ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు మరో ఆరు నెలల్లో ఉన్నాయనగా అయ్యయ్యో తెలుగుతల్లికి అన్యాయం జరిగిందా?. అయ్యయ్యో ప్రత్యేక హోదా రాలేదా? అని చంద్రబాబు మాట్లాడతారని దుయ్యబట్టారు.