breaking news
-
బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు!
కడప అర్బన్: ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నల్లగళ్ల వెంకటే‹Ù, గుంటూరుకు చెందిన మాల్యాద్రి మల్లఅజయ్, గంటా కళ్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీ, పసుపులేటి గోపి ఉన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో కడప నగరానికి చెందిన శంకరయ్య తన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.5,500 విత్ డ్రా అయినట్టు కడప సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. కాగా, ఈ నెల 15న ఓ వ్యక్తి వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా శంకరయ్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఫిర్యాదు చేయడం వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు. రేపటిలోగా నా అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయించకుంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనిపై బాధితుడు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి విచారణ చేపట్టారు. అలా వారి ఖాతాలకు నగదు బదిలీ ఈ నేరం ఆధార్ ఎనేబుల్ సిస్టం(ఏఈపీఎస్)ద్వారా ఫిర్యాది బయోమెట్రిక్(వేలిముద్రలు)లను నకిలీవి సృష్టించి వాటి సాయంతో కస్టమర్ సరీ్వస్ పాయింట్స్(బిజినెస్ కరస్పాండెంట్స్)లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి ఫిర్యాది ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5,500 విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు విత్‌డ్రా జరిగిన ప్రదేశం కడప పట్టణంలో ఉందని గుర్తించారు. అలాగే అనుమానితుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కడప ఓల్డ్ బైపాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వెంకటేష్(బిజినెస్ కరెస్పాండెంట్) బ్లాక్ మార్కెట్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్రజల వేలిముద్రలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, నిందితుల సాయంతో బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేవారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగించే డివైస్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై 4 ఎఫ్ఐఆర్లు, 412(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్సీఆర్పీ పిటిషన్లు నమోదైనట్లు, దేశంలో మొత్తం 416 మంది బాధితులను గుర్తించారు. -
బొట్లపాలెం ఘటనలో నిందితుల అరెస్ట్
ఒంగోలు టౌన్/దర్శి: కులాంతర వివాహం కేసులో దళిత మహిళను బంధించి పెట్రోలు పోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మరెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి.. అదే గ్రామానికి చెందిన దళితుడు జక్కుల సాయిరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని బ్రహ్మారెడ్డి దంపతులు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మంచినీళ్లు పట్టుకునేందుకు కొళాయి వద్దకు వెళ్లిన సాయిరాం తల్లి అనురాధ, సోదరి కామునూరి మౌనిక మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. మౌనికను దుస్తులు చింపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ ఇంటి వరండాలో ఆమెను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారు. అయితే ఈ లోపు అనురాధ స్థానికుల సాయంతో 100కు కాల్ చేయడంతో వెంటనే దర్శి ఎస్ఐ డి.రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యువతిని కాపాడారు. చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో దర్శి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అంకితా సురాన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన దర్శి డీఎస్పీ టి.అశోక్‌వర్థన్.. మంగళవారం మధ్యాహ్నం తూర్పు గంగవరం బస్టాండ్ సెంటర్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నిముషాల్లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు గంటలోపే కేసు రిజిస్టర్ చేశారు. వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వివరించారు. కాగా, దళిత మహిళలపై దాడి ఘటనలో నిందితులు గంగిరెడ్డి బ్రహా్మరెడ్డి, భార్య పుల్లమ్మలకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ బుధవారం దర్శి ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
మద్యం మత్తులో కారుతో టీడీపీ కార్యకర్తల హల్చల్
మంగళగిరి: లోకేష్ యాత్రలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి కారులో వచ్చిన నలుగురు యువకులు మద్యంమత్తులో హల్చల్ చేశారు. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ దుర్ఘటన బుధవారం జరిగింది. తాడేపల్లి పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి కలకాల తేజశ్రీ విష్ణు వర్థన్ చౌదరి మరో ముగ్గురితో కలిసి లోకేష్ బస చేస్తున్న నగరంలోని యర్రబాలెంకు చేరుకున్నారు. మద్యం ఫూటుగా తాగి కారులో టీడీపీ జెండాలతో తిరుగుతూ చక్కర్లు కొట్టారు. తాడేపల్లి నులకపేట వద్ద విజయవాడకు చెందిన ఏసీ మెకానిక్‌లు బి.గోపి, పి.రాఘవేంద్ర ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చౌదరి తమ కారుతో వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఫలితంగా గోపి, రాఘవేంద్ర గాయపడ్డారు. స్థానికులు ఘటనాస్థలికి చేరుకునేలోపు చౌదరి అతని స్నేహితులు కారు వదిలి పరారయ్యారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
యువకుల ప్రేమ.. సహజీవనం.. ప్రేమ కోసం అమ్మాయిగా మారితే.. షాకిచ్చిన యువకుడు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇద్దరు యువకులు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. ఇరుగు పొరుగువారి నుంచి ఛీత్కారం ఎదురైంది. తమలో ఒకరు అమ్మాయిగా మారితే ఇరుగుపొరుగువారి నుంచి ఇబ్బందులు ఉండవని ఓ యువకుడు భావించాడు. జీవితాంతం స్నేహితుడితోనే కలిసి ఉండొచ్చని ఆశపడ్డ అతను లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే ఆపరేషన్ చేయించుకుని ఆమెగా మారిన అతడిని స్నేహితుడు మోసగించాడు. పెళ్లి చేసుకోనంటూ ఇంటి నుంచి గెంటేశాడు. మోసపోయిన ఆమె ఫిర్యాదు చేయడంతో కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. పెనమలూరుకు చెందిన ఎ.పవన్, కృష్ణలంకకు చెందిన ఇ.నాగేశ్వరరావు 2017–19 మధ్య కాలంలో బీఈడీ చేసే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్ని నెలల తరువాత ఆ ఇష్టం ప్రేమగా మారడంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. బీఈడీ పూర్తయ్యాక 2019 నుంచి కృష్ణలంకలోని సత్యంగారి హోటల్ సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించి, బతుకుదెరువు కోసం అక్కడే ట్యూషన్ సెంటర్ నిర్వహించారు. ఇద్దరి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి మాటలు తట్టుకోలేక, విడిపోయి ఉండలేక మానసిక వేదన అనుభవించారు. తమలో ఒకరు అమ్మాయిగా మారితే కలిసి జీవించేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవనే నిర్ణయానికి వచ్చారు. పవన్ ఢిల్లీ వెళ్లి రూ.లక్షలు వెచ్చించి లింగమార్పిడి ఆపరేషన్ చేయించు కుని యువతిగా మారి భ్రమరాంబికగా సమాజంలోకి అడుగుపెట్టాడు. అయితే భ్రమరాంబిక సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రేమి కుడు ఆమెను మోసగించి పరారయ్యాడు. పోలీస్ స్టేషన్‌కు చేరిన కథ నాగేశ్వరరావు కోసం తన జీవితాన్నే త్యాగం చేశానని, అతను తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ భ్రమరాంబిక ఈ నెల పదో తేదీన కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మి నాగేశ్వరరావుకు పలు విడతలుగా రూ.26 లక్షల నగదు, 11 నవర్సల బంగారం ఇచ్చానని, 2022 డిసెంబర్లో తనను పెళ్లి చేసుకోనని నాగేశ్వరరావు తేల్చిచెప్పి, ఇంటి నుంచి గెంటేసి, మంగళగిరికి మకాం మార్చాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసగించి, తన నగదులో పరారైన నాగేశ్వరరావు, అందుకు కారణమైన అతని తల్లి విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరింది. నాగేశ్వరరావు, అతని తల్లి విజయలక్ష్మిపై చీటింగ్, నమ్మకద్రోహం, ట్రాన్స్ జెండర్ హక్కుల రక్షణ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైద్యుడి ఇంట్లో శవంగా పనిమనిషి.. ఆర్ధరాత్రి ఏం జరిగింది?
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు వీరన్న షెడ్డు పరిసర ప్రాంతంలో రిటైర్డ్ వైద్యుని ఇంట్లో సోమవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళంలో వైద్యునిగా పనిచేసిన డాక్టర్ గొల్లంగి జగన్నాథం ఇంట్లో సుమారు పాతికేళ్లుగా ఇద్దరు మహిళలు తాళ్లవలస రాజు(35), చిట్టెమ్మ పనిమనుషులుగా ఉంటున్నారు. వీరిలో రాజు చిన్నప్పటి నుంచి వైద్యుని ఇంటిలోనే ఉంటోంది. వివాహం కాలేదు. మరో మహిళ చిట్టెమ్మ స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ. ఈమెకు వివాహమైంది. జగన్నాథం కుటుంబమంతా ప్రస్తుతం విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నారు. ఈయన కుమారుడు కూడా డాక్టర్ కావడంతో శ్రీకాకుళంలోని ఓ నర్సింగ్ హోంలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా సేవలందించేందుకు వారానికి ఒకసారి వచ్చి ఓపీ చూసి వెళ్తుంటారు. ఆ సమయంలో వంట చేసేందుకు, ఇంటిని చూసుకునేందుకు రాజు, చిట్టెమ్మలు నమ్మకంగా పనిచేస్తున్నారు. ఏం జరిగిందంటే.. పనిమనుషుల్లో ఒకరైన రాజు శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురంలో బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రానికి వచ్చేసింది. అదే రోజు రాత్రి ఏమైందో గానీ తలపై బలమైన గాయాలతో హత్యకు గురైంది. ఈ విషయాన్ని మరో పనిమనిషి చిట్టెమ్మ వైద్యుని ఇంటి పక్కనే ఉన్న షాపు యజమానులకు మంగళవారం ఉదయం చెప్పింది. వారు విశాఖలోని జగన్నాథంకు ఫోన్లో విషయం చేరవేశారు. ఆయన శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్‌టీం సబ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రక్తపు మరకలతో నైటీ, నిరోధ్ ప్యాకెట్లు గుర్తించినట్లు తెలిసింది. హత్య జరిగిన ప్రదేశాన్ని శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి పరిశీలించారు. టౌన్ సీఐ సన్యాసినాయుడు, రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాపను బాగా చూసుకోండి.. 4 పేజీల సూసైడ్ నోట్ రాసి..
ఏలూరు: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పని చేస్తున్న గుణదల శిరీష(30) భర్త వేధింపులు తాళలేక సోమవారం అర్ధరాత్రి నూజివీడులోని తన పుట్టింటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణదల శిరీషకు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన గద్దల వెంకటేశ్వరరావుతో 2018 ఆగస్టులో వివాహమైంది. వివాహమైన నాటి నుంచి నిత్యం అనుమానంతో శిరీషను వేధించేవాడు. ఆ తరువాత కొంతకాలానికి పాప పుట్టింది. 2019 నవంబరులో నున్న సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో నున్నలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవారు. ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరుగుతుండడంతో పెద్దలు పలుమార్లు సర్దిచెప్పి కాపురానికి పంపించేవారు.అయితే మూడు రోజుల క్రితం తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. దీంతో శిరీష నూజివీడులోని తన పుట్టింటికి వచ్చింది. తరువాత తన అన్నను పాపను తీసుకురమ్మని పంపగా వారు పంపలేదు. దీంతో చేసేదేమీ లేక తాను చనిపోయిన తర్వాత పాపను బాగా చూసుకోవాలని తన అన్నను కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. తన ఆత్మహత్యకు తన భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ, చిన్న అత్తలు కారణమని లెటర్లో పేర్కొంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆమె అన్న ఆమె గదిలోకి వెళ్లగా ఉరివేసుకుని ఉండడంతో వెంటనే అందరిని పిలిచి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివనారాయణ బాపూనగర్‌లోని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్‌గౌడ్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. సూసైడ్ లేఖ ఆధారంగా, మృతురాలి అన్న గుణదల కాశీ విశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
కులాంతర వివాహం చేసుకున్నాడని దాడి
ప్రకాశం: తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్న యువకుడి తల్లి, అక్కపై యువతి తల్లిదండ్రులు దాడిచేసి గాయపరిచిన సంఘటన దర్శి మండలం బొట్లపాలెం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. డీఎస్పీ అశోక్‌వర్ధన్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ దంపతుల కుమార్తె భార్గవి ఎస్సీ కులానికి చెందిన అనురాధ కుమారుడు సాయిరాం మార్చి 2వ తేదీన వివాహం చేసుకున్నారు. వారి వినతి మేరకు రక్షణ కల్పించాలని ఎస్పీ మలికాగర్గ్ దర్శి పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేసి ఎలాంటి గొడవలు పడవద్దని చెప్పి పంపారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ కలిసి అర్ధరాత్రి ఎస్సీ కాలనీకి వెళ్లి యువకుడి తల్లి అనూరాధ, ఆమె కుమార్తె మౌనిక కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. మౌనికను కత్తితో పొడవబోగా చేయి అడ్డు పెట్టడంతో ఆమె చేతికి గాయమైంది. ఇనుపరాడ్డుతో తలపై కొట్టి గతంలో ఉన్న కేసులు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని భయబ్రాంతులకు గురిచేశారు. వారిద్దరినీ కొట్టుకుంటూ బ్రహ్మారెడ్డి ఇంటికి తీసుకువెళ్లి కట్టేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో తాళ్లతో కట్టేసి ఉన్న అనూరాధ, అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను గుర్తించారు. వారిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి దర్శి సీహెచ్‌సీలో వైద్యం అందించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ అశోక్‌వర్థన్ తెలిపారు. బాధితులను ట్రైనీ ఎస్పీ అంకితా సురానా పరామర్శించారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. -
శ్యామల కేసులో ట్విస్ట్: ముందు వేధింపులు, ఏడాది క్రితం అత్యాచారం.. ఏది నిజం!
అనంతపురం: కళ్యాణదుర్గం మండలం ఈస్ట్కోడిపల్లికి చెందిన శ్యామల కేసుకు సంబంధించి త్వరలోనే నిజాలు నిగ్గు తేలుస్తామని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయ ఆవరణంలోని కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10న ఈస్ట్ కోడిపల్లిలో ఓ ఇంట్లో మహిళ, మరో వ్యక్తి కలసి ఉండగా స్థానికులు తలుపులకు తాళం వేసినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమందింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తాళం తీసి ఇంట్లో ఉన్న శ్యామల, బోయ హరిలను బయటకు తీసుకువచ్చారు. స్థానికుల సమక్షంలో విచారణ చేపట్టారు. బోయ హరితో పాటు ఇంట్లో ఉన్న మహిళ చేష్టలు మంచివి కావని స్థానికులు తెలిపారు. వీరిలాగే కొనసాగితే ఎవరైనా ఆమెకు హాని తలపెట్టే అవకాశం ఉందని భావించి తాము ఆ ఇంటికి తాళం వేశామని ఎస్ఐ సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాథమికంగా అన్ని కోణాల్లో ఆరా తీసిన ఎస్ఐ అప్పటికే రాత్రి కావడంతో ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించి, ఉదయాన్నే స్టేషన్‌కు రావాలని సూచించి వెళ్లిపోయారు. 11న ఉదయం శ్యామల పోలీసుస్టేషన్‌కు వెళ్లి ముందు రోజు జరిగిన దానికి భిన్నంగా ఫిర్యాదు చేసింది. బోయ హరి తనను మూడు నెలలుగా వేధిస్తున్నాడని, లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని అందులో పేర్కొంది. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 14న ఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘పోలీస్ స్పందన’కు ప్రజా సంఘాల నాయకులతో కలసి వచ్చిన శ్యామల తనను ఏడాది కిందట ఐదుగురు సామూహిక అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. మీడియా ముందు ఇదే విషయాన్ని వెల్లడించింది. సదరు మహిళకు న్యాయం చేయడం కోసం ముందుగా కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యలలో భాగంగా విచారణ చేపట్టామన్నారు. శ్యామలకు ఎలాంటి ఇబ్బందులున్నా చట్టపరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కిందిస్థాయి పోలీసులు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. శ్యామల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ విజయభాస్కరరెడ్డి, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులులు పాల్గొన్నారు. -
అష్టాచమ్మ ఆటలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ
విశాఖపట్నం: మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఇద్దరి యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. అప్పటి వరకు కలిసి అష్టాచమ్మ ఆడిన ఆ యువకులు ఆట లో తలెత్తిన చిన్నపాటి వివాదంతో పరస్పరం దాడికి దిగారు. దీంతో నారాయణరావు (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గవరవీధి, ఆటోమోటివ్ ప్రాంతానికి చెందిన దవిల నారాయణరావు (28), మద్దిలపాలెం పిఠాపురం కాలనీకి చెందిన ఆర్.రాంబాబు (29) ఇద్దరూ స్నేహితులు. వివాహితుడైన రాంబాబు కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా అవివాహితుడైన నారాయణరావు పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ పిఠాపురం కాలనీ మార్కెట్ సెంటర్ సమీపంలో బెట్టింగ్‌కు అష్టాచమ్మా ఆడారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. అష్టాచమ్మా పిక్కలను నారాయణరావు తన్నేయడంతో కోపానికి గురైన రాంబాబు అతని మోహంపై బలంగా కొట్టాడు. దీంతో వెనక్కిపడిపోయిన నారాయణరావుకు అక్కడి సిమెంట్ అరుగు తల వెనుక బలంగా తగలడంతో మరణించినట్లు సీఐ మల్లేశ్వరరావు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు రాంబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
స్కూల్ బస్సు బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, బాపట్ల: అమృతలూరు మండలం కూచిపూడి వద్ద స్కూల్ బస్సు బోల్తా పడటంతో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారు. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి.. -
కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందుల్ని కాలుస్తున్నారు. ఈ క్రమంలో నాటు తుపాకీతో పందులను కాల్చడానికి ప్రయత్నిస్తుండగా.. ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులకు చేరవేయగా.. వారు వచ్చి చిన్నారిని చూసేసరికి అప్పటికే మృతిచెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే -
పరామర్శకు వెళ్తే పొడిచేశాడు..
సాలూరు: గాయాలపాలైన స్నేహితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఓ మహిళపై దాడి జరిగిన సంఘటన సాలూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కిరణ్మయి, తండ్రి ఈశ్వరరావు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు... పట్టణంలోని చిట్లువీధిలో నివసిస్తున్న లలితకుమారి రామభద్రపురం మండలం తారాపురం యూపీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు భర్త ప్రసాద్‌తో విభేదాలుండడంతో ఇరు కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇటీవల లలితకుమారిపై ప్రసాద్ దాడిచేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న కిరణ్మయి స్నేహితురాలిని పరామర్శించేందుకు సోమవారం లలితకుమారి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో లలితకుమారి భర్త ప్రసాద్ రావడంతో అతనికి, కిరణ్మయికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన ప్రసాద్ కిరణ్మయి పొట్టపై కత్తితో దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కిరణ్మయిని స్థానికులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. పట్టణ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే
సీతంపేట/బూర్జ(శ్రీకాకుళం): సీతంపేట ఏజెన్సీలోని గొయిది గ్రామ సమీపంలో సోమవారం ఓ బైక్, ఆటో ఢీనండంతో జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తవల్లికి చెందిన పైడి వసంతకుమారి (17) మృతి చెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుత్తవల్లి పక్కగ్రామానికి చెందిన యువకుడు కూన వెంకటేష్, వసంతకుమారి బైక్‌పై సీతంపేట వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో గాయాలపాలవగా యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇద్దరినీ 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడు వెంకటేష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, సత్యనారాయణ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.నీలకంఠరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
ఉలవపాడు: అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రలో ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా రైల్లో కలకలం.. బోగీలోకి ఎక్కిన దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని చైన్ లాగి దర్జాగా రైలు దిగి వెళ్లిపోయారు. చాగల్లు–తెట్టు మధ్య హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రాత్రి గం.1.50 సమయంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం (చాగల్లు–తెట్టు) వద్ద దొంగలు చైన్ లాగడంతో రైలు నిలిచింది. దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు అపహరించి రైలు దిగారు. అనంతరం హైదరాబాద్ నుంచి తాంబరం వెళుతున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 2.30గం.ల. సమయంలో సిగ్నల్ వద్ద నిలిచిపోయింది. అక్కడే ఉన్న దొంగలు అక్కడే ఉండి ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసేందుకు యతి్నంచారు. కానీ రైల్వే పోలీసులు టార్చ్లైట్లు వేసి వారిని చూడాలని ప్రయత్నించడంతో రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆటోలో దొంగలు పారిపోయారు. ఈ రెండు ఘటనలు 40 నిమిషాల వ్యవధిలో జరిగాయి. నలుగురు దొంగలు! హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం మూడు బోగీలలో కలిపి 111 గ్రాముల బంగారం దోపిడీ జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న మహేంద్రచౌదరి నుంచి 36 గ్రా. చైన్, నరేంద్రరెడ్డి, దీప్తిల దగ్గర్నుంచి 40 గ్రా. బంగారం, సరళ, తమిళనాడుకు చెందినవారు వారి వద్ద నుంచి 20 గ్రా. బంగారం, ఉమాజానకి నుంచి 15 గ్రా. చైన్.. మొత్తం 111 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు బెదిరించి తీసుకెళ్లినట్టు తెలిసింది. సూళ్లూరుపేట స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ దోపిడీ మొత్తం నలుగురు దొంగలున్నట్టు పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఆరుగురు ఎస్ఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లతో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్2 నుంచి ఎస్8 వరకు బోగీల్లో ప్రయాణికులను దొంగలు బెదిరించినట్లు తెలిపారు. అయితే ఆ బోగీల్లో పోలీస్ సిబ్బంది లేకపోవడం వల్లే భారీ దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి. -
కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్ దాడి
సాక్షి, అనంతపూర్: విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు విద్యార్థినిల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలి పేరెంట్స్ అతడిపై దాడి చేశారు. ఈ ఘటన అనంతపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎస్కేయూలోని కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ భాను ప్రకాశ్ నాయక్ విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థులను భాను ప్రకాశ్ దుర్భాషలాడాడు. ఇక, విద్యార్థులు తమ పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో, ఆగ్రహానికి లోనైన విద్యార్ధులు పేరెంట్స్, బంధువులు.. భానుప్రకాశ్‌కు దేహశుద్ది చేశారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయంలో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా భాను ప్రకాశ్‌పై ప్రిన్సిపాల్‌కు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: Cyber Crime: రూ. 5 కట్టమని.. రూ.1.85 లక్షలు దోచుకున్నారు -
డాడీ హోం రాజారెడ్డి అనుమానాస్పద మృతి
ప్రొద్దుటూరు క్రైం : ఎందరో అనాథలు, అభాగ్యులను చేరదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాడీ హోం వ్యవస్థాపకుడు రాజారెడ్డి (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూజాస్కూల్ ప్రాంగణంలో పడి ఉండగా ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, సన్నిహితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన నల్లదిమ్ము రాజారెడ్డి సుమారు 20 ఏళ్ల నుంచి మైలవరంలో డాడీ హోం నిర్వహిస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. పెద్దముడియం మండలంలోని పాలూరు గ్రామంలో చర్చి ఫాదర్‌గా కొనసాగుతున్నారు. అనాథ, ఎయిడ్స్ బారిన పిల్లలతోపాటు వృద్ధులకు డాడీ హోంలో ఆశ్రయం కల్పించి వారి పోషణా బాధ్యతలను చూస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామం సమీపంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్, ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వెనుక భాగంలో పూజా కిడ్స్ స్కూళ్లను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. రాజారెడ్డి సోదరుడు శ్రీధర్‌రెడ్డితోపాటు అతని భార్య ప్రసన్నలక్ష్మిలు పూజా స్కూల్లోనే ఉంటూ నిర్వహణా బాధ్యతలు చూస్తున్నారు. శనివారం, ఆదివారం పాఠశాలకు సెలవులు రావడంతో పూజా స్కూల్లోని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. దీంతో పూజా స్కూల్లో దూరప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, పని మనిషులు మాత్రమే ఉన్నారు. రాత్రి శబ్ధం రావడంతో.. శుక్రవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో స్కూల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పై అంతస్తులో ఉన్న ప్రిన్సిపాల్ జాన్ హుటాహుటిన కిందికి వచ్చాడు. శ్రీధర్‌రెడ్డి గాబరా పడుతూ కనిపించడంతో.. తిరిగి ఆయన పైకెళ్లి తొందరగా కిందికి రావాలని తోటి ఉపాధ్యాయులను పిలిచాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు పీఈటీ రామాంజనీ కిందికి వచ్చారు. వారు వచ్చేసరికి కింద పడిపోయిన రాజారెడ్డికి శ్రీధర్‌రెడ్డి, అతని భార్య లక్ష్మీప్రసన్న, కుమార్తెలు సపర్యలు చేస్తున్నారు. కొద్ది సేపటి తర్వాత రాజారెడ్డిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలియడంతో సీఐ ఇబ్రహీంతోపాటు రూరల్ ఎస్ఐలు చిరంజీవి, శివప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజారెడ్డి మృతదేహంపై ఎక్కువ గాయాలు ఉండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. వీపు, ముఖం, చేతులకు గాయాలున్నాయి. దీంతో ఆయన మృతిపై బంధువులు, పూజా స్కూల్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలను పెంచిన రీ పోస్టుమార్టం పూజా స్కూల్ పీఈటీ రామాంజనీ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం రాజారెడ్డి మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలోని డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పూజా స్కూల్‌కు తరలించారు. విద్యార్థులు, బంధువుల సందర్శనార్థం కొంత సేపు అక్కడ ఉంచి తర్వాత మైలవరంలోని డాడీ హోంకు మృతదేహాన్ని తరలించాలని భావించారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులకు అనుమానం రావడంతో మరింత లోతుగా రీ పోస్టుమార్టం నిర్వహించాలని డీఎంహెచ్ఓను కోరారు. రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు కడప నుంచి ప్రొఫెసర్ల బృందాన్ని పంపించనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. దీంతో పూజా స్కూల్లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రొఫెసర్లచే రీ పోస్టుమార్టం చేయించారు. పోస్టుంమార్టం తర్వాత రాజారెడ్డి మృతిపై పోలీసులకు అనుమానాలు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం మైలవరంలోని డాడీ హోంలో రాజారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాజారెడ్డి మృతితో డాడీహోంలోని అనాథ పిల్లలు బోరున విలపించసాగారు. రాజారెడ్డి తల్లి సుబ్బమ్మ కుమారుని మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించింది. పోలీసు అధికారుల దర్యాప్తు ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు జిల్లా ఆస్పత్రికి చేరుకొని స్కూల్ నిర్వాహకులతో మాట్లాడారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులతో కూడా పోలీసు అధికారులు చర్చించారు. కాగా ఇటీవల పూజాస్కూల్ నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఇరువురు అనాథ బాలికలకు అప్పగించినట్లు తెలిసింది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రముఖుల నివాళులు రాజారెడ్డి మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పూజాస్కూల్లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సేవకు మారుపేరుగా నిలిచిన రాజారెడ్డి మరణం తనను ఎంతగానో కలచి వేసిందని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఏఎస్పీ లోసారి సుధాకర్‌తోపాటు రాజుపాళెం మండలంలోని రాజారెడ్డి బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజా స్కూల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు రాజారెడ్డిని కడసారి చూడటానికి వచ్చారు. -
భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా...
కావలి: బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకే ఇంట్లో ముగ్గురిని దారుణంగా హత్య మార్చిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత కోడలితో పాటు ఆమె నాన్న, అమ్మమ్మను అత్త, మామ, మరిది కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి నిందితులు పరారీలో ఉండగా పోలీసులు నిఘా ఉంచి శుక్రవారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ వెంకట రమణ నిందితుల వివరాలను వెల్లడించారు. వివరాలు.. కొండబిట్రగుంటకు చెందిన మందాటి మధుసూదన్‌కు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వాడకుప్ప మౌనికతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వయస్సున బాబు ఉన్నాడు. రైల్వే ఉద్యోగిగా పనిచేసే మధుసూదన్ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నారు. మౌనిక తన కుమారుడిని బుచ్చిలోని అమ్మమ్మ వద్ద ఉంచి తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గతనెల 28న భర్త గుండెపోటుతో చనిపోవడంతో మౌనిక కొండబిట్రగుంటలోని అత్తగారింటికి వచ్చింది. ఆమెకు తోడుగా ఆమె నాన్న వాడకుప్ప కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ కూడా వచ్చి కొండబిట్రగుంటలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తి గొడవలు తలెత్తడంతో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో మౌనిక అత్తమామలైన మందాటి మాల్యాద్రి, మందాటి ధనమ్మ, మరిది మౌళిచంద్రలు ఇనుప రాడ్లతో దాడి చేసి ముగ్గురిని హతమార్చారు. మౌనిక తల్లి వాడకుప్ప పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి బుడంగుంట గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ రాధా హత్య కేసులో బిగ్ ట్విస్ట్
ఎన్టీఆర్: జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య కేసులో మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడని పోలీసులు తేల్చి చెప్పారు. రాధను హతమార్చటంలో నిందితుడు కారు డ్రైవర్ సహాయం పొందినట్లు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఆర్ధిక వివాదాలే హత్యకు గల కారణాలుగా నిర్ధరించారు. జిల్లా ఎస్పీ పి.జాషువా శుక్రవారం తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మూడు నెలల ముందే పథక రచన.. డాక్టర్ లోక్‌నాథ్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాధ భార్యభర్తలు. మచిలీపట్నం జవ్వారుపేటలో శ్రీ వెంకటేశ్వర తల్లిపిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. రాధ కొంత కాలంగా ప్రాక్టీస్ ఆపేసింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిరువురూ వివాహితులే. కుమారుడికి ఇటీవలే వివాహం కావటంతో గత నెలలో అత్తారింటికి వెళ్లాడు. ఇదిలా ఉండగా లోక్నాధ్, రాధల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. వ్యక్తిగత కలహాలతో పాటు ఆర్ధికపరమైన విషయాల్లోనూ మనస్పర్ధలు ఉన్నాయి. విబేధాలు తారస్థాయికి చేరుకోవటంతో ఉమామహేశ్వరరావు భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పథకం రచించి సమయం కోసం వేచి చూస్తున్నాడు. తన వద్ద సుమారు 15 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ స్ఫూర్తి జానార్ధన్ అలియాస్ మధును ఈ పనిలో సహాయం కోరాడు. సహకరిస్తే 30 లక్షల నగదుతో పాటు రాధ సంబంధించిన బంగారం మొత్తం ఇచ్చి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇందుకు మధు ఒప్పుకున్నాడు. ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేసేందుకు మూడు నెలల ముందుగానే సీసీ కెమెరాలను ఉపయోగంలో లేకుండా చేశారు. ఆభరణాలు తీసి.. సీలింగ్‌లో దాచి.. అదును కోసం చూస్తున్న ఉమామహేశ్వరరావు కొడుకు అత్తగారింటికి వెళ్లటంతో డ్రైవర్‌తో చర్చలు జరిపాడు. ఆక్సిజన్ సిలిండర్లు బిగించేందుకు ఉపయోగించే రెంచీని ఆయుధంగా ఎంచుకున్నారు. గత నెల 25వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ లోక్‌నాథ్ రెంచీని మధుకు అందజేశాడు. సాయంత్రం రెండో అంతస్తులో అనుమానం కలుగకుండా నక్కి ఉండమని చెప్పాడు. అతడు డాక్టర్ చెప్పిన విధంగా చేశాడు. అదును చూసుకుని ఉమామహేశ్వరావు, మధు ఇద్దరూ రాధపై ఒక్కసారిగా దాడి చేశారు. మధు ఆమెను బలంగా పట్టుకోగా భర్త ఆమె తలపై రెంచీతో బలమైన దెబ్బలు కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అయిన రాధ స్పృహ కోల్పోయింది. మృతి చెందిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు మరలా రెంచీతో బలంగా ఆమె తలపై కొట్టారు. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఉమామహేశ్వరరావు ఇంటి వెనుక వైపు నుంచి కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌లో వెళ్లిపోయాడు. మధు ఆమె ఒంటిపై ఆభరణాలు ఒలిచి సీలింగ్‌లో దాచాడు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు డాక్టర్ సలహా మేరకు కారం తెచ్చి మృతురాలి ఒంటిపై చల్లాడు. గదిలో అక్కడక్కడా కారం చల్లటంతో పాటు రెంచీని ఇంటి వెనుకభాగంలో దాచి పెట్టాడు. అదే రోజు రాత్రి 10.30 సమయంలో డాక్టర్ ఉమామహేశ్వరావు ఏం ఎరుగనట్టు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ సమాచారం ఇచ్చాడు. ఆభరణాలు స్వాధీనం.. రాధ హత్య సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మాధవరెడ్డి, సంబంధిత ఏరియా సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త నుంచి వివరాలు తీసుకున్నారు. అతని ఫిర్యాదుపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో హత్య కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు చిక్కకపోవటంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాధను హత్య చేసింది ఆమె భర్తేనని నిర్ధారించారు. అతడికి డ్రైవర్ సహకరించినట్లు నిర్ణయానికి వచ్చారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును చేధించటంలో ప్రతిభ కనబరచిన బందరు డీఎస్పీ మాధవరెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వర్తించి హంతకులను అదుపులోకి తీసుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించేందుకు రాష్ట్ర డీజీపీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ హరిబాబు, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐలు ఉమామహేశ్వరరావు, రవికుమార్ పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై వీఆర్వోను పట్టుకున్న ఏసీబీ అధికారులు
కనిగిరి రూరల్: పాస్ పుస్తకాల మ్యుటేషన్‌కు వీఆర్వో లంచం డిమాండ్ చేయడంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక కనిగిరి మండలం ఏరువారిపల్లి వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని అదే సచివాలయ పరిధిలో పనిచేసే వలంటీర్ ఏసీబీ అధికారులకు పట్టించాడు. వివరాల్లోకి వెళితే కనిగిరి మండలం పేరంగుడిపల్లికి చెందిన వీరంరెడ్డి భాస్కర్‌రెడ్డి గోసులవీడు గ్రామవలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి లక్ష్మీరెడ్డి పేరు మీద మండలంలోని అజీస్‌పురంలో 2.73 ఎకరాల భూమి ఉంది. దీన్ని మ్యుటేషన్ చేయించుకునేందుకు గత నెల 24న గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత పాస్బుక్ల మ్యుటేషన్ కోసం వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని కలిశాడు. అతను రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు ఇద్దరి మధ్య రూ.21 వేలకు బేరం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టంలేని వీఆర్వో ఏసీబీ అధికారులకు ఈనెల 9న ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు 11న శుక్రవారం కేసు రిజస్టర్ చేసుకుని.. ఏసీబీ డీఎస్పీ వీ శ్రీనివాసరావు బృందం దాడులు నిర్వహించింది. వెంటాడి నడిరోడ్డుపై పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రైతుల వేషధారణలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణాల్లో కాపు కాశారు. ఏసీబీ అధికారులు వీరం రెడ్డి భాస్కర్‌రెడ్డి చేతికి రూ.21 నగదును అందజేశారు. సుమారు 12 గంటల సమయంలో భాస్కర్‌రెడ్డి.. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డికి నగదు ఇస్తానని చెప్పాడు. దీంతో వీఆర్వో , వలంటీర్‌ని బైక్ పై ఎక్కించుకుని పట్టణంలో కందుకూరు రోడ్డు వైపు ఉన్న కపిలా హోటల్ సెంటర్‌కు తీసుకెళ్లి నగదు తీసుకున్నాడు. అప్పటికే వీఆర్వోను వెంటాడుతున్న ఏసీబీ ట్రాప్ పార్టీ అధికారులు ఒక్క సారిగా రోడ్డుపై చుట్టుముట్టారు. దాన్ని గమనించిన వీఆర్వో తీసుకున్న నగదును జేబులో నుంచి కింద పడేశాడు. వెంటనే ఏసీబీ అధికారులు వీఆర్వో రెండు చేతులు గట్టిగా వెనక్కి మడిచి పట్టుకున్నారు. రోడ్డు పైనే స్టూల్ పెట్టి ఏసీబీ అధికారులు వెంట తెచ్చిన రసాయనం కలిపిన నీటిలో వీఆర్వో చేతులను కడిగించగా, నీళ్లు రంగు మారాయి. ఈ ఘటన అంతా నడిరోడ్డుపై దాదాపు 15 నిమిషాలు సాగింది. ట్రాఫిక్‌కు అంతరాయంగా మారడంతో వీఆర్వో వేణును పోలీసుల సహకారంతో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణానికి తరలించి, తదుపరి విచారణ ప్రక్రియ ప్రారంభించారు. వీఆర్వో వద్ద లెక్కలో లేని నగదు మరో రూ.32,300 ఉంది. ఏసీబీ అధికారుల ట్రాప్‌నకు ముందు ఇద్దరు రైతుల వద్ద ఈ నగదును తీసుకున్నట్లు అధికారులు గుర్తించి, విచారణ జరిపి వారి వద్ద కూడా ఫిర్యాదు తీసుకుంటామని తెలిపారు. మాచవరంలోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు: వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాచవరానికి వెళ్లి అతని ఇంట్లో ఏసీబీ సీఐ అపర్ణ సోదాలు నిర్వహించారు. ఇంట్లో 10 ఈ–పాస్ బుక్‌లు ఐదేళ్ల నాటివి దొరికినట్లు ఏసీబీ డీఎస్పీ వీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆ పాస్‌బుక్‌లు తిరిగి ఇవ్వకుండా అతని దగ్గరే ఎందుకు ఉంచుకున్నాడు అనే దానిపై విచారణ చేపడతామని డీఎస్పీ వెల్లడించారు. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఏసీడీ దాడుల్లో ఏసీబీ సీఐలు అపర్ణ, సీహెచ్ శేషు, టీవీ శ్రీనివాసులు, ఎస్సై జేవీఎన్ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితుడు వీరం రెడ్డి భాస్కర్‌రెడ్డి తొలుత ఈనెల 6న 14400 యాప్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే 14400 యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిర్యాదుదారుల పేర్లను, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తర్వాత విచారణ జరిపి నిజమైతే చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు పరార్.. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకోగానే వివిధ శాఖ అధికారులు పరారయ్యారు. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయంలోని వీఆర్వోలు, వివిధ స్థాయిల్లోని అధికారులు అదృశ్యమయ్యారు. రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులోని అధికారులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు పత్తా లేకుండా పోయారు. బిక్కు బిక్కు మంటూ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇతర సిబ్బంది విధులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు కనిగిరి వదిలి పోయేంత వరకు పలు శాఖల ఉన్నతాధికారులు వారి సీట్లల్లో కూర్చోలేదంటే అతిశయోక్తి కాదు. పలువురు వీఆర్వోలు, రెవెన్యూ, ఇతర రెండు శాఖల్లోని ప్రధాన అధికారుల పేర్లు ఏసీబీ జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి
సాక్షి, విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి జరిగింది. నలుగురు వ్యక్తులు బందర్‌రోడ్డులోని ఆఫీసులో విష్ణును రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌లోని ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక, దుండగుల దాడిలో విష్ణు తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని మాచవరం సీఐ గునరామ్ పరిశీలించారు. అయితే, దాడి సందర్భంగా అదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండగా నిందితులు జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా.. ఆలిండియా హాస్టల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా విష్ణు ఉన్నాడు. ట్రెక్కింగ్ గైడ్, టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నాడు. ఇక, మహిళల వ్యవహారం కారణంగానే విష్ణుపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లో యాక్టివ్.. బీజేపీ నేత దారుణ హత్య.. -
ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, అనకాపల్లి/ విశాఖపట్నం: అనకాపల్లిలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీలో కేబుల్ ట్రాక్ విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాంలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 50 అడుగుల ఎత్తులో కేబుల్ ట్రాక్ నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కేబుల్ ట్రాక్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్ -
రక్తం కారుతున్నా.. ‘అన్నా.. తను జాగ్రత్త’
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): రెండు కాళ్లూ ఛిద్రమై రక్తమోడుతున్నాయి. అయినా ఆయన భయపడలేదు. తనతో పాటు ప్రమాదానికి గురైన భార్యను కాపాడాలని తాపత్రయపడ్డాడు. పైకి లేచి నిలబడలేని స్థితిలోనూ గుండె నిబ్బరం చేసుకుని నేలపై పాకుతూ వెళ్లి భార్యను గుండెలకు హత్తుకున్నాడు. ‘ఏం కాదులే’ అని ధైర్యం చెప్పాడు. 108 వాహనంలోకి చేర్చే క్రమంలో ఆమెను దీనంగా చూస్తూ అంబులెన్స్ సిబ్బందితో.. ‘అన్నా.. తను జాగ్రత్త’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. భార్యను కాపాడేందుకు ఎంతగానో తపించిన ఆ భర్త చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. లారీ ఢీకొన్న ఘటనలో కిరణ్‌కుమార్ (42) మరణించగా.. అతడి భార్య అనిత తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఏఆర్ కానిస్టేబుల్.. భార్య టీచర్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కిరణ్‌కుమార్ 2003 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్. ఇదే ప్రాంతానికి చెందిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనితకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు ఎస్బీఐ కాలనీ రెండో క్రాస్‌లో నివాసం ఉంటున్నారు. కిరణ్‌కుమార్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. అనిత తరిమెల జెడ్పీ హైసూ్కల్లో టీచర్. వీరికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ ఇద్దరు సంతానం. రోజూ ఉదయం భార్యను సోములదొడ్డి క్రాస్‌కు బైక్‌పై తీసుకెళ్లి.. ఆర్టీసీ బస్సులో తరిమెలకు పంపించడం కిరణ్‌కుమార్ దినచర్య. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో కిరణ్‌కుమార్ భార్యతో కలిసి సోములదొడ్డి బస్‌స్టాప్ వద్దకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. 44వ జాతీయ రహదారిపై నుంచి నేషనల్ పార్క్ వద్ద సరీ్వసు రోడ్డులోకి వచ్చే క్రమంలో లారీ ఢీకొంది. బైక్‌పై నుంచి ఎగిరి కిందపడ్డ కిరణ్‌కుమార్ కాళ్లపై లారీ వెనుక టైర్లు వెళ్లాయి. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకోగానే అల్లంత దూరంలో భార్య అనిత పడి ఉండటం చూసి ఆమెను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. తన కాళ్లు ఛిద్రమైపోయినా శక్తినంతటినీ కూడదీసుకుని పాకుతూనే ఆమె వద్దకు చేరాడు. భార్యను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ముక్కు, చెవిలో రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకుంటున్న భార్యను చూసి ‘ఏమీ కాదు’ అంటూ ధైర్యం చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించిన తరువాత అపస్మారక స్థితిలోకి చేరాడు. దంపతులిద్దరినీ 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స చేసి బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ మృతి చెందగా.. భార్య అనిత కోమాలోకి వెళ్లింది. చదవండి: కుమారుడు పరీక్షలో తప్పాడని..తల్లి ఆత్మహత్య -
వివాహితపై లైంగికదాడి : నిందితుడికి రిమాండ్
సబ్బవరం: మండలంలోని నారపాడు గ్రామంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు పరవాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన రాజాన అప్పారావు(36) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మానసిక వైకల్యంతో ఉన్న మహిళపై అత్యాచారం చేసినట్టు చెప్పారు. వారం రోజుల కిందట బాధితురాలి భర్త గ్రామంలో లేని సమయంలో మధ్యాహ్నం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నారు. విషయం బహిర్గతం కాకుండా పెద్దలు న్యాయం చేస్తారనడంతో వెంటనే ఫిర్యాదు ఇవ్వలేదని, అయితే నిందితుడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈమేరకు ఎస్ఐ ఎల్.సురేష్ కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సీఐ రంగనాథం జుడీషియల్ రిమాండ్‌కు తరలించారని చెప్పారు. సమావేశంలో సీఐ రంగనాఽథం, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు.