ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని, విభిన్న అవకాశాలతో తమ భవిష్యత్తు బాగుపడుతుందని యువత విశ్వసిస్తోంది. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం కొనసాగిస్తుండగా సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని, హోదా కలిగిన రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా అని ఎద్దేవా చేశారు. హోదా తప్పనిసరని, దాన్ని సాధించుకోవడానికి అందరం కలిసి ప్రయత్నిద్దామని వైఎస్ జగన్ పదే పదే చెప్పినా చంద్రబాబు చెవికెక్కించుకోలేదు.