Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Government Records In Debt1
అప్పుల్లో చంద్రబాబు సర్కార్‌ రికార్డు

అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

MLA Sabitha On Obulapuram Mining Case2
‘12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాను’

హైదరాబాద్‌: 12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడానన్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఓబులాపురం మైనింగ్‌ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్‌ కృపానందంలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అనంతరం ఆమె మాల్లాడుతూ.. ‘న్యాయస్థానం నన్ను నిర్దోషి గా ప్రకటించింది, న్యాయస్థానంకి ధన్యవాదాలు. ఏ తప్పు చేయకపోయిన కోర్ట్ మెట్లు ఎక్కాను. పన్నెడున్నర సంవత్సరాలు నన్ను రాజకీయంగా అవమానించారు. ఈ కేసులను ముందు పెట్టి నన్ను రాజకీయంగా అణిచివేయాలనుకున్నారు న్యాయస్థానం మీద నమ్మకం ఉంచాను కాబట్టి ఇవ్వాళ నాకు న్యాయం జరిగింది. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నా నియోజకవర్గ ప్రజలు నా వెంట నిలబడ్డారు’ అని అన్నారు. కేసు నమోదు అయిన తరువాత ఇదే సీబీఐ కోర్ట్ కి నేను కనీళ్లతో కోర్ట్ మెట్లు ఎక్కాను. నాపై రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేశారు. నేను అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారు. ఇన్నాళ్లకు నాకు న్యాయం జరిగింది’ అని అన్నారు సబితా ఇంద్రారెడ్డి.ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు

Pahalgam Incident: BJP Responds M Kharges Big Charge3
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’

రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్‌ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్‌ పార్టీ సంవిధాన్‌ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు.

Iceland Cricket Creates IPL 2025 Frauds And Scammers Team, Rishabh Pant Named Captain4
IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌. ఈ జట్టుకు సారధిగా రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్‌ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. ఈ జట్టులో రాహుల్‌ త్రిపాఠి, రచిన్‌ రవీంద్ర, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, దీపక్‌ హుడా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మతీష పతిరణ, మహ్మద్‌ షమీకి చోటు కల్పించింది. పంత్‌ను కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టును నిన్న తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.On a rain day in Reyjavík, we give you our IPL 2025 frauds and scammers team:R TripathiR RavindraI KishanR Pant (c & wk)V IyerG MaxwellL LivingstoneD HoodaR AshwinM PathiranaM ShamiNo impact player: M Kumar— Iceland Cricket (@icelandcricket) May 5, 2025ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఎంపిక చేసిన ఈ టీమ్‌పై సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. నిజంగానే వీరు స్కామర్లు, మోసగాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కోట్లలో డబ్బు తీసుకుని కనీస వందల విలువ చేసే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరేమే ఆటగాళ్లు ఎలా ఆడినా ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఇలాంటి విమర్శలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. కాగా, ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌కు ఇలాంటి వివాదాస్పద పోస్ట్‌లు చేయడం​ కొత్తేమీ కాదు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గతంలో చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా స్పందించింది.ఇదిలా ఉంటే, మోసగాళ్లు.. స్కామర్లు అంటూ ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ ఆటగాళ్లను విమర్శించడం సరి కాదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెడితే, ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లుందరూ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారన్నది కాదనలేని సత్యం. రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లు 20 కోట్లకు పైగా మొత్తాన్ని తీసుకున్నా కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మ్యాక్స్‌వెల్‌, లివింగ్‌స్టోన్‌ లాంటి విదేశీ ఆటగాళ్లయితే ఏదో హాలిడేకి వచ్చామన్నట్లు ఐపీఎల్‌ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇషాన్‌ కిషన్‌, షమీపై వారి ఫ్రాంచైజీ ఎంతో నమ్మకముంచితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అశ్విన్‌ అయితే తనకున్న ఘన చరిత్రను చెత్త ప్రదర్శనలతో దిగజార్చుకున్నాడు. రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా లాంటి వారు కోట్లు మింగి గల్లీ క్రికెటర్ల కంటే హీనమైన క్రికెట్‌ను ఆడుతున్నారు.రాహుల్‌ త్రిపాఠి- 3.4 కోట్లురచిన్‌ రవీంద్ర- 4 కోట్లుఇషాన్‌ కిషన్‌- 11.25దీపక్‌ హుడా- 1.7 కోట్లురిషబ్‌ పంత్‌- 27 కోట్లువెంకటేశ్‌ అయ్యర్‌- 23.75గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌- 4.2 కోట్లులియామ్‌ లివింగ్‌స్టోన్‌- 8.75 కోట్లురవిచంద్రన్‌ అశ్విన్‌- 9.75 కోట్లుమతీష పతిరణ- 13 కోట్లుమహ్మద్‌ షమీ- 10 కోట్లు

Is Mamata Banerjee Stolen Sacred Wood To Digha Temple?5
సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా?

కోల్‌కతా: ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా? అంటే అవుననే అంటున్నారు ఒడిశా బీజేపీ నేతలుపశ్చిమ బెంగాల్‌ దిఘూలో జగన్నాథుడి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠాపన జరిగింది.ఈ ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి మమతా వేప మొద్దులు దొంగిలించదని ఒడిశా బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని దీదీ ఖండించారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంట్లోనే నాలుగు వేప చెట్లు ఉన్నాయి. దొంగిలించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో జగన్నాథ స్వామిని పూజించడం నేరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ, ఒడిశా బీజేపీ పాలనలో పశ్చిమ బెంగాల్‌ వలసకూలీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Indian Billionaire Balvinder Singh Sahni Gets Five Years In Jail In Dubai For Money Laundering6
దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష

దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.షెల్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్‌లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలుకార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

Met Gala 2025: Isha Ambani couture Blending Indian craft and global glamour7
Met Gala 2025: స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..

ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్‌లో బాలీవుడ్‌ తారలంతా తమదైన ఫ్యాషన్‌ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్‌ అటెన్షన్‌ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్‌ వేర్‌లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్‌ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్‌ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్‌ గాలా ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్‌(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్‌లో భారతీయ ఫ్యాషన్‌ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్‌ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్‌ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్‌. స్టైలిష్‌ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అనామిక ఖన్నా ఇషా డిజైనర్‌ వేర్‌ని రూపొందించారు. టాప్‌ గోల్డ్‌ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్‌ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్‌ కలర్‌ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్‌ తెల్లటి క్యాప్‌ లుక్‌లో అత్యంత స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్‌ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్‌ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్‌ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్‌ వేర్‌లా డిజైన్‌ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్‌ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్‌లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్‌ వేర్‌కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్‌ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్‌ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్‌. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్‌ వేర్‌ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్‌ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్‌ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్‌ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు..)

RTC JAC Of Telangana Talks With Govt Successfully Done8
TG: ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపు(మే7వ తేదీ, బుధవారం) ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ మేరకు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ.. తమ సమ్మెను వాయిదా వేసుకుంది. సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నాం -సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌ లో సమ్మె చేయక తప్పదని హెచ్చరించింది. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిర్టీసీ జేఏసీ చైర్మన్‌ వెంకన్న తెలిపారు.‘రవాణా శాఖ మంత్రి తో చర్చలు జరిపాం..Rtc యూనియన్ ల పై ఆంక్షలను ఎట్టివేస్తామని హామీ ఇచ్చారు. Rtc లోఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగం భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీ లో కొని rtc కీ ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాటిపథకన చేస్తామన్నారు.. Rtc ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం,మంత్రిమీద నమ్మకం తో సమ్మెని తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపొతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం’ అని అన్నారు.తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, అటు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈరోజు(మే 6వ తేదీ, మంగళవారం) వారిని చర్చలకు పిలిచింది.ఉద్యో‍గుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటుఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్బంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఓ కమిటీని సర్కార్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఈ అధికారుల కమిటీ విధి.

Abdul Basit: India Likely to Strike Pakistan After Russia Victory Celebrations9
భారత్‌ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్‌ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్‌!

ఇస్లామాబాద్‌: 1971లలో నాటి భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో భారత్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్‌ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్‌) అబ్దుల్‌ బాసిత్‌ సంచలన ట్వీట్‌ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్‌.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్‌ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్‌’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్‌ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్‌ సరఫరా బ్లాకౌట్‌ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.

Obulapuram Mining Case Latest Update10
ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు

సాక్షి,హైదరాబాద్‌: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్‌ కృపానందంలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో మంగళవారం సీబీఐ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతోపాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ కేసులో విచారణ సాగుతున్న సమయంలోనే A5రావు లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేసింది. కేసులో గాలి సోదరుడు, బీవీ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్లు శిక్ష విధించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement