పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు హౌస్ అరెస్ట్ | YSRCP Leaders House Arrested In Nandigam | Sakshi
Sakshi News home page

పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు హౌస్ అరెస్ట్

Apr 10 2018 9:52 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ జాతీయ రహదారులను దిగ్బంధం చేసింది. కడప-చెన్నై రహదారిలో వాహనాల రాకపోకలను రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

మరోవైపు కృష్ణా జిల్లా జాతీయ రహదారుల దిగ్బంధనానికి సిద్ధమవుతున్న నందిగామ పార్టీ నేతలను పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు. హౌజ్‌ అరెస్టు అయిన వారిలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు న్యూఢిల్లీలో ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement