సదావర్తి భూముల వేలం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసి విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎండోమెంట్ శాఖకు నేడు రెండో విడత నగదు జమచేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఇటీవల రూ.10 కోట్లను చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే, శుక్రవారం రూ.17.44 కోట్లను ఎండోమెంట్ శాఖకు చెల్లించారు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తీర్పును శిరసావహిస్తామని చెప్పిన ఆర్కే.. అదే ప్రకారం రెండు విడతల్లో పూర్తిస్థాయి నగదు రూ.27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు జమచేశారు.