషా తనను కాదని వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షాదిఖానాలో పెండ్లి కొడుకు సయ్యద్ బాషాపై కత్తి, యాసిడ్‌తో దాడి యత్నించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో యాసిడ్ పడి ఒక్క మహిళలకు తీవ్రంగా, మరో మహిళలు స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రియుడి మోసానికి యువతి బలి
ఒంగోలు టౌన్: ప్రేమ పేరుతో ఓ యువకుడి చేతిలో వంచనకు గురైన యువతి చివరకు ప్రాణాలొదిలింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించడంతో పాటు శారీరకంగా దగ్గరై యువతిని గర్భిణిని చేశాడు. ఆ యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిట్ చేసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజీవ్‌కాలనీకి చెందిన చప్పిడి రాజేంద్రప్రసాద్, అరుణకుమారి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్నారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కూతురు ప్రియ తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మిగతా ఇద్దరు కూతుళ్లు చీమకుర్తిలో పదో తరగతి చదువుకుంటున్నారు. ప్రియ కూడా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చీమకుర్తి గురుకుల పాఠశాలలో చదివింది. తన క్లాస్మేట్, దూరపు బంధువైన శివకళ్యాణ్తో ఏడాది క్రితం ఆమెకు పరిచయమైంది. సంతనూతలపాడు మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శివకళ్యాణ్ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ చదువుకుంటున్న ప్రియ.. తన తల్లిదండ్రులకు తెలియకుండా తక్కెళ్లపాడు వచ్చి తరచూ ప్రియుడితో కలుస్తుండేది. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గరైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకళ్యాణ్కు చెప్పింది. జూలై చివరి వారంలో యూనివర్శిటీ నుంచి వచ్చేసి తక్కెళ్లపాడులో ప్రియుడితో కలిసి జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ప్రియ ఆరోగ్యం దెబ్బతింది. ఎగశ్వాస వస్తుండటంతో ఆమెను ఒంగోలులోని జీజీహెచ్‌కి శివకళ్యాణ్ తీసుకొచ్చాడు. హాస్పిటల్లో చేర్పించి ప్రియ తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు గుర్తు తెలియని వ్యక్తిలా ఫోన్ చేశాడు. తిరుపతి నుంచి రైలులో వస్తుండగా మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని, ఆమెను ఒంగోలు జీజీహెచ్‌లో జాయిన్ చేశానని చెప్పాడు. ఆందోళనకు గురైన రాజేంద్ర ప్రసాద్ హడావిడిగా జీజీహెచ్‌కి వచ్చాడు. ఆస్పత్రిలో వాకబు చేయగా, మీ కూతురు ఆరో నెల గర్భిణి అని, ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రియ ప్రియుడు శివకళ్యాణ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.నా బిడ్డను చంపిన హంతకులను శిక్షించండి సారూ...నా బిడ్డతో రెండు రోజుల క్రితమే మాట్లాడాను. బాగానే మాట్లాడింది. కాస్త దగ్గు వస్తుందని చెప్పింది. ఇంతలో ఇలా చనిపోతుందని అనుకోలేదంటూ ప్రియ తల్లి అరుణకుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డను మోసం చేసి ఆమె చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, తన బిడ్డలాగా మరొకరి బిడ్డ బలికాకూడదని కన్నీరు పెట్టింది. ప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రియ నోటి నుంచి నురగ వస్తుండటంతో ఆమె మరణం సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమైపె హత్యా ప్రయత్నం జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తిగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
పచ్చని సంసారంలో చిచ్చురేపిన మద్యం
నెల్లూరు (క్రైమ్): పచ్చని సంసారంలో మద్యం చిచ్చు రేపింది. ఉరేసుకుని భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్నగర్లో శనివారం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. దంపతులు బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందో తెలియక మృతుల కుమారులిద్దరూ అటు ఇటూ తిరుగుతూ ఉండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కె. నాగరాజు(23), సురేఖ (19) నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా రు. వారికి మూడేళ్లు, పదకొండు నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు మార్బుల్స్, టైల్స్ పనులు చేసుకుంటుండగా, సురేఖ మాగుంట లేఅవుట్లోని ఓ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంతోషంగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం విచ్ఛిన్నం చేసింది. మద్యానికి బానిసైన నాగరాజు సంపాదించిందతా మద్యానికి ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం సురేఖపై పడింది. ఆమె తాను సంపాదించిన మొత్తంలో కొంత కుటుంబ పోషణకు ఖర్చు చేసి మిగిలిన దాంతో అప్పులు తీర్చింది. పలుమార్లు మద్యం మానేయమని, అప్పులు చేయొద్దని భర్తను ప్రాధేయపడింది. అయినా అతని తీరులో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా సురేఖ తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలు సుకున్న ఆమె తల్లిదండ్రులు గీత, సురేష్ హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కిందకు దించారు. ఆమెను నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేఖ మృతి చెందిందని నిర్ధారించారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నాగరాజు హాస్పిటల్ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. భార్య లేని జీవితం వ్యర్థమంటూ రోదించాడు. ఇక తాను బతకలేనంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లి విజయమహాల్ రైల్వే గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది. సురేఖ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఎస్ఐ విజయ్‌శ్రీనివాస్, నెల్లూరు తహసీల్దార్ హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు ఆత్మహత్య ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆ యువకుడికి అలా దగ్గరైంది.. ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు. -
ప్రాణం తీసిన జల్లికట్టు
పూతలపట్టు (చిత్తూరు జిల్లా): జల్లికట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, కొట్టాలలో చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. ఆడిజాతర పురస్కరించుకుని కొట్టాలలో గురువారం మారెమ్మ జాతర జరిగింది. ఇందులోనే జల్లికట్టును నిర్వహించారు. దీనికి మండల, తమిళనాడు సరిహద్దు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులొచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగాపాళ్యంకు చెందిన దిలీప్‌కుమార్ (40)పైకి దూసుకెళ్లింది. కొమ్ములతో బలంగా పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించిన మునిరత్నం, సెల్వరాజ్, పళణివేలు, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిత్తూరు మండలం, తమ్మింద గ్రామంలో పదేళ్లుగా కాపురం ఉంటున్నారు.