అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్‌ వీడియో షూట్‌

సాక్షి, విశాఖపట్నం : అతి పిన్న వయసులో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్‌ను పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్‌ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్‌ బి.టెక్‌, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం కరస్పాండెట్‌గా ఓ కాలేజ్‌ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్‌ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు అయింది.

పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక​ ఎన్నికల్లో  గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్‌ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top