వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం! | OMG O Manchi Ghost Movie trailer released | Sakshi
Sakshi News home page

వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం!

Published Mon, Jun 17 2024 3:32 AM | Last Updated on Mon, Jun 17 2024 3:34 AM

OMG O Manchi Ghost Movie trailer released

‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందర్నీ చంపేస్తోందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ‘ఓఎమ్‌జీ’(ఓ మంచి ఘోస్ట్‌) సినిమా ట్రైలర్‌ ఆరంభమైంది. నందితా శ్వేత, ‘వెన్నెల’ కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. మార్క్‌సెట్‌ నెట్‌వర్క్స్‌ బ్యానర్‌పై డా. అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌.

‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’, ‘ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం’ వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘హారర్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సూపర్‌ నేచురల్, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. అనూప్‌ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి మేజర్‌ అస్సెట్‌ కానుంది. మా సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భయపెడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రఘుబాబు, ‘షకలక’ శంకర్, నాగినీడు, ‘బాహుబలి’ ప్రభాకర్, నవమి గాయక్‌ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement