తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సార్వత్రిక ఎన్నికల సమరశంఖాన్ని పూరించనున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ఇక ఏ రోజైనా వెలువడవచ్చనే సంకేతాలు రావడంతో శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్ జగన్ జిల్లాలవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో తటస్థులతోపాటు పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహిస్తున్న రెండు సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. రెండో రోజైన 7వ తేదీన వైఎస్సార్ జిల్లాలో సమర శంఖారావం సభలకు హాజరవుతారు.
నేడు తిరుపతిలో ‘సమర శంఖారావం’
Feb 6 2019 7:09 AM | Updated on Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement