Top Stories
ప్రధాన వార్తలు

అప్పుల్లో చంద్రబాబు సర్కార్ రికార్డు
అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్ అధికారి భార్య
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మే 3న జరిగిన ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ సందర్భంగా ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో వీవీఐపీ ప్రేక్షకుల బాక్స్‌లో (బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో) రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒక కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ ప్రముఖులకు చెందినది కాగా.. మరో కుటుంబం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబానికి చెందినది. ఈ రెండు కుటుంబాల మధ్య సీట్ల విషయంలో మొదలైన గొడవ చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఐపీఎల్ అధికారి భార్య ప్రత్యర్థి వర్గంపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమెను, ఆమె కుమార్తెను లైంగికంగా వేధించారని కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.ఇదిలా ఉంటే, నువ్వా నేనా అన్నట్లు సాగిన ఆ మ్యాచ్‌లో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (55), విరాట్ కోహ్లి (62), రొమారియో షెపర్ట్ (53 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆఖర్లో షెపర్ట్ సునామీలా విరుచుకుపడి ఆర్సీబీకి భారీ స్కోర్ అందించాడు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది.ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జడేజా, ధోని, దూబే లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా 12 పరుగులకే పరిమితం చేశాడు.

సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా?
కోల్‌కతా: ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా? అంటే అవుననే అంటున్నారు ఒడిశా బీజేపీ నేతలుపశ్చిమ బెంగాల్ దిఘూలో జగన్నాథుడి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠాపన జరిగింది.ఈ ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి మమతా వేప మొద్దులు దొంగిలించదని ఒడిశా బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని దీదీ ఖండించారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంట్లోనే నాలుగు వేప చెట్లు ఉన్నాయి. దొంగిలించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో జగన్నాథ స్వామిని పూజించడం నేరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ, ఒడిశా బీజేపీ పాలనలో పశ్చిమ బెంగాల్ వలసకూలీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష
దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.షెల్ కంపెనీల నెట్వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్‌లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలుకార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు భగ్గుమంటున్నాయి. ప్రతిదాడి కోసం భారత్ పక్కాగా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఈ తరుణంలో మే 7న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ 48 గంటల్లోనే రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జరగనున్న ఈ కేబినేట్ మీటింగ్‌పై అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.ఉగ్రదాడి జరిగిన సమయం నుంచి దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. పాక్ విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచదేశాలు అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశ భద్రతపై ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో పాక్‌లో అలజడి రేగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి కేబినేట్ సమావేశం జరగనుంది. అందులో దాయాది దేశానికి ఎలా బుద్ధి చెప్పాలి వంటి అంశాల గురించి చర్చించనున్నారు. భారత్‌పై పాక్ వైమానిక దాడులకు దిగితే ఎలా వ్యవహరించాలి..? ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఎలాంటి సూచనలు చేయాలి..? దేశంలో అత్యవసరమైన కీలకమైన కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి..? ఏదైనా ప్రమాధం జరిగితే హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలు ఏంటి..? వంటి అంశాలు చర్చకు రానున్నాయి.ప్రధాని మోదీ ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్‌తో పాటు హోంమంత్రి అమిత్‌షాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ (సీసీఎస్) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూజలాల ఒప్పందంపై ఆంక్షలు. దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు, గగనతలాన్ని మూసివేయడం వంటి నిర్ణయాలను భారత్ తీసుకుంది.

Met Gala 2025: స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్లో బాలీవుడ్ తారలంతా తమదైన ఫ్యాషన్ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్ అటెన్షన్ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్ వేర్లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్ గాలా ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్లో భారతీయ ఫ్యాషన్ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్. స్టైలిష్ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఇషా డిజైనర్ వేర్ని రూపొందించారు. టాప్ గోల్డ్ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్ కలర్ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్ తెల్లటి క్యాప్ లుక్‌లో అత్యంత స్టైలిష్ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్ వేర్లా డిజైన్ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్ వేర్కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్ వేర్ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)

TG: ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపు(మే7వ తేదీ, బుధవారం) ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ మేరకు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ.. తమ సమ్మెను వాయిదా వేసుకుంది. సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నాం -సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ లో సమ్మె చేయక తప్పదని హెచ్చరించింది. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు.‘రవాణా శాఖ మంత్రి తో చర్చలు జరిపాం..Rtc యూనియన్ ల పై ఆంక్షలను ఎట్టివేస్తామని హామీ ఇచ్చారు. Rtc లోఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగం భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీ లో కొని rtc కీ ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాటిపథకన చేస్తామన్నారు.. Rtc ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం,మంత్రిమీద నమ్మకం తో సమ్మెని తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపొతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం’ అని అన్నారు.తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, అటు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈరోజు(మే 6వ తేదీ, మంగళవారం) వారిని చర్చలకు పిలిచింది.ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటుఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్బంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఓ కమిటీని సర్కార్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఈ అధికారుల కమిటీ విధి.

భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఇస్లామాబాద్: 1971లలో నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.

ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు
సాక్షి,హైదరాబాద్: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్ కృపానందంలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మంగళవారం సీబీఐ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతోపాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ కేసులో విచారణ సాగుతున్న సమయంలోనే A5రావు లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేసింది. కేసులో గాలి సోదరుడు, బీవీ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్లు శిక్ష విధించింది.

Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.ఈ మాక్ డ్రిల్‌పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు,డీజీపీలు,ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రంకేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరిలో ఢిల్లీ ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 1. అండమాన్ & నికోబార్ ద్వీపాలు Category-II: పోర్ట్ బ్లెయిర్2. ఆంధ్ర ప్రదేశ్Category-II: హైదరాబాద్, విశాఖపట్నం3. అరుణాచల్ ప్రదేశ్ Category-II: • ఆలోగ్ (వెస్ట్ సియాంగ్) • ఇటనగర్ • తవాంగ్ • హయులింగ్ • Category-III: బొమ్డిలా4. అస్సాం Category-II: • బోంగైగావోన్ • డిబ్రూగఢ్ • ధుబ్రి • గోల్పారా • జోర్హాట్ • శిబ్‌సాగర్ • టిన్సుకియా • తేజ్‌పూర్ • డిగ్బోయ్ • దిలీజన్ • గువహాటి (డిస్పూర్) • రంగియా • నమ్రుప్ • నజీరా • నార్త్-లక్ష…26.ఒరిస్సా (ఒడిశా)Category-II: • టాల్చర్ Category-III: • బలాసోర్ • కోరాపుట్ • భువనేశ్వర్ • గోపాల్పూర్ • హిరాకుడ • పారాదీప్ • రౌర్కెలా • భద్రక్ • ధేంకనాల్ • జగత్సింగ్పూర్ • కేండ్రాపాడా27. పుదుచ్చేరి Category-II:పుదుచ్చేరి28. పంజాబ్Category-II: • అమృత్సర్ • భటిండా • ఫిరోజ్‌పూర్ • గుర్దాస్పూర్ • హోషియార్పూర్ • జలంధర్ • లుధియానా • పటియాలా • పఠాన్‌కోట్ • అడాంపూర్ • బర్ణాలా • భాఖ్రా-నంగళ్ • హల్వారా • కొఠ్‌కాపూర్ • బటాలా • మోహాలి (ససనగర్) • అబోహర్Category-III: • ఫరీద్పూర్ • రోపర్ • సంగ్రూర్29. రాజస్థాన్Category-II: • కోటా • రావత్భాటా • అజ్మీర్ • అల్వార్ • బార్మేర్ • భరత్పూర్ • బీకానేర్ • బుండీ • గంగానగర్ • హనుమాన్‌గఢ్ • జైపూర్ • జైసల్మేర్ • జోధ్‌పూర్ • ఉదయ్‌పూర్ • సికార్ • నాల్ • సూరత్‌గఢ్ • అబూ రోడ్ • నసీరాబాద్ (అజ్మీర్) • భివారీ Category-III: • ఫులేరా (జైపూర్) • నాగౌర్ (మెర్టా రోడ్) • జాలోర్ • బేవార్ (అజ్మీర్) • లాల్‌గఢ్ (గంగానగర్) • సవాయ్ మాధోపూర్ • పాలి • భిల్వారా👉రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలుఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్మొబైల్ సిగ్నల్స్ నిలిపివేతట్రాఫిక్ దారి మళ్లింపుప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలుపబ్లిక్ అనౌన్స్మెంట్స్👉యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారా మిలిటరీ వ్యవహరించే విధానంసివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు వ్యవహరించాల్సిన విధానంఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండడం. స్థానిక గా ఇచ్చే సూచనలు పాటించాలివదంతులను వ్యాపింప చేయొద్దు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దుకరెంటు లేక పోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఆందోళనకు గురికావద్దు అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ చానల్స్, రేడియోను మాత్రమే వినాలిప్రజలు, అధికారులు తమ తమ బాధ్యతలు గుర్తెరిగి మెలగాలిమార్క్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప... ఆందోళన కు గురిచేయడం లక్ష్యం కాదు 👉రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే...ఎయిర్ రైడ్ సైరన్స్ : ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలిక్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్ కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ
డ్రగ్స్ కేసు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరెస్ట్
గుడి కట్టిన అభిమాని.. సమంత ఏమన్నారంటే..
ఏఐ వినియోగంలో దూసుకెళ్తున్న భారత్: కేపీఎంజీ రిపోర్ట్
Road Accidents: రూ. లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్
Met Gala 2025: స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్ అధికారి భార్య
సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా?
పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత
449 కిమీ రేంజ్ అందించే.. విండ్సర్ ఈవీ ప్రో: ధర ఎంతంటే?
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య'.. కంగ్రాట్స్ అంటూ అల్లు స్నేహ
దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష
పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!
సోలార్ విద్యుత్ మాకు కుదించకండి.. కేంద్రమంత్రితో భట్టి
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
తాకట్టులో ఆంధ్రప్రదేశ్ ఖజానా!
అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా
అప్పుల్లో చంద్రబాబు సర్కార్ రికార్డు
సాంకేతికతతో యుద్ధానికి సై
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
ధోని రిటైర్ అయితే బెటర్!.. సురేశ్ రైనా ‘షాకింగ్’ కామెంట్
ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు
‘అవినీతే సిగ్గుపడేలా..కూటమి ప్రభుత్వం అవినీతి’
యూఎన్వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు
అందుబాటులో అమెరికా విద్యార్థి వీసా అపాయింట్మెంట్లు
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
కూటమిపై తిరుగుబాటు మొదలైంది: దేవినేని అవినాష్
డ్రగ్స్ కేసు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరెస్ట్
గుడి కట్టిన అభిమాని.. సమంత ఏమన్నారంటే..
ఏఐ వినియోగంలో దూసుకెళ్తున్న భారత్: కేపీఎంజీ రిపోర్ట్
Road Accidents: రూ. లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్
Met Gala 2025: స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్ అధికారి భార్య
సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా?
పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత
449 కిమీ రేంజ్ అందించే.. విండ్సర్ ఈవీ ప్రో: ధర ఎంతంటే?
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య'.. కంగ్రాట్స్ అంటూ అల్లు స్నేహ
దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష
పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!
సోలార్ విద్యుత్ మాకు కుదించకండి.. కేంద్రమంత్రితో భట్టి
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
తాకట్టులో ఆంధ్రప్రదేశ్ ఖజానా!
అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా
అప్పుల్లో చంద్రబాబు సర్కార్ రికార్డు
సాంకేతికతతో యుద్ధానికి సై
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
ధోని రిటైర్ అయితే బెటర్!.. సురేశ్ రైనా ‘షాకింగ్’ కామెంట్
ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు
‘అవినీతే సిగ్గుపడేలా..కూటమి ప్రభుత్వం అవినీతి’
యూఎన్వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు
అందుబాటులో అమెరికా విద్యార్థి వీసా అపాయింట్మెంట్లు
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
కూటమిపై తిరుగుబాటు మొదలైంది: దేవినేని అవినాష్
సినిమా

కర్ణాటక ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన స్టార్ సింగర్
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ బెంగళూరులో నిర్వహించిన సంగీత కచేరీ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కర్ణాటక ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన సోనూ, తాజాగా క్షమాపణలు చెప్పారు. ‘సారీ కర్ణాటక.. నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.అసలేం జరిగింది?గత నెల 25-26 తేదీల్లో బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సోనూ నిగమ్ ఒక సంగీత కచేరీ నిర్వహించారు. కచేరీ సందర్భంగా, కొంతమంది ప్రేక్షకులు సోనూ నిగమ్‌ను కన్నడ పాటలు పాడాలని గట్టిగా కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో సోనూ చిరాకు పడ్డారు. ఈ క్రమంలో ఓ అభిమాని కన్నడ పాటల డిమాండ్‌ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ డిమాండ్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను గాయపరిచాయని ఆరోపణలు వచ్చాయి.కన్నడ సంఘాల ఆగ్రహంసోనూ నిగమ్ వ్యాఖ్యలు కన్నడ భాష, సంస్కృతిని అవమానించాయని భావించిన కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. KRV బెంగళూరు సిటీ యూనిట్ అధ్యక్షుడు ధర్మరాజ్, సోనూ వ్యాఖ్యలు భాషల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాయని ఆరోపిస్తూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, బెంగళూరు పోలీసులు సోనూ నిగమ్‌కు నోటీసులు జారీ చేసి, వారంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ బ్యాన్ఈ వివాదం నేపథ్యంలో, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోనూ నిగమ్‌పై బ్యాన్ విధించినట్టు తెలుస్తోంది. ఈ నిషేధం కారణంగా సోనూ కర్ణాటకలో సంగీత కార్యక్రమాలు నిర్వహించడంపై ఆంక్షలు విధించినట్టు సమాచారం. అయితే, ఈ బ్యాన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సోనూ నిగమ్ బెంగళూరు కాన్సర్ట్ వివాదం కన్నడ భాష, సంస్కృతి చుట్టూ సున్నితమైన అంశాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, కన్నడిగుల ఆగ్రహం, పోలీసు విచారణ, ఫిల్మ్ ఛాంబర్ బ్యాన్ వంటి పరిణామాలు ఈ ఘటనను మరింత హైలైట్ చేశాయి. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ఆస్పత్రిలో నటుడు ఉపేంద్ర.. ఏమైందంటే?
కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర(Upendra). రీసెంట్ టైంలో మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈయన ఆస్పత్రి పాలయ్యారని, అనారోగ్యం(Health Update) అని వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ఈ విషయమై స్వయంగా ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)'అందరికీ నమస్కారం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సాధారణ చెకప్ కోసమే మాత్రమే ఆస్పత్రికి వెళ్లొచ్చాను. ఇలాంటి పుకార్లతో అయోమయానికి గురవ్వొద్దు. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని ఉపేంద్ర ట్వీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరు ఆస్పత్రికి వెళ్లినా సరే అనారోగ్య సమస్యలు, పరిస్థితి విషమం తరహా వార్తలు వస్తున్నాయి. దీంతో సదరు నటీనటులు తప్పని పరిస్థితుల్లో ట్వీట్, పోస్ట్ ద్వారా స్పష్టత ఇవ్వాల్సి వస్తోంది. ఉపేంద్ర.. తెలుగులో రామ్(Ram Pothineni) హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య')ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.. ನಾನು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೇನೆ.. ರೆಗ್ಯುಲರ್ ಚೆಕ್ ಅಪ್ ಗಾಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದೆ ಅಷ್ಟೇ.. ಯಾವುದೇ ಊಹಾ ಪೋಹ ಗಳಿಗೆ ಕಿವಿಕೊಟ್ಟು ಗೊಂದಲಕ್ಕಿಡಾಗಬೇಡಿ.. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಕಾಳಜಿಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು 🙏— Upendra (@nimmaupendra) May 5, 2025

బాలీవుడ్ అమ్ముడు పోయింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj ) బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో సగం మంది నటీనటులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అందుకే వారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ప్రకాశ్ రాజ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడానికి కారణాలను వివరించారు.“నేను సూటిగా మాట్లాడతాను. రాజకీయ పరిణామాలపై నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతుంటాను. దీని వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని భావించి, నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసిన తర్వాతే నేను గళం విప్పాలని నిర్ణయించుకున్నాను,” అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించాలనే ఆలోచన చాలా మందిలో ఉన్నప్పటికీ, ధైర్యంతో ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“సినిమా పరిశ్రమలో సగం మంది అమ్ముడుపోయినవారే. కొంతమంది మంచివారు ఉన్నప్పటికీ, ప్రశ్నించే ధైర్యం లేదు. నా సన్నిహిత మిత్రుడు ఒకరు, ‘ప్రకాశ్, నీకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నావ్, మాకు అంత ధైర్యం లేదు’ అని చెప్పారు. వారి పరస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ, చరిత్ర నేరాలు చేసిన వారిని క్షమించినా, మౌనంగా ఉండేవారిని మాత్రం క్షమించదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన తాజాగా సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రంలో కనిపించారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’, విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

త్వరలో నా డ్రీమ్ ప్రాజెక్ట్‌తో తిరిగొస్తా: కార్తీక్ సుబ్బరాజ్
'రెట్రో' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఈ మూవీ తెలుగువారికి అంతగా నచ్చలేదు. కానీ, కోలీవుడ్‌లో దుమ్మురేపుతుంది. సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో వచ్చిన రెట్రోపై నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఇంతలోనే వీరిద్దరి నుంచి మరో సినిమా రానుందని ప్రకటించారు. అయితే అది అత్యంత భారీ బడ్జెట్ కథా చిత్రంగా ఉంటుందని, అది తన డ్రీమ్ ప్రాజెక్టు అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు.రెట్రో సినిమాను కూడా సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెయిన్మెట్ సంస్థ, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మించాయి. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మేడే రోజున విడుదలయ్యి టాక్‌కు అతీతంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ముఖ్యంగా నటుడు సూర్య నటనకు, గెటప్‌లకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. దీంతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఒక భేటీలో పేర్కొంటూ సూర్య హీరోగా మరో చిత్రం కచ్చితంగా చేస్తానని చెప్పారు. అయితే అది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఉంటుందని అన్నారు.దీంతో అందులో నటించడానికి సూర్య ఎక్కువ కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే సూర్య ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నారని, అందువల్ల ఈయనతో తెరకెక్కించే భారీ బడ్జెట్ కథా చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ప్రస్తుతం చెప్పలేనని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పారు. ఇది నిజంగా సూర్య అభిమానులకు సంతోషపడే వార్తే అవుతుంది. కాగా నటుడు సూర్య ప్రస్తుతం ఆయన 45వ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్నారు. డ్రీమ్ వారయర్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. దీని తరువాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో నటిస్తారని సమాచారం.
న్యూస్ పాడ్‌కాస్ట్

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.
క్రీడలు

అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా: కోహ్లి
టీమిండియా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గానూ కోహ్లి వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.ఆ తర్వాత కోహ్లి 2.0గా తిరిగొచ్చి ప్రస్తుతం ఇటు టీమిండియా వన్డే, టెస్టు జట్లలో.. అటు ఆర్సీబీలో స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న ఈ బెంగళూరు ఆటగాడు.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి కారణాల గురించి తాజాగా మాట్లాడాడు.అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నాఆర్సీబీ బోల్డ్ డైరీస్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకానొక సమయంలో... పరిస్థితులన్నీ కఠినంగా మారిపోయాయి. నా కెరీర్లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. అప్పటికి ఏడు- ఎనిమిదేళ్ల నుంచి నేను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాను.ఆర్సీబీకి తొమ్మిదేళ్లుగా సారథిగా కొనసాగుతున్నాను. ఆ సమయంలో నా బ్యాటింగ్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ నేను బాగా ఆడాలనే ఆకాంక్షలు ఉన్నాయి. కెప్టెన్‌గా ఉన్నా.. బ్యాటర్‌గా కొనసాగినా ఇలాంటివి తప్పదని అర్థమైంది. 24*7 నేను ఎక్స్పోజ్ అవుతూనే ఉంటా. ఇది నాకు కఠినంగా తోచింది.పరిస్థితులు నా ఆధీనంలో లేకుండా పోయాయి. అప్పుడే నేను సంతోషంగా ఉండాలని.. నా ఆనందం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాను. వ్యక్తిగత జీవితంలో నా కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉండాలి.ఆటగాడిగా వచ్చి నా పని పూర్తి చేసి వెళ్తాలి.. నా ఆటను విమర్శించే అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఈ సీజన్లో జరుగుతున్నది ఇదే’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అండర్-19 క్రికెట్లో కెప్టెన్‌గా భారత్‌కు టైటిల్ అందించాడు కోహ్లి. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో రాటుదేలాడు.కెప్టెన్‌గానూ తనదైన ముద్రబ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సాధించాడు. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్‌ను విజేతగా నిలపడం కోహ్లి కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.ఇక భారత జట్టు సారథిగా మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి. అదే విధంగా ఆటగాడిగా.. 2008 నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లు పూర్తి చేసుకున్నాడు.రికార్డుల రారాజుటెస్టుల్లో 9230, వన్డేల్లో 14181, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. కోహ్లి ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, వన్డేల్లో 51 శతకాలు, అంతర్జాతీయ టీ20లలో ఒక సెంచరీ ఉంది. తద్వారా ఓవరాల్‌గా 82 సెంచరీలతో.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా దాటేసి అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు కూడా!.. ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి 263 మ్యాచ్‌లలో ఎనిమిది శతకాలతో కలిపి 8509 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025లోనూ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్

ఆ ముఖంలో నవ్వే లేదు.. రహానే, కోహ్లి కావాలేమో?
ఐపీఎల్-2025 (IPL 2025)లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా, బ్యాటర్‌గా వరుస మ్యాచ్‌లలో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికి మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పంత్.. కేవలం 128 పరుగులు రాబట్టగలిగాడు.ఇదే అత్యంత చెత్త ప్రదర్శన2016లో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన పంత్ కెరీర్లో ఇప్పటికి ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. ఈ నేపథ్యంలో మేటి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్ క్రిస్ట్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ముఖంలో నవ్వే లేదు.. ‘‘అతడిని చూసిన ప్రతిసారీ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తూ ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఈసారి తను అలా లేడు. ఆ ముఖంలో నవ్వు లేదు.. సహచర ఆటగాళ్లతో సరదాగా ఉన్నట్లు కనిపించడం లేదు.. ప్రశాంతవదనంతో ఉన్నాడా అంటే అదీ లేదు.కొత్త ఫ్రాంఛైజీ తరఫున కెప్టెన్సీ భారమా లేదంటే ప్రైస్ ట్యాగ్ అతడి నెత్తి గుదిబండగా మారిందా అర్థం కావడం లేదు. ఇది అతడు కానే కాదని వంద శాతం చెప్పగలను. అతడి ఆటలో మునుపటి మెరుపు, చురుకుదనం కనిపించడం లేదు’’ అని క్రిక్‌బజ్ షోలో గిల్‌క్రిస్ట్ అన్నాడు.రహానే, కోహ్లి కావాలేమో?ఇందుకు అదే షోలో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ బదులిస్తూ.. ‘‘పంత్ విషయంలో మీరు ఇచ్చిన చెప్పిన మాటల్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నా. అతడు సొంతగడ్డపై.. చుట్టూ భారత క్రికెటర్లు ఉంటే మాత్రమే అతడు ఆటను ఆస్వాదిస్తాడా?వారి కంపెనీని మాత్రమే ఎంజాయ్ చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు అతడి చుట్టూ ప్రధానంగా నలుగురూ విదేశీ బ్యాటర్లే ఉన్నారు. పంత్ సహచరులతో సంతోషంగా లేడని అంటున్నారా?అజింక్య రహానే, విరాట్ కోహ్లి తన జట్టులో ఉంటే పంత్ మారిపోతాడా? అంటే సమాధానం చెప్పలేము. ఏదేమైనా పంత్ మునుపటిలా మాత్రం లేడన్నది వాస్తవం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మెగా వేలం-2025లో రూ. 27 కోట్లకు లక్నో పంత్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు.పది జట్ల స్థానాలు ఇలాఈ సీజన్లో ఇప్పటికి 128 పరుగులు చేసిన పంత్ అత్యధిక స్కోరు 63. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం ఐదే గెలిచి.. ఆరు ఓడిపోయింది.తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఆర్సీబీ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండి.. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ రెండు, ముంబై ఇండియన్స్ మూడు, గుజరాత్ టైటాన్స్ నాలుగు, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్, ఏడో స్థానంలో ఉన్న లక్నో కూడా సాంకేతికంగా ఇంకా రేసులో ఉన్నాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్

ధోని రిటైర్ అయితే బెటర్!.. సురేశ్ రైనా ‘షాకింగ్’ కామెంట్
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా తలా విఫలమవుతున్నాడు. మరోవైపు.. జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది.ఐదు మ్యాచ్‌ల తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో మరోసారి ధోని బాధ్యతలు చేపట్టాడు. కానీ అతడి సారథ్యంలోనూ కనీవినీ ఎరుగని రీతిలో కంచుకోట చెపాక్‌లో చెన్నై వరుస ఓటములు చవిచూసింది.అంతేకాదు.. ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక గతేడాది కూడా సీఎస్కే ఇలాగే టాప్-4కు చేరకుండానే అవుటైన విషయం తెలిసిందే. వరుసగా ఇలా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరకపోవడం చెన్నై చరిత్రలోనే తొలిసారి ఇది.వారిని వదిలించుకోండిఈ నేపథ్యంలో సీఎస్కే మెగా వేలం-2025లో అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్ తదితరులను వదిలించుకుంటేనే చెన్నై జట్టు బాగుపడుతుందని వీరేందర్ సెహ్వాగ్ వంటి మేటి క్రికెటర్లు యాజమాన్యానికి సూచిస్తున్నారు.ధోని రిటైర్ అయితే బెటర్మరోవైపు.. వికెట్ కీపర్‌గా రాణిస్తున్నా.. బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని ఇక రిటైర్ పోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ సీజన్లో తలా ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 163 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 148.18.ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇక ధోని కనిపించకపోవచ్చన్న అభిప్రాయాల నడుమ.. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై చిన్న తలా సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సురేశ్ రైనా ‘షాకింగ్’ కామెంట్ఇటీవల ఫిల్మీజ్ఞాన్ షోలో పాల్గొన్న సురేశ్ రైనాకు.. ‘ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్‌గా ఎవరుంటారు?’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే నాకూ తెలియదు. ఎందుకంటే.. ఎంఎస్ ధోని ఇంకో రెండేళ్ల పాటు సీఎస్కేకు ఆడతాడు’’ అంటూ అభిమానుకుల షాక్‌తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చాడు రైనా.కాగా ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కేవలం రెండు గెలిచి.. ఏకంగా తొమ్మిది ఓడిపోయింది. నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.ఇక 43 ఏళ్ల ధోని విషయానికొస్తే.. ఐపీఎల్లో 275 మ్యాచ్‌లు ఆడి 5406 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 24 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు 38 ఏళ్ల సురేశ్ రైనా కూడా గతంలో చెన్నైకి ఆడిన విషయం తెలిసిందే. ఓవరాల్‌గా క్యాష్ రిచ్ లీగ్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 రన్స్ సాధించి.. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందాడు.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్

మతిపోయిందా?.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తప్పు: షేన్ వాట్సన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC) అనుసరించిన వ్యూహాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ విమర్శించాడు.ప్లే ఆఫ్స్ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లోనూ ఓపెనింగ్ జోడీని మార్చడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్ధిలేని చర్యగా అభివర్ణించాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ తరఫున జేక్ ఫ్రేజర్ మెగర్క్, అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, కేఎల్ రాహుల్ వేర్వేరు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా వచ్చారు. తాజాగా సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా డుప్లెసిస్‌తో కలిసి కరుణ్ నాయర్ (Karun Nair) ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించాడు.బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలుఅయితే, బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. మొదటి బంతికే కరుణ్ నాయర్ (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే డుప్లెసిస్ (3), అభిషేక్ పొరెల్ (8)లు కూడా వికెట్లను పారేసుకున్నారు. దీంతో క్యాపిటల్స్ 15 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఖాతాలోనే పడ్డాయి. క్యాచ్‌లన్నీ కీపర్ ఇషాన్ కిషన్ చేతికే అందాయి.ఇక ఢిల్లీ ఈ షాక్ నుంచి తేరుకోకముందే హర్షల్ పటేల్ మరోదెబ్బ తీశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (6)ను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన స్లో డెలివరీని షాట్ ఆడే ప్రయత్నం చేయగా అదికాస్తా కమిన్స్ చేతికి చిక్కింది. దీంతో పవర్ ప్లేలో ఢిల్లీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి క్యాపిటల్స్ స్కోరు 26/4. ఆ తర్వాత కూడా క్యాపిటల్స్ పరిస్థితిలో ఏమార్పు లేదు. ఇక ఢిల్లీ అండదండా కేఎల్ రాహులే అనుకునేలోపే ఈ స్టార్ మురిపెం కూడా అంతలోనే ముగిసింది.జయదేవ్ ఉనాద్కట్ తెలివైన బంతితో ఈ విలువైన వికెట్ తీసి ఢిల్లీని కోలుకోకుండా చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవల దూసుకొచ్చిన బంతి రాహుల్ (10) బ్యాట్‌ను తాకుతూ ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటివరకు పెవిలియన్ చేరిన ఐదుగురిలో అతనొక్కడిదే రెండంకెల స్కోరు కాగా... కనీసం మూడు పదుల స్కోరైన కాకముందే (29 పరుగులకే 5) ఢిల్లీ సగం వికెట్లను కోల్పోయింది. వికెట్ల జోరులో మెరుపుల్లేని మ్యాచ్‌లో ఎట్టకేలకు పదో ఓవర్లో ఒక సిక్స్ నమోదైంది. స్పిన్నర్ జిషాన్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్ భారీ సిక్సర్ బాదాడు. సగం ఓవర్లు ముగిశాక గానీ 11వ ఓవర్లో జట్టు స్కోరు కష్టంగా 50 పరుగులకు చేరింది. అశుతోశ్ వచ్చాకే... స్టబ్స్, విప్రాజ్ కుదురుకునే అవకాశాన్ని కూడా సన్‌రైజర్స్ ఫీల్డర్లు ఇవ్వలేదు. కొద్దిసేపటికే విప్రాజ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రనౌట్ కాగా... అశుతోష్ రాకతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. అవతలి ఎండ్‌లో ఉన్నది హిట్టర్ స్టబ్సే అయినా జోరు పెంచింది మాత్రం అశుతోష్ మొదట్లో సింగిల్స్‌తో పరుగు... పరుగు పేర్చిన ఈ జోడీ తర్వాత ధాటిని ఆడింది. జీషాన్ 15వ ఓవర్లో అశుతోష్ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు. తర్వాత హర్షల్ 17వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. స్టబ్స్ కూడా ఫోర్లతో వేగం అందుకోగా, డెత్ ఓవర్లో మరో సిక్స్ కొట్టిన అశుతోష్ ఆఖరి ఓవర్లో నిష్క్రమించాడు. ఇద్దరు కలిసి ఏడో ఓవర్‌కు 66 పరుగులు జోడించారు. ఈ జోడీ ఆడటం వల్లే ఢిల్లీ ఆలౌట్ నుంచి తప్పించుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది.ఢిల్లీ క్యాపిటల్స్‌ది తప్పుడు నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్ షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటికప్పుడు ఏ కారణం లేకుండా.. నచ్చినట్లుగా ఓపెనింగ్ జోడీని మార్చడం సరికాదు. నిజంగా ఢిల్లీ వ్యూహం చూసి నేను ఆశ్చర్యపోయా.కరుణ్ నాయర్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌కు రావడం చూసి నాకు మతిపోయినంత పనైంది. ఇదొక చెత్త నిర్ణయం. ఢిల్లీ శిబిరం ఏం ఆలోచించి ఇలా చేసిందో గానీ.. ఇదైతే తప్పుడు నిర్ణయం.ఇలా చేయడం వల్ల జట్టులో ఎవరి పాత్ర ఏమిటన్నది ఆటగాళ్లకే తెలియకుండా పోతుంది. ఇలాంటి చర్యల వల్ల వాళ్లు కూడా అభద్రతాభావంలో కూరుకుపోతారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయంం పంచుకున్నాడు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపిలేని వర్షం వల్ల మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఢిల్లీకి అదృష్టం కలిసి రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు కావడం వల్ల ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవమయ్యాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్Wickets ✅Catch ✅Captaincy ✅Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025
బిజినెస్

దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష
దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.షెల్ కంపెనీల నెట్వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్‌లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలుకార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా ఇజ్రాయెల్-యెమెన్ ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.క్షిపణి దాడియెమెన్కు చెందిన హౌతీలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పరిధిలో దాడికి పాల్పడ్డారు. దాంతో విమానాశ్రయం సమీపంలో టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మే 4న జరిగిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బోయింగ్ 787కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ139 ల్యాండ్ అవ్వడానికి గంట ముందు ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్రాడార్24.కామ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉందని, దాడి సమాచారం తెలిసిన వెంటనే దాన్ని అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: సాంకేతికతతో యుద్ధానికి సైఎయిరిండియా స్పందనమే 4న జరిగిన ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఎయిరిండియా మొదట టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగిస్తున్న విమానాలను మే 6 వరకు నిలిపివేసింది. అక్కడ కొనసాగుతున్న భద్రతా కారణాల వల్ల విమానాల నిలిపివేతను మే 8 వరకు పొడిగించింది. టెల్ అవీవ్‌కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో సంస్థ బృందాలు ప్రభావిత ప్రయాణీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

ఎకాఎకి భారీగా పెరిగిన బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,250 (22 క్యారెట్స్), రూ.98,460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.2,500, రూ.2,730 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,730 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,460 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,500 పెరిగి రూ.90,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,750 పెరిగి రూ.98,610 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై స్వల్పంగా రూ.100 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,07,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

సాంకేతికతతో యుద్ధానికి సై
సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. అందుకు యుద్ధ భూమి ఏమీ అతీతం కాదు. శత్రువులపై యుద్ధం సాధించేందుకు, స్పష్టమైన ఫలితాల కోసం టెక్నాలజీ వాడుతున్నారు. ఇందులో భాగంగా మానవరహిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్, డ్రోన్లు, రోబోటిక్స్, అన్ మ్యాన్డ్ అడ్వాన్స్డ్ వెపన్స్.. వంటి చాలా పరికరాల్లో సాంకేతికతను వినియోగిస్తున్నారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో రణరంగంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.ఏఐ, మెషిన్ లెర్నింగ్యుద్ధ సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, ఇంటెలిజెన్స్ విశ్లేషణను మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. యుద్ధరంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తోంది. శత్రువుల కదలికలను అంచనా వేయడానికి లేదా వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించడానికి ఏఐ విస్తారమైన డేటాసెట్లను ప్రాసెస్ చేస్తుంది. అటానమస్ విధానం ద్వారా డ్రోన్లు, వాహనాలకు ఏఐ సామర్థ్యాలు జోడిస్తున్నారు. ఇది మానవ ప్రమేయం లేకుండా రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్‌కు వీలు కల్పిస్తుంది. సైబర్ బెదిరింపులను గుర్తించి సమర్థంగా కట్టడి చేసేందుకు మెషిన్ లెర్నింగ్ తోడ్పడుతుంది. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షిస్తుంది.మానవ రహిత వ్యవస్థలు (డ్రోన్లు, రోబోటిక్స్)యుద్ధంలో మానవరహిత వ్యవస్థలు అనివార్యంగా పెరుగుతున్నాయి. ఇది సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. ఏరియల్ డ్రోన్లను నిఘా, దాడుల్లో కచ్చితత్వం కోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన స్మాల్ అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్ (ఎస్‌యూజీవీ) వంటి రోబోలు బాంబుల తొలగింపును నిర్వహిస్తున్నాయి. మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ (యూయూవీ) మైన్ డిటెక్షన్, సబ్ మెరైన్ ట్రాకింగ్ పనులు చేస్తున్నాయి.సైబర్ వార్ఫేర్ టెక్నాలజీయుద్ధ సమయంలో కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, ఇతర రక్షణ వ్యవస్థలకు అంతరాయం కలిగించేలా సైబర్ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబర్ వార్‌పేర్ డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఇందులో భాగంగా మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్ ద్వారా ప్రభుత్వ ప్రాయోజిత వెబ్‌సైట్‌ల్లోని సమాచారం శత్రు దేశాల్లోని నెట్‌వర్క్‌లోకి వెళ్లకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ద్వారా మిలిటరీ నెట్‌వర్క్‌లను రక్షిస్తున్నారు.అధునాతన ఆయుధాలుఆధునిక ఆయుధాల ద్వారా ప్రమాద పరిధి పెరుగుతుంది. రష్యాకు చెందిన కింజాల్ అనే హైపర్ సోనిక్ ఆయుధాలు లేదా చైనాకు చెందిన డీఎఫ్-జెడ్ ఎఫ్ వంటి క్షిపణులు సంప్రదాయ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే తప్పించుకుంటాయి. లేజర్లు, మైక్రోవేవ్ వ్యవస్థలు డ్రోన్లు లేదా క్షిపణులను కచ్చితత్వంతో నిలిపివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీపీఎస్ గైడెడ్ బాంబులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేదిస్తాయి.ఇదీ చదవండి: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ బ్రాండ్ ఇదే..శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీస్సైనిక కార్యకలాపాలకు అంతరిక్షం కీలకమైన డొమైన్‌గా మారింది. నిఘా ఉపగ్రహాలతో రియల్ టైమ్ ఇమేజ్‌లు, ప్రత్యేకంగా సిగ్నలింగ్ సదుపాయాలను పొందుతున్నారు. దళాల కదలికల కోసం జీపీఎస్, నావిగేషన్‌ను వాడుతున్నారు. కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించే శత్రు ఉపగ్రహాలను నిలిపివేయడానికి లేదా నాశనం చేయడానికి యాంటీ శాటిలైట్ వెపన్స్ రూపొందిస్తున్నారు.
ఫ్యామిలీ

పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
పేరెంట్‌హుడ్‌ని ఆస్వాదించని వారెవరు? అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉవ్విళ్లూరని వాళ్లెవరు? కానీ మన దేశంలోని సరోగసీ యాక్ట్ –2021 అందరికీ ఆ ఆవకాశాన్నివ్వట్లేదు. విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్పీపుల్కి సరోగసీ ద్వారా పేరెంట్ అయ్యే చాన్స్‌కి నో అంటోంది! దీన్నే సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల డెంటల్ సర్జన్.. సరోగసీ ద్వారా ఒంటరి పురుషులకూ తండ్రి అయ్యే భాగ్యం కల్పించమంటూ సుప్రీంకోర్ట్‌లో దావా వేశాడు. ఇప్పుడది చర్చగా మారింది.. అడ్వకేట్లు, జెండర్ రైట్స్ కోసం పనిచేస్తున్న యాక్టివిస్ట్లూ దీనిమీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు.సరోగసీ.. గర్భంలో బిడ్డను మోసే ఆరోగ్యపరిస్థితులు లేని వాళ్లకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన వరం! ఇది ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్‌కీ పేరెంట్ అయ్యే అదృష్టాన్ని కలిగిస్తోంది. అలా బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే నటుడు తుషార్ కపూర్ కూడా ఓ బిడ్డను కన్నాడు. అయితే అది 2021కి ముందు. ఈ చట్టం వచ్చాక పురుషులకు ఆ వెసులుబాటును తీసేసింది. ఒంటరి మహిళలు (విడాకులు పొందిన వారు, అలాగే వితంతువులు), స్త్రీ పురుషులు మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలకూ మాత్రమే ఈ చట్టం పేరెంట్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిమీద సమాజంలోని పురుషులు సహా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలోనూ అసంతృప్తి ఉంది. విడాకులు పొందిన స్త్రీకి సరోగసీ ద్వారా తల్లి అయ్యే హక్కు ఉన్నప్పుడు, విడాకులు పొందిన పురుషుడికి ఎందుకు ఉండకూడదు? ఇది చట్టం చూపిస్తున్న వివక్ష తప్ప ఇంకోటి కాదని కర్ణాటక డెంటల్ సర్జన్ వాదన. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ స్త్రీకెప్పుడూ ఇవ్వని ఈ సమాజంలో.. ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్ని అనుమతించడం లేదు సరికదా... పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటిని చూసుకోవాలనే లింగవివక్షను ప్రేరేపించే మూస ధోరణిని ప్రోత్సహిస్తోందని జెండర్ యాక్టివిస్ట్‌ల అభి్ప్రాయం. కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) నివేదికలను బట్టి ఒంటరి పురుషులకు దత్తత తీసుకునేందుకు అనుమతించినవీ, అలాగే.. మగవాళ్లు కూడా పిల్లల్ని పెంచగలరని నిరూపించిన ఉదాహరణలున్నాయి. కాబట్టి డెంటల్ సర్జన్ పిటిషన్లో న్యాయం ఉందని అంటున్నారు యాక్టివిస్ట్‌లు. అంతేకాదు అతని ఈ ΄ోరాటం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఒక ఊతమవుతుందని.. లింగ అసమానతలను రూపుమాపే ప్రయత్నానికీ ఒక అడుగు పడుతుందనే ఆశనూ వ్యక్తం చేస్తున్నారు. – సరస్వతి రమవివక్ష చూపిస్తోందిడైవర్స్ తీసుకున్న మగవారికి, ఒంటరి పురుషులకు, స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్ జెండర్స్‌కి సరోగసి పద్ధతిలో పిల్లలని కనడాన్ని సరోగసీ చట్టం నిషేధించింది. ఈ చట్టంలోని సెక్షన్ ంలు ఈ నిబంధన విధించాయి. ఈ చట్టం ప్రకారం కేవలం విడాకులు పొందిన లేదా వితంతువులకు, హెటిరో సెక్సువల్ దంపతులకు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలని కనే హక్కు ఉంది. ఒంటరి పురుషుడికి ఆడపిల్లను దత్తత తీసుకునే వీలు లేనప్పటికీ, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 57, హిందూ అడాప్షన్ – మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషుడికి కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్నది. సరోగసీ చట్టం ఇందుకు భిన్నంగా ఉండటం రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే స్వేచ్ఛ హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమే! ఇతర దేశాలు చాలామటుకు స్త్రీ పురుషుల మధ్య సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనటం పై సమాన హక్కులే కల్పించాయి. –శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిఆ అవకాశం, వాతావరణం ఉన్నాయా? ప్రతి ఒక్కరికీ పేరెంట్‌హుడ్‌ను ఆస్వాదించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం కర్ణాటక డెంటల్ సర్జన్ న్యాయ ΄ోరాటంలో తప్పులేదు. స΄ోర్ట్ కూడా చేస్తాను. అయితే వ్యక్తిగతంగా మాత్రం అందులో నాకు భిన్నమైన అభి్ప్రాయం ఉంది. అడుగడుగునా అసమానతలు, వివక్ష, అభద్రతలున్న ఈ సమాజంలో పుట్టబోయే పిల్లలను భద్రంగా కాపాడుకోగలమా? మనముందున్న సెక్సువల్ ఐడెంటిటీలనే గుర్తించి, గౌరవించడానికి సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఏంటీ? వాళ్లు చక్కగా పెరిగే అవకాశం, వాతావరణం ఉన్నాయా అనే విషయంలోనే నా భయం, ఆందోళన అంతా! – బోయపాటి విష్ణు తేజ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్టీరియోటైప్స్ని బలపరుస్తోంది.. పేరెంట్‌హుడ్ అనేది ఒక జెండర్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. పేరెంట్ అవ్వాలని ఆశపడేవాళ్లందరూ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కొంతమంది మగవాళ్లు పేరెంట్ కావాలనుకున్నా ఇలాంటి చట్టాల వల్ల పేరెంట్‌హుడ్ చాయిస్‌ని కోల్పోతున్నారు. స్టీరియోటైప్స్ కొన్నిటిని ఈ చట్టం బలపరుస్తోంది. సింగిల్‌గా ఉన్న ఆడవాళ్లకు, హెటరో సెక్సువల్ ఫ్యామిలీస్‌కి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ! సింగిల్ ఉమెన్‌కి ఎందుకిచ్చిందంటే కేర్ గివింగ్ అనే లక్షణం సహజంగానే వాళ్లకుంటుంది కాబట్టి అనే. అంటే ఈ రెండు స్టీరియోటైప్స్‌ని ఆ చట్టం బలపరుస్తున్నట్టే కదా! వివక్షే కాకుండా స్టీరియోటైప్స్నీ బలపరుస్తున్నట్టున్న ఈ చట్టాన్ని చాలెంజ్ చేయడం మంచిదే! పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ ఇల్లు చూసుకుంటుంది లాంటి జెండర్ రోల్స్‌ను ఈ చట్టం బలపరుస్తోంది. ఈ చట్టం వల్ల ఎల్‌జిబీటీక్యూ కమ్యూనిటీస్కీ నష్టమే! ఏమైనా ఈ చట్టంలో మార్పులు రావాలి. ఎక్స్΄్లాయిటేషన్ను ఆపేలా చట్టాలుండాలి కానీ.. పేరెంట్‌హుడ్ కావాలనుకునే వారిని నిరుత్సాహపరచేలా కాదు.– దీప్తి సిర్ల, దళిత్ అండ్ జెండర్ యాక్టివిస్ట్

అరటి పండుతో అదిరేటి రుచులు
వేసవి సెలవులొచ్చేశాయి. ఇక ఇంట్లో పిల్లల సందడి మొదలవుతుంది. ఎండల్లో బాగా ఆడుకుంటారు. అందుకే పిల్లలకి పోషకమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరం. అలాగేఈ సమయంలో పిల్లలకి అన్ని పనులనూ మెల్లిగా అలవాటు చేయాలి కూడా. మరి పిల్లలు సైతం సిద్ధం చేసుకోగలిగే ఈజీ రెసిపీల గురించి తెలుసుకుందాం. వీటిల్లో బనానా రెసిపీలు మొదటి వరసలో ఉంటాయి. పైగా అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇప్పుడు కొన్ని వెరైటీలు చూద్దాం..బనానా శాండ్విచ్కావాల్సినవి: రెండు లేదా మూడు అరటిపళ్లు, పీనట్ బటర్-పావు కప్పు; కొన్ని బ్రెడ్ స్లైసెస్. తయారీ: ముందుగా బ్రెడ్ స్లైసెస్ను ఓవెన్లో దోరగా వేయించుకోవాలి. ఈలోపు అరటి పండ్లను గుండ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పీనట్ బటర్‌ను బ్రెడ్ ముక్కలకు ఒకవైపు అప్లై చేసుకుని, రెండేసి బ్రెడ్ముక్కల్లో కొన్ని అరటిపండు ముక్కలను పెట్టుకుని, పైన పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.బనానా ఓట్ మీల్ బాల్స్ కావాల్సినవి: అరటిపండు-1 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); రోల్డ్ ఓట్స్ - అర కప్పు; పీనట్ బటర్-ఒక టేబుల్ స్పూన్; బెల్లం తురుము-కొద్దిగా; దాల్చినచెక్క పొడి -కొద్దిగా.తయారీ: ముందుగా ఒక పాత్రలో రోల్డ్ ఓట్స్, అరటిపండు గుజ్జు, పీనట్ బటర్, దాల్చిన చెక్క పొడి, బెల్లం తురుము ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి బ్రెడ్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని, కొద్దిగా కొబ్బరి కోరులో దొర్లించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుబనానా హనీ బైట్స్కావాల్సినవి: అరటిపండ్లు – 2; తేనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు; దాల్చినచెక్క పొడి – టీ స్పూన్‌తయారీ: ముందుగా అరటిపండ్లను గుండ్రంగా కట్ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అభిరుచిని బట్టి నెయ్యి లేదా బటర్లో దోరగా వేయించుకోవచ్చు. వేయించుకున్నా వేయించుకోకపోయినా వాటిపై తేనె, దాల్చినచెక్క పొడి వేసుకుని, కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బైట్స్.చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుబనానా చాక్లెట్ పాప్స్కావాల్సినవి: అరటిపండ్లు -4; ఐస్ క్రీమ్ పుల్లలు -6 పైనే; చాక్లెట్ చిప్స్- అర కప్పు (మెల్ట్ చేసుకోవాలి); డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొన్ని (నచ్చినవి)చదవండి: Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరితయారీ: ముందుగా అరటిపండు తొక్క తీసి.. నచ్చిన విధంగా కట్ చేసుకుని.. ఒక్కో ముక్కకు ఒక్కో ఐస్ క్రీమ్ పుల్ల గుచ్చాలి. ఒక ప్లేట్లో పార్చ్మెంట్ పేపర్ వేసి అరటిపండు ముక్కలను దానిపై పేర్చి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అరటిపండు ముక్కలు గట్టిపడిన తర్వాత కరిగిన చాక్లెట్లో ముంచి, వెంటనే తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలను పైన జల్లి సర్వ్ చేసుకోవచ్చు.చదవండి : 60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్

300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..
కొన్ని ఆలయాల చరిత్ర అత్యంత వింతగా ఉంటాయి. సాధారణంగా అందరూ దేవుడి ప్రసాదాన్ని అత్యంత పరమపవిత్రంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం మాత్రం పిల్లులు స్వీకరించాక భక్తులకు పంచుతారుట. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఇది నమ్మశక్యంగానీ నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది..? దాని కథాకమామీషు ఏంటో చూద్దామా..!.ఒడిశాలో దాదాపు 300 ఏళ్ల నాటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన మదన్ మోహన స్వామి పూజలందుకుంటున్నారు. ఆ స్వామి విగ్రహం తోపాటు పది ఇతర విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ గుడి కేంద్రపారా జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని ఒడిస్సాలో బిలేఖియా మఠం అని పిలుస్తారు. ఒడియా భాషలో పిల్లి 'బెలీ అంటారు. ఆ పేరు మీదుగానే ఈ ఆలయం బిలేఖియాగా స్థిరపడింది. ఇక్కడ స్వామి మదన మోహన్‌కి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆ ప్రసాదాన్ని మొదటగా అక్కడే నివాసం ఉండే పది పిల్లులకు సమర్పించాక గానీ భక్తలకు వితరణ చేయరు. దాదాపు మూడు శతాబ్దాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారట ఆలయ పూజర్లు.ఇలా ఎందుకంటే..స్థానిక పురాణం ప్రకారం, ఆయుల్ రాజ్యానికి చెందిన రాజు బ్రజ సుందర్ దేబ్ ఈ మఠాన్ని సందర్శించాడు. ఆలయ పూజారి వందలాది పిల్లులను సంరక్షించడం చూశాడు. వెంటనే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కొన్ని ఎకరాల భూమిని ఆ ఆలయానికి కానుకగా ఇచ్చేశాడు. అలా ఆ ఆలయంలో ఆ పిల్లలకు ఆహారం పెట్టడం అనేది ఆచారంగా సాగుతోందట. అంతేకాదండోయ్ చాలావరకు ఆ పిల్లులన్ని ఆ ఆలయంలోనే పుట్టాయట. వాటికి రోజూ బిస్కెట్లు, పాలు, అన్నం తదితరాలు పెడతారట. ప్రస్తుతం ఆ పిల్లుల్లో చాలామటుకు ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చేసినట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. అవన్నీ ఆలయ ప్రాంగణంలోనే తచ్చాడుతూ ఉంటాయి. అంతేగాదు ఆ పిల్లులు కూడా సరిగ్గా ప్రసాదం నివేదించే సమయాని కల్లా..పూజారి పెట్టే ప్లేటు వద్దకు వచ్చి నిరీక్షిస్తూ ఉండటం విశేషం. నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ ఈ ఆలయం స్టోరీ. పిల్లుల పోషణార్థం రాజు ఎకరాలకొద్దీ భూమిని రాసివ్వడం కూడా అత్యంత వింతగా అనిపిస్తోంది కదూ..!.(చదవండి: మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్లో ఆ ఆహారాలకు చోటు లేదు! రీజన్ ఇదే..)

తప్పతాగి, ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు : తిక్క కుదిర్చిన ఎయిర్‌లైన్స్
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.రహతా పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఫొటోలు


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)


#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)


కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)


SRH vs DC Photos : ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అభిమానులతో సందడిగా ఉప్పల్ స్టేడియం.. తారల సందడి (ఫొటోలు)


రోజురోజుకీ తమన్నా అందం రెట్టింపు.. చూస్తుంటేనే! (ఫొటోలు)


'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)


హిమాచల్ ప్రదేశ్ లో చిల్ అవుతున్న అరియానా (ఫొటోలు)


శర్వానంద్ సినిమాతో గ్లామర్ బ్యూటీ రీ ఎంట్రీ ఇంతకీ ఎవరు? (ఫొటోలు)


కూకట్‌పల్లిలో సినీనటి కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

నిప్పు చల్లగా.. మంచు మంటగా!
మెల్బోర్న్(ఆస్ట్రేలియా): మంటను ముట్టుకుంటే కాలిపోతుంది. మంచును టచ్ చేస్తే చల్లగా ఉంటుంది. కానీ ఈ ఆ్రస్టేలియా వ్యక్తికి మాత్రం నిప్పు చల్లగా ఉంటుంది. చల్లని పదార్థం చురుక్కుమటుంది. అదెలా సాధ్యమంటే, అదో వింత వ్యాధి. అతని కాళ్లు, చేతులు గ్రహణ శక్తి కోల్పోయాయి. ఈ వ్యాధితో అతను ఐదేళ్లుగా బాధపడుతున్నాడు. ఎన్నో పరీక్షలు చేసినా వ్యాధేమిటో తెలిసింది కానీ చికిత్స ఏమిటో తెలియడం లేదు. ఆ్రస్టేలియాకు చెందిన 22 ఏళ్ల ఎయిడెన్ మెక్మానస్ 17వ ఏట హైస్కూల్ చివరి ఏడాదిలో ఉండగా ఈ సమస్య మొదలైంది. పాదాల్లో కొద్దికొద్దిగా అనుభూతిని కోల్పోవడం మొదలైంది. పాదాలు చక్కిలిగింతలు పెట్టినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం మొదలైంది. పాదాల్లోకి రక్తం, ఇతర ద్రవాల సరఫరా లేదంటూ డాక్టర్ మందులిచ్చాడు. అవేవీ పని చేయలేదు. నడవడమే కష్టంగా మారడంతో న్యూరాలజిస్టులు 20కి పైగా రక్త పరీక్షలు చేశారు. బయాప్సీ కూడా చేసినా వ్యాధీ నిర్ధారణ కాలేదు. చివరకు అతను ఆక్సోనల్ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్నాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇది శరీరానికి సంకేతాలను ప్రసారం చేయకుండా నాడీ కణాలను అడ్డుకుంటుంది. దాంతో తన కుమారుడు వేడిగా ఏదైనా తీసుకున్నప్పుడు, చల్లగా అనిపిస్తుందని, చల్లగా ఉన్నప్పుడు మండుతున్న అనుభూతిని పొందుతాడని తల్లి ఏంజిలా మెక్మానస్ వాపోయారు. అతని రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోంది. నడక సామర్థ్యం, కాళ్లు, చేతుల్లో సమతుల్యత, సమన్వయం తగ్గుతున్నాయి. నయం చేయలేని ఈ వ్యాధికి చికిత్సను భరించలేమని నేషనల్ డిజేబులిటీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ (ఎన్డీఐఏ) సైతం చేతులెత్తేసింది. చికిత్సేమిటో తెలియకుండా నిధులివ్వలేమని తేల్చేసింది. కానీ నొప్పి నివారణ మందులు తప్ప ప్రస్తుతానికి అతనికి చికిత్స అందుబాటులో లేదని న్యూరాలజిస్ట్ చెప్పుకొచ్చారు. పరిస్థితి నానాటికి దిగజారిపోయే పరిస్థితి ఉంది గనుక ఎన్డీఐఏలో చేర్చాలంటూ ఏజెన్సీకి లేఖ రాశారు.

ప్రెస్మీట్లో పాక్ జర్నలిస్టుల బూతులు.. వీడియో వైరల్
లండన్: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దారుణంగా ప్రవర్తించారు. విదేశాల్లో మీడియా సమావేశానికి హాజరైన ఇద్దరు పాక్ జర్నలిస్టులు మాత్రం.. పరస్పరం తిట్టుకుంటూ ఏకంగా బూతుపురాణం అందుకున్నారు. పాక్ నేత ప్రెస్‌మీట్ సందర్భంగా జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సెక్రెటరీ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన సల్మాన్ అక్రమ్ రాజా లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సఫీనా ఖాన్, అసద్ మాలిక్‌తోపాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సఫీనా ఖాన్ పాకిస్థాన్‌కు చెందిన నియో న్యూస్ ఛానెల్లో పని చేస్తుండగా.. అసద్ మాలిక్, కొందరు ఇతర జర్నలిస్టులు వేర్వేరు చానళ్లలో పని చేస్తున్నారు. వీరంతా ఒక చోట చేరిన సమయంలో సఫీనా, అసద్ మాలిక్ మధ్య వివాదం చోటు చేసుకుంది.ఇద్దరు గొడవకు దిగారు. బూతులు తిట్టుకున్నారు. కుటుంబాలను సైతం దూషించుకున్నారు. అక్కడున్న మిగతా జర్నలిస్టులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం మాలిక్, ఇతర పాక్ జర్నలిస్టులు తనను చంపేస్తామని బెదిరించారని సఫీనా ఖాన్ ట్వీట్ చేశారు. తనకు ఏదైనా జరిగితే ఈ ముగ్గురు రిపోర్టర్లే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఆరోపణలను అసద్‌ఖాన్ తోసిపుచ్చారు. ఇద్దరు జర్నలిస్టుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Pakistani Journalism at its peak with journalists Safina Khan and Asad Malik fight it out at a London eatery. (Warning: Very Abusive Content)Delhi boys, take a bow, this language exceeds everything. pic.twitter.com/ZSdMOIpNyj— Ꮙarun (@Ambarseriya) May 4, 2025

ఐరాసలో నేడు పాక్-భారత్ పంచాయితీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.

అంతుచిక్కని బంగారం రహస్యం.. పుత్తడి పుట్టిందెక్కడ?
బంగారం. ఈ పేరు వింటేనే భారతీయులు మైమరిచిపోతారు. మనోళ్ల బంగారం మోజు దెబ్బకు పదిగ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష మార్కు దాటేయడం తెల్సిందే. పసిడి అంటే సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలకు సైతం ప్రత్యేక ఆసక్తి. పుత్తడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వాళ్లు తెగ ఆసక్తి చూపిస్తారు. ‘‘స్వర్ణం మూలాలెక్కడున్నాయి? బంగారు లోహం భూమ్మీదకు ఎలా వచ్చింది?’’ అన్న ప్రశ్నలు శాస్త్రజు్ఞలను ఎప్పటినుంచో తొలుస్తున్నాయి. పేలిపోయిన నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవించిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూట్రాన్ నక్షత్రాలే పుత్తడికి పుట్టిల్లు అని సరికొత్త అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘ది ఆస్ట్రో ఫిజిక్స్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమైంది. దాదాపు 1,380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్ వల్ల విశ్వం ఆవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అత్యంత తేలికైన హైడ్రోజన్, హీలియం, అంతకంటే తక్కువ పరిమాణంలో లిథియం వంటి మూలకాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ సమయంలో పేలిన నక్షత్రాలు ఇనుము వంటి కాస్త బరువైన మూలకాలను విశ్వమంతటా వెదజల్లాయి. ఇనుము కంటే సాంద్రత ఎక్కువ ఉండే బంగారం ఎప్పుడు, ఎలా ఉద్భవించిందనే ప్రశ్నకు ‘మ్యాగ్నెటార్’ సరైన సమాధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమిటీ మ్యాగ్నెటార్లు? మనకు అతి సమీపంలోని నక్షత్రమైన సూర్యుడు అపారమైన శక్తిని వెలుతురు, ఉష్ణశక్తి రూపంలో నిరంతరం విశ్వంలోకి వెదజల్లుతూనే ఉంటాడు. ఇలా నక్షత్రం తనలోని అపారమైన శక్తినంతా వెదజల్లాక గురుత్వాకర్షణ బలాలను కోల్పోతుంది. దీంతో ఎర్రరంగుకు మారి తుదకు పేలిపోతుంది. దాన్ని సూపర్నోవా అంటారు. పేలిన నక్షత్రం న్యూట్రాన్ నక్షత్రంగా, లేదంటే బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా రూపాంతరం చెందుతుంది. ఈ న్యూట్రాన్ నక్షత్ర ద్రవ్యరాశి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో అది గురుత్వాకర్షణ శక్తిని తరంగాల రూపంలో విశ్వంలోకి వెదజల్లుతుంది. వాటితోపాటు ‘గామా’ కిరణాలను, అణు కేంద్రకాలను కూడా అతివేగంగా వెదజల్లుతుంది. దీన్ని ఆర్–ప్రాసెస్ అంటారు. బరువైన మూలకమైన బంగారం ఈ క్రమంలోనే జనించిందని అధ్యయనం విశ్లేషించింది. ‘‘విశ్వంలోని ప్రాథమిక అంశాల పుట్టుక నిజంగా నవ్వు తెప్పించే క్లిష్టతరమైన పజిల్ వంటిది. వాటి పుట్టుపూర్వోత్తరాలను మనం పూర్తిగా కనుక్కోలేం. రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొంటే బంగారం పుట్టిందని గతంలో భావించేవారు. కానీ అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటార్ (న్యూట్రాన్ నక్షత్రం) నుంచి కూడా బంగారం పుడుతోందని అధ్యయనంలో తేలింది’’ అని కొలంబియా వర్సిటీ ఫిజిక్స్ డాక్టోరల్ విద్యారి్థ, పరిశోధన ముఖ్య రచయిత అనిరుధ్ పటేల్ చెప్పారు. 20 ఏళ్ల సమాచారం... ‘‘2017లో రెండు నక్షత్రాలు ఢీకొనడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దాంతో అంతరిక్షంలో అలల్లా గురుత్వాకర్షణ తరంగాలు విస్తరించాయి. వీటితోపాటే గామా కిరణాలు పెద్దమొత్తంలో వెలువడ్డాయి. ఇలా ఢీకొనడాన్ని కిలోనోవాగా పేర్కొన్నారు. దాని ఫలితంగా బరువైన బంగారం, ప్లాటినం, లెడ్ ఏర్పడ్డాయి. అందుకే కిలోనోవాలను బంగారం కర్మాగారాలుగా చెబుతారు. మ్యాగ్నెటార్లు గామా కిరణాలను వెదజల్లినప్పుడే బంగారం పుట్టింది’’ అని లూసియానా స్టేట్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ బర్న్స్ చెప్పారు.నక్షత్రకంపం! న్యూట్రాన్ నక్షత్రాల్లో అత్యంత కాంతిమయ నక్షత్రాలనే మ్యాగ్నెటార్లు అంటారు. కేవలం టీస్పూన్ సైజులో ఉండే మ్యాగ్నెటార్ ద్రవ్యరాశి కూడా ఏకంగా 100 కోట్ల భూగోళాలంత బరువుంటుంది! మ్యాగ్నెటార్ చుట్టూ అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉంటుంది. బిగ్‌బ్యాంగ్ జరిగిన 20 కోట్ల ఏళ్లకే మ్యాగ్నెటార్లు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు వల్ల భూకంపాలు వచి్చనట్టే నక్షత్రంలోనూ నక్షత్రకంపం పుడుతుంది. మాగ్నెటార్ అంతర్భాగంలోని ద్రవరూప పదార్థంలో సర్దుబాటు కారణంగా నక్షత్ర బాహ్యవలయాల్లో ‘స్టార్క్వేక్’లు వస్తాయట.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

రక్షణ సైట్లపై పాక్ సైబర్ దాడులు
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రతీకార చర్యలపై ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ తన సైబర్‌మూకలను రంగంలోకి దింపింది. దీంతో భారత రక్షణ రంగానికి సంబంధించిన వెబ్సైట్లపై పాక్ సైబర్ దాడుల ఉధృతి ఎక్కువైంది. అయితే రక్షణరంగంలోని వ్యక్తుల లాగిన్, పాస్వర్డ్ వంటి క్రెడెన్షియల్స్ తస్కరణకు గురయినట్లు భావిస్తున్నట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ సోమవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ‘పాకిస్తాన్ సైబర్ ఫోర్స్’ పేరిట ఈ వివరాలతో ఒక పోస్ట్ పెట్టింది. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్, ది మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల సిబ్బందికి చెందిన లాగిన్, పాస్‌వర్డ్‌లను పాక్ సైబర్ నేరగాళ్లు తమ వశంచేసుకున్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్‌చేశారు. వెబ్సైట్ హోం పేజీపై పాకిస్తాన్ జెండా, అల్ ఖలీద్ యుద్ధట్యాంక్ ఫొటోలను పెట్టారు. ‘‘ ఈ వెబ్సైట్ ఇప్పుడు పాకిస్తాన్ వశమైంది. ఇది పాకిస్తాన్ సైబర్‌ఫోర్స్ పని. పహల్గాం కేవలం ఆరంభం మాత్రమే’’ అని సందేశాన్ని హ్యాకర్లు ఆ వెబ్సైట్లో పెట్టారు. దీంతో ముందుజాగ్రత్తగా భారత ఆర్మీ అధికారులు ఈ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో పెట్టేశారు. హ్యాకింగ్ కారణంగా వెబ్‌సైట్‌లోని సమాచారం ఏ స్థాయిలో చోరీకి గురైందన్న అంశాలపై విస్తృతస్థాయిలో ఆడిట్ చేశాకే వెబ్‌సైట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు.

ఆనకట్టల కట్టడి
సింధూ, దాని పరీవాహక నదుల నుంచి పాకిస్తాన్‌కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్న భారత్, ఆ దిశగా పూర్తిస్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగింది. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక తదితరాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని అధికారులకు సూచించింది. జమ్మూ కశ్మీర్లో చినాబ్ నదిపై ఉన్న కీలక బాగ్లిహార్, సలాల్ జల విద్యుత్కేంద్రాల్లో ఆ దిశగా గురువారం లాంఛనంగా మొదలైన పూడికతీత పనులు సోమవారం పూర్తిస్థాయికి చేరాయి. పనుల్లో భాగంగా రెండు డ్యాముల్లో అవసరమైన గేట్లను గురువారం నుంచి శనివారం దాకా పాక్షికంగా ఎత్తడంతో పాక్‌లోని సరిహద్దు ప్రాంతాలు నీటమునిగాయి. సింధూ జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ విషయమై పాక్‌కు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. 1960ల్లో ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. ఒప్పందాన్ని బూచిగా చూపుతూ పూడిక పనులను పాక్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడిక ఆ ప్రాజెక్టుల్లోని పూడిక మొత్తాన్నీ తొలగించి పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. అప్పటిదాకా చినాబ్ నదీజలాలు పాక్‌కు పూర్తిగా నిలిచిపోయినట్టే!. సింధూ ఒప్పందం ప్రకారం చినాబ్ జలాలు పాక్‌కే చెందుతాయి. వాటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవడానికి వీల్లేదు.మూడింటి నుంచి నీళ్లు బంద్జమ్మూ కశ్మీర్లో సింధూ, దాని పరీవాహక నదులపై ఆరుకు పైగా జలాశయాల్లో పూడికతీతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ సారథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బాగ్లిహార్, సలాల్‌తో పాటు జీలం నది మీది కిషన్‌గంగ జలాశయాల నుంచి పాక్‌కు నీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపేశారు. దాంతో పాక్‌లోని పంజాబ్ తదితర ప్రాంతాలకు సాగునీరు నిలిచిపోయింది. సలాల్ ప్రాజెక్టును 1987లో, బాగ్లిహార్ను 2008లో నిర్మించారు. అప్పటినుంచీ వాటిలో పూడికతీత చేపట్టడం ఇదే తొలిసారి. సలాల్ 690 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. బాగ్లీహార్ సామర్థ్యం 900 మెగావాట్లు. పూడిక నేపథ్యంలో వాటిలో విద్యుదుత్పాదన చాలాకాలంగా సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతూ వస్తోంది.10 వేల మెగావాట్ల విద్యుత్జమ్మూ కశ్మీర్లో సింధూ, ఉప నదులపై మొదలు పెట్టిన ఆరు ప్రాజెక్టులు పాక్ అభ్యంతరాల నేపథ్యంలో చాన్నాళ్లుగా నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటి నిర్మాణాన్ని తక్షణం పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. సవాల్కోట్ (1,856 మెగావాట్లు), కిర్తాయ్ 1, 2 (1,320 ఎంవీ), పాకాల్దుల్ (1,000 ఎంవీ)తో పాటు 2,224 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన మరో ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ఏకంగా 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌తో పాటు సాగు, తాగునీటి అవసరాలకు మరిన్ని జలవనరులు అందుబాటులోకి వస్తాయి. సింధూ ఒప్పందం కింద ఇలాంటి పనులకు పాక్‌కు ఆర్నెల్ల నోటీసు ఇవ్వాల్సి ఉండేది. దాన్ని నిలిపివేసిన నేపథ్యంలో భారత్ తాజా చర్యలను అడ్డుకునేందుకు పాక్‌కు పెద్దగా మార్గాలేమీ లేవు. మధ్యవర్తి అయిన ప్రపంచబ్యాంకు కూడా పెద్దగా చేసేదేమీ లేదు. ఇరు దేశాలనూ చర్చలకు ప్రోత్సహించడం తప్ప ఒప్పందం అమలుకు ఆదేశించడం వంటి అధికారాలేవీ దానికి లేవు.– సాక్షి, నేషనల్ డెస్క్

ఉగ్ర పాక్‌కు నిధులు ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆర్థిక మూలా లను దెబ్బకొట్టడంపై దృష్టిపెట్టిన భారత్ ఆ దిశగా ప్రయత్నాలు ఉధృతంచేసింది. పాకిస్తాన్‌కు వందల కోట్ల రూపాయల రుణాలు, ఆర్థిక సాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఆ యత్నాలను మానుకోవాలని భారత్ అభ్యర్థిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఇటలీలోని మిలాన్ సిటీలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అధ్యక్షుడు మసాటో కందాతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్‌కు ఆర్థికసాయం చేయడం మానుకోవాలని నిర్మల కోరారు. ఈ సందర్భంగా ఇటలీ ఆర్థిక మంత్రి జిన్‌కార్లో జార్జెట్టీతోనూ నిర్మల భేటీ అయ్యారు. నాలుగురోజులపాటు జరిగే ఏడీబీ 58వ వార్షిక సమావేశాలు ఆదివారం ఇటలీలో ప్రారంభమవడం తెల్సిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ వంటి బహుళజాతి సంఘాలు పాకిస్తాన్‌కు సాయంపై పునరాలోచన చేస్తే మంచిదని ఈ సందర్భంగా నిర్మల హితవు పలికారు. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకుగాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్ణయించడం తెల్సిందే. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. మరోవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే జాబితాలోకి పాకిస్తాన్‌కు చేర్చడానికి భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది.

భారత్‌కే మా మద్దతు
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉ గ్రవాదులను, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. అత్యంత హేయమైన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా మని తెలిపారు. బాధిత కుటుంబాలకు పుతిన్ సానుభూతి ప్రకటించారు. ఆయన సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే నామరూపాల్లేకుండా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. భారత్–రష్యా మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, పుతిన్ పేర్కొన్నారు. రష్యా ‘విక్టరీ డే’ 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌తోపాటు రష్యా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ ఏడాది జరగబోయే ఇండియా–రష్యా ద్వైపాక్షిక సదస్సుకు హాజరు కావాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా, పుతిన్ అందుకు అంగీకరించారు.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

క్రెడిట్ కార్డు బిల్లు కట్టమన్నందుకు..
మదనపల్లె(అన్నమయ్య): క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో, బ్యాంక్ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వేంపల్లె పంచాయతీ జంగావారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, కాంతమ్మ దంపతుల ఏకై క కుమారుడు శ్రీకాంత్(25) పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన అనిల్‌కు తనపేరుపై ఉన్న క్రెడిట్‌కార్డు ద్వారా రూ.3లక్షల రుణం తీసిచ్చాడు. అయితే, అతను సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో తాను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులతో పాటు కొంతమేర అప్పుచేసి మూడో వంతు రుణం చెల్లించాడు. ఇంకా రూ.40వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు చెల్లింపు కోసం శనివారం బ్యాంక్ సిబ్బంది శ్రీకాంత్ ఇంటివద్దకు వెళ్లి వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించి మనస్తాపంతో ఆదివారం ఉదయం ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్‌లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
వీడియోలు


తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి డోకా లేదు: జగదీష్‌రెడ్డి


పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన వంగా గీతా


Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం


Jammu And Kashmir: పూంచ్ జిల్లాలో లోయలో పడిన బస్సు


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు


Varudu Kalyani: కూటమి సర్కార్ ప్రతి పథకంలో స్కామ్ చేస్తోంది


LB Nagar: సిలిండర్ బ్లాస్ట్ కావడంతో మంటలు


వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య క్లారిటీ..


అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు


అనంతపురం ఎస్పీ కార్యాలయం దగ్గర హైడ్రామా