Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Political News: June 19 YSRCP Key Meeting
YS Jagan: 19న వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం

గుంటూరు, సాక్షి: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే.. పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్‌జగన్‌ భేటీ కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా.

Rahul Gandhi To Give Up Wayanad Seat, Priyanka Gandhi To Contest From Wayanad
వయనాడ్‌ను వదులుకున్న రాజీనామా.. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో రెండు రాయబరేలీ, వయనాడ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విజయం సాధించారు. అయితే ఆ రెండు స్థానాల్లో వయనాడ్‌ను వదులుకున్నట్లు రాహుల్‌ అధికారికంగా ప్రకటించారు. రాయ బరేలీ ఎంపీగా కొనసాగనున్నారు.ఇక వయనాడ్‌కు ఉపఎన్నిక జరగాల్సి ఉండగా.. అదే స్థానంలో కాంగ్రెస్‌ తరుపున రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్నట్లు రాహుల్‌ గాంధీ తెలిపారు.

Chandrababu Comments On Polavaram Project
బాబు మార్క్‌ కథలు మళ్లీ షురూ..!

బాబు గారు మళ్లీ గళమెత్తారు. తనదైన శైలిలో తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలకు మరో దఫా శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణం విషయంలో తాను చేసిందంతా సక్రమమేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ఆ తరువాత ఓ మీడియా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని తేల్చేశారు. డయాఫ్రామ్‌ వాల్‌ మరమ్మతులకు రూ.2000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని కూడా ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలోనే కొన్ని సత్యాలకు బోలెడన్ని అసత్యాలు జోడించి గత తప్పులన్నింటినీ కప్పిపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా.. తప్పు ఇతరులపైకి నెట్టేందుకూ కృషి చేశారు. అయితే 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు చేసిన పలు తప్పిదాలు.. తీసుకున్న నిర్ణయాలే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోయేందుకు కారణమన్నది నిపుణులు చాలామంది చెప్పే విషయం.ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌ వే నిర్మాణం మొదట చేపట్టి ఆ తరువాత అవసరానికి అనుగుణంగా కాఫర్‌ డ్యామ్‌ కట్టడం ఇంజినీరింగ్‌ పద్ధతి. అయితే చంద్రబాబు మాత్రం ముందు కాఫర్‌ డ్యామ్‌ కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నా పట్టించుకోలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన చాలా కీలకమైన నిర్మాణ పనులన్నింటినీ పక్కనబెట్టి ఆఘమేఘాల మీద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టారు. ఫలితంగా 2020లో వచ్చిన వరదకు కాఫర్‌ డ్యామ్‌ బాగా దెబ్బతింది. మళ్లీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫర్‌ డ్యామ్‌ డిజైన్లను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ 2017లో తిరస్కరించినా పట్టించుకోని చంద్రబాబు ఫిబ్రవరి నెలలో డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి, గేట్ల నిర్మాణ పనులు మొదలుపెట్టడం గమనార్హం.కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 41 మీటర్ల వరకూ పెంచుకోవచ్చునని జల వనరుల శాఖ అనుమతిచ్చిన తరువాత దిగువభాగంలో ఊటను నియంత్రించేందుకు షీట్‌ ఫైల్స్‌ వాడతామని కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతిపాదించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి.అయితే ఈ షీట్‌ ఫైల్స్‌ ద్వారా ఊటను నియంత్రించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ డిజైన్లను తిరస్కరించి కొత్త డిజైన్లను రూపొందించిమని ఆదేశించింది.వాస్తవం ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం 2019 మే నెలలో గద్దెనెక్కిన జగన్‌ ప్రభుత్వం కాఫర్‌ డ్యామ్‌ (డయాఫ్రమ్‌ వాల్‌)ను కాపాడలేకపోయారని విమర్శించడం గమనార్హం.పోలవరం స్పిల్‌ వే బ్రిడ్జికి సంబంధించి 14 బ్లాకుల్లో ట్రూనియన్‌ స్తంభాలు విఫలమయ్యాయి. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కారణంగా గ్యాప్‌-1లోని అప్రోచ్‌ ఏరియా పూర్తిగా దెబ్బతినింది. పైగా ఈ అప్పర్‌ కాఫర్‌డ్యామ్‌ కట్టినందుకు 2019లోనే వరదనీరు స్పిల్‌ వేను దాటి మరీ ప్రవహించింది. ఫలితంగా అప్పటివరకూ చేపట్టిన స్పిల్‌ వే ఛానల్‌ పనులు వృథా అయ్యాయి. స్పిల్‌ వేలో చేరి నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టిందంటేనే బాబు గారి నిర్ణయం వల్ల జరిగిన నష్టం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.2019, 2020లలో గోదావరికి వచ్చిన వరదలు ఎగువప్రాంతాల్లోని నీట మునిగేందుకు కారణమయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల వరద నీరు వెనక్కు వెళ్లిపోవడం దీనికి కారణం.2014- 2019 మధ్యకాలంలో పోలవరం నిర్మాణంపై చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాఫర్‌ డ్యామ్‌లు (అప్పర్‌, లోయర్‌) నిర్మాణం పూర్తి కాకున్నా... వాటిని తమ ప్రభుత్వ ఘన విజయాలుగా చాటుకున్నారు. అప్రోచ్‌ ఛానల్‌, పైలట్‌ ఛానళ్లలో జరిగిన మార్పులు కూడా బాబుగారి డాంబికాలకు అద్దం పట్టే నిర్ణయాలే.మూల లంక ప్రాంతంలో డంప్‌ యార్డ్‌ కోసం ఏడాదికి రెండు పంటలు పండే సుమారు 200 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడమే కాకుండా.. బాధితులకు పరిహారం సైతం చెల్లించలేదు.తొలి పర్యటన నుంచి పక్కా ప్రణాళికతో..2019లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్‌ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు.ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్‌ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా..!పోలవరం ప్రాజెక్టును గత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానా నుంచే ఇచ్చి, మరొకవైపు నిర్వాసితులకు పునరావసం కల్పించారు. కరోనా కష్టకాలంలోనూ రికార్డు సమయంలో స్పిల్‌ వే ను పూర్తి చేశారు. సీడబ్యూసీ మార్గదర్శకాల మేరకు దెబ్బతిన్న పనులు సైతం చేపట్టారు.గతేడాది జూలైలో ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 44 మీటర్లకు పెంచడంతో పాటు దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు.

TEAMS QUALIFIED FOR THE T20 WORLD CUP IN 2026
2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..!

భారత్‌, శ్రీలంక వేదికగా 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ అర్హత సాధించే జట్లేవో తేలిపోయాయి. 2026 టీ20 వరల్డ్‌కప్‌ కూడా ప్రస్తుత ఎడిషన్‌ (2024) లాగే 20 జట్లతో జరుగుతుంది. ఇందులో 12 జట్లు నేరుగా అర్హత సాధించనుండగా.. మిగతా ఎనిమిది బెర్త్‌లు వివిధ రీజియనల్‌ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో సూపర్‌-8కు అర్హత సాధించిన జట్లు (భారత్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌) నేరుగా తదుపరి ఎడిషన్‌కు అర్హత సాధించనుండగా.. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంక తొమ్మిదో జట్టుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.మిగతా మూడు స్థానాలు జూన్ 30, 2024 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్‌ నడుస్తుండటంతో ఈ టోర్నీ ఫలితాలు ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేయవు కాబట్టి ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్‌ 30 వరకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఐర్లాండ్‌ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి.ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్‌-8కు చేరకుండా నిష్క్రమించిన న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ తదుపరి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే 10, 11, 12 జట్లవుతాయి. ఓవరాల్‌గా 2026 టీ20 వరల్డ్‌కప్‌కు భారత్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ జట్లు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్‌లు క్వాలిఫయర్‌ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి.

Israel Dissolves War Cabinet
నెతన్యాహు సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్‌ వార్‌ క్యాబినెట్‌ రద్దు

జెరూసలెం: హమాస్‌ లక్ష్యంగా గాజాపై గత కొంత కాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్‌ క్యాబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వార్‌ క్యాబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్‌, గాడీ ఐసెన్‌కోట్‌ వార్‌ క్యాబినెట్‌ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన నేపథ్యంలో దానిని రద్దు చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌ మెరుపుదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులకు దిగింది. హమాస్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్‌ క్యాబినెట్‌ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం.

Ksr Comments On The Chances Of YSRCP Coming Back To Power In Politics
వైఎస్సార్‌సీపీ బౌన్స్‌ బ్యాక్‌ వెరీ సూన్‌!

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్‌సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.అలాగే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్‌సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.ఈ విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రస్తావించారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Heavy Rain Lashes In Hyderabad
హైదరాబాద్‌లో భారీ వర్షం

సాక్షి,హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ నగరంలో సోమవారం(జూన్‌17) పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, సెక్రటేరియట్‌, లక్డీకాపూల్‌ మాదాపూర్‌, గచ్చిబౌలి ఏరియాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఒక్కసారిగా కురిసిరన కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Pakistan richest beggar who has insurance of Rs 1 crore
ఈ బిచ్చగాడు ఎంత రిచ్‌ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్‌!

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్‌వై వార్తా కేంద్రం తెలిపింది.పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్‌ బిచ్చగాడు. 2021 అక్టోబర్‌లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్‌బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు. షౌకత్‌ పిల్లలు పాకిస్తాన్‌లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు.

Vijay Sethupathi Opens Up About Rejecting Pushpa Movie
సీరియస్‌గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి

మహారాజ సినిమా తెలుగులో రిలీజ్‌ చేస్తున్న విషయం చాలామందికి తెలియదు. కొన్ని ప్రమోషన్లు చేసినా అందరికీ అది రీచవలేదు. అసలు మహారాజ సినిమా ఏంటి? ఇదెప్పుడు తీశారు? అని చాలామంది అనుకున్నారు. అయితే రిలీజైన రోజే ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. మౌత్‌టాక్‌తోనే మహారాజ గురించి అందరికీ తెలిసొచ్చింది. విజయ్‌ సేతుపతి నటన, నితిలన్‌ సామినాథన్‌ డైరెక్షన్‌, అజనీష్‌ లోకనాథ్‌ బీజీఎమ్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఏ రోజుకారోజు వసూళ్లు పెంచుకుంటూ సూపర్‌ హిట్‌ దిశగా ముందుకు సాగుతోంది.రామ్‌చరణ్‌ సినిమాలో?జూన్‌ 14న ఈ ద్విభాషా(తమిళ, తెలుగు) చిత్రం రిలీజవగా.. సోమవారం నాడు చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో థాంక్యూ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సేతుపతి ఓపికగా సమాధానాలిచ్చాడు. బుచ్చిబాబు-చరణ్‌(#RC16) మూవీలో ఏదైనా పాత్ర చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు లేదని బదులిచ్చాడు. ఎటువంటి పాత్రలు పోషించడం ఇష్టమన్న క్వశ్చన్‌కు రొమాంటిక్‌ పాత్రలు చేయడం ఎక్కువ ఇష్టమన్నాడు.సీరియస్‌గా ట్రై చేశా..సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్‌ తీసుకున్నారు.. అలాగే పుష్ప సినిమా రిజెక్ట్‌ చేశారా? అన్న ప్రశ్నకు సేతుపతి స్పందిస్తూ.. నేను సీరియస్‌గా ప్రయత్నించాను సర్‌, కానీ నాకు ఎవరూ అవకాశాలివ్వలేదు. పుష్ప మూవీలో ఛాన్స్‌ నేను రిజెక్ట్‌ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలే మాట్లాడకూడదు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది అని పేర్కొన్నాడు.ఎప్పుడో చెప్పిన సేతుపతికాగా పుష్ప 1 షూటింగ్‌కు ముందే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై 2020వ సంవత్సరంలోనే సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. పుష్పలో భాగం కావాలని ఉన్నప్పటికీ డేట్స్‌ కుదరకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. దర్శకుడు సుకుమార్‌ను కలిసి మరీ తన నిర్ణయాన్ని తెలిపినట్లు వెల్లడించాడు.చదవండి: పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?

Personal care, energy, utility and rental costs are high levels in Mumbai
ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్‌.. కారణం..

దేశవ్యాప్తంగా ముంబయి ఖరీదైన నగరాల్లో మొదటిస్థానంలో ఉందని ‘మెర్సర్‌ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే వెల్లడించింది. కలల నగరం(సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌)గా పేరున్న భారత వాణిజ్య రాజధాని ముంబయిలో జీవనవ్యయం భారీగా పెరిగిందని నివేదికలో తెలిపారు. వ్యక్తిగత ఖర్చులు, రవాణా ఖర్చులు, గృహ అద్దెలు అధిక స్థాయిలో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ముంబయి గతంలో కంటే 11 స్థానాలు ఎగబాకి 136వ ర్యాంక్‌కు చేరుకుంది. దిల్లీ 4 స్థానాలు పెరిగి 164వ ర్యాంక్‌కు, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189కు, బెంగళూరు ఆరు స్థానాలు తగ్గి 195కు, హైదరాబాద్‌ ఎలాంటి మార్పు లేకుండా 202 వద్ద స్థిరంగా ఉంది. పుణె ఎనిమిది స్థానాలు పెరిగి 205కి, కోల్‌కతా నాలుగు స్థానాలు పెరిగి 207కి చేరుకుంది.అంతకుముందు ఏడాదికంటే 2023లో 20 స్థానాలు దిగజారి 147వ ర్యాంక్‌కు చేరుకున్న ముంబయి 2024లో 136వ ర్యాంక్‌కు పెరిగింది. ఎనానమీలో వస్తున్న ఆర్థిక మార్పుల వల్ల ముంబయిలో జీవన వ్యయం పెరుగుతోందని నివేదిక పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో దిల్లీ 169 నుంచి 164కి, కోల్‌కతా 211 నుంచి 207కి, పుణె 215 నుంచి 205కి చేరుకుంది. చెన్నై 184 నుంచి 189కి, బెంగళూరు 189 నుంచి 195కి, హైదరాబాద్ 202 వద్ద నిలకడగా ఉంది. ఆసియావ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో, దిల్లీ 30వ స్థానంలో ఉన్నాయని నివేదిక తెలిపింది.ఈ సందర్భంగా మెర్సర్‌ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో భారత్‌ చాలావరకు నిలకడగా ఉంది. మెర్సర్‌ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ముంబయి గ్లోబల్‌ ర్యాంకు పెరిగినప్పటికీ మారుతున్న ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయి. దిల్లీలో గృహ అద్దెలు అత్యధికంగా 12-15 శాతం పెరిగాయి. ముంబయిలో 6-8 శాతం, బెంగళూరులో 3-6 శాతం, పుణె, హైదరాబాద్, చెన్నైలో 2-4 శాతం గృహ అద్దెలో పెరుగుదల కనిపించింది. సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ముంబయిలో అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఈవిభాగంలో చెన్నై తర్వాతి స్థానంలో ఉంది. కోల్‌కతాలో వాటి ధర తక్కువగా ఉంది. కరెంటు బిల్లులు, యుటిలిటీ ఖర్చులు ముంబైలో చాలా ఖరీదయ్యాయి. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరిగాయి. ఈ విభాగంలో బెంగళూరు తర్వాతి స్థానంలో ఉంది.ఇతర దేశాల్లోని ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించడంలో స్థానికంగా ఉన్న హౌసింగ్ ఖర్చులు కీలకంగా మారుతాయని నివేదిక తెలిపింది. దాంతోపాటు ఉద్యోగుల జీవననాణ్యతపై ప్రభావం పడుతుందని చెప్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయ అనిశ్చుతులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుందని, దాంతో సంస్థలు ఇతరదేశాల్లోని ప్రతిభ ఉన్నవారిని ఆకర్షించే పనిలో ఉన్నాయని నివేదిక తెలిపింది. చాలాకంపెనీలు ముంబయిలో తమ కార్యకలాపాలు సాగిస్తుండడంతో విదేశీ ఉద్యోగులకు తగిన జీవనప్రమాణాలు అందించేలా ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఖర్చులు ఎక్కువవుతున్నాయని మెర్సర్‌ పేర్కొంది.ఇదీ చదవండి: ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అధిక లివింగ్‌ కాస్ట్‌ ఉన్న నగరాల్లో హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), జెనీవా (స్విట్జర్లాండ్), బాసెల్ (స్విట్జర్లాండ్), బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ఏంజిల్స్ (యూఎస్‌) వరుసస్థానాల్లో నిలిచాయి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement