వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 275వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం జననేత విజయనగరం నియోజకర్గంలోని జొన్నవలస క్రాస్ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వై జంక్షన్, మయూరి జంక్షన్, రైల్వే స్టేషన్ మీదుగా వెంకటలక్ష్మీ జంక్షన్ వరకు జననేత పాదయాత్ర సాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి త్రీ ల్యాంప్స్ సెంటర్ మీదుగా కొత్తపేట వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
275వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Oct 1 2018 7:23 AM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement