వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 271వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం జననేత ఎస్.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సంతపేట, లక్కవరపు కోట మీదుగా ఖాశాపేట వరకు సాగనుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కుర్మవరం క్రాస్, తలరి మీదుగా కొట్యడ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.