ఏ క్రికెట్ మ్యాచ్ ఫలితంలోనైనా రనౌట్లు కీలక పాత్ర పోషిస్తాయనేది వాస్తవం. అయితే నామ మాత్రపు మ్యాచ్‌లో రనౌట్లు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఒక సీరియస్ మ్యాచ్‌లో సిల్లీగా రనౌటైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్‌ను సాధించే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంది. తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా సిల్లీగా రనౌటై విమర్శకుల నోటికి పని చెప్పాడు.