ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిర్వహిస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రానికి హోదా కావాలని నిరసిస్తూ బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు.