సదావర్తి సత్రం భూముల వేలం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.