
బంగారు కిరీటం సమర్పణ
ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వకు సోమవారం ఆలయ నిర్వాహకులు బంగారు కిరీటం సమర్పించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎండోమెండ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు రాయచోటి సుబ్బయ్య, సభ్యులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
కర్నూలు సిటీ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఏ వలి అధ్యక్షతన రిలే నిరహార దీక్షలు చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగే దీక్షలను మొదటి రోజు సోమవారం సంఘం రీజినల్ చైర్మన్ ఎస్‌ఎండీ గౌస్, కార్యదర్శి సి.మద్దిలేటిలు దీక్షలో కూర్చున ఉద్యోగులకు పూల మాలలు వేసి ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ఎదుట దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం జారీ చేసిన సర్క్యూలర్ 1/2019ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్స్, రిమూవల్స్‌ను నిలిపి వేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో ఆర్‌బీఎన్ మూర్తి, కేటీ రెడ్డి, సి.లక్ష్మన్న, ఆర్‌పీ రావు, జేబీ రాజేశ్వరయ్య, ఎం.జెడ్ బాషా, ఎస్‌డీ బాషా కూర్చున్నారు. వీరికి డిపో–1 సెక్రటరీ సయ్యద్ ఇసాక్, డిపో–2 సెక్రటరీ ఎంఎస్‌బీ రెడ్డి సంఘీభావం తెలిపారు.