ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారత ప్రభుత్వం ఇచ్చే విందు హైదరాబాద్ వంటకాలతో పసందుగా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నిజాం వంటకాలు.. హైదరాబాద్ ప్రఖ్యాత వంటకాలన్నీ దేశ, విదేశీ అతిథుల నోరూరించేలా మెనూను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, షీర్ కుర్మా, పత్తర్ కా గోష్, ఖుర్బానీ కా మీఠా, డబుల్ కా మీఠా వంటి వంటకాలను ప్రత్యేకంగా వడ్డించనున్నారు.