మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాదించింది. కివీస్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(50; 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్(30; 31 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభాన్ని ఇచ్చారు.