breaking news
-
పల్నాడు: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
మహిళతో వరుస మరిచి టీడీపీ నేత అకృత్యాలు.. ఎట్టకేలకు అరెస్ట్!
సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం.. బంధువులను సైతం షాక్‌కు గురిచేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి.. మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని, బాబాయ్ రవి కుమార్.. ఆమెను చేరదీశారు. అనంతరం, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్. ఇక, ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్.. వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు.లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో, సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. అనంతరం, బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్.. మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రిని అని రవి కుమార్ సంతకం చేశాడు.ఆ తరువాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించాడు. ఈ సమయంలో బాధితురాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రవికుమార్ కీచకపర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. -
యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్ అరెస్ట్
సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్‌గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్‌తో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె నోటిలో పోశాడు.తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్‌ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు. -
అంకుల్ మా అమ్మను.. మా నాన్నే చంపాడు
కడప అర్బన్ : భర్తే కాలయముడిగా మారి భార్య తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. మద్యం సేవించడానికి డబ్బులను ఇవ్వలేదనే నెపంతో జీవితాంతం తోడు నీడగా నిలిచి, పిల్లలకు మంచి తండ్రిగా చూసుకోవాల్సిన ఆ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన హృదయవిదారకంగా మారింది. ఈ సంఘటన వారి ముగ్గురు పిల్లల జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేసింది. కడప నగరంలోని టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్ఐ ఎస్‌కెఎం హుసేన్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బెల్లమండివీధి, చిన్నమునిరావు వీధిలో గత నెల రోజులక్రిందట ఓ ఇంటిలో బాడుగకు పఠాన్ ఇమ్రాన్‌ఖాన్, అతని భార్య పఠాన్ జమీల (28) చేరారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో షాహిదాఖానం(9), ఏజాజ్‌ఖాన్ (7), అలినాఖానం(5) ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ఎలక్ట్రిషన్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్యతో తరచూ గొడవపడుతూ తాను మద్యం సేవించి వచ్చి మరింత తీవ్రస్థాయిలో భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వరకు పనిచేసుకుని వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ తన భార్యకు రూ. 1000 డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులో రూ. 500 దాచిపెట్టి, రూ.300 తన భర్తకు మద్యం సేవించేందుకు ఇచ్చింది. రూ. 200 కూరగాయలను తీసుకుని వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తనకు మద్యం సేవించడానికి ఇంకా డబ్బులు కావాలంటూ భార్య జమీలతో భర్త వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో భార్య జమీల ఈనెల అద్దె డబ్బులను కట్టాలని, అదే కట్టకుండా డబ్బులను మద్యానికి ఇవ్వమని అంటున్నావా? అనీ అరిచింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తాను ఉపయోగించే ఎలక్రిషన్ కిట్‌లో ఉన్న సుత్తిని తీసుకుని ఆవేశంతో ఊగిపోతూ భార్య తలపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ దెబ్బలకు రక్తపుమడుగులో అక్కడికక్కడే జమీల కుప్పకూలిపోయింది. తన తండ్రి తల్లిని సుత్తితో బాదిన విషయాన్ని గమనించిన పెద్దకుమార్తె షాహిదాఖానమ్ భయంతో తన బంధువుల ఇంటికి పరుగుతీసింది. వారికి చెప్పగానే జమీల బావ, అన్నదమ్ములు పరుగెత్తుకుంటూ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు స్థానిక ప్రజల సాయంతో జమీలను ఆటోలో రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ డాక్టర్లు ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కలా విచారించారు. తమ తల్లి దారుణంగా హత్యకు గురి కావడం, తన తండ్రే హత్య చేయడంతో ముగ్గురు పిల్లలు అనాథ«లుగా మారారు. వారి భవిష్యత్తు ఎలా వుంటుందోననీ స్థానికులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటనతో ఐదుగురు జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు! -
విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!
సాక్షి, విశాఖ: విశాఖలో భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక వివాహిత వసంత ఆత్మహత్యకు పాల్పడింది. నీలి చిత్రాలు చూపిస్తూ.. అందులో చేసినట్లు చేయాలని భర్త వేధించడమే దీనికి కారణమని తేలింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం, నాగేంద్ర ఫోన్లో గూగుల్ హిస్టరీ చూసి పోలీసులే షాక్ అయినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు, వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.ఇక, ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నాగేంద్రను రిమాండ్‌కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. గూగుల్ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సెర్చ్ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.మరోవైపు.. నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
యాసిడ్ దాడి నిందితుడు గణేష్ ఎక్కడ?
అన్నమయ్య, సాక్షి: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో నాశనం చేయాలని చూసిన నిందితుడు గణేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు!. నేరం జరిగిన కాసేపటికే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. ఆ వెంటనే మాట మార్చేశారు. దీంతో.. ఈ కేసులో పోలీసుల అలసత్వంతో పాటు, రాజకీయ నేతల జోక్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి.మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల ముచ్చుమర్రి బాలిక కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. వీటికి తోడు ఉన్మాద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.తాజాగా.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లెలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై.. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించగా.. నిందితుడు అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్‌గా పోలీసులు ప్రకటించారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోపే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. తర్వాత అతని జాడ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు.. అతను పరారీలో ఉన్నాడని, గాలింపు కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో బాధితురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా.. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు ప్రధాన అనుచరుడు. అంతేకాదు.. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా సన్నిహితుడే. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నా.. ఇంత వరకు కేసులో ఎలాంటి పురోగతి చోటు చేసుకోలేదు. ఉన్మాది దాడి ఇలా..యువతి డిగ్రీ వరకు చదువుకుని మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో కొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. -
యాసిడ్ తాగించి.. కత్తితో పొడిచి!
గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్‌తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.వేధింపులతో ఉద్యోగం మానేసి..ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరువాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ (24) ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌తో ఈనెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పొలం నుంచి పరుగులు తీస్తూ..బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతినిత్యం మహిళలపై దాడులు..యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
భర్త వికృత చేష్టలు.. విశాఖలో నవ వధువు..
సాక్షి, విశాఖ జిల్లా: గోపాలపట్నంలో నవ వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. అశ్లీల వీడియోలకు బానిసగా మారిన భర్త నాగేంద్ర.. వికృత ప్రవర్తనకు భార్య బలైంది. భర్త చేష్టలు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నాగేంద్ర సైకోలాగా మారి లైంగికంగా వేధించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.మితిమీరిన కోరికలు, శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర వేధించేవాడు. నాగేంద్రలో కామం వికృత రూపం దాల్చడంతో టార్చర్‌ను భార్య భరించలేకపోయింది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా కానీ మార్పు రాలేదు. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్ద కూడా బాధితురాలు వాపోయింది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరికి ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా తమకు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు అన్నారు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. -
ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు.. యూట్యూబ్‌లో వీడియో చూసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. అనుమానం రాకుండా భూ తగాదాలో ప్రత్యర్థులు హతమార్చినట్లు డ్రామాలాడాడు. పోలీసుల విచారణతో మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 8వ తేదీన మైలవరం మండలం మెర్సుపల్లి వద్ద వక్తి మృతదేహం లభ్యం కాగా, మృతుడు ములకలపెం గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు.వ్యవసనాలకు బానిసై తండ్రి శ్రీనివాసరావును హతమార్చిన కొడుకు పుల్లారావు.. పేకాట, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లలో డబ్బు పోగొట్టుకున్నాడు. గతంలో పుల్లారావు చేసిన నాలుగు లక్షల అప్పును తండ్రి శ్రీనివాసరావు తీర్చాడు. వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన కొడుకు పుల్లారావును పలుమార్లు తండ్రి మందలించాడు. దీంతో తండ్రిని చంపేందుకు పుల్లారావు స్కెచ్ వేశాడు.యూట్యూబ్‌లో సీరియల్ కిల్లర్ మర్డర్ వీడియోలు చూసిన పుల్లారావు.. ఒకే దెబ్బతో ఎలా మనిషి ప్రాణం తీయొచ్చు అని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. పథకం ప్రకారం ఈనెల 8వ తేదీన పొలంలో ఉన్న తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయంటూ డ్రామాకు తెరతీసిన మృతుడి కుమారుడు పుల్లారావు.. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిపి నిరసనలు చేపట్టాడు. పోలీసుల విచారణలో పుల్లారావే హంతకుడని నిర్థారణ కావడంతో నిందితుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. -
అన్నమయ్య జిల్లా: వాలెంటైన్స్ డే రోజున ప్రేమోన్మాది యాసిడ్ దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజున అమానుష ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. రాబోయే ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. అనంతరం, ఈరోజు దాడికి పాల్పడ్డారు.గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇక, నిందితుడిని మదనపల్లె అమ్మచెరువుమిట్టకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి వద్దకు జడ్జీ వెళ్లి బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
AP: ఒంటరి మహిళపై వేధింపులు.. సీఐ సస్పెండ్
సాక్షి, శ్రీ సత్యసాయి: పోలీసు స్టేషన్లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.జరిగింది ఇది..బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మడకశిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయత్రి శనివారం ఎస్పీ రత్నను కలిసి పోలీసు స్టేషన్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.అనంతరం పోలీస్ కార్యాలయం ఎదుట బాధితురాలు గాయత్రి మీడియాతో గోడు వెళ్లబోసుకొంది. టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిందని చెప్పింది. వారికి సర్ది చెప్పాలని తాము కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లామంది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వచ్చి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు చెప్పింది.అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని వివరించింది.వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింది. విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయబ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో, ఉన్నతాధికారులు తాజాగా సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సీఐ రామయ్యపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. -
సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.88.58 లక్షల కోట్లు కొల్లగొట్టడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. గ్లోబల్ యాంటీ స్కామ్స్ అలయన్స్ (గాసా) నివేదిక సైబర్ నేరాల బాధితులపై సర్వే చేసింది.నివేదికలోని ప్రధాన అంశాలు..⇒ ఆసియా దేశాల్లో రూ.6.88 లక్షల కోట్లు కొల్లగొట్టారు. ⇒ ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది సైబర్ నేరాల బారినపడ్డారు. ⇒ 74శాతం మంది బాధితులు వారి తప్పిదం, అవగాహన రాహిత్యంతోనే సైబర్ నేరాల బారిన పడుతున్నారు.⇒ 67శాతం మంది బాధితులు తమకు వచ్చిన లింకులు సైబర్ నేరాలకు సంబంధించినవని సందేహిస్తూనే క్లిక్ చేస్తూ మోసపోతున్నారు.⇒ 70శాతం మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే లేదు.⇒ 25 శాతం మంది తమ బ్యాంకు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.⇒ సైబర్ నేరాల్లో 28శాతం ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్, బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారానే సాగుతున్నాయి.⇒ 36శాతం సైబర్ నేరాలకు ఈ–వాలెట్ విధానాన్ని వాడుకుంటున్నారు. ⇒ ఫిర్యాదు చేస్తున్న వారిలో కేవలం 4శాతం మంది బాధితులే తాము కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందుతున్నారు. ⇒ కేవలం 0.05శాతం మంది సైబర్ నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ⇒ ఆన్లైన్ మోసాలను ముందుగా గుర్తించడంలో చైనీయులు మొదటిస్థానంలో ఉండగా భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. ⇒ అత్యధికంగా సైబర్ నేరాల బాధిత దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. ⇒ అమెరికా, డెన్మార్క్, స్లోవేకియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ⇒ భారత్‌లోని సైబర్ బాధితులు సగటున రూ.35వేలు కోల్పోయారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన చిట్రా సూర్య (20) అనే యువకుడు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సూర్యకు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన యువకుడు యువతి చదువుతున్న కొవ్వూరులోని స్కూలుకి వెళ్లాడు. యువతిని పిలువమని అడుగగా ప్రిన్సిపాల్ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. తాము ఎవరినీ పంపలేదని చెప్పడంతో యువతిని కలిసేందుకు పాఠశాల నిర్వాహకులు నిరాకరించారు. యువతి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ వ్యవహారంపై యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. స్థానిక బ్యాంకులో యువకుడి సోదరుడు పనిచేస్తున్నారు. ఆ యువకుడి బ్యాంకు ఉద్యోగం తీయించి వేస్తామని యువతి తల్లిదండ్రులు హెచ్చరించారు. పైగా సూర్యని చంపుతామని బెదిరించడంతో మనస్థాపం చెంది సోమవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పక్క గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు యువకుడి తండ్రి శివ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు యువతి కుటుంబ సభ్యులైన హరి, వరలక్ష్మీ , పార్వతీ, లాయర్ నరసింహరాజు, సూర్యచంద్రం, సత్యవతిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కె.జగన్మోహన్రావు తెలిపారు. సూర్య ఆ కుటుంబంలో రెండో సంతానం అన్నారు. ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారని అన్నారు. మృతుడి తండ్రి తాపీ పనిచేస్తాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు. -
ఆ గంట.. కీలకమంట!
పట్నంబజారు: అత్యవసర పరిస్థితుల్లో ఎంతో అవసరమైన సమయంలో మనం వాడే పదం గోల్డెన్ అవర్. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం విని ఉంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేయగలిగితే.. ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్‌లో సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయటమే. జిల్లాలో ఇప్పటివరకు వందల సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అయ్యాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాము మోసానికి గురయ్యామని ఎస్‌సీఆర్‌బీకి ఫిర్యాదు చేయటం ద్వారా, లేదా 1930 సైబర్ సెల్ నంబరు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెనక్కి తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదు చేయాలిలా..» మోసపోయామని తెలుసుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు కాల్ చేయాలి. » లేదంటే https:// cybercrime. gov. in అనే పోర్టల్‌పై క్లిక్ చేయాలి. హోం పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు, షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వంటి వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే. » ఈ పేజీలో ఒక ఫామ్ కనిపిస్తుంది.. దానిలో జరిగిన సైబర్ మోసం గురించి క్లుప్తంగా రాయాలి. అక్కడ నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో అడిగిన వివరాలను సమరి్పస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని భావిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (అకౌంట్ ట్రాన్సాక్షన్ తదితర) ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి. » అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది. సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్‌కు కాల్ చేయాలి. వెంటనే ఫిర్యాదు చేయండి.. సైబర్ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. తక్షణం ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవో.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రక్రియ అవుతుంది. డయల్ 1930కు గానీ, ఎన్సీఆర్బీ గానీ ఫిర్యాదు చేసి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలి. తద్వారా బాధితుడికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ, గుంటూరు జిల్లా -
Kiran Royal: ‘మరీ ఇంత అన్యాయమా?’
తిరుపతి, సాక్షి: కూటమి నేతలకు పోలీసులు తలొగ్గుతున్నారని, జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్పీని కలిసి స్పందన ద్వారా మరోసారి ఫిర్యాదు చేశారు.ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్షంగా.. ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడికే అండగా ఎందుకు నిలబడుతున్నారు?. కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ఐద్వా మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తక్షణమే కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేయాలని ఐద్వా నాయకురాలుసాయిలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.పవన్‌కు అత్యంత సన్నిహితుడు, తిరుపతి జనసేన ఇంఛార్జి అయిన కిరణ్‌రాయల్.. తన నుంచి రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా, పైగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. అయితే ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. నాటకీయ పరిణామాల నడుమ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కిరణ్‌రాయల్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు? -
రూ.1.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత
తాడేపల్లిగూడెం అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గంజాయి అక్రమ రవాణా(Ganja smuggling) చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ విశ్వనాథ్(Vishwanath) సోమవారం తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వే గూడ్స్ షెడ్డు రోడ్డులో మోటారు సైకిల్ పార్కింగ్ వద్ద కొందరు వ్యక్తులు గంజాయిని తీసుకువెళ్తున్నారని సమాచారం రావడంతో ఆ ప్రాంతానికి వెళ్లి.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.వారి వద్ద నుంచి రూ.1.30 లక్షల విలువైన 13.288 కిలోల గంజాయిని స్వాదీనం(Ganja possession) చేసుకున్నట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లి శ్రీనివాస్, కరాటం బాలకృష్ణ, కంకిపాటి నాగరాజు, గుండుగోలు మురళి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ముసునూరి దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. -
తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్‌ను తండ్రి సురేష్ స్కూల్లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్‌కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్‌పై తీసుకువెళ్లాడు.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్‌కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. -
AP: నిన్న వీఆర్వో.. నేడు సీఐ.. మహిళలపై ఆగని వేధింపులు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాడిపత్రి వీఆర్వో వేధింపుల ఘటన మరువకముందే మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మడకశిరలో సీఐ.. ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. దీంతో, బాధితురాలు పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, యువతులపై వేధింపులు పెరిగాయి. కూటమి నేతల అండతో కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలపై కొందరు ఉద్యోగుల లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. దీంతో, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా మడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన బయటకు వచ్చింది.అయితే, కేసుతో సంబంధం లేకుండా సదరు సీఐ.. ఓ మహిళను రాత్రి 10 గంటల వరకు తన చాంబర్లోనే ఉంచారు. విచారణ పేరుతో ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. అనంతరం, బాధితురాలు.. ధైర్యం చేసుకుని సీఐ తనను లైంగికంగా వేధించారని పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సీఐ అరాచకం వెలుగులోకి వచ్చింది.ఇదిలా ఉండగా.. తాడిపత్రి వీఆర్వో చంద్రశేఖర్ వేధింపుల ఘటన కూడా తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ మహిళలను వేధించిన మడకశిర సీఐ, తాడిపత్రి వీఆర్వోలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, బాధితులు, ప్రజలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ కార్యకర్త అమానుషం.. దివ్యాంగురాలిపై అఘాయిత్యం
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ కార్యకర్త దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెను బెదిరించి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పలాస మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ దివ్యాంగురాలి(20)పై కన్నేసిన భాస్కరరావు ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉండగా.. పెదంచలలో తన నానమ్మతో కలిసి ఉంటోంది ఆమె.ఇక, తన మనుమరాలికి న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు భాస్కరరావు వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు.. కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ..‘అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా నా మనవరాలు గర్భవతి అని తెలిసింది. వరిశి భాస్కరరావు నా మనవరాల్ని గర్భవతిని చేశాడు. మాకు అన్యాయం జరిగింది.. న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
రీల్స్ పిచ్చి..! బాలికను రెండుసార్లు వివాహం భార్గవ్
సీతమ్మధార: సెల్ఫోన్లకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్న రోజులివి. రీల్స్ పిచ్చి ఓ మైనర్ తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేస్తే..మరో యువకుడ్ని కటకటాలపాల్జేసింది. ఫోర్త్‌టౌన్ పోలీసు స్టేషన్లో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వివరాలు..తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన 15 ఏళ్ల బాలికకు రీల్స్ అంటే పిచ్చి..నిత్యం రీల్స్ చేయడం..వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం అలవాటు. ఈ క్రమంలో సమీప ఇంట్లో ఉంటున్న భార్గవ్..బాలిక చేసిన రీల్స్ చూసి లైక్ కొట్టాడు. క్రమంగా ఇన్స్టాలోనే పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తనకు రీల్స్ చేయాలని ఉందని, దానికి సహకరించాలని బాలికను కోరాడు. లేదంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇటీవల కై లాసపురం కొండమీద గల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలుసుకున్నారు. జనవరి 9వ తేదీన మళ్లీ అదే ప్రదేశంలో కలుసుకుని బలవంతంగా బాలిక మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత కొద్ది రోజులకు మళ్లీ సదరు బాలికను సింహాచలం తీసుకువెళ్లి అక్కడ మరోమారి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫోర్త్ టౌన్ పోలీసులు భార్గవ్‌పై పోక్సో, బాల్యవివాహ నిరోధక చట్టం, ఎస్టీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. భార్గవ్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసును ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలు.. మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి: తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిందో మహిళ. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది.‘నావద్ద నుంచి తిరుపతి జనసేన ఇన్చార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ీతీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ాబాండ్స్, ెచెక్ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు -
ప్రేమించి వంచించాడు.. పెళ్లంటే పొమ్మన్నాడు..
రాజానగరం: ప్రేమించానన్నాడు.. వంచించాడు.. పెళ్లి మాటెత్తితే కాదు పొమ్మన్నాడు. 16 ఏళ్ల బాలిక 18 బాలుడిపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాజానగరంలో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలు ఇలా వున్నాయి. రాజానగరానికి చెందిన ఆ మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నరేంద్రపురం కూడలిలో జులాయిగా తిరిగే ఆ బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఆమె వెంటపడేవాడు. చివరకు తనతోనే లోకం అనేలా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పదో తరగతి వరకు చదివిన ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో పెళ్లంటే తనకు ఇష్టం లేదని పొమ్మన్నాడు. దీనితో న్యాయం కోసం ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లే కావడంతో పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి, నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో.. భార్యను వెంటాడి మరీ.. -
తిరుపతిలో భారీ చోరీ
తిరుపతి రూరల్: తిరుపతి శివారు తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మొత్తం నాలుగు విల్లాల్లోకి చొరబడిన దుండగులు రెండు విల్లాల్లోంచి దాదాపు 1.48 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు సమాచారం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన తిరుపతి నగరంతో పాటు శివారు ప్రాంతాల వారిని భయాందోళనకు గురిచేసింది. సీపీఆర్ విల్లాల సముదాయంలో 30కి పైగా విల్లాలున్నాయి. వాటి ప్రధాన ద్వారం వద్ద హై సెక్యూరిటీతో పాటు చుట్టూ సోలార్ ఫెన్షింగ్, అక్కడక్కడా హై రెజల్యూషన్ సీసీ కెమెరాలున్నా.. దొంగలు చాకచక్యంగా లోనికి చొరబడ్డారు. ఆ రెండు విల్లాల్లో ఏమీ దొరకలేదు.. 81వ నంబర్ విల్లా యజమాని మేఘనాథరెడ్డి పైఅంతస్తులో నిద్రిస్తుండగా.. కింది అంతస్తులో కేజీ బంగారు ఆభరణాలను దోచుకున్నారు. 82వ నంబర్ గల విల్లా యజమాని కేశవులనాయుడు కుమారుడు జగదీష్ ఇంటి నుంచి 48 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కేజీల వెండి వస్తువులను చోరీ చేశారు. ఇక 80, 83 నంబర్లు గల విల్లాల యజమానులు వాటిని కేవలం గెస్ట్ హౌస్‌లుగా మాత్రమే వినియోగించుకుంటున్నారు. వాటి తలుపులను కూడా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులకు అక్కడ విలువైన వస్తువులేమీ దొరకలేదు. ఉదయాన్నే చోరీ విషయాన్ని గమనించిన యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భద్రతాపరంగా పటిష్టంగా ఉన్న సీపీఆర్ విల్లాలోకి దొంగలు ప్రవేశించడాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. -
మహిళా జెడ్పీటీసీ ఇంటిపై టీడీపీ మూకల దాడి
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య దంపతుల ఇంటిపై టీడీపీ మూకలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం పరిధిలోని జాండ్రపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. దాడి జరగక ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. లక్కిరెడ్డిపల్లె టీడీపీ నేత మదన్మోహన్ సెల్ ద్వారా వాట్సాప్ కాల్ చేసి ‘నిన్ను చంపేస్తాం’ అని బెదిరించాడని మాజీ ఎంపీపీ రెడ్డయ్య ఆరోపించారు. రెండు సుమోలు, మరో మూడు వాహనాలలో 60 మందికి పైగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు మంకీ క్యాపులు పెట్టుకుని మచ్చు కత్తులు, ఇనుప రాడ్లతో తమ ఇంటిపై దాడికి తెగబడ్డారని రమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.తన భర్త రెడ్డయ్య, కుమారుడు రమేష్‌ను కాపాడుకునేందుకు ఇంటి వెనక డోర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తుండగా, ఆడవాళ్లు అని కూడా చూడకుండా తమపై దాడి చేశారని వాపోయారు. తమ కోడలు ఆరు నెలల గర్భిణి అని, ఆమె జోలికి వెళ్లొద్దని ప్రాథేయపడినా వినకుండా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తమ ఇంటి బయట ఉన్న బుల్లెట్ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, మరో బుల్లెట్ వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. అంతలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకోబోగా, జగన్మోహన్ ప్రసాద్ అనే వ్యక్తిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచారన్నారు.ఇంట్లోకి దూరి తలుపులు, కిటికీల అద్దాలు, సామాన్లు, ఫర్నీచర్, టీవీలు, సోఫా సెట్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న రెడ్డయ్య తల్లి లేవలేని స్థితిలో మంచానపడి ఉన్నా కూడా కనికరించలేదని, ఆమెపై కూడా దాడి చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డిలు రమాదేవికి ధైర్యం చెప్పారు. -
సముద్రంలో ఈతకు వెళ్లి ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతు
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్కో బ్రేక్ వాటర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది. మత్స్యకారుడు గల్లంతు కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్‌లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.