ఒకే ఒక్క మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్(డీకే) హీరో అయిపోయాడు. చివరి బంతికి అద్భుతం చేసి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అతడు బాదిన సిక్సర్ డీకే క్రీడా జీవితంలో పెద్ద మైలురాయిలా నిలిచింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆఖరి బంతికి విజయాన్ని అందించిన క్రికెటర్ల జాబితాలో అతడి పేరు చేరిపోయింది.