చిన్న పిల్లలు అన్నాక అపుడప్పుడు అనుకోకుండా తప్పులు చేస్తారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులను ఎవరైనా చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం నాలుగేళ్ల బాలుడు చేసిన చిన్న తప్పుకు పగపట్టి గాయలయ్యేలా చేసింది. తన కాలు అడ్డుపెట్టి కిందపడేలా చేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. ఇందంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో చిక్కడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.