న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ పోరాడి ఓడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి ఓటమి పాలైంది. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది.