
కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు.
సాక్షి, అమరావతి: కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ బతికే ఉందని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఇష్టానుసారం దోచుకున్నారు. బాబు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు నమ్మరు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: చంద్రబాబు ముఠా వికారపు చేష్టలు.. సజ్జల ఏమన్నారంటే..?
‘‘ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అలాగే పారిపోయేందుకు సిద్ధమైన టీడీపీకి మాటలు ఎక్కువగా వస్తున్నాయి. కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జన్మభూమి పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు మళ్లీ వారికి ఆదాయ వనరులు సమకూర్చటానికి ప్రయత్నిస్తున్నారు. పట్టాభి, అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ నిప్పులు చెరిగారు.